CBI Raides
-
బలపరీక్ష రోజే తేజస్వీకి షాక్.. ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు
పాట్నా: బిహార్‌లో నితీశ్ కూమార్ నేతృత్వంలోని మహా గట్బంధన్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న కొన్ని గంటల ముందు ఆర్జేడీ సీనియర్ నేతల ఇళ్లపై దాడులు జరగటం సంచలనంగా మారింది. ముగ్గురు సీనియర్ నేతల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం తనిఖీలు చేపట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా లాలూప్రసాద్ ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పాట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ నివాసం సహా ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ అహ్మద్ అష్ఫాఖ్ కరీమ్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ సుబోధ్ రాయ్ నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. ‘ఈ సోదాలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. అందులో ఎలాంటి అర్థం లేదు. భయంతో మా ఎమ్మెల్యేలు వారితో చేరతారనే కారణంగా చేస్తున్నారు.’అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ సునీల్ సింగ్. ముందే ట్వీట్.. దాడులకు కొన్ని గంటల ముందు ఆర్జేడీ అధికార ప్రతినిధి సీబీఐ దాడులపై ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్‌లో అధికారం కోల్పోవటంపై బీజేపీ కోపంగా ఉందని, అందుకే సీబీఐ, కేంద్ర ఏజెన్సీలతో దాడులు చేపట్టేందుకు సిద్ధమైందన్నారు. బుధవారం కీలకమైన రోజుగా ఆయన పేర్కొనటం గమనార్హం. ఇదీ చదవండి: అవిశ్వాస తీర్మానం పెట్టినా.. రాజీనామా చెయ్యను! బీహార్ స్పీకర్ మొండిపట్టు -
బీజేపీతో ఆప్ ఢీ.. అందుకే సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోరు ఉంటుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి సరైన ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ అని పేర్కొన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేజ్రీవాల్ అంటే భయంతోనే.. ‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ స్కామ్ గురించి ఆలోచించడం లేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ అవుతారని బీజేపీ భయపడుతోంద’ని మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. పూర్తి పారదర్శకంగా ఎక్సైజ్ పాలసీ ఉందని, ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. సీబీఐ అరెస్ట్ చేయొచ్చు తనను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశముందని సిసోడియా వెల్లడించారు. నిర్బంధాలతో తమ పార్టీ మంచి పనులు చేయకుండా అడ్డుకోలేరని చెప్పారు. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో ప్రచురించడంతోనే తమపై మోదీ సర్కారు కక్ష సాధిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. అసలు సూత్రధారి అరవింద్: ఠాకూర్ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా నిందితుడు మాత్రమేనని, అసలు సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. డబ్బులు వసూలు చేసి మౌనం దాల్చిన మనీశ్ సిసోడియా తన పేరును ‘మనీ-ష్’గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. మోదీకి కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థి కాదని కొట్టిపారేశారు. 31 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు ఢిల్లీలోని సిసోడియా ఇంటితో పాటు, ఏడు రాష్ట్రాల్లోని మరో 31 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. మద్యం పాలసీ ఉల్లంఘనలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో 15 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 11 పేజీల నేరాభియోగ పత్రంలో అవినీతి, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపారు. (క్లిక్: కేంద్రం, ఆప్ కుస్తీ) -
సీబీఐ దాడుల వేళ కేజ్రీవాల్ ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. ఓ వైపు సీబీఐ దాడులు జరుగుతున్న క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మిషన్‌లో పాల్గొనాలని ‘మిస్డ్ కాల్’ ప్రచారం చేపట్టారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ‘భారత్‌ను నంబర్ వన్ చేసేందుకు మా నేషనల్ మిషన్‌లో పాలుపంచుకోండి. అందుకు 9510001000కు మిస్డ్‌కాల్ ఇచ్చి భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టండి.’ అని వీడియో ద్వారా పిలుపునిచ్చారు. ట్విట్టర్లోనూ ప్రజలకు సూచించారు. మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు చేపట్టిన తర్వాత మాట్లాడారు కేజ్రీవాల్. ‘సీబీఐ దాడులపై ఎలాంటి భయం అవసరం లేదు. వారి పనిని చేసుకోనిద్దాం. మమ్మల్ని వేధించేందుకు పైనుంచి వారికి ఆదేశాలు వచ్చాయి. మా నాయకుల పని అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతుంటే ఓర్వలేకపోతున్నారు.’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్. మనీశ్ సిసోడియా ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో తొలి పేజీలో వచ్చిన కథనాన్ని సూచిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు.. ఇతర మంత్రులు కైలాశ్ గహ్లోట్, సత్యేందర్ జైన్‌లపైనా దాడులు చేశారని, ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదన్నారు. भारत को दुनिया का नम्बर वन देश बनाने के लिए साथ आयें। इस मिशन से जुड़ने के लिए 9510001000 पर मिस कॉल करें। हमें देश के 130 करोड़ लोगों को जोड़ना है। — Arvind Kejriwal (@ArvindKejriwal) August 19, 2022 ఇదీ చదవండి: కేజ్రీవాల్ ఎఫెక్ట్.. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్ -
కేజ్రీవాల్ ఎఫెక్ట్.. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్
దేశవ్యాప్తంగా పలు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ షాక్ ఇచ్చింది. కాగా, శుక్రవారం ఉదయం ఢిల్లీలోని మనీష్ సిసోడియా నివాసం, సహా పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. అయితే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(లిక్కర్ స్కామ్) కేసులో జరిగిన అవకతవకలపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. సీబీఐ దాడులపై మనీష్ సిసోడియా స్పందిస్తూ.. నా ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. నేను సీబీఐ అధికారులకు సహాకరిస్తాను. అధికారులు నాకు వ్యతిరేకంగా ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకోలేరు. దేశంలో మంచి చేసే వారిని ఇలా వేధింపులకు గురిచేయడం దురదుష్టకరం. విద్యా రంగంలో నేను చేస్తున్న పనిని ఎవరూ ఆపలేరు. నిజం బయటకు వస్తుంది అంటూ ట్విటర్ వేదికగా కామెంట్స్ చేశారు. కాగా, సీబీఐ సోదాల సందర్భంగా కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సీబీఐకి స్వాగతం. మేము పూర్తి సహకారం అందిస్తాము. గతంలో కూడా సోదాలు దాడులు జరిగాయి, కానీ ఏమీ కనుగొనబడలేదు. ఇప్పుడు కూడా మీకు ఏదీ దొరకదు అంటూ కామెంట్స్ చేశారు. Delhi | CBI reaches the residence of Deputy CM Manish Sisodia. pic.twitter.com/mxiYCAOWZi — ANI (@ANI) August 19, 2022 ఇదిలా ఉండగా.. కొద్ది రోజులుగా కేంద్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆప్ డిప్యూటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది. Delhi CM Arvind Kejriwal tweets, "CBI is welcome. We will give full cooperation. Searches/raids took place earlier too, but nothing was found. Nothing will be found now too." https://t.co/7xUpwNla5V pic.twitter.com/JQ6Mx5v6He — ANI (@ANI) August 19, 2022 -
రాయపాటి ఇంటిపై సీబీఐ దాడులు
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులో రాయపాటికి చెందిన నివాసాల్లో, ఆఫీసుల్లో ఉదయం నుంచి ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ రూ. 300కోట్ల మేర బ్యాంకు రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ట్రాన్స్ట్రాయ్ కంపెనీపై కేసు నమోదు చేసిన అధికారులు అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. -
బొల్లినేని గాంధీకి సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ఆదాయానికిమించి ఆస్తులు ఆరోపణలతో అడ్డంగా దొరికిపోయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి, జీఎస్టీ సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస గాంధీకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆయన ఆదాయానికి మించి విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన సీబీఐ అధికారులు నిన్న ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా జీఎస్టీ పన్ను ఎగవేత విభాగం సూపరింటెండెంట్‌గా కూడా ఆయన పలు కంపెనీలను ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలతో వీటిపై కూడా సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అలాగే హై ప్రొఫైల్ కేసులను డీల్ చేయడంలో పాటు, సీరియస్ కేసులను... చిన్న కేసులుగా మార్చి ఆ కేసులను మూసివేయడంలో ఘనాపాటీ అని ఆరోపణలు వెల్లువెత్తాయి. చదవండి: సీబీఐకి బుక్కయిన బొల్లినేని గాంధీ భారీ బ్యాంక్ ఫ్రాడ్ కేసులైన ఫోనిక్స్ గ్రూప్, ముసద్దీలాల్ జువెల్లరీ, లాంకో గ్రూప్, సుజనా గ్రూప్, క్యూ సిటీ గ్రూప్ కేసులను డీల్ చేసి... నిందితులకు సహకరించారని బొల్లినేని గాంధీపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన డీల్ చేసిన ఏ కేసు కూడా ఓ కొలిక్కి రానివ్వరంటూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే పూర్తి ఆధారాలున్నా కూడా సుజనా కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఫిర్యాదులు గాంధీపై వెల్లువెత్తాయి. ఇదే రీతిలో పలు కంపెనీల విషయంలోనూ గాంధీ చూసీచూడనట్లు వ్యవహరించారని.. ఫైళ్లను తారుమారు చేశారని కేంద్ర ఆర్థిక శాఖకు గతంలోనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడిన నేపథ్యంలోనే గాంధీ ఇంత భారీస్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. -
బొల్లినేని గాంధీ అంతులేని అవినీతి
-
సీబీఐకి బుక్కయిన బొల్లినేని గాంధీ
సాక్షి, అమరావతి/విజయవాడ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొంది, ఆయన ఆదేశాల మేరకు ఈడీలో నడుచుకున్నట్లు ఆరోపణలున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి, జీఎస్టీ ప్రస్తుతసూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. ఆయన అక్రమ ఆస్తుల గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ రట్టుచేసింది. ఆయన ఆదాయానికి మించి విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. బీఎస్ గాంధీ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. సుజనాచౌదరి కేసులనూ ఆయన నీరుగార్చారని కొంతకాలంగా ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీబీఐ అధికారులు హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల గాంధీ నివాసాలు, కార్యాలయంపై మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపి సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, అమరావతిలలో తండ్రి నర్సింహారావు, భార్య శిరీషా, కుమార్తెల పేర్ల మీదనే కాక తన పేరు మీద కూడా గాంధీ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. మొత్తంగా గాంధీ 288 శాతం మేర ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు లెక్కలతో సహా తేల్చారు. రూ.3.74 కోట్ల ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని కేంద్ర జీఎస్టీ పన్ను ఎగవేత విభాగం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస గాంధీపై సీబీఐ అధికారులు అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో గాంధీ, ఆయన సతీమణి శిరీషాలను నిందితులుగా చేర్చారు. 2010 జనవరి 1 నుంచి 2019 జూన్ 27 వరకు ప్రభుత్వోద్యోగిగా గాంధీ ఉద్దేశపూర్వకంగా తన ఆస్తులను పెంచుకునేందుకు నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని సీబీఐ అధికారులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బీఎస్ గాంధీపై ఐపీసీ సెక్షన్–109, ప్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988లోని 13 (2), 13(1)(బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ ఇన్స్పెక్టర్ (ఏసీబీ) వి.వివేకానందస్వామికి అప్పగిస్తూ సీబీఐ డీఐజీ వి.చంద్రశేఖర్ ప్రొసీడింగ్స్ జారీచేశారు. బాబుకు అత్యంత సన్నిహితుడు.. బొల్లినేని శ్రీనివాస గాంధీ 1992 ఏప్రిల్ 27న సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఇన్స్పెక్టర్గా చేరారు. 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది హైదరాబాద్ కమిషనరేట్–1లో పోస్టింగ్ పొందారు. 2003లో డిప్యుటేషన్‌పై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్)కి వెళ్లారు. అక్కడి నుంచి 2004లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వెళ్లి, 2017 వరకు అక్కడే ఉన్నారు. ఆ తరువాత జీఎస్టీకి బదిలీ అయ్యారు. ఈ బదిలీ కూడా నిబంధనలను పట్టించుకోకుండా జరిగినట్లు సమచారం. అప్పట్లో అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఓ అధికారి ప్రోద్బలంతో బీఎస్ గాంధీని నియమించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా, ఆయన పే గ్రేడ్ రూ.5,400. సవరించిన వేతన స్కేల్ ప్రకారం ఆయన లెవల్–9 కింద జీతాన్ని అందుకుంటున్నారు. గాంధీ దాదాపు 13ఏళ్ల పాటు ఈడీలో పనిచేశారు. ఈ సమయంలో ఆయన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా మారారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ పూర్తిస్థాయిలో పనిచేశారు. సుజనా కేసులు దర్యాప్తు చేస్తోందీ ఇతనే.. కేంద్ర మాజీమంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనాచౌదరికి చెందిన గ్రూపు కంపెనీల మనీలాండరింగ్‌పై వచ్చిన ఫిర్యాదులను గాంధీ ఉద్దేశపూర్వకంగా బుట్ట దాఖలుచేశారు. పూర్తి ఆధారాలున్నా కూడా సుజనా కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఫిర్యాదులు గాంధీపై వెల్లువెత్తాయి. ఇదే రీతిలో పలు కంపెనీల విషయంలోనూ గాంధీ చూసీచూడనట్లు వ్యవహరించారని.. ఫైళ్లను తారుమారు చేశారని కేంద్ర ఆర్థిక శాఖకు గతంలోనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడిన నేపథ్యంలోనే గాంధీ ఇంత భారీస్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. తమ ప్రయోజనాల మేరకు గాంధీ పనిచేయడంతో అప్పటి అధికార పార్టీ వర్గాలు ఆయనకు రాజధాని అమరావతి ప్రాంతంలో భూమిని కట్టబెట్టినట్లు కూడా సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, గాంధీ విజయవాడ చుట్టపక్కల ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టడంపై సీబీఐ వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. జీఎస్టీ పన్ను ఎగవేత విభాగం సూపరింటెండెంట్‌గా కూడా ఆయన పలు కంపెనీలను ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలున్నాయి. వీటిపై కూడా సీబీఐ దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. అప్పుడున్న ఆస్తులు రూ.21 లక్షలే.. 2010–2019 మధ్య కాలంలో గాంధీ తన పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేరు మీద భారీగా స్థిర, చరాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. గాంధీ అక్రమాస్తుల లెక్కింపునకు సీబీఐ అధికా>రులు ఈ 2010–19 మధ్య కాలాన్ని చెక్ పీరియడ్‌గా పరిగణనలోకి తీసుకున్నారు. 2010 జనవరి 1 నాటికి ముందు గాంధీ స్థిర, చరాస్తుల విలువ రూ.21,00,845గా ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు.. జూన్ 27, 2019 నాటికి గాంధీ, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు రూ.2,74,14, 263కు చేరుకున్నట్లు తేల్చారు. అలాగే, 2010–19 మధ్య కాలాంలో గాంధీ, ఆయన కుటుంబ సభ్యుల ఆదాయాన్ని రూ.1,30,07,800లుగా సీబీఐ అధికారులు తేల్చారు. 2011–14 మధ్య కాలంలో నారాయణ ఒలింపియాడ్‌లో కుమార్తె చదువు నిమిత్తం రూ.4 లక్షలు ఖర్చు చేసినట్లు గుర్తించారు. అంతేకాక, రామచంద్ర యూనివర్సిటీలో కుమార్తె ఎంబీబీఎస్ కోర్సు కోసం రూ.70 లక్షలు చెల్లించినట్లు తేల్చారు. కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌లో ఇంటి నిర్మాణం కోసం గాంధీ ఏకంగా రూ.1.20 కోట్లు వెచ్చించినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ ఇంటికి సంబంధించి రూ.27 లక్షల రుణాన్ని చెల్లించారు. ఆస్తులు, ఖర్చులను రూ.5.04 కోట్లుగా తేల్చిన అధికారులు, ఆదాయాన్ని మాత్రం రూ.1.30 కోట్లుగా గుర్తించారు. ఈ విధంగా ఆయన మొత్తం రూ.3,74,73,046 ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు లెక్కలు తేల్చారు. సీబీఐ గుర్తించిన ఆస్తులివే.. కృష్ణాజిల్లా కంకిపాడులో గాంధీ తండ్రి బి.నర్సింహారావు పేరు మీద 360 చదరపు గజాల స్థలం, ప్రొద్దుటూరులో తండ్రి పేరు మీద 266.66 చ.గ. స్థలం. కొండాపూర్, రాజరాజేశ్వరి నగర్లో తండ్రి పేరు మీద రూ.17.15 లక్షల విలువ చేసే 93,300 చ.గజాల స్థలం. కూకట్పల్లి, హైదర్‌నగర్‌లో గాంధీ పేరు మీద రూ.29.56 లక్షల విలువ చేసే 257.83 గ. స్థలం, రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో 10 గుంటల స్థలం. ఇందులో గాంధీ భార్య శిరీషా వాటా రూ.12.31 లక్షలు. విజయవాడ ఎనికేపాడు గ్రామంలో భార్య శిరీష పేరు మీద రూ.28.71 లక్షల విలువ చేసే 0.43 సెంట్ల భూమి, తరిగొప్పుల గ్రామంలో కుమార్తె పేరు మీద రూ.15.67 లక్షల విలువ చేసే 2.96 ఎకరాల భూమి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో రూ.2.72 లక్షల విలువ చేసే 0.42 సెంట్ల భూమి. విజయవాడ, గుణదల వార్డు నెంబర్ 31లో రూ.72.87 లక్షల విలువ చేసే 327 చ.గజాల భూమి. ఇది గాంధీ తండ్రి, భార్య, మరొకరి పేరు మీద ఉంది. విజయవాడ శివారు పెదపులిపాక గ్రామంలో రూ.9.14 లక్షల విలువ చేసే 242 చ.గజాల స్థలం, కానూరులో తండ్రి, చిన్న కుమార్తె పేరు మీద రూ.45.15 లక్షల విలువ చేసే 400 గ.స్థలం. హైదరాబాద్ కూకట్పల్లి యాక్సిస్ బ్యాంకులో భార్య శిరీష పేరు మీద రూ.20 లక్షల బ్యాలెన్స్, తండ్రి పేరు మీద ఉన్న జాయింట్ ఖాతాలో రూ.10.12 లక్షల బ్యాలెన్స్, శిరీష పేరు మీద రూ.6.50 లక్షల విలువ చేసే ఫోక్స్‌వ్యాగన్ పోలో కారు ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. -
'ఈ నెల 19న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు'
♦ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, హిమాచల్ సీఎం వీరభద్రసింగ్ ఇళ్లపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి ♦ బీజేపీ నేతలకు ఒక విధానం.. ప్రతిపక్ష పార్టీలకు మరో విధానమా?: ఏఐసీసీ నేత కుంతియా ♦ అవినీతి కేసులున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎం ఇళ్లపై దాడులు ఎందుకు జరగడంలేదు?: రామచంద్ర కుంతియా హైదరాబాద్/ఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్ తీరుకు నిరసనగా ఈ నెల 19న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని ఏఐసీసీ నేత రామచంద్ర కుంతియా పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఇళ్లపై సీబీఐ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. అవినీతి కేసులున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంల ఇళ్లపై ఎందుకు సీబీఐ దాడులు జరగడం లేదని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ఒక విధానం.. ప్రతిపక్ష పార్టీలకు మరో విధానమా? అంటూ ధ్వజమెత్తారు.