తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొంది, ఆయన ఆదేశాల మేరకు ఈడీలో నడుచుకున్నట్లు ఆరోపణలున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి, జీఎస్టీ ప్రస్తుతసూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. ఆయన అక్రమ ఆస్తుల గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ రట్టుచేసింది. ఆయన ఆదాయానికి మించి విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది.