
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రికి ఈ ఏడాది సుమారు ఏడు లక్షలకుపైగా భవానీలు అమ్మవారి దర్శనార్థం వస్తారని అంచనా వేస్తూ అందుకు తగిన ఏర్పాట్లు చేశామని దేవాదయశాఖ మంత్రి వెల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇంద్రకీలాద్రిపై భవనీదీక్షా విరమణల ఏర్పాట్లను ఆయన బుధవారం పర్యవేక్షించారు. అదేవిధంగా భవానీ భక్తుల ఏర్పాట్లపై రాజీపడొద్దని మంత్రి వెల్లపల్లి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. క్యూలైన్లతో పాటు గిరి ప్రదక్షణకు భవానీలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.
గిరి ప్రదక్షణ సమయంలో భవానీలు ట్రాఫిక్‌లో ఇబ్బంది పడకుండా చూడాలిని ఆయన అధికారులను ఆదేశించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులు వేగవంతంగా జరుగుతున్నందున వచ్చే ఏడాదికి ఆ సమస్య తీరుతుందని మంత్రి వెల్లపల్లి తెలిపారు. ప్రతి భవానీ భక్తుడు అమ్మవారిని దర్శించుకొని మాల విరమణ చేసే వరకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లపల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా హోమగుండాలు, గిరి ప్రదక్షణ ఏర్పాట్లు ఉన్నాయని భవానీ భక్తులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment