vijyawada
-
విజయవాడ : పేద, మధ్య తరగతులకు వరద మిగిల్చిన నష్టం (ఫొటోలు)
-
ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పించడంలో సిద్ధహస్తులు. ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనేది టీడీపీ ఆలోచన’’ అంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. టీడీపీ నేతలు అక్రమ మార్గంలో గెలిచేందుకే ప్రయత్నిస్తున్నారు. చాలమందికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించాలని ఈసీని కోరాం. ఎవరికైనా సరే ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి’’ అని వైఎస్సార్సీ నేతలు పేర్కొన్నారు. హైదరాబాద్, ఏపీలో 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయి. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు అందించాం. డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం. దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం. ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం. -మంత్రి జోగి రమేష్ ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా. ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి. టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. -మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇదీ చదవండి: బాబు కోసం ఇంత బరితెగింపా!? -
విజయవాడ-ఒంగోలు మధ్య ఎన్‌హెచ్ 16పై విమానాల ట్రయల్ రన్ సక్సెస్ (ఫొటోలు)
-
కాంస్య పతకంతో మెరిసిన ప్రియాంక
భువనేశ్వర్: జాతీయ సీనియర్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి నూతక్కి ప్రియాంక కాంస్య పతకంతో మెరిసింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 19 ఏళ్ల ప్రియాంక ఏడు పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు చెందిన దివ్యా దేశ్‌ముఖ్ 8 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించింది. 103 మంది క్రీడాకారిణులు తొమ్మిది రౌండ్లపాటు పోటీపడిన ఈ టోర్నీ లో ప్రియాంక ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయింది. చదవండి: ITF Tournament: ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యూష -
పెట్రోల్ బంకుల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్
సాక్షి, అమరావతి బ్యూరో: డీజిల్, పెట్రోల్ వాహనాలతో రోజురోజుకూ కాలుష్యం అధికమవుతోంది. మరోవైపు రోజు రోజుకూ పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రో వినియోగంతోపాటు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (ఈ–వాహనాలు) వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. వీటి కొనుగోలుపై రాయితీలను ఇస్తోంది. దీంతో క్రమంగా ఈ–వాహనాల సంఖ్య కూడా ఊపందుకుంటోంది. ఇప్పటికే పురపాలక, విద్యుత్, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖల్లో విద్యుత్ కార్లను ప్రవేశపెట్టారు. విజయవాడ సహా మరికొన్ని పట్టణాలు, నగరాల్లో ఈ–ఆటోలు కూడా నడుస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల వాతావరణానికి నష్టం కలగకపోయినా, వాటిని చార్జింగ్ చేయడమే అసలు సమస్యగా మారింది. ఎలక్ట్రిక్ బైక్‌లు, ఆటోలకు ఇళ్లలోనే 5 యాంప్స్ సామర్థ్యం ఉన్న పిన్ ద్వారా చార్జింగ్కు వీలుంటుంది. విద్యుత్ కార్లకు అయితే 15 యాంప్స్ పిన్లు అవసరం. ఈ నేపథ్యంలో ఈ – కార్లకు ఇంటి వద్ద చార్జింగ్ పెట్టడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఈ–కార్ల చార్జింగ్ కోసం రాష్ట్రంలో ప్రాథమికంగా కొన్ని చార్జింగ్ స్టేషన్లను పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత చమురు సంస్థల యాజమాన్యాలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. విజయవాడ నగరంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, సెంట్రల్ ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటుకు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో జనసమ్మర్థం ఉండే ప్రాంతాల్లో వీటిని అందుబాటులో ఉంచాలని యోచించారు. తాజాగా పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వల్ల ప్రయోజనం ఉంటుందన్న నిర్ణయానికొచ్చారు. తొలుత విజయవాడ పరిధిలోనూ, అనంతరం జాతీయ రహదారికి ఆనుకుని, కొన్నాళ్ల తర్వాత మండల కేంద్రాల్లోని బంకుల్లోనూ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. పెరగనున్న మైలేజీ.. గతంలో వచ్చిన ఈ–కార్లకు ఫుల్ చార్జింగ్ కోసం ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టేది. పైగా ఆ చార్జింగ్‌తో వాహనం 100 నుంచి 120 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించేది. మారిన పరిస్థితుల్లో తక్కువ సమయంలో చార్జింగయ్యి, ఎక్కువ దూరం ప్రయాణించే సాంకేతికత ఈ–కార్లలో అందుబాటులోకి వచ్చింది. ఇలా ఇప్పుడు వచ్చే ఈ–కార్లకు కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో చార్జింగ్ అవుతుంది. ఒక్కసారి పూర్తిస్థాయిలో చార్జింగ్ అయిన కారు నిరాటంకంగా 300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో ఇలాంటి ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లనే ఏర్పాటవుతాయని నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ జె.వి.ఎల్.సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. అందువల్ల వీటితో ఇకపై ఈ–వాహనదార్లు చార్జింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం రాదని తెలిపారు. ఈ–బైక్‌ల కోసం.. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది కోసం విద్యుత్ ద్విచక్ర వాహనాల (ఈ–బైక్‌ల)ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా రాష్ట్రంలో తొలి దశలో లక్ష వరకూ ఈ–బైక్‌లను సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కృష్ణా జిల్లాలో అధికారుల అంచనాలకు మించి ఈ–బైక్‌ల కోసం 15 వేల మంది వరకు ఆసక్తి చూపారు. వారిలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తపాలా శాఖ ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ఈ–బైక్‌ల పంపిణీకి దాదాపు పది కంపెనీలు ముందుకొచ్చాయి. చదవండి: ఘాట్ వద్ద.. చెమర్చిన కళ్లతో -
రిజర్వేషన్ లేకుండానే రైలు ప్రయాణం
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో డివిజన్ల వారీగా నిర్దేశించిన కొన్ని రైళ్లలో సాధారణ టికెట్ (రిజర్వేషన్ లేకుండా) ఉన్న ప్రయాణికులకు ప్రయాణ అవకాశం కల్పిస్తూ దక్షణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సాధారణ టికెట్లను అందుబాటులో ఉన్న రైల్వే బుకింగ్ కౌంటర్ల వద్ద కానీ, యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. చదవండి: కర్రకు ప్రాణం.. కళకు రూపం విజయవాడ డివిజన్ పరిధిలో ఈ నెల 24 నుంచి గూడూరు–సికింద్రాబాద్ (02709), గూడురు–విజయవాడ (02743/02744), విజయవాడ–సికింద్రాబాద్ (02799), నర్సాపూర్–ధర్మవరం (07247), కాకినాడ టౌన్–రేణిగుంట (07249), నర్సాపూర్–లింగంపల్లి (07255), ఈ నెల 25 నుంచి మచిలీపట్నం–బీదర్ (02749), విజయవాడ–లింగంపల్లి (02795), ఈ నెల 27 నుంచి కాకినాడ పోర్టు–లింగంపల్లి (02737), నర్సాపూర్–నాగర్సోల్ (07231 ), ఈ నెల 28 నుంచి నర్సాపూర్–నాగర్సోల్ (02713) రైళ్లలో రిజర్వేషన్ లేకుండానే ప్రయాణానికి అవకాశం కల్పించారు. చదవండి: బెంగళూరు–బెజవాడ @ 370 కిలో మీటర్లు -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలోని గుప్తా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన ఐఏఎస్ అధికారులు కె. ప్రవీణ్ కుమార్, కె. సునీత దంపతుల కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులు పృధ్వి, లిఖితలను సీఎం జగన్ ఆశీర్వదించారు. చదవండి: అఫ్ఘాన్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ -
చిట్టీల పేరుతో రూ.4కోట్లకు టోకరా!
సాక్షి, విజయవాడ సెంట్రల్: ఇంటి చుట్టుపక్కల వారితో ఎంతో నమ్మకంగా ఉంటూ చిట్టీల పేరుతో సుమారు రూ. 4కోట్ల వరకు వసూళ్లు చేసిన ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఉడాయించిన ఘటన సత్యనారాయణపురం శ్రీనగర్‌కాలనీలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. శనగల బాలాజీరావు అనే వ్యక్తి చిట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ భార్య, ఇద్దరు కొడుకులతో కలసి శ్రీనగర్‌కాలనీ మొదటి లైన్లో సొంత ఇంట్లో ఉంటున్నారు. గత పదిహేనేళ్లుగా ఇంటి చుట్టుపక్కల వారితో నమ్మకంగా చిట్టీలు కట్టించుకోవడం, వడ్డీకి అప్పులు తీసుకుంటూ సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉండేవాడు. దీంతో అతనిపై నమ్మకం కలగటంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అతని వద్ద చిట్టీలు వేయడంతో పాటు పెద్ద మొత్తంలో వడ్డీకి అప్పులు ఇచ్చేవారు. ఈ క్రమంలో గత లాక్డౌన్ నుంచి చిట్టీలు పూర్తయిన వారికి, అప్పులు ఇచ్చిన వారికి చెల్లింపులు చేయకుండా.. రేపు, మాపు అంటు కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో బాధితులు అతనిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో బాలాజీరావు గుట్టుచప్పుడు కాకుండా తన ఇంటిని అమ్మివేసి ఈ నెల 16వ తేదీ రాత్రి కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. బాధితుల ఆందోళన.. విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు సుమారు 20 మంది మంగళవారం బాలాజీరావు ఇంటి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎన్‌పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు హామీ ఇవ్వడంతో వారంతా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు సుమారు 50 మంది ఫిర్యాదు చేయగా.. ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ. 30 లక్షల వరకు నగదు తీసుకోవడంతో పాటు చిట్టీలు పూర్తయిన వారికి రావాల్సిన బకాయిలు మొత్తం సుమారు రూ. 4కోట్ల వరకు ఉంటుందని బాధితులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలమురళీకృష్ణ తెలిపారు. -
రంజాన్ పర్వదినం పై కరోనా ప్రభావం
-
బెజవాడ మహేష్ హత్య : చేధించిన పోలీసులు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో సంచలనం రేపిన విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి గజకంటి మహేష్ హత్యకేసును చేధించినట్లు సిటీపోలీస్ కమిషనర్ బత్తిని శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం విజయవాడలో కేసుకు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ' మూడు రోజులపాటు అన్ని కోణాల్లో కేసు విచారణ చేసిన ప్రత్యేక బృందం అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారమే మహేష్ హత్య జరిగినట్లు స్ఫష్టమైంది. మహేష్‌ని తుపాకీ తో కాల్చి హత్య చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశాం. మద్యం మత్తులో వివాదం జరగడంతోనే హైదరాబాద్ కి చెందిన సాకేత్ రెడ్డి మహేష్‌పై కాల్పులు జరిపినట్లు విచారణలో తేలింది. ఈ ఘటన జరిగినపుడు సాకేత్ రెడ్డితో పాటు గంగాధర్ కూడా ఉన్నట్లుగా నిర్థారణ అయింది. (చదవండి : బెజవాడ మహేష్ హత్య కేసులో కొత్త కోణం) కాగా సాకేత్ రెడ్డికి బెజవాడలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణ రెడ్డి స్నేహితుడని.. రాధాకృష్ణ రెడ్డి ఆటోలోనే సాకేత్, గంగాధర్ మద్యం తాగటానికి వచ్చారు. తెనాలికి చెందిన సందీప్ గుంటూరులో ఒకరిని కిడ్నాప్ చేయటంతో పాటు, మరొకరికి వార్నింగ్ ఇవ్వటానికి సాకేత్ రెడ్డిని పిలిపించాడు. అయితే కిడ్నాప్ చేద్దాం అని వచ్చిన సాకేత్ మద్యం మత్తులో మహేష్‌తో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలోనే సాకేత్ తుపాకీతో మహేష్‌పై కాల్పులు జరిపాడు . కాగా సాకేత్ ఎప్పుడూ తన వెంట రివాల్వర్ వెంటపెట్టుకొని తిరుగుతాడని.. అతను ఆ తుపాకీని బీహార్ గయాలో రూ. 45వేలకు కొనుగోలు చేశాడని' సీపీ బత్తిని శ్రీనివాస్ వెల్లడించారు. కిడ్నాప్ వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై కేసులు నమోదు చేశామని.. ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామని సీపీ పేర్కొన్నారు.(చదవండి : విజయవాడ నగర శివారులో దారుణ హత్య) (చదవండి : పక్కా పథకం ప్రకారమే మహేష్ హత్య) -
హరూన్ ఇండియా జాబితాలో బెజవాడ కుర్రోడు
చిన్న వయసులోనే దండిగా సంపాదించడం కొందరికే సాధ్యమవుతుంది. ఉన్నత విద్య తర్వాత సాదా సీదా ఉద్యోగంతో సంతుష్టి పడక.. సొంతంగా స్టార్టప్ ఆరంభించి తన లాంటి వందల మందికి ఉపాధి కల్పించడంలో సంతప్తిని వెతుక్కునే వారు పెరిగిపోతున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్, హరూన్ ఇండియా సంపన్నుల జాబితాను పరిశీలిస్తే ఇటువంటి విజయవంతమైన వ్యాపారవేత్తలు తారసపడతారు. అత్యంత చౌక రేట్లకు బ్రోకరేజీ సేవలను అందిస్తూ బ్రోకరేజీ పరిశ్రమలోనే అత్యధిక కస్టమర్లను సంపాదించుకున్న ‘జెరోదా’ వ్యవస్థాపకుడు నితిన్ కామత్, నిఖిల్ కామత్ రూ.24,000 కోట్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. మరీ ముఖ్యంగా మన బెజవాడ కుర్రోడు, శ్రీహర్ష మాజేటి రూ.1,400 కోట్ల సంపదతతో ఈ జాబితాలో 15వ స్థానంలో నిలిచి అందరి దష్టిని మరోసారి ఆకర్షించారు. టైర్2 పట్టణం నుంచి చోటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కూడా ఇతడే. బిట్స్ పిలానీ పూర్వవిద్యార్థి అయిన శ్రీహర్ష, నందన్ రెడ్డితో కలసి 2013లో బండ్ఎల్ టెక్నాలజీస్ ను ఏర్పాటు చేశారు. స్విగ్గీ హోల్డింగ్ కంపెనీ ఇది. స్విగ్గీలో దిగ్గజ ఇన్వెెస్ట్ మెంట్ సంస్థలు టెన్సెంట్ హోల్డింగ్స్, నాస్పర్స్ లిమిటెడ్, డీఎస్ టీ గ్లోబల్ తదితర సంస్థలు వాటాదారులుగా ఉన్నాయి. స్విగ్గీ మార్కెట్ విలువ 3 బిలియన్ డాలర్లుగా (రూ.22వేల కోట్లు) ఉంటుంది. ఇంటర్నెట్ వేదికగా విస్తరణ 40 ఏళ్ల వయసు అంతకంటే తక్కువ వయసున్న వ్యాపావేత్తలు 16 మంది వద్ద ఉమ్మడిగా రూ.44,900 కోట్ల సంపద ఉన్నట్టు ‘ఐఐఎఫ్ఎల్ వెల్త్ అండ్ హరూన్ ఇండియా సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ 2020 ఆఫ్ ఎంటర్ ప్రెన్యుర్స్ అండర్ 40’ నివేదిక తెలియజేసింది. కనీసం రూ.1,000 కోట్ల నెట్ వర్త్ (నికర సంపద విలువ)ను జాబితాకు ప్రామాణికంగా తీసుకున్నారు. వీరిలో అధికులు ఇంటర్నెట్ వేదికగా స్టార్టప్ పెట్టి జాక్ పాట్ కొట్టినవారే. కరోనా కాలంలోనూ వీరిలో కొద్ది మందిని మినహాయిస్తే మిగిలిన వారి సంపద వద్ధి చెందడం గమనార్హం. నివేదికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జెరోదా వ్యవస్థాపకులు తమ సంపదను ఈ ఏడాది ఏకంగా 58 శాతం పెంచుకున్నారు. నివేదికలో తొమ్మిదో స్థానంలో ఉన్న ‘ఓయో’ రితేష్ అగర్వాల్ సంపద 40 శాతం ఈ ఏడాది పడిపోయింది. కరోనాతో పర్యాటక, ఆతిథ్య రంగాలు కుదేలవడం రితేష్ సంపదకు చిల్లుపెట్టింది. జాబితాలో పిన్నవయస్కుడు రితేషే. వీయూ టెక్నాలజీస్ (వూ బ్రాండ్) దేవిత సరాఫ్ సంపద కూడా 33 శాతం తగ్గింది. 16 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా వ్యాపారవేత్త దేవిత సరాఫ్. ‘‘కొందరు తమ స్టార్టప్ ల నుంచి పూర్తిగా వైదొలిగితే, కొందరు పాక్షికంగా తప్పుకుని ఇన్వెస్ట్ మెంట్ ఫండ్స్ ను ప్రారంభించారు. అలాగే, యువ వ్యాపారవేత్తలకు వెన్నుదన్నుగా నిలిచారు. ఇది భారత ఔత్సాహిక వ్యాపారవేత్తల ఎదుగుదలపై ఎన్నోరెట్ల ప్రభావం చూపించింది’’అని హరూన్ ఇండియా ఎండీ అనాస్ రెహమాన్ పేర్కొన్నారు. -
కనకదుర్గ ఫ్లై ఓవర్‌కు చివరి సామర్థ్య పరీక్షలు
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఈ నెల 18న ప్రారంభం కానున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ సామర్థ్య పరీక్షలను మరోమారు నిర్వహించారు. నేషనల్ హైవే, ఆర్ అండ్ బీ అధికారులు ఇప్పటికే పలు పర్యాయాలు లోడ్ టెస్ట్‌లు నిర్వహించిన సంగతి విదితమే. మరో రెండు రోజుల్లో ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి సారిగా మంగళవారం సుమారు 216 పౌండ్ల బరువుతోకూడిన తొమ్మిది టిప్పర్లను ఫ్లై ఓవర్‌పై ఉంచారు. ఈ టిప్పర్లను సుమారు 106 గంటలపాటు అలానే ఉంచుతారని అక్కడ సిబ్బంది తెలిపారు. కాగా ఫ్లై ఓవర్ రోడ్లో సెంట్రల్ డివైడర్ పెయింటింగ్, జీబ్రా లైన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్‌తోకూడిన బోర్డ్‌ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఫిల్లర్‌కు ఫిల్లర్‌కు మధ్య జాయింట్లను కలుపుతూ తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇంద్రకీలాద్రిపై వెండి రథంలో సింహాలు మాయం! సాక్షి, విజయవాడ/ఇంద్రకీలాద్రి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల వెండి రథంలో రెండు సింహాలు మాయమయ్యాయి. ఒక్కొక్క సింహం మూడు కిలోలకు పైగా బరువు ఉంటుందని దేవస్థాన సిబ్బంది చెబుతున్నారు. ఆది దంపతులను ఉగాది పర్వదినంతో పాటు చైత్రమాస బ్రహ్మోత్సవాల సందర్భంగా వెండి రథంపై నగర వీధుల్లో ఊరేగిస్తారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఉగాది ఊరేగింపును, చైత్రమాస బ్రహ్మోత్సవాలను రద్దు చేశారు. దీంతో వెండి రథం గురించి దేవస్థానం అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల అంతర్వేది ఘటనతో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో రథాలకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుర్గామల్లేశ్వరస్వామి వార్ల రథానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు దేవస్థాన ఈవో ఎంవీ సురేష్‌బాబుకు సూచించారు. దీంతో మహా మండపం దిగువన దేవస్థాన సమాచార కేంద్రం వద్ద భద్రపరిచిన వెండి రథాన్ని ప్లాస్టిక్ పట్టాతో పూర్తిగా కప్పడం, ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేసే పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే రథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహాలలో రెండు మాయమైనట్టు ఆలయ ఇంజినీరింగ్ సిబ్బంది గుర్తించారు. నివేదిక ఇస్తాం.. అమ్మవారి వెండి రథంలో ఉండే నాలుగు సింహాల్లో రెండు కనిపించలేదు. ఉత్సవాల అనంతరం వెండి సింహాలను భద్రపరిచి, వెండి రథానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సెక్యూరిటీ సిబ్బందిదే. వెండి సింహాల మాయంపై సమగ్రంగా పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదికిస్తాం. – ఎంవీ సురేష్‌బాబు, ఈవో -
రైతు బజార్లకు బారులు తీరిన ప్రజలు
-
‘ట్రావెల్స్ పేరుతో కార్మికుల జీతాలు ఎగ్గొటావు’
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై విమర్శలు చేసే అర్హత లేదని బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజీ అన్నారు. ఆయన బుధవారం మీడియాలో మాట్లాడుతూ.. బ్యాంక్‌లకు రుణాలు ఎగ్గొట్టిన నాని.. మోదీ, ఆమిత్ షాపై విమర్శలు చేసే అర్హత లేదని షేక్ బాజీ ఎద్దేవా చేశారు. కేశినేని ట్రావెల్స్ పేరుతో కార్మికుల జీతాలు ఎగ్గొట్టి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ఆయన మండిపడ్డారు. నష్టాలను సాకుగా చూపించి కార్మికుల పొట్టగొట్టావని మండిపడ్డారు. సీఏఏకు టీడీపీ ద్వంద విధానంతో ఉందన్నారు. చంద్రబాబు సీఏఏకు మద్దతు తెలుపుతారు.. రాష్ట్రంలో వ్యతిరేకంగా తమ నాయకులతో బీజేపీపై ఉద్యమాలు చేయిస్తారని షేక్ బాజీ దుయ్యబట్టారు. ‘చంద్రబాబు ప్రతిపక్షనేత కాదు.. పనికిమాలిన నేత’ -
‘భవానీ భక్తుల ఏర్పాట్లపై రాజీపడొద్దు’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రికి ఈ ఏడాది సుమారు ఏడు లక్షలకుపైగా భవానీలు అమ్మవారి దర్శనార్థం వస్తారని అంచనా వేస్తూ అందుకు తగిన ఏర్పాట్లు చేశామని దేవాదయశాఖ మంత్రి వెల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇంద్రకీలాద్రిపై భవనీదీక్షా విరమణల ఏర్పాట్లను ఆయన బుధవారం పర్యవేక్షించారు. అదేవిధంగా భవానీ భక్తుల ఏర్పాట్లపై రాజీపడొద్దని మంత్రి వెల్లపల్లి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. క్యూలైన్లతో పాటు గిరి ప్రదక్షణకు భవానీలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. గిరి ప్రదక్షణ సమయంలో భవానీలు ట్రాఫిక్‌లో ఇబ్బంది పడకుండా చూడాలిని ఆయన అధికారులను ఆదేశించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులు వేగవంతంగా జరుగుతున్నందున వచ్చే ఏడాదికి ఆ సమస్య తీరుతుందని మంత్రి వెల్లపల్లి తెలిపారు. ప్రతి భవానీ భక్తుడు అమ్మవారిని దర్శించుకొని మాల విరమణ చేసే వరకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లపల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా హోమగుండాలు, గిరి ప్రదక్షణ ఏర్పాట్లు ఉన్నాయని భవానీ భక్తులను అడిగి తెలుసుకున్నారు. -
దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులపై సీఎం జగన్‌కు అపార గౌరవం ఉందని.. ఆయనలోనూ ఓ జర్నలిస్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో నకిలీ వార్తలు ప్రమాదకరంగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేసిన శ్రీనాథ్‌రెడ్డి... జర్నలిస్టులు తమ ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకోవలసిన అవసరం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంత విలేకరుల సమస్యలను పరిష్కరించటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆయనను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ... పాత్రికేయ రంగంలో శ్రీనాథ్‌రెడ్డి సేవలను గుర్తించి సీఎం జగన్.. ఆయనను ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించారని పేర్కొన్నారు. శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ అకాడమీ మరింతగా అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ కూడా శ్రీనాథ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ‘గతంలో ఏ ప్రభుత్వాలు జర్నలిస్టులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే సీఎం జగన్ మాత్రం ఆరుగురు సీనియర్ జర్నలిస్టులకు తన ప్రభుత్వంలో పలు పదవులు ఇచ్చారు’ అని హర్షం వ్యక్తం చేశారు. ‘1996 లో ప్రెస్ అకాడమీ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ శిక్షణ ఇచ్చేది. గత కొంత కాలంగా ప్రెస్ అకాడమీలు నామమాత్రంగా మారాయి. ప్రెస్ అకాడమీకి స్థలం, నిధులు ఇచ్చి జర్నలిస్టులను ప్రోత్సహించాలి’ అని విఙ్ఞప్తి చేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ కమిషనర్, సీనియర్ పాత్రికేయులు ఆర్. దిలీప్‌రెడ్డి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. కాగా శ్రీనాథ్‌రెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామం. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. -
‘అందుకే సీఎం జగన్‌ను అభినందిస్తున్నా’
సాక్షి, విజయవాడ : రివర్స్ టెండరింగ్ విధానంతో ప్రజాధనం ఆదా అవుతుందని బీజేపీ సీనియర్ నేత కిలారు దిలీప్ అన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 780 కోట్ల మేర మిగలడమే ఇందుకు నిదర్శనమన్నారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... రివర్స్ టెండరింగ్ విధానంలో అవినీతి జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని ఆదా చేసిన వారిని తప్పక అభినందించాలని.. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందిస్తున్నామని తెలిపారు.(చదవండి : 'రివర్స్'పై పారని కుట్రలు!) అదే విధంగా పారదర్శక రివర్స్ టెండరింగ్ విధానంపై టీడీపీ విమర్శలు సరికావని కిలారు దిలీప్ చురకలు అంటించారు. రివర్స్ టెండరింగ్‌పై సీఎం జగన్‌కు ప్రజల ఆశీస్సులు ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. పోలవరం మాదిరి మిగతా ప్రాజెక్టులలో కూడా రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
ఉగ్ర స్వరూపిణి కృష్ణమ్మ
-
‘చంద్రబాబు డైరెక్షన్లో మందకృష్ణ మాదిగ’
విజయవాడ: అసెంబ్లీలో ముఖ్యమత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి మందకృష్ణ మాదిగ.. చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారని ‘మాదిగ మహాసేన’ రాష్ట్ర అధ్యక్షుడు కొరిపాటి ప్రేమ్ కుమార్ విమర్శించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా వర్గీకరణ పోరాటంలో మాదిగల అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్‌ని గెలిపించుకున్న మాదిగల మధ్యనే గొడవలు పెడుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా గతంలో చంద్రబాబు వర్గీకరణ పేరుతో మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు. నోటాకి ఓటు వేయమన్న వ్యక్తి మంద కృష్ణ మాదిగ.. ఏ మొహం పెట్టకొని అడుగుతున్నావని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలు అంతా జగన్‌తోనే ఉన్నారని తెలిపారు. కాగా మందకృష్ణను నమ్మే పరిస్థితిలో ఎవరు లేవరని పేర్కొన్నారు. దీంతోపాటు ఈ నెల 30న మందకృష్ణ మాదిగ చేపట్టిన అసెంబ్లీ ముట్టడిని అడ్డుకుంటామని తెలిపారు. -
బొల్లినేని గాంధీ అంతులేని అవినీతి
-
సీబీఐకి బుక్కయిన బొల్లినేని గాంధీ
సాక్షి, అమరావతి/విజయవాడ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొంది, ఆయన ఆదేశాల మేరకు ఈడీలో నడుచుకున్నట్లు ఆరోపణలున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి, జీఎస్టీ ప్రస్తుతసూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. ఆయన అక్రమ ఆస్తుల గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ రట్టుచేసింది. ఆయన ఆదాయానికి మించి విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. బీఎస్ గాంధీ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. సుజనాచౌదరి కేసులనూ ఆయన నీరుగార్చారని కొంతకాలంగా ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీబీఐ అధికారులు హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల గాంధీ నివాసాలు, కార్యాలయంపై మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపి సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, అమరావతిలలో తండ్రి నర్సింహారావు, భార్య శిరీషా, కుమార్తెల పేర్ల మీదనే కాక తన పేరు మీద కూడా గాంధీ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. మొత్తంగా గాంధీ 288 శాతం మేర ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు లెక్కలతో సహా తేల్చారు. రూ.3.74 కోట్ల ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని కేంద్ర జీఎస్టీ పన్ను ఎగవేత విభాగం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస గాంధీపై సీబీఐ అధికారులు అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో గాంధీ, ఆయన సతీమణి శిరీషాలను నిందితులుగా చేర్చారు. 2010 జనవరి 1 నుంచి 2019 జూన్ 27 వరకు ప్రభుత్వోద్యోగిగా గాంధీ ఉద్దేశపూర్వకంగా తన ఆస్తులను పెంచుకునేందుకు నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని సీబీఐ అధికారులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బీఎస్ గాంధీపై ఐపీసీ సెక్షన్–109, ప్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988లోని 13 (2), 13(1)(బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ ఇన్స్పెక్టర్ (ఏసీబీ) వి.వివేకానందస్వామికి అప్పగిస్తూ సీబీఐ డీఐజీ వి.చంద్రశేఖర్ ప్రొసీడింగ్స్ జారీచేశారు. బాబుకు అత్యంత సన్నిహితుడు.. బొల్లినేని శ్రీనివాస గాంధీ 1992 ఏప్రిల్ 27న సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఇన్స్పెక్టర్గా చేరారు. 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది హైదరాబాద్ కమిషనరేట్–1లో పోస్టింగ్ పొందారు. 2003లో డిప్యుటేషన్‌పై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్)కి వెళ్లారు. అక్కడి నుంచి 2004లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వెళ్లి, 2017 వరకు అక్కడే ఉన్నారు. ఆ తరువాత జీఎస్టీకి బదిలీ అయ్యారు. ఈ బదిలీ కూడా నిబంధనలను పట్టించుకోకుండా జరిగినట్లు సమచారం. అప్పట్లో అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఓ అధికారి ప్రోద్బలంతో బీఎస్ గాంధీని నియమించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా, ఆయన పే గ్రేడ్ రూ.5,400. సవరించిన వేతన స్కేల్ ప్రకారం ఆయన లెవల్–9 కింద జీతాన్ని అందుకుంటున్నారు. గాంధీ దాదాపు 13ఏళ్ల పాటు ఈడీలో పనిచేశారు. ఈ సమయంలో ఆయన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా మారారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ పూర్తిస్థాయిలో పనిచేశారు. సుజనా కేసులు దర్యాప్తు చేస్తోందీ ఇతనే.. కేంద్ర మాజీమంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనాచౌదరికి చెందిన గ్రూపు కంపెనీల మనీలాండరింగ్‌పై వచ్చిన ఫిర్యాదులను గాంధీ ఉద్దేశపూర్వకంగా బుట్ట దాఖలుచేశారు. పూర్తి ఆధారాలున్నా కూడా సుజనా కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఫిర్యాదులు గాంధీపై వెల్లువెత్తాయి. ఇదే రీతిలో పలు కంపెనీల విషయంలోనూ గాంధీ చూసీచూడనట్లు వ్యవహరించారని.. ఫైళ్లను తారుమారు చేశారని కేంద్ర ఆర్థిక శాఖకు గతంలోనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడిన నేపథ్యంలోనే గాంధీ ఇంత భారీస్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. తమ ప్రయోజనాల మేరకు గాంధీ పనిచేయడంతో అప్పటి అధికార పార్టీ వర్గాలు ఆయనకు రాజధాని అమరావతి ప్రాంతంలో భూమిని కట్టబెట్టినట్లు కూడా సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, గాంధీ విజయవాడ చుట్టపక్కల ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టడంపై సీబీఐ వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. జీఎస్టీ పన్ను ఎగవేత విభాగం సూపరింటెండెంట్‌గా కూడా ఆయన పలు కంపెనీలను ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలున్నాయి. వీటిపై కూడా సీబీఐ దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. అప్పుడున్న ఆస్తులు రూ.21 లక్షలే.. 2010–2019 మధ్య కాలంలో గాంధీ తన పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేరు మీద భారీగా స్థిర, చరాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. గాంధీ అక్రమాస్తుల లెక్కింపునకు సీబీఐ అధికా>రులు ఈ 2010–19 మధ్య కాలాన్ని చెక్ పీరియడ్‌గా పరిగణనలోకి తీసుకున్నారు. 2010 జనవరి 1 నాటికి ముందు గాంధీ స్థిర, చరాస్తుల విలువ రూ.21,00,845గా ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు.. జూన్ 27, 2019 నాటికి గాంధీ, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు రూ.2,74,14, 263కు చేరుకున్నట్లు తేల్చారు. అలాగే, 2010–19 మధ్య కాలాంలో గాంధీ, ఆయన కుటుంబ సభ్యుల ఆదాయాన్ని రూ.1,30,07,800లుగా సీబీఐ అధికారులు తేల్చారు. 2011–14 మధ్య కాలంలో నారాయణ ఒలింపియాడ్‌లో కుమార్తె చదువు నిమిత్తం రూ.4 లక్షలు ఖర్చు చేసినట్లు గుర్తించారు. అంతేకాక, రామచంద్ర యూనివర్సిటీలో కుమార్తె ఎంబీబీఎస్ కోర్సు కోసం రూ.70 లక్షలు చెల్లించినట్లు తేల్చారు. కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌లో ఇంటి నిర్మాణం కోసం గాంధీ ఏకంగా రూ.1.20 కోట్లు వెచ్చించినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ ఇంటికి సంబంధించి రూ.27 లక్షల రుణాన్ని చెల్లించారు. ఆస్తులు, ఖర్చులను రూ.5.04 కోట్లుగా తేల్చిన అధికారులు, ఆదాయాన్ని మాత్రం రూ.1.30 కోట్లుగా గుర్తించారు. ఈ విధంగా ఆయన మొత్తం రూ.3,74,73,046 ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు లెక్కలు తేల్చారు. సీబీఐ గుర్తించిన ఆస్తులివే.. కృష్ణాజిల్లా కంకిపాడులో గాంధీ తండ్రి బి.నర్సింహారావు పేరు మీద 360 చదరపు గజాల స్థలం, ప్రొద్దుటూరులో తండ్రి పేరు మీద 266.66 చ.గ. స్థలం. కొండాపూర్, రాజరాజేశ్వరి నగర్లో తండ్రి పేరు మీద రూ.17.15 లక్షల విలువ చేసే 93,300 చ.గజాల స్థలం. కూకట్పల్లి, హైదర్‌నగర్‌లో గాంధీ పేరు మీద రూ.29.56 లక్షల విలువ చేసే 257.83 గ. స్థలం, రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో 10 గుంటల స్థలం. ఇందులో గాంధీ భార్య శిరీషా వాటా రూ.12.31 లక్షలు. విజయవాడ ఎనికేపాడు గ్రామంలో భార్య శిరీష పేరు మీద రూ.28.71 లక్షల విలువ చేసే 0.43 సెంట్ల భూమి, తరిగొప్పుల గ్రామంలో కుమార్తె పేరు మీద రూ.15.67 లక్షల విలువ చేసే 2.96 ఎకరాల భూమి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో రూ.2.72 లక్షల విలువ చేసే 0.42 సెంట్ల భూమి. విజయవాడ, గుణదల వార్డు నెంబర్ 31లో రూ.72.87 లక్షల విలువ చేసే 327 చ.గజాల భూమి. ఇది గాంధీ తండ్రి, భార్య, మరొకరి పేరు మీద ఉంది. విజయవాడ శివారు పెదపులిపాక గ్రామంలో రూ.9.14 లక్షల విలువ చేసే 242 చ.గజాల స్థలం, కానూరులో తండ్రి, చిన్న కుమార్తె పేరు మీద రూ.45.15 లక్షల విలువ చేసే 400 గ.స్థలం. హైదరాబాద్ కూకట్పల్లి యాక్సిస్ బ్యాంకులో భార్య శిరీష పేరు మీద రూ.20 లక్షల బ్యాలెన్స్, తండ్రి పేరు మీద ఉన్న జాయింట్ ఖాతాలో రూ.10.12 లక్షల బ్యాలెన్స్, శిరీష పేరు మీద రూ.6.50 లక్షల విలువ చేసే ఫోక్స్‌వ్యాగన్ పోలో కారు ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. -
విజయవాడ నగరంలో భారీ వర్షం
-
విజయవాడలో భారీ వర్షం
సాక్షి, విజయవాడ : నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వర్షపు నీరు చేరడంతో వన్ టౌన్ ప్రాంతంలో నీరు రోడ్లపైకి చేరింది. దీంతో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఈ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. -
దేవీ అలంకారాలు
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాౖయెర్ముఖైస్త్రీక్షణైఃయుక్తా మిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్‌గాయత్రీం వరదా భయంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవింద యుగళం హస్తైర్వహంతీ భజే‘‘ శరన్నవరాత్రి మహోత్సవాలలో మూడవ రోజు గురువారం కనకదుర్గమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకు మూల శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్త్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా, త్రిమూర్తి అంశగా గాయత్రీదేవి వెలుగొందుతున్నది. సమస్త దేవతా మంత్రాలూ గాయత్రీ మంత్రంతో అనుసంధానమవుతాయి. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవుళ్లకి అన్నప్రసాదాలను నివేదన చేస్తారు. గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత సూర్యభగవానుడు. గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన భక్తులందరికీ సౌరశక్తి ప్రాప్తించి, ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారు. -
త్రిపురసుందరీ పాహిమాం
-
విజయవాడలో రాష్ట్ర పశుసంవర్ధక కార్యాలయం
విజయవాడ (లబ్బీపేట) : రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కార్యాలయం పూర్తిస్థాయిలో నగరానికి తరలివచ్చింది. నెల రోజుల కిందట లబ్బీపేటలోని సూపర్‌స్పెషాలిటీ పశుశుల ఆస్పత్రిలో వెటర్నరీ డైరెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించినప్పటికీ, హైదరాబాద్ నుంచే విధులు నిర్వహించారు. గురువారం అక్కడి నుంచి ఫైళ్లతో సహా పూర్తిస్థాయిలో ఉద్యోగులు నగరానికి తరలివచ్చారు. వారిని ఏపీ ఎన్జీవో సంఘ నాయకుడు ఎ.విద్యాసాగర్‌తో పాటు, ఏపీ పశువైద్యుల సంఘం ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. వారికి పూలు ఇస్తూ, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ జి.సోమశేఖరమ్ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధానికి కార్యాలయం తరలిరావడం సంతోషకంగా ఉందన్నారు. రాష్ట్రంలో పశు సంవర్ధకశాఖలో సేవలు మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదనపు సంచాలకుడు డాక్టర్ కె.కృష్ణమూర్తి సహా సుమారు 50 మందికిపైగా ఉద్యోగులు తరలివచ్చారు. వెటర్నరీ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తుమ్మల సాయిగోపాల్, గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘ ప్రతినిధి డాక్టర్కె నగేష్‌బాబు, డాక్టర్ పద్మ పాల్గొన్నారు. -
ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ రాష్ట్ర కార్యవర్గం
విజయవాడ : స్థానిక మాచవరంలోని విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎంపికైంది. అధ్యక్షుడిగా టి.మోతీలాల్ రామ్‌ప్రసాద్ (గుంటూరు), ప్రధాన కార్యదర్శిగా శ్రీహరిరావు (విజయవాడ), కార్యదర్శిగా కె.పాల్రాజు (కర్నూలు), కోశాధికారిగా డి.వి.సత్యనారాయణ (విజయవాడ), ఉపాధ్యక్షులుగా ఆర్.వి.కష్ణకుమార్ (తూర్పుగోదావరి), నందగోపాల్ (తిరుపతి), సంయుక్త కార్యదర్శిగా మంతెన శ్రీనివాసరావు (శ్రీకాకుళం ), పి.వి.సత్యనారాయణ (పశ్చిమగోదావరి), పి.గురప్ప (కడప), ఎస్.కె.ఖాసిం (గుంటూరు) ఎంపికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా మండవ కుటుంబరావు (విజయవాడ), గౌరవ సలహాదారులుగా కె.శ్రీనివాసరావు, బి.రంగారావు, కార్యనిర్వాహక సభ్యులుగా ఎస్.రవిబాబు (గుంటూరు), దొడ్డి వెంకటేశ్వరరావు (విశాఖపట్నం), వై.శ్రీనివాసరావు (రాజమండ్రి), కె.దస్తగిరి (కడప), బి.సురేష్‌బాబు (కర్నూలు) ఎంపికయ్యారు. -
ఆదరించిన వారిపైనే తొలివేటు
సాక్షి, విజయవాడ బ్యూరో : ఆదరించిన వారిపైనే తొలి వేటు పడింది. అధికార పార్టీకి అండగా నిలిచినందుకు ఆ గ్రామాలను వదిలిపోవాల్సిన పరిస్థితి దాపురించనుంది. సీడ్ కేపిటల్ (తొలి దశ) కీలక నిర్మాణాలకు తమ గ్రామాలను ఎంపిక చేశారని తెలుసుకున్న వారంతా కలవరపడాల్సి వచ్చింది. ఉన్నపళంగా ఊరు, ఇళ్లు, గొడ్డూగోదా వదిలి పొమ్మంటే ఎలా అనే ఆందోళన వారి మదిని తొలిచేస్తోంది. ఇది రాజధాని ప్రాంతంలోని నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, వెలగపూడి గ్రామస్తుల దయనీయ స్థితి. వ్యూహాత్మకంగా ప్రభుత్వం అడుగులు.. అబద్దాల పునాదులపై రాజధాని వ్యవహారాన్ని నెట్టుకొస్తున్న టీడీపీ సర్కారు వ్యూహాత్మకంగానే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నేలపాడు నుంచి మొదలెట్టింది. సొంత సామాజికవర్గం, టీడీపీకి అనుకూలవర్గం అధికంగా ఉన్న ఈ గ్రామాల నుంచే ల్యాండ్ పూలింగ్ ప్రారంభిస్తే ప్రజా వ్యతిరేకత లేకుండా తమ పని సజావుగా సాగుతుందన్నది ప్రభుత్వ ఎత్తుగడ. అనుకున్నట్టే ఆ నాలుగు గ్రామాల్లో భూ సమీకరణ పూర్తి చేసిన ప్రభుత్వం సీడ్ కేపిటల్‌కు వాటినే ఎంపిక చేయడం ఆయా గ్రామాల ప్రజలకు మింగుడు పడటంలేదు. ఆ నాలుగు గ్రామాలనే ముందుగా ఖాళీ చేయించి అక్కడి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తామంటూ సీఆర్డీఏ వైస్ చైర్మన్, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించడంతో కలకలం రేగుతోంది. తొలి దశలో పరిపాలన పరమైన కీలక నిర్మాణాలను చేపట్టి సీడ్ కేపిటల్‌గా అభివృద్ధి చేసేందుకు గ్రామాలను ఖాళీ చేయిస్తే అక్కడి ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగరేస్తారనడంలో సందేహం లేదు. ఈ నాలుగు గ్రామాల్లోను ఉన్న సుమారు 6,714 మంది ఇల్లు వదిలిపోవాలంటే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇబ్బంది పెట్టకుండా సీడ్ కేపిటల్ నిర్మించుకుంటే సరే.. లేకుంటే ప్రతిఘటనే అంటూ ప్రభుత్వానికి అక్కడి వారు అల్టిమేటం ఇస్తున్నారు. ఆ నాలుగు గ్రామాల్లో భూములు ఇలా... నాలుగు గ్రామాల్లోను రైతుల సొంత భూములు 5,601ఎకరాలు ఉండగా దాదాపు 5,450ఎకరాలను భూ సమీకరణ చేశారు. మిగిలిన గ్రామం కంఠం, అసైన్డ్భూములు, దేవాదాయ శాఖ భూములు ఎలాగు ప్రభుత్వం పరిధిలోకే వస్తాయి. ఈ నాలుగు గ్రామాల్లోను ఒక్క వెలగపూడిలోనే కొంత మేర భూమి సమీకరణ పూర్తి కాలేదు. మిగిలిన మూడు గ్రామాల్లోను పూర్తిస్థాయిలో భూ సమీకరణ చేయడం గమనార్హం. గ్రామాల వారీగా భూముల విస్తీర్ణం.. నేలపాడులో రైతు సొంత భూములు 1,222 ఎకరాలు, దేవాదాయశాఖ భూములు 30, చెరువులు 42, అసైన్డ్ భూములు 40, గ్రామ కంఠం 9.5 ఎకరాలు ఉంది. ఐనవోలులో రైతు సొంత భూములు 1,046 ఎకరాలు, దేవాదాయశాఖ భూములు 9.32, వక్ఫ్ భూములు 21.25, చెరువులు 41.85, అసైన్డ్ భూములు 10.78, గ్రామ కంఠం 23.29, రోడ్లు, డొంకలు, పిల్ల కాలువలు 45.21ఎకరాలు ఉన్నాయి. శాఖమూరులో రైతుల సొంత భూములు 1,510 ఎకరాలు, దేవాదాయశాఖ భూములు 7, చెరువులు 27, అసైన్డ్ భూములు 36, గ్రామ కంఠం 14, రోడ్లు, డొంకలు, చిన్నపాటి కాలువలు 32 ఎకరాలు ఉన్నాయి. వెలగపూడిలో రైతుల సొంత భూమి 1,823 ఎకరాలు, దేవాదాయ శాఖ భూములు 33, అసైన్డ్ భూములు 37 గ్రామ కంఠం భూములు 19, కాలువలు, డొంకలు, రోడ్లు 85 ఎకరాలు ఉన్నాయి. -
విజయవాడలో పేలిన గ్యాస్ సిలిండర్...
-
జిల్లాకూ మహర్దశ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: విజయవాడ పరిసరాల్లో కొత్త రాజధాని ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం తో సరిహద్దునే ఉన్న గుంటూరు జిల్లాకు మహర్దశ పట్టనుంది. రెండు నెలల క్రితమే ఎయిమ్స్, జాతీయ విపత్తు నివారణ సంస్థలను మంగళగిరిలో, వ్యవసాయ యూనివర్సిటీని గుంటూరు సమీపంలోని లాంలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఎయిర్‌పోర్టు, మెట్రోరైలు, టెక్స్టైల్ పార్కు, టూరిజం సర్క్యూట్ వంటి మరి కొన్నింటిని ప్రకటించింది. - వీటికితోడు విజయవాడ-గుంటూరు మధ్య అనేక రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన స్థలాలు, భవనాలు ఉన్నాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. అరగంటలో రాజధానికి చేరుకోవడానికి 16వ నంబరు జాతీయ రహదారి, రైలు మార్గం ఉండటంతో గుంటూరు సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా గుంటూరులోనూ అనేక ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు రూపొందిం చినట్టు చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ముఖ్యంగా తీర ప్రాంతంలో ఆక్వా, మెట్టప్రాంతాల్లో వాణిజ్య పంటల సాగుకు అనువైన పరిస్థితులు ఉండటంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫుడ్‌పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన ఎయిమ్స్‌ను మంగళగిరికి సమీపంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభయ్యాయి. దీనికోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తోపాటు ఉన్నతాధికారులు మంగళగిరి టీబీ శానిటోరియం స్థలాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రూ.1500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్ లో వంద సీట్లతో మెడికల్ కళాశాల, 500 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల, పలు పరిశోధనా కేంద్రాలు ఉంటాయి. 200 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. అలాగే జాతీయ ప్రకృతి విపత్తుల దళం (ఎన్డీఆర్ఎఫ్) ఏర్పాటుకు ఇప్పటికే శానిటోరియంలో 50 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. గుంటూరుకు సమీపంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉన్న లాంఫారం పక్కనే 500 ఎకరాల్లో వ్యవసాయ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించి, రూ.100 కోట్లు కేటాయించింది. మెట్రోరైలుకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీ బాధ్యతలను వీజీటీఎం ఉడా నెల రోజుల క్రితమే చేపట్టింది. ఉడా పరిధిలో రైలు మార్గానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు నివేదికను కూడా పంపినట్టు చెబు తున్నారు. అదే విధంగా 50 కిలోమీటర్ల రేడియస్ సర్కిల్లో కృష్ణా, గుం టూరు జిల్లాల్లోని వివిధ గ్రామాల మీదుగా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ రింగ్ రోడ్డు పరిధిలో విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి ప్రాంతాలు ఉంటాయి. కొత్తగా ప్రకటించిన ఎయిర్ పోర్టు, టూరిజం సర్క్యూట్లతోపాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలంగా ఉండటంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫుడ్‌పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. రేపల్లె, నిజాంపట్నంలో ఆక్వాసాగు, మెట్ట ప్రాంతాల్లో పత్తి, పొగాకు, పసుపు వంటి వాణిజ్య పంటల సాగుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అధిక విస్తీర్ణంలో పత్తి సాగుతో పాటు అనేక స్పిన్నింగ్ మిల్లులు ఉండటంతో టెక్స్ టైల్పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.ప్రభుత్వం ప్రకటించినవన్నీ కార్యరూపం దాల్చితే అభివృద్ధిలో గుంటూరు రాజధానితో పోటీ పడే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక రంగనిపుణులు చెబుతున్నారు. -
జిల్లాకు జగన్ రాక
నేడు, రేపు పార్టీ సమీక్షలు కానూరులోని ఆహ్వానం కల్యాణ మండపంలో సమావేశాలు సాక్షి, విజయవాడ : జిల్లాలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై సమీక్ష నిర్వహించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం జిల్లాకు వచ్చారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి గుడివాడ వెళ్లారు. ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నివాసంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. రాత్రికి విజయవాడకు చేరుకున్నారు. జగన్మోహన్రెడ్డి వెంట వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, పేర్ని నాని, జోగి రమేష్, నాయకులు పి.గౌతమ్‌రెడ్డి, తాతినేని పద్మావతి, దూలం నాగేశ్వరరావు, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికారు. విజయవాడ తూర్పు నుంచి మొదలు.. శనివారం ఉదయం 9గంటలకు బందరురోడ్డులోని కానూరులో ఉన్న ఆహ్వనం కల్యాళ మండపంలో పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయని ఆ పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు సామినేని ఉదయభాను, జలీల్‌ఖాన్ తెలిపారు. ఉదయం 9గంటలకు విజయవాడ తూర్పు నియోజకవర్గ సమీక్షతో సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత విజయవాడ సెంట్రల్, మైలవరం, నంగదిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, పెడన, మచిలీపట్నం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల సమీక్షలు జరుగుతామని వివరించారు. ఆదివారం పెనమలూరు, గన్నవరం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని తెలిపారు. అయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, పార్టీ మండల అధ్యక్షులు పాల్గొంటారని పేర్కొన్నారు. -
నిఘా నీడలో..
వీవీఐపీలకు మూడంచెల భద్రత వీఐపీల బస వద్ద ప్రత్యేక బృందాలు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సీమాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడలో పోలీసు నిఘా భారీగా పెంచారు. వీవీఐపీలు, వీఐపీలు బసచేసే ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు ముమ్మరం చేశారు. విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడలో నిఘా భారీగా పెరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరానుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ జాతీయ పార్టీల అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రముఖులు (వీవీఐపీ), ప్రముఖులు (వీఐపీ)లు బసచేసే ప్రాంతాల్లో మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటుచేశారు. ఐజీలు ఎన్వీ సురేంద్రబాబు, గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు భద్రత చర్యలపై దృష్టిసారించారు. శనివారం ఉదయంలోగా అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధులకు హాజరుకానున్నారు. నగర పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ, ప్రత్యేక బలగాలు విధుల్లో పాల్గొంటున్నాయి. నగర పోలీసు కమిషనరేట్‌లో 10 కంపెనీల సీఆర్పీఎఫ్, 2 ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలు అందుబాటులో ఉన్నాయి. మరో 20 ప్లాటూన్ల బలగాలను ఇతర ప్రాంతాల నుంచి రప్పించారు. పొరుగు జిల్లాల పోలీసులను కూడా అందుబాటులో ఉంచారు. రెండువేల మందితో విడిది కేంద్రాలకు భద్రత.. పలువురు ప్రముఖులు అతిథి గృహాలు, ప్రముఖ హోటళ్లలో బస చేయనున్నారు. శనివారం నుంచే వీరు వచ్చే అవకాశముంది. ఆయా వ్యక్తుల హోదాను బట్టి అతిథి గృహాలు, హోటళ్లను రెవెన్యూ అధికారులు కేటాయిస్తున్నారు. గెస్ట్‌హౌస్‌లు, హోటళ్ల వద్ద రెండు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రముఖులను కలిసేందుకు వచ్చేవారిని నిశితంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించనున్నారు. వీరు బసచేసే ప్రాంతాల్లో భద్రత చర్యల్లో భాగంగా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. బస కేంద్రాలకు సమీపంలో నివసించే వారి వివరాలు సేకరించారు. కొత్తగా వచ్చిన వారి వివరాలను సైతం పోలీసు అధికారులు తీసుకుని విచారణ జరుపుతున్నారు. వీఐపీల కాన్వాయ్‌లు సిద్ధం.. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే ప్రముఖుల కాన్వాయ్‌లను అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా జరిగింది. శనివారం మరోసారి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఏ కాన్వాయ్‌లో ఎవరు విధులు నిర్వహించాలనే విషయాన్ని అధికారులు ఖరారు చేశారు. కంట్రోల్ రూం.. గన్నవరం విమానాశ్రయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ప్రముఖుల రాకపోకలను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తారు. తద్వారా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు వెయ్యిమంది.. విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణకు వెయ్యిమందిని వినియోగిస్తున్నారు. ఉన్నతాధికారుల ప్రత్యేక పర్యవేక్షణలో దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించనున్నారు. పొరుగు జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుని ప్రమాణ స్వీకారం రోజున ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు చేపట్టారు. బెజవాడతో పాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మీదుగా ఏ విధమైన వాహనాలూ రాకుండా గుంటూరు, ఒంగోలు, హనుమాన్‌జంక్షన్, రాజమండ్రి ప్రాంతాల మీదుగా ట్రాఫిక్ మళ్లించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆదివారం గన్నవరం నుంచి విశ్వవిద్యాలయం వరకు వెళ్లే మార్గంలో అనుమతి ఉంటేనే వాహనాలను పంపుతారు. ఆరోజు ఆ మార్గంలో ఏ విధమైన ప్రయాణాలూ పెట్టుకోరాదంటూ ఇప్పటికే ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నందున కీలక ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర నిఘా బృందాలు విజయవాడలో బస చేసే ఆయా ప్రాంతాలపై దృష్టిసారించాయి. -
సీఐడీ ఎస్ఐ ఇంట్లో దొంగతనం
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : పట్టణంలోని ఓ ఇంట్లో శనివారం దొంగలు పడి 18 కాసుల బంగారు నగలు అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పంచవటి కాలనీలో నివాసం ఉంటున్న కొండేటి రామ్‌ప్రసాద్ విజయవాడలోని సీఐడీ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. రామ్‌ప్రసాద్ దంపతులు శనివారం రాత్రి ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లారు. తిరిగి వచ్చాక నగలను తీసి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో ఉంచారు. తలుపులు దగ్గరకు వేసి అడ్డంగా మంచాలు వేసి నిద్రించారు. దొంగలు చాకచక్యంగా ఇంట్లోకి చొరబడి రెండు సెల్ఫోన్లు, 18 కాసుల బంగారు నగలు, రూ.4,500 నగదు అపహరించుకపోయారు. రామ్‌ప్రసాద్ దంపతులు ఆదివారం ఉదయం లేచి ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ సీఐ ఏబీజీ తిలక్, ఎస్సై రాజేంద్రప్రసాద్ సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రెచ్చగొట్టడం సరికాదు
కేసీఆర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి పశ్చిమకృష్ణా ఎన్జీవోల సంఘం విజయవాడ, న్యూస్‌లైన్ : సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే అంటూ టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఎన్జీవోల సంఘం పశ్చిమకృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడతామంటూ ఎన్నికల ముందు చెప్పిన కేసీఆర్ ఈ విధంగా మాట్లాడడం తగదన్నారు. స్థానిక ఎన్జీవో హోంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అంతగా ఉద్యోగులపై ఒత్తిడి తెస్తే ఆంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల విషయంలోనూ ఇక్కడి ప్రభుత్వం అదే తీరుగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో లక్షలాది ఉద్యోగాలను సీమాంధ్రులు దోచుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. తీరా రాష్ట్రం విడిపోయాక ఉద్యోగుల సంఖ్య వందల్లోనే ఉండడంతో అక్కడి ప్రజలను మభ్యపెట్టేందుకు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నికల్లో లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని అక్కడి యువతను మోసగించారని, ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లోనే సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సచివాలయంలో ఉన్న ఉద్యోగులంతా తెలంగాణలో జన్మించిన వారేనని విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఈ విషయం కేసీఆర్‌కు తెలిసి కూడా అనుచితంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి వైదొలిగేందుకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ నిజస్వరూపం తెలంగాణ ప్రాంత ప్రజలకు, యువతకు అర్థమైందన్నారు. తప్పడు ప్రచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నాడన్నారు. లక్ష ఎకరాలకు నీరందిస్తామంటూ కేసీఆర్ చేసిన హామీ నెరవేరే పరిస్థితి కనుచూపుమేరలో లేదన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెడతామన్నారు. విభజన తర్వాత స్థిరాస్తి పంపకాల్లో సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా అటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీనివాసరావు, వాసు, సిటీ అధ్యక్షుడు కోనేరు రవి తదితరులు పాల్గొన్నారు. -
మాది ప్రజాపక్షం
విజయవాడ ‘పశ్చిమ’ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విజయవాడ, న్యూస్‌లైన్ : అక్రమాలు చేయడం, మాయమాటలు చెప్పడం వల్లే టీడీపీ అధినేత చంద్రబాబుకు గెలుపు సాధ్యమైందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ చెప్పారు. ప్రజాతీర్పును గౌరవిస్తామని, ప్రజాపక్షం వహించి వారి సమస్యలపై ఆలుపెరుగని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. తారాపేటలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జలీల్‌ఖాన్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కొత్తగా స్థానికేతరులను ఓటర్లుగా చేర్పించి అధర్మ రాజకీయాలకు పాల్పడిందని గుర్తుచేశారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని విచ్చలవిడిగా నగదు పంపిణీ చేసి అక్రమ పద్ధతులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒంటరి పోరాటం చేసిన వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేక చంద్రబాబు మోడీని, పవన్‌కల్యాణ్‌లతో జతకట్టి అధర్మ యుద్ధానికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు నేడు సీమాంధ్రకు మేలు చేస్తారంటే నమ్మే పరిస్థితి లేదన్నారు. బెజవాడను రాజధాని చేయాలి చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుపై ఏమాత్రం గౌరవం ఉన్నా, సీమాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉన్నా అన్ని అర్హతలున్న విజయవాడను కొత్త రాష్ట్రానికి రాజధాని చేయాలని జలీల్‌ఖాన్ డిమాండ్ చేశారు. విజయవాడ-గుంటూరు మధ్యనే హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యేలందరినీ సమదృష్టితో చూసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. నియోజకవర్గ సమస్యలపై పోరాడతా.. నగరంలో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉందని జలీల్‌ఖాన్ చెప్పారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్‌హెచ్-9, ఎన్‌హెచ్-5ను కలపాలని, అవసరమైన చోట్ల ఫ్లైవోవర్లు నిర్మించాలని అసెంబ్లీలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. నగరాన్ని బుడమేరు ముంపు సమస్య వెంటాడుతోందని, దాని శాశ్వత పరిష్కారానికి ఆయనపై ఒత్తిడి తీసుకొస్తానని వివరించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో నాటి పాలకులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని, దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి త్వరితగతిన దాని నిర్మాణం పూర్తి చేస్తానన్నారు. అందరి అండతోనే గెలిచా.. తనకు మైనార్టీ, ఎస్సీ వర్గాలతోపాటు ఆర్యవైశ్యులు, నగరాలు, బీసీలు, ఎస్టీలు తదితర వర్గాల ప్రజలు అండగా నిలిచారని, వారి అభ్యున్నతి కోసం పాటుపడతానని జలీల్‌ఖాన్ వివరించారు. -
బరితెగింపు
‘దేశం’ అరాచక పర్వం ఓటమి భయంతో వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు మహిళలని చూడకుండా పిడిగుద్దులు భయభ్రాంతులకు గురిచేసే యత్నాలు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ వైపే ప్రజాదరణ ఉండటం.. టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటం.. ఓటమి భయం వెంటాడుతుండటంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బరితెగించి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఆ పార్టీకి మద్దతిచ్చే ప్రజలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు. పోలింగ్ సమయం సమీపించేకొద్దీ అరాచకం పేట్రేగింది. సాక్షి, విజయవాడ : ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసైనా సరే ఎన్నికల్లో గెలవాలనే భావనతో తెలుగుదేశం నేతలు బరితెగించారు. ఎన్నికల రోజు జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు దిగారు. వారే దాడులు చేసి పోలీస్స్టేషన్ల ముందు ధర్నాలకు దిగారు. పోలింగ్ కేంద్రాల వద్దనే ప్రచారాలకు ఒడిగట్టారు. అదేమని ప్రశ్నించిన వారిపై నానా దుర్భాషలాడటానికి కూడా వెనుకాడలేదు. మహిళలని కూడా చూడకుండా చేయి చేసుకున్నారు. అడ్డువచ్చిన పోలీసు సిబ్బందిపైనా దురుసుగా ప్రవర్తించారు. రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు మీ సంగతి తేలుస్తామంటూ గొప్పలకుపోయి వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. ఓటమి భయంతోనే సైకోల్లా ప్రవర్తించారని పలువురు భావిస్తున్నారు. దొంగతనం చేసినవాడే దొంగో దొంగ అని కేకలేసిన చందంగా ఆ నేరాలు ఇతరులపై నెట్టిన వైనం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. టీడీపీ రౌడీయిజం ఇలా... గంపలగూడెం మండలం అనుమోలులంక గ్రామంలో వైఎస్సార్సీపీకి ఓటు వేశారనే ఆగ్రహంతో నలుగురు రజక వృత్తిదారులపై టీడీపీ నేతలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో పత్తిపాటి నారాయణకు తీవ్ర గాయాలపాలయ్యారు. పుష్పవతి, లక్షణరావు, పుల్లమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. వారి ఇంటిని కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇంటిలోని తడికలను పీకి వేసి గలాటా సృష్టించారు. గుడ్లవల్లేరు మండలం వెణుతురుమిల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త హనుమంతరావు ఒక వృద్ధురాలిని ఎన్నికల కేంద్రంలోకి తీసుకువెళుతుండగా... టీడీపీ నేతలు చంద్రశేఖర్‌రావు, అశోక్, ప్రసాద్‌లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. హనుమంతరావు భార్య లక్ష్మీకుమారి గత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున వార్డు సభ్యురాలిగా గెలుపొందారు. ఓటమి అక్కసుతోనే టీడీపీ నేతలు వారిపై ఈ దాడికి పాల్పడ్డారు. భర్త గాయపడ్డాడని తెలియగానే ఆమె పరుగు పరుగున అక్కడకు చేరుకోగా, మహిళ అని కూడా చూడకుండా టీడీపీ నేతలు ఆమె ముఖంపై పిడి గుద్దులు గుద్ది పరారయ్యారు. చందర్లపాడు మండలంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఎక్కువ మంది ఓట్లు వేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేతలు మైనార్టీ వర్గానికి చెందిన షేక్ బుజ్జి, షేక్ చిన్న బీబీ, మీరాబీలపై దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో షేక్ బుజ్జి తలకు బలమైన గాయం కాగా ఆయన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. టీడీపీకి చెందిన షేక్ సయిదా, లాల్ అహ్మద్, హుస్సేన్ తదితర పదిమంది ఈ దాడిలో పాల్గొన్నారు. నూజివీడు మండలం దేవరగుంట గ్రామంలో సర్పంచి చంద్రశేఖర్‌రావుపై టీడీపీ కార్యకర్తలు దాడిచేసి గాయపరిచారు. చంద్రశేఖర్‌రావు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటమే ఇందుకు కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. రెడ్డిగూడెం మండలం రంగాపురంలో పోలింగ్ బూత్‌లో టీడీపీ నేత ఓటర్లను ప్రభావితం చేయబోయారు. దీన్ని వైఎస్సార్ సీపీ నేతలు అడ్డుకోవడంతో వివాదం చోటుచేసుకుంది. చివరకు టీడీపీ కార్యకర్తను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి స్టేషన్ పైనే దాడికి దిగి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మోపిదేవిలో జెడ్పీ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద గ్రామ సర్పంచ్ చక్రపాణి ఓటర్లను ప్రభావితం చేయబోగా, దాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేటలో పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీకి చెందిన చుక్కా మరియమ్మ అనే మహిళను అడ్డుకున్నందుకు వైఎస్సార్ సీపీ బూత్ ఏజెంట్లు చుక్కా ప్రసాద్, రవిలపై టీడీపీ కార్యకర్తలు చుక్కా సుదర్శన్, సంజీవరావు, ఇజ్రాయిల్, లాజర్ దాడి చేశారు. ఈ ఘటనలో ప్రసాద్, రవిలకు తీవ్ర గాయాలయ్యాయి. బాపులపాడు మండలం కొత్త మల్లవల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ అభ్యర్థి వంశీ సమక్షంలోనే ఆ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు. మహిళలు, చిన్నారులు ఉన్నారని కూడా చూడకుండా రాళ్లు రువ్వడంతో పలువురికి గాయాలయ్యాయి. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడి, అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించారు. అయితే వైస్సార్సీపీ శ్రేణులు ఎంతో సమన్వయంతో వ్యవహరించడం గమనార్హం. -
‘తెలుగునాడు’గా మార్చాలి : లగడపాటి
విజయవాడ, న్యూస్‌లైన్ : కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగునాడుగా పేరు మార్చాలని దీని కోసం అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం తీర్మానం చేయాలని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కోరారు. మొగల్రాజపురంలోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బుధవారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.10వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ కొత్త రాష్ట్రంలోనే ప్రమాణస్వీకారం చేయాలని కోరారు. ఎంత త్వరగా కొత్త రాజధాని ఏర్పాటు జరిగితే అంతే వేగంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు వీలైనంత త్వరగా కొత్త రాష్ట్రానికి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు. జేఎస్పీతో సంబంధం లేదు.. జైసమైక్యాంధ్ర పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని లగడపాటి స్పష్టం చేశారు. జై సమైక్యాంధ్ర ఉద్యమం అనేది ప్రజల్లోని ఐక్యత అని, పార్టీతో సంబంధం ఉండదని చెప్పారు. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ.. తనకు పునర్జన్మ మీద నమ్మకం లేదని, మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తాను భావించటం లేదన్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గానీ, ఒక పార్టీలోకి వెళ్లాలనే ఉద్దేశంతో గానీ తాను సర్వే ఫలితాలు ప్రకటించటం లేదన్నారు. కొందరు తన పేరు ఉపయోగించుకుని దొంగ సర్వేలు చేస్తున్నారని, దీంతో తాను సర్వేలు చేయటం ప్రస్తుతానికి నిలిపివేశానని చెప్పారు. గెలుపోటములపై పోలింగ్ శాతం ప్రభావం న్నికల్లో ట్రెండ్ అనేది పోలింగ్ సరళిని ఆధారంగా మారుతుందన్నారు. పోలింగ్ శాతం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ట్రెండ్‌ను సృష్టిస్తుందన్నారు. పోలింగ్ మొత్తం పూర్తయిన తరువాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపై తాను ఒక అభిప్రాయానికి వస్తానన్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందన్నారు. ఈ నెల 12వ తేదీన వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు దగ్గరగానే ఇంచుమించు అసెంబ్లీ ఫలితాలు ఉంటాయని జోస్యం చెప్పారు. -
బీజేపీలో ‘స్థానిక’ పోరు!
పొత్తులతో చిక్కులు స్థానికులకే టికెట్ ఇవ్వాలంటున్న నేతలు గెలుపే ముఖ్యమంటున్న మరి కొందరు నేతలు సాక్షి, విజయవాడ : టీడీపీతో పొత్తు బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పొత్తు దాదాపుగా ఖరారవుతుండటంతో టికెట్లు ఆశించేవారిలో ఆందోళన ప్రారంభమయింది. పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్, పశ్చిమం, కైకలూరు అసెంబ్లీ సీట్లలో ఒకటి రెండే బీజేపీకి దక్కే అవకాశం ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీలోనూ అంతర్గత పోరు మొదలైంది. విజయవాడ సెంట్రల్ సీటు తమకే కావాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. అయితే పశ్చిమం లేదా కైకలూరు సీట్లలో ఒకటే ఇస్తామంటూ టీడీపీ నేతలు సూచిస్తున్నారు. చివరకు సెంట్రల్ బీజేపీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన సీనియర్లు చాలా మంది ఉన్నారని, వారికే అవకాశం కల్పించాలని, కొత్తవారిని తీసుకొస్తే ఊరుకొనేది లేదని ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే నిరసన గళం వినిపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకునేవారి వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగమేమీ ఉండదని సలహాలిస్తున్నారు. వారు గెలి చినా, ఓడిపోయినా హైదరాబాద్‌లోనే ఉంటారని, దీనివల్ల స్థానికంగా పార్టీ అభివృద్ధి చెందదని పేర్కొంటున్నారు. బీజేపీ కూడా టీడీపీలాగానే ‘కార్పొరేట్ సంస్థ’గా మారిపోయిం దని, హైదరాబాద్‌లో నేతలకు డబ్బు సంచులు ఇచ్చి సీట్లు తెచ్చుకోవచ్చని కొంతమంది నేతలు భావిస్తున్నారని, అందువల్లనే స్థానికేతరుడికి సీటు ఇవ్వకూడదని బలంగా వాదిస్తున్నారు. ఏనాడూ పార్టీ జెండా పట్టుకోనప్పటికీ ముఖ్యనేతలను సంతృప్తి పరిచి బీఫారంతో దిగుమతి అయితే సహించబోమని ఈ సందర్భంగా తేల్చిచెబుతున్నారు. స్థానికుల కోటాలో బీజేపీ సీమాంధ్ర కన్వీనర్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు, సీనియర్ నేతలు వీరమాచినేని రంగ ప్రసాద్, రామసాయి తదితర పేర్లు పరిశీలించవచ్చని సూచిస్తున్నారు. గెలుపుగుర్రాలపైనే దృష్టిపెట్టాలి సెంట్రల్ సీటు బీజేపీకి దక్కితే పార్టీని గెలిపించే వారికే అవకాశం కల్పించాలి తప్ప స్థానికుడికే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అర్బన్ పార్టీలోనే మరికొంతమంది నేతలు వ్యాఖానిస్తున్నారు. సీనియార్టీనే ప్రాధాన్యతగా తీసుకుంటే జనసంఘ్ నుంచీ పనిచేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారని, వారికే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గతంలో టికెట్ ఆశించి భంగపడి, కొన్నేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న కొందరు నేతలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చి ‘స్థానికుడికే సీటు’ అంటూ కొత్తవాదనలు తెస్తున్నార ని ఈ వర్గం వాదిస్తోంది. బీజేపీకి ఉన్న ఓటింగ్‌కు తోడు తన ప్రభావంతో పార్టీకి పది ఓట్లు తీసుకొచ్చే అభ్యర్థి అవసరమని, కేవలం సీనియార్టీని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. వాణిజ్య, వ్యాపార, ఉద్యోగ వర్గాలతో మంచి సంబంధాలు, సినీ రంగంతో పరిచయం ఉన్నవారైతే నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని వివరిస్తున్నారు. కొత్తవారి కోటాలో వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగుల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణ, సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని తెలుస్తోంది. పశ్చిమం, కైకలూరు సీటు లభించినా అక్కడ నుంచి కూడా పోటీ చేసేందుకు నలుగురైదుగురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే లభించే ఒకటి రెండు సీట్ల విషయంలో ఆచి తూచి అడుగు వేయాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారని సమాచారం. -
పోలింగ్ నేడే
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల తొలి విడత పోరుకు రంగం సిద్ధమైంది. విజయవాడ, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లలోని 26 మండలాల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులు శనివారం పర్యవేక్షించారు. విజయవాడ డివిజన్లోని 293 ఎంపీటీసీ స్థానాల్లో 774 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 14 జెడ్పీటీసీ స్థానాల్లో 48 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మచిలీపట్నం డివిజన్లోని 12 మండలాల్లో 157 ఎంపీటీసీ స్థానాలకు 413 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 12 జెడ్పీటీసీ స్థానాలకు 51 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. విజయవాడ డివిజన్లోని 14 మండలాల్లో 7,41,619 మంది, మచిలీపట్నం డివిజన్లోని 12 మండలాల్లో 4,14,503 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా రెండు డివిజన్లలోని 26 మండలాల్లో 11,56,122 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్‌లను పంపిణీ చేశారు. ఇంకా ఎవరికైనా ఓటరు స్లిప్‌లు అందకుంటే పోలింగ్ స్టేషన్ల వద్ద ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో పోలింగ్ స్టేషన్ల వద్ద షామియానాలు, తాగునీటి వసతి కల్పించారు. ఎన్నికల సామాగ్రి అందజేత... మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ పత్రాలు, బాక్సులు, ఓటర్ల జాబితాలు ఇతరత్రా ఎన్నికల సామగ్రిని శనివారం అందజేశారు. మండల విస్తీర్ణాన్ని బట్టి రూట్లు, జోన్లుగా విభజించి ఎన్నికల సిబ్బందిని గ్రామాలకు పంపారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్‌కు ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారితో పాటు మరో ముగ్గురిని నియమించారు. మొదటి విడతలో జరిగే ఎన్నికలకు 7,185 మంది సిబ్బందితో పాటు 719 మందిని రిజర్వులో ఉంచారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఎస్పీ జె.ప్రభాకరరావు నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా ఉంచుతామని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వెంటనే అరెస్టు చేస్తామని చెప్పారు. తొలివిడత ఎన్నికలు జరిగే మండలాలివే... విజయవాడ రెవెన్యూ డివిజన్లోని చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనుమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మచిలీపట్నం డివిజన్లోని అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, ఘంటసాల, గూడూరు, కోడూరు, కృత్తివెన్ను, మచిలీపట్నం, మోపిదేవి, మొవ్వ, నాగాయలంక, పెడన మండలాలు ఉన్నాయి. జోరుగా మద్యం, నగదు పంపిణీ : తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఒక్కరోజు వ్యవధే మిగిలి ఉండటంతో శనివారం గ్రామాల్లో నగదు, మద్యం పంపిణీ జోరుగా సాగాయి. పోలీసుల బందోబస్తు ఉన్నా అభ్యర్థుల అనుచరులు గుట్టుచప్పుడు కాకుండా తమ పని కానిచ్చేశారు. శుక్రవారం సాయంత్రమే ప్రచారం ముగియటంతో శనివారం అంతా ఆయా గ్రామాల పెద్దలు, ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కుల సంఘాలు, ఆయా సామాజిక వర్గాల పెద్దలు తదితరులతో చర్చలు జరిపి ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. -
నేడు జిల్లాకు జగన్ రాక
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హనుమాన్‌జంక్షన్, ఏలూరు మీదుగా నర్సాపురం చేరుకుంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
నేటి నుంచి సమ్మె బాట
సమ్మెలోకి 20 వేల మంది ఉద్యోగులు అవసరమైతే మెరుపు సమ్మె : విద్యుత్ ఉద్యోగులు సాక్షి, విజయవాడ : మరోసారి సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సన్నద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల మంది ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్జీవో సంఘం నేతలు కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులకు సమ్మె ఆవశ్యకతను వివరించారు. బుధవారం నుంచి రెవెన్యూ, నీటిపారుదల, రవాణా, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వ్యవసాయశాఖతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోనున్నాయి. రబీ పంట నడుస్తున్నందున నీటి పారుదల శాఖలో అధికారులు, రెగ్యులేటర్లను పర్యవేక్షించే కొంతమంది మాత్రమే విధుల్లో ఉండనున్నారు. రెవెన్యూ సిబ్బంది ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు. ట్రెజరీ, వాణిజ్యపన్నులశాఖలో కొంతమంది ఉద్యోగులు మాత్రం సమ్మెకు దూరంగా ఉంటున్నారు. మెరుపు సమ్మెకు దిగేందుకు వెనుకాడేది లేదని విద్యుత్ జేఏసీ ప్రకటించింది. సమ్మెకు దూరంగా ఉంటూ ఆందోళనలకు సహకరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. మున్సిపల్ ఉద్యోగులు సమ్మెపై నిర్ణయం తీసుకోలేదు. గురు, శుక్రవారాల్లో విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. పీఆర్టీయూ సంఘీబావం సీమాంధ్ర ప్రాంత విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా తాము సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నట్లు సమైక్య పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నారాయణరావు తెలిపారు. పటమటలోని సమైక్య పి.ఆర్.టి.యు కార్యాలయంలో బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయ పాఠశాల పనిగంటల తరువాత ఏపీఎన్జీవోలతో, సమైక్యాంధ్ర సాధన ఉద్యమ పార్టీలతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రెడ్డెమ్మ పాల్గొన్నారు. వాణిజ్య పన్నుల శాఖ దూరం విజయవాడ సిటీ : సమ్మెకు దూరంగా ఉండాలని వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు తీర్మానించారు. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీఓ అసోయేషన్ విజయవాడ 1, 2 డివిజన్ల కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి హాజరైన కొందరు ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో 66 రోజుల సమ్మెకాలంలో నష్టపోయామని, ఈ పరిస్థితిలో సమ్మెలో పాల్గొనలేమని తీర్మానం చేసి రాష్ట్ర నాయకత్వానికి పంపారు. -
ఉడాలో కుర్చీలాట సా...గదీతే
రిలీవ్ కాని వైస్ చైర్మన్ రామారావు నూతన వీసీ చేరికపై వీడని సందిగ్ధత రెండు రోజులు వేచిచూడాలని ఉషాకుమారికి పెద్దల సూచన! కొనసాగుతున్న రామారావు యత్నాలు నేడు లేదా రేపు ఉషాకుమారి చేరే అవకాశం ఉడాలో కుర్చీలాట ఇంకా కొన‘సా...గుతోంది’. ప్రస్తుత వైస్ చైర్మన్ రామారావు, నూతనంగా నియమితులైన ఉషాకుమారి తమ పరపతిని ఉపయోగించి ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైస్‌చైర్మన్‌గా చివరికి ఎవరు వస్తారనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఉషాకుమారి సోమవారమే బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా, రామారావు రిలీవ్ కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. సాక్షి, విజయవాడ : ఉడా వైస్‌చైర్మన్‌గా పి.ఉషాకుమారిని నియమిస్తూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో వీసీగా ఉన్న రామారావును బదిలీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదు. ఉషాకుమారి ఈ నెల ఒకటిన బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా వీసీ రామారావు రిలీవ్ కాకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లి సోమవారమే తిరిగి వచ్చారు. రిలీవ్ కాకుండా విధుల్లో కొనసాగారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎవరి ప్రయత్నాలు వారివి... ఇద్దరు ఐఏఎస్ అధికారులూ తమ గాడ్ఫాదర్ల ద్వారా ఎవరికివారు సీటు దక్కించుకోవటానికి ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. వైస్ చైర్మన్ రామారావుకు ఐఏఎస్ అయ్యాక వచ్చిన మొదటి మంచి పోస్టింగ్ కావడం.. అదీ తక్కువ రోజుల్లోనే ఆకస్మికంగా బదిలీ చేయటంతో సీటును కాపాడుకోవటానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ కార్యదర్శిని కలిసి తన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఐఏఎస్ వచ్చాక పోస్టింగ్ కోసం ఎక్కువ కాలం నిరీక్షించాల్సి వచ్చిందని, ఆ తర్వాత వచ్చిన ఉడా పోస్టింగ్‌లోనూ పట్టుమని మూడు నెలలు కూడా పనిచేసే అవకాశం లేదని చెప్పినట్లు తెలిసింది. తన బదిలీ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేయటంతో పాటు తన గాడ్ఫాదర్ల ద్వారా హైదరాబాద్‌లో లాబీయింగ్ కొనసాగించినట్లు సమాచారం. మరోవైపు చివరి ప్రయత్నాలు చేస్తున్నారని, అవి ఫలించకపోతే మంగళవారం సాయంత్రం ఆయన రిలీవ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా నుంచి బదిలీ అయిన ఉషాకుమారి తన రాజకీయ పరపతితో చక్రం తిప్పి ఉడా వైస్‌చైర్మన్ సీటును పొందగలిగారు. రామారావు ప్రయత్నాల నేపథ్యంలో ఆమె కూడా పావులు కదిపి పోస్టింగ్‌లో చేరే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. వేచిచూడండి... ఈ క్రమంలో పి.ఉషాకుమారి రెండు రోజులు వేచిచూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదివారం మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ఆమె సోమవారం విధుల్లో చేరలేదు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం విధుల్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు గత నెల 21న విజయవాడలో జేసీగా రిలీవై 31న ఉడా వైస్ చైర్మన్‌గా మళ్లీ పోస్టింగ్ దక్కించుకున్న క్రమంలో 22 నుంచి 31 వరకు ఆమె దరఖాస్తు చేసుకున్న సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
వెండితెర సీత అంజలీదేవి ఇక లేరు!
సాక్షి, విజయవాడ: వెండితెర సీత అంజలీదేవి(86) సోమవారం కన్ను మూశారు. ఆమె తూర్పుగోదావరి జిల్లా పెద్దపురంలో జన్మించినప్పటికీ విజయవాడతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆమె నటించిన లవకుశ, సువర్ణసుందరి, అనార్కలీ, బండిపంతులు,భోగిమంటలు, వీరాంజనేయ, భక్త ప్రహ్లాద తదితర చిత్రాలు విజయవాడలోని మారుతీటాకీస్, దుర్గాకళామందిరం, శ్రీనివాస్ మహాల్, సర్వస్వతి పిక్చర్ ప్యాలెస్, ఈశ్వరమహాల్ థియేటర్లలో వందేసి రోజులు ఆడాయి. ఆమె పుట్టపర్తిసాయిబాబాకు భక్తురాలు. నాటి ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్యే ఆమెను పుట్టపర్తి బాబాకు పరిచయం చేశారు. 2008లో ఆమె విజయవాడ వచ్చినప్పుడు సీతారాంపురంలోని సత్యసాయిబాబా మందిరానికి వెళ్లి అక్కడ బాబా భక్తులతో గడపటం విశేషం. నగరంలోని ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు తీసిన కన్నకొడుకు చిత్రంలో అంజలీదేవి సినీనటుడు నాగేశ్వరరావు తల్లిగా నటించి మన్ననలు పొందింది. నగరంలో అంజలీ పిక్చర్స్ కార్యాలయం... అంజలీదేవి నటిగానే కాకుండా చిత్ర నిర్మాత. అంజలీ పిక్చర్స్‌ను ప్రారంభించి అనేక చిత్రాలను ఆమె తీశారు. నగరంలోని దుర్గాకళామందిరం వెనుక అంజలీ పిక్చర్ కార్యాలయం ఉండేది. ఆమె భర్త ఆదినారాయణరావుతో కలిసి అమె అనేక సార్లు ఈ కార్యాలయానికి వచ్చేదని నాటి సినీ అభిమానులు చెబుతున్నారు. ఆమె తీసిన భక్త తుకారం చిత్రానికి అభినందన సభ విజయవాడలోని నటరాజ్ థియేటర్లో జరిగింది. ఈ సభకు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు అధ్యక్షత వహించడం విశేషం. అంజలీదేవి ఏ చిత్రం నిర్మించినా తుర్లపాటిని ప్రత్యేకంగా ఆహ్వానించేవారు. 2008లో ఘన సన్మానం.... లవకుశ విడుదలై 46 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీ సోమనాధ నాట్యమండలి అధ్యక్షుడు బొలిశెట్టి రాధకష్ణమూర్తి అంజలీదేవి(సీత), కుశుడు(సుబ్రహ్మణ్యం), లవుడు(నాగరాజు)లను విజయవాడకు ప్రత్యేకంగా ఆహ్వానించి ఘంటసాల సంగీత కళాశాలలో 2008 జూన్ 8న ఘనంగా సన్మానించారు. రాధాకష్ణమూర్తి కోరిన వెంటనే ఆమె విజయవాడ రావడానికి అంగీకారం తెలిపారు. వయోభారం కుంగదీస్తున్నప్పటికీ నగరాకి వచ్చి ఆ చిత్రం విశేషాలను శ్రోతలకు వివరించడం విశేషం. -
పండగ ప‘రేషన్’
అమ్మహస్తం.. అస్తవ్యస్తం... నేటికీ అందని వస్తువులు సంక్రాంతి గడిచేదెలా.. అమ్మహస్తం పథకం రానురాను అస్తవ్యస్తంగా తయారవుతోంది. పండగపూట కూడా పేద, మధ్యతరగతి ప్రజలు పచ్చడి మెతుకులతో కడుపు నింపుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకం అమలుపై ప్రభుత్వం ఎందుకింత అలక్ష్యం వహిస్తోందో అర్థం కావడం లేదు. విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలోని చౌకధరల దుకాణాలకు నేటికీ సగానికి సగం సరకులు చేరలేదు. అధికారులు సోమవారం నాటికి పామాయిల్ గోడౌన్లకు చేర్చారు. స్టాక్ లేకపోవడంతో గత డిసెంబర్లో జిల్లా వ్యాప్తంగా పామోలిన్ సరఫరా పూర్తిగా నిలిపివేసిన ప్రభుత్వం పండగ వచ్చేసినా పంపిణీ చేయలేకపోయింది. అధికారులు ప్రయాసలు పడి ఎంఎల్సీ పాయింట్లకు చేర్చినా ఇంకా ప్రజలకు అందలేదు. విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని పలు రేషన్ దుకాణాలకు పామాయిల్ సరఫరా కాలేదని తెలిసింది. స్టాక్ వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో కొందరు డీలర్లు సరకు కోసం డీడీలు కట్టకపోవడంతో ప్రజలకు పామాయిల్ తోపాటు ఇతర వస్తువులు అందలేదని చె బుతున్నారు. 49 మండలాల్లో 30 మండలాలకు మాత్రమే అదికారులు ఇప్పటి వరకు పామాయిల్ సరఫరా చేశారు. జిల్లాకు ప్రతి నెలా 1209 మెట్రిక్ టన్నుల పామాయిల్‌ను అధికారులు కార్డుదారులకు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం 900 మెట్రిక్ టన్నులు మాత్రమే డిపోలకు సరఫరా అయినట్లు తెలిసింది. తాజాగా ఇచ్చిన కొత్త కార్డుదారులతో కలిపి జిల్లా వ్యాప్తంగా 2,150 డిపోలలో12లక్షల రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరకులు అందించాల్సి ఉంది. తొమ్మిదింటిలో నాలుగే సరఫరా .... అమ్మహస్తంలో భాగంగా రూ.185కు 9 వస్తువులు సరఫరా చేయాల్సి ఉంది. ఈ నెలలో అధికారులు బియ్యం, పంచదార, పామాయిల్, కందిపప్పు మాత్రమే సరఫరా చేశారు. ఉప్పు, చింతపండు, గోధుమలు, గోధుమపిండి, పసుపు, కారం సరఫరా నిలిపివేశారు. -
సామాజిక సువార్త బోధించాలి
బిషప్‌లకు కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపు సీఎస్ఐ-సినాడు కమిటీ బాధ్యతల స్వీకారం విజయవాడ, న్యూస్‌లైన్ : సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు సంఘాలకతీతంగా బిషప్‌లు సామాజిక సువార్త బోధించాలని కేంద్ర సహాయ మంత్రి జేడీ శీలం చెప్పారు. దక్షిణ ఇండియా సంఘం (చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా-సీఎస్ఐ) సినాడు నూతన కమిటీ బాధ్యతల స్వీకారోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. స్థానిక బిషప్ అజరయ్య గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో జేడీ శీలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బిషప్‌ల సందేశం గ్రామీణ ప్రాంతాలకు చేరాలన్నారు. గ్రామీణులను శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు క్రైస్తవ మత గురువులు కృషి చేయాలని కోరారు. మంచి మనసున్న దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దేందుకు సువార్త ప్రచారం చే యాలన్నారు. క్రైస్తవ సంఘాలన్నీ కలిసి మంచి శక్తిగా ఎదగి సమర్ధ నాయకత్వాన్ని ఏర్పరచుకోవాలని చెప్పారు. సామాజిక సేవలో సైతం ముందుం డాలని ఆకాంక్షించారు. మోడరేటర్ (మహా పీఠాధిపతి)గా ఎన్నికైన కృష్ణా-గోదావరి అధ్యక్ష ఖండం బిషప్ గోవాడ దైవాశీర్వాదాన్ని దుశ్శాలువాతో సత్కరించారు. ఆర్సీఎం విశాఖపట్నం ఆర్చ్ బిషప్ మల్లవరపు ప్రకాష్ మాట్లాడుతూ మోడరేటర్‌గా ఎన్నికైన దైవాశీర్వాదంతో తనకు పదేళ్లుగా మంచి అనుబంధం ఉందన్నారు. ఆయన మోడరేటర్‌గా సీఎస్‌ఐని మరింత ముందుకు నడిపించగలరన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు మోడరేటర్‌గా వ్యవహరించిన ది మోస్ట్ రెవరెండ్ దైవకడాశం మాట్లాడుతూ సీఎస్ఐ ఆధ్వర్యాన విద్యాసంస్థలు, ఆస్పత్రుల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తాను మోడరేటర్‌గా వ్యవహరించిన రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలు సంతృప్తినిచ్చాయన్నారు. అనంతరం డెప్యూటీ మోడరేటర్ రైట్ రెవరెండ్ థామస్ కె.ఒమ్మెన్, జనరల్ సెక్రటరీ డానియేల్ రత్నాకర సదానంద, కోశాధికారి రాబర్ట్ బ్రౌన్లను ఘనంగా సత్కరించారు. చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా మహా పీఠాధిపతి పీసీ మరాండి, జబల్పూర్ బిషప్ పీసీ సింగ్, జాప్నా బిషప్ డాని యేల్ త్యాగరాజ్, సైప్రస్ బిషప్ మైకేల్ లూయిస్, నేషనల్ చర్చెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి తారానాథ్ సాగర్ ప్రసంగించారు. భక్తులు ఆలపించిన గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి 20 మంది బిషప్‌లు, 200 మందికి పైగా ప్రతినిధులు, నగర ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, వేలాది మంది భక్తులు హాజరయ్యారు. -
‘సమైక్య’ పోరాటం
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన యత్నాలను వ్యతిరేకిస్తూ.. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించాయి. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసించాలని నాయకులు పిలుపునిచ్చారు. జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ప్రధాన రహదారులగుండా వివిధ ప్రాంతాల్లో నినాదాల హోరు మధ్య ర్యాలీ చేశారు. విజయవాడ వన్‌టౌన్‌లో నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో సమన్వయకర్త పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. అవనిగడ్డలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో సాగింది. వైఎస్సార్సీపీ రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఆరు మండలాల నుంచి మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు మోటార్‌సైకిళ్లతో ర్యాలీ చేశారు. మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్‌బాబు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అక్కడినుంచి మైలవరం చేరుకున్నారు. ఇబ్రహీంపట్నంలో, నూజివీడు పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు చేశారు. పామర్రులో వైఎస్సార్సీపీ నాయకురాలు ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర ఒక్క జగన్మోహన్రెడ్డి వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. -
రికార్డు టెండర్లు
=గని ఆత్కూర్ ఇసుక రీచ్‌కు డిమాండ్ = 742 మంది దరఖాస్తుదారులు =బినామీల హవా = దరఖాస్తుల ద్వారా రూ.38 లక్షల ఆదాయం గొల్లపూడి (విజయవాడ రూరల్), న్యూస్‌లైన్ : జిల్లాలో ఏడాదిన్నర తరువాత ఇసుక రీచ్ వేలానికి టెండర్లు పిలవగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. శనివారం గొల్లపూడిలోని డ్వామా కార్యాలయం వేలంలో పాల్గొనే దరఖాస్తుదారులతో కిక్కిరిసింది. లాటరీ పద్ధతిలో ఇసుక వేలం చేపడుతుండటంతో టెండర్‌దారులు ఎగబడ్డారు. 742 మంది దరఖాస్తులు అందజేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉన్నప్పటికీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇసుక రీచ్ కోసం టెండర్లు వేయటానికి వచ్చినవారి వాహనాలు కార్యాలయం చుట్టూ పెద్ద సంఖ్యలో కనిపించాయి. క్యూ కట్టిన ఇతర జిల్లాల సిండికేట్లు... ఇసుక రీచ్ వేలం కోసం కృష్ణా, గుంటూరు, ఖమ్మం, హైదరాబాద్‌ల నుంచి కూడా పలువురు సిండికేట్లు కూడా క్యూ కట్టారు. ఇతర జిల్లాల నుంచి వేలం పాటలో దరఖాస్తులను సమర్పించేవారు అధిక సంఖ్యలో రావటంతో అధికారులు కార్యాలయంలో ఐదు కౌంటర్లను ఏర్పాటుచేశారు. పలువురు రాజకీయ నేతల బినామీదారులు ఇందులో పాల్గొని హడావిడి చేశారు. జిల్లాలోని 72 ఇసుక క్వారీల వేలం నిర్వహణ బాధ్యతలను మైనింగ్ శాఖ నుంచి డ్వామా ప్రాజెక్ట్ కార్యాలయానికి ఏడాదిన్నర క్రితం అప్పగించారు. ఈ నేపథ్యంలో గని ఆత్కూరు వేలానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ దఫా వేలానికి లాటరీ పద్ధతి అమలు చేస్తున్నారు. ఇసుక రీచ్ వేలం కోసం 742 మంది ఒక్కొక్కటి రూ.5,000 చొప్పున దరఖాస్తులు కొనుగోలు చేసి అందజేశారు. 36 వేల క్యూబిక్ మీటర్లకే అనుమతి గని ఆత్కూరు ఇసుక రీచ్‌లో 36 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తీసేందుకు మాత్రమే ప్రభుత్వం నిబంధనలు విధించింది. క్యూబిక్ మీటర్‌కు రూ.40 చొప్పున ధర విధించింది. తద్వారా రూ.14 లక్షల 40 వేల ఆదాయాన్ని ప్రభుత్వం సమకూర్చుకోనుంది. దరఖాస్తుదారులు ఒక్కొక్కరు రూ.3.60 లక్షలు డిపాజిట్ చేశారు. దీంతో పాటు రూ.15 లక్షల విలువైన సొంత ఆస్తుల సాల్వెన్స్ సర్టిఫికెట్లు సమర్పించారు. పురుషులతో పాటు మహిళలూ దరఖాస్తు చేయటం విశేషం. గత నెల 20 నుంచే ఈ దరఖాస్తులు విక్రయించారు. జిల్లాలోని సిండికేట్లు దరఖాస్తులను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు తెలిసింది. జిల్లాలోని ఇసుక రీచ్‌లకు వేలంపాటలు లేక గత కొంతకాలం నుంచి నిలిపివేయటంతో డీసెల్టేషన్ పద్ధతిలో ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, భవానీపురంలోని ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తీసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు, వివిధ సొసైటీల ద్వారా అందజేస్తున్నారు. ఈ నెల 10న మచిలీపట్నంలోని కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని అధికారులు పేర్కొన్నారు. -
తప్పిన పెను ముప్పు నిండు నిర్లక్ష్యం
=ఏసీ బోగీలో నిబంధనలకు విరుద్ధంగా వైరింగ్ =ఎల్సీడీతో పాటు అన్ని సౌకర్యాలు =ఐఆర్టీసీ రైలులో భద్రతా లోపాలు =దక్షిణమధ్య రైల్వే జీఎం సమీక్ష సాక్షి, విజయవాడ : మరో పెను ముప్పు తప్పింది. రైల్వే అధికారులు, సిబ్బంది నిండు నిర్లక్ష్యంతో మరో నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఘటన పునరావృతమయ్యే ప్రమాదం.. విజయవాడలో ముందే బయటపడింది. దీంతో పెద్ద ఉపద్రవం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తున్నా అధికారులు గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు కనపడటం లేదని ఈ ఘటనతో తేటతెల్లమైంది. నిబంధనలకు విరుద్ధంగా కొత్తచెరువు వద్ద శనివారం తెల్లవారుజామున బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో అగ్నిప్రమాదం సంభవించి 26 మంది సజీవదహనమైన ఘటన కళ్లల్లో మెదులుతుండగానే విజయవాడ రైల్వేస్టేషన్లో నిలిచి ఉన్న రైలులోని ఏసీ కోచ్‌ల నుంచి పొగలు రావడం కలకలం సృష్టించింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులు అదనంగా వైరింగ్ లాగి ఎల్సీడీ టీవీ నుంచి ల్యాప్‌ట్యాప్‌ల వరకు చార్జింగ్ పెట్టుకునే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదాయంపై దృష్టి పెట్టిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా లోడ్ కన్నా అధికంగా విద్యుత్ ఏర్పాట్లుచేసినా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదం విజయవాడ స్టేషన్లో మెయింటెనెన్స్ కోసం ఆగిన సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అదే రాత్రి సమయంలో జరిగి ఉంటే మరో నాందేడ్ ఘటన పునరావృతం అయ్యేదన్న భావన అధికారులలో వ్యక్తం అవుతోంది. రంగంలోకి దక్షిణమధ్య రైల్వే జీఎం... ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ కూడా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఇండియన్ రైల్వే టూరిజం అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాగృతి సంస్థ వారు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు విద్యార్థులతో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలను వీక్షిస్తున్నారు. దానిలో భాగంగా ఈ నెల 24న ముంబయిలో బయలుదేరి బెంగళూరు, మధురై, చెన్నైల మీదుగా విశాఖపట్నానికి వెళ్తున్నారు. విజయవాడలో మెయింటెనెన్స్నిమిత్తం రైలును నిలిపివేశారు. విద్యార్థులందరూ దిగి నగరంలోకి వెళ్లిన తర్వాత ఆ రైలులోని ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా పొగ, నిప్పురవ్వలు వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపుచేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బోగీల లోపల నిబంధనలకు వ్యతిరేకంగా వైరింగ్ చేసినా పట్టించుకోని సిబ్బందిపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. -
‘వీఆర్వో, వీఆర్ఏ’లకు నోటిఫికేషన్
గుడివాడ రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుడి (వీఆర్ఏ) పోస్టులకు భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 64 వీఆర్వో, 403 వీఆర్ఏల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. వీఆర్ఏలు డివిజన్ల వారీగా బందరు 96, గుడివాడ 104, నూజివీడు 88, విజయవాడ 115 పోస్టులు రిజర్వేషన్లు వారీగా కేటాయించారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. వాటి ప్రకారం.. జిల్లా కేంద్రంగా వీఆర్వోలు, గ్రామ కేంద్రంగా వీఆర్ఏల ఎంపిక జరుగుతుంది. గతంలో వీఆర్ఏ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మండలంలో నివాసం ఉన్నవారైతే సరిపోతుంది. ప్రస్తుతం దానిని మార్చి పోస్టు మంజూరు చేసిన గ్రామవాసి అయి ఉండాలని నిబంధన విధించారు. దీంతో పాటు పుట్టిన స్థలం, నివాస, రేషన్ కార్డు, నాలుగు నుంచి ఏడేళ్లలోపు స్టడీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. 36 సంవత్సరాల లోపువారు మాత్రమే ఈ పోస్టుకు అర్హులు. వివాహ మైన మహిళలు తమ స్వస్థలం గాని, భర్త అడ్రసుతోగాని దరఖాస్తు చేసుకోవచ్చు. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఓసీ, బీసీలు రూ.300, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు రూ.150 చెల్లించాలి. వికలాంగులు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు రుసుం జనవరి 12 లోపు చెల్లించాలి. దరఖాస్తులు అందించాల్సిన గడువు జనవరి 13తో ముగుస్తుంది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 2 వరకు హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి రెండోతేదీ ఉదయం 10 నుంచి 12 వరకు వీఆర్వోలకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు వీఆర్ఏలకు పరీక్షలు ఉంటాయి. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షల్లో జనరల్ స్టడీస్ 60, అర్థమెటిక్స్ 30, లాజికల్ స్కిల్స్ 10 మార్కులకు ఉంటాయి. దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరిస్తారు. దగ్గరలో ఉన్న మీ సేవ, ఈ సేవలలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాలకు నోటిఫికేషన్ మార్గదర్శక ఉత్తర్వులు పంపించారు. -
ఇక్కడితో ఆగను: హంపి
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: ‘గ్రాండ్‌ప్రి’ విజయాలతో సరిపెట్టుకోకుండా... తన చిరకాల స్వప్నం ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. సోమవారం ముగిసిన తాష్కెంట్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో విజేతగా నిలిచిన ఈ విజయవాడ అమ్మాయి మంగళవారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. ఈ ఏడాదిలో గ్రాండ్‌ప్రి టోర్నీలు ముగిశాయని... వచ్చే ఏడాది జరిగే మిగతా మూడు గ్రాండ్‌ప్రి టోర్నీలకుగాను తాను రెండింటిలో బరిలోకి దిగుతున్నట్లు వివరించింది. ఆ రెండు టోర్నీల్లోనూ రాణించి 2015 ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత పొందేందుకు కృషి చేస్తానని తెలిపింది. ‘తాష్కెంట్’ టోర్నీలో టాప్ సీడ్ హంపి స్థాయికి తగ్గట్టుగా ఆడి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 19 నుంచి గ్రీస్‌లో జరిగే యూరోపియన్ క్లబ్ కప్‌లో బరిలోకి దిగుతానని వెల్లడించింది. ప్రస్తుతం కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించానని ఇప్పటికైతే తనకు అకాడమీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేసింది.