Bhavani Deeksha
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడ : వైభవంగా ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు (ఫొటోలు)
-
భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష స్వీకరణ (ఫొటోలు)
-
విజయవాడ : ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి..ముగిసిన భవానీ దీక్ష విరమణ (ఫొటోలు)
-
Bhavani Deeksha Viramana Images: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ రద్దీ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రీపై ఇవాళ్టి నుంచి భవానీ దీక్షల విరమణ
-
Vijayawada: దుర్గమ్మకు భారీగా దసరా ఆదాయం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో రూ.16 కోట్ల మేర ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రి మహా మండపం ఆరో అంతస్తులో ఆమె సోమవారం విలేకరులకు ఉత్సవ ఆదాయ వ్యయాలను వివరించారు. హుండీ కానుకల ద్వారా రూ.9.11 కోట్లు, దర్శన టికెట్ల ద్వారా రూ.2.50 కోట్లు, ప్రసాదాల విక్రయాలతో రూ.2.48 కోట్లు, ఆర్జిత సేవల టికెట్ల ద్వారా రూ.1.03 కోట్లు, తలనీలాల ద్వారా రూ.20 లక్షలు, విరాళాలు ఇతరత్రా కలిపి రూ.16 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు. ఉత్సవాల ఏర్పాట్లు, ప్రొవిజన్స్, ఇతర ఖర్చులకు రూ.10.50 కోట్ల మేర వెచ్చించామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఈఈలు కోటేశ్వరరావు, రమా పాల్గొన్నారు. 26 నుంచి కార్తిక మాసోత్సవాలు ఈ నెల 26 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కార్తిక మాసోత్సవాలను వైభవంగా నిర్వహి స్తామని ఈఓ భ్రమరాంబ తెలిపారు. 23వ తేదీన ధనత్రయోదశి సందర్భంగా మహాలక్ష్మి యాగం, 24న దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో ధనలక్ష్మి పూజ, సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తామన్నారు. 25వ తేదీ సూర్యగ్రహణం నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఆలయాన్ని మూసివేసి, 26 ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. నవంబర్ ఎనిమిదో తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేసి మరుసటిరోజు ఉదయం పూజల అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. నవంబర్ 4 నుంచి భవానీ మండల దీక్షలు నవంబర్ నాలుగో తేదీ నుంచి భవానీ మండల దీక్షలు, 24వ తేదీ నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయని ఈఓ తెలిపారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభమై 19వ తేదీ పూర్ణాహుతితో ముగుస్తాయని పేర్కొన్నారు. డిసెంబర్ ఏడో తేదీన సత్యనారాయణపురం రామకోటి నుంచి కలశజ్యోతుల మహోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు. (క్లిక్ చేయండి: గుండెకు ‘ఆరోగ్యశ్రీ’ అండ) -
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ఫొటోలు
-
ఇంద్రకీలాద్రిలో ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు
-
భవానీ దీక్షల విరమణ..ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్ష విరమణ ప్రారంభమైంది. దాంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే దీక్ష విరమణ ఉత్సవం 29వ తేదీ వరకు కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భవానీ మాలధారులు దీక్ష విరమణకు ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే భవానీల రాక ప్రారంభమైంది. దీక్ష విరమణ నేపథ్యంలో దేవదాయ శాఖ, పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు దేవస్థాన ఘాట్ రోడ్డు, రాజగోపురానికి రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల తర్వాతే దర్శనం శనివారం తెల్లవారుజామున దుర్గమ్మ మూలవిరాట్‌కు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అఖండ జ్యోతిని వెలిగించారు. అఖండ జ్యోతిని వెలిగించిన తర్వాత భవానీలను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. హోమగుండాల్లో ఉదయం 8.23 గంటలకు అగ్నిప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈఓ భ్రమరాంబ, వైదిక కమిటీ, అర్చకులు పాల్గొన్నారు. అగ్నిప్రతిష్టాపన అనంతరం ఇరుముడుల సమర్పణ ప్రారంభమైంది. నగరానికి భవానీలు శనివారం దీక్ష విరమణ ఉత్సవం ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచే భవానీలు విజయవాడ నగరానికి చేరుకున్నారు. ఉదయం తమిళనాడుకు చెందిన భవానీలు, పలువురు భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా దీక్ష విరమణకు ముందు రోజు తమిళనాడు నుంచి పలువురు భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేస్తుంటారు. గిరి ప్రదక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు నగరానికి శుక్రవారం చేరుకున్న భవానీలు దుర్గాఘాట్, కనకదుర్గనగర్‌లో విశ్రాంతి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గిరి ప్రదక్షణ ప్రారంభించారు. గిరి ప్రదక్షణ మార్గాల్లో భవానీలకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురవకుండా పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది భవానీలు గిరి ప్రదక్షణ చేసే కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాలు, సితార జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు గిరి ప్రదక్షణ పూర్తి చేసిన భవానీలు వినాయకుడి గుడి వద్దకు చేరుకుని క్యూలైన్ ద్వారా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. వినాయకుడి గుడి వద్ద క్యూలైన్లోకి చేరిన భవానీలు, భక్తులు అమ్మవారి దర్శనం అనంతరమే బయటకు చేరుకుంటారు. కొండపై మల్లేశ్వర స్వామి ఆలయ మెట్ల మార్గంతో పాటు మహా మండపం మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకుంటారు. మహా మండపం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఇరుముడులను సమర్పించాల్సి ఉంటుంది. ఇరుముడులను సమర్పించిన అనంతరం నేతి కొబ్బరికాయలను హోమగుండాలలో సమర్పించి, అమ్మవారి ప్రసాదాలను కొనుగోలు చేసుకునేలా కౌంటర్లు ఏర్పాటు చేశారు. భవానీ, పున్నమి స్నాన ఘాట్లల్లో ఏర్పాట్లు భవానీపురం (విజయవాడ పశ్చిమ): భవానీ దీక్ష విరమణ సందర్భంగా గట్టు వెనుక ప్రాంతంలోని భవానీ, పున్నమి ఘాట్లల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భవానీల వాహనాలను (బస్సులు, కార్లు, టెంపోలు) పార్కింగ్ చేసుకునేందుకు భవానీపురంలోని పున్నమి హోటల్ పక్కనగల ఖాళీ ప్రదేశాన్ని నిర్ణయించారు. అక్కడే తలనీలాలు సమర్పించేందుకు కేశఖండన శాల ఏర్పాటు చేశారు. అనంతరం స్నానాలు చేసేందుకు రెండు ఘాట్లల్లో జల్లు స్నానానికి ఏర్పాట్లు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, మరుగుదొడ్లను సిద్ధం చేశారు. భవానీలు తలనీలాలను సమర్పించిన అనంతరం అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పున్నమి హోటల్ వద్ద నుంచి బస్సులను ఏర్పాటు చేసింది. మాస్కు తప్పనిసరి దీక్షల విరమణ ఉత్సవాల ఏర్పాట్లపై దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు శుక్రవారం మీడి యాతో మాట్లాడారు. భవానీలు, భక్తులు తప్పని సరిగా మాస్క్‌లు ధరించి, కోవిడ్ నిబంధలను పాటించాలన్నారు. ఆరోగ్యకర వాతావరణంలో ఇరుముడులను సమర్పించేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. భక్తులకు, భవానీలకు దద్దోజనం, పులిహోర ప్యాకెట్ల పంపిణీ చేస్తామని తెలిపారు. ఈఓ భ్రమరాంబ మాట్లాడుతూ దీక్ష విరమణలకు ఐదు లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అంచనావేశామన్నారు. రోజుకు ఆరు లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతాన్నారు. భవానీ, పున్నమి స్నాన ఘాట్లల్లో భవానీలకు జల్లు స్నానా లకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్.డి.ప్రసాద్, ఈఈ భాస్కర్, పాలక మండలి సభ్యులు కటకం శ్రీదేవి, గంటా ప్రసాద్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘భవానీ భక్తుల ఏర్పాట్లపై రాజీపడొద్దు’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రికి ఈ ఏడాది సుమారు ఏడు లక్షలకుపైగా భవానీలు అమ్మవారి దర్శనార్థం వస్తారని అంచనా వేస్తూ అందుకు తగిన ఏర్పాట్లు చేశామని దేవాదయశాఖ మంత్రి వెల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇంద్రకీలాద్రిపై భవనీదీక్షా విరమణల ఏర్పాట్లను ఆయన బుధవారం పర్యవేక్షించారు. అదేవిధంగా భవానీ భక్తుల ఏర్పాట్లపై రాజీపడొద్దని మంత్రి వెల్లపల్లి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. క్యూలైన్లతో పాటు గిరి ప్రదక్షణకు భవానీలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. గిరి ప్రదక్షణ సమయంలో భవానీలు ట్రాఫిక్‌లో ఇబ్బంది పడకుండా చూడాలిని ఆయన అధికారులను ఆదేశించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులు వేగవంతంగా జరుగుతున్నందున వచ్చే ఏడాదికి ఆ సమస్య తీరుతుందని మంత్రి వెల్లపల్లి తెలిపారు. ప్రతి భవానీ భక్తుడు అమ్మవారిని దర్శించుకొని మాల విరమణ చేసే వరకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లపల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా హోమగుండాలు, గిరి ప్రదక్షణ ఏర్పాట్లు ఉన్నాయని భవానీ భక్తులను అడిగి తెలుసుకున్నారు. -
ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్షల విరమణ
-
విజయవాడలో భవానీ దీక్షల విరమణ
-
అమ్మ గుడికి వెళుతుండగా..
పెద్దాపురం: దేవీ నవరాత్రుల వేళ దుర్గమ్మ చెంతకు కాలినడకన వస్తానని మొక్కుకున్న భక్తుడు అమ్మ దర్శనానికి వెళుతుండగా మార్గం మధ్యలో మృత్యువు కాటేసింది. కాలినడకన విజయవాడ దుర్గ గుడికి బయల్దేరిన భవానీ భక్తులను బుధవారం వేకువజామున పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఐషర్ వ్యాన్ బలంగా ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వారితో పాటు కలినడకన వస్తున్న మరో ఇరువురు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.పెద్దాపురం పోలీసుల కథనం ప్రకారం.. యు.కొత్తపల్లి మండలం మూలపేట నుంచి నలుగురు భవానీలు కాలినడకన విజయవాడ కనకదుర్గ గుడికి బయల్దేరారు. ప్రయాణంలో భాగంగా స్థానిక ఏడీబీ రోడ్డులో వేకువ జామునే ప్రయాణం మొదలుపెట్టిన భవానీలను వెనుక నుంచి టాటా ఏసీ వాహనం బలంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో మురాలశెట్టి సారాజు (30) అక్కడికక్కడే మృతి చెందగా గరగ సత్తిబాబు తీవ్ర గాయాలపాలయ్యాడు. మరో నల్లా శ్రీనివాస్, గరగ నాగ సూరిబాబు పక్కకు తప్పుకోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది.స్థానికుల సమాచారం మేరకు పెద్దాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై వి.సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సారాజు మృతితో రోదిస్తున్న బంధువులు కొత్తపల్లి (పిఠాపురం): కొత్తమూలపేట రామరాఘవపురానికి చెందిన మురాలశెట్టి సారాజు (28) రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో మరో భక్తుడు కొత్తమూలపేటకు చెందిన గరగ సత్తిబాబుకు తీవ్రగాయాలు కావడంతో బంధువులు రోదిస్తున్నారు. సారాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సారాజు సోదరుడు శ్రీనివాస్ తొమ్మిదేళ్ల క్రితం శీలంవారి పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
జై భవానీ.. జైజై భవానీ !
చిట్టినగర్ : ‘జై భవానీ.. జైజై భవానీ..’ నినాదాలతో వన్‌టౌన్ ప్రాంతం మంగళవారం మార్మోగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భవానీలు, భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ గిరిప్రదర్శన సాగిస్తున్నారు. భవానీ దీక్ష విరమణలు సందర్భంగా వన్‌టౌన్ ప్రాంతంలో పండుగ వాతవరణం నెలకొంది. గిరి ప్రదక్షణ చేసే భవానీలతో ఇంద్రకీలాద్రి చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. భవానీలకు స్థానిక వ్యాపారులు, అమ్మవారి భక్తులు మంచినీరు, పాలు, పండ్లు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం ఎండ ఎక్కువగా ఉండటంతో సేవా కార్యక్రమాలు తొలి రోజు నుంచే వేగవంతమయ్యాయి. ట్రాఫిక్‌లో ఇబ్బందులు కేటీ రోడ్డులోని పాలప్రాజెక్టు నుంచి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో భవానీలు గిరిప్రదక్షణ కోసం నానా అవస్థలు పడాల్సి వచ్చింది. చిట్టినగర్, నెహ్రూబొమ్మ సెంటర్లో తరచూ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనాల మధ్య నుంచి భవానీలు భయంభయంగా వెళ్లాల్సి వచ్చింది. రోడ్డుకు ఒకవైపు వాహనాలను మళ్లించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తే భవానీలకు ఉపయోగరంగా ఉంటుంది. భవానీ ఘాట్‌లో ఏర్పాట్లు భవానీపురం : భవానీ దీక్షల విరమణను పురస్కరించుకుని భవానీ ఘాట్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ మెట్ల దిగువున స్టీల్ బారికేడ్లను నిర్మిస్తున్నారు. ఘాట్ ఆసాంతం ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్య అక్కడక్కడ దారి వదిలారు. ఆ మార్గం నుంచే భక్తులు ఒక క్రమ పద్ధతిలో నదిలో స్నానాలు చేసేలా చూస్తున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
నేటి నుంచి భవానీ దీక్షల విరమణ
-
గిరిప్రదక్షిణ ఇలా ...
దుర్గగుడి ఫ్లైవోవర్ పనులతో ట్రాఫిక్ ఎక్కువ భారీ వాహనాలతో జాగ్రత్తగా ఉండండి రోడ్డు పక్కగా నడిస్తేనే మంచిది రాత్రివేళ ప్రదక్షిణకు కాస్త అనుకూలం గ్రూపుగా వెళ్తేనే మంచిది భవానీలు జాగ్రత్త సుమా.. విజయవాడ (ఇంద్రకీలాద్రి) : బస్సులు, రైళ్లలో నగరానికి చేరుకున్న భవానీలు పుణ్యస్నానాలు చేసేందుకు పద్మావతి, సీతమ్మ వారి పాదాలు, దుర్గాఘాట్, భవానీఘాట్, పున్నమి ఘాట్లను సిద్ధం చేశారు. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు దుర్గగుడి టోల్గేట్ నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభించవచ్చు... సుమారు ఏడు కిలోమీటర్లు, 2.30 గంటల్లో గిరిప్రదక్షిణ పూర్తిచేసుకుని వినాయకుడి గుడి మీదుగా దుర్గమ్మ దర్శన క్యూలైన్‌కు చేరుకోవచ్చు. ఒకసారి క్యూలైన్లోకి చేరుకున్న తర్వాత అమ్మవారి దర్శనం, ఇరుముడి బంధాల సమర్పణ, హోమగుండం, ప్రసాదాల కొనుగోలుతో బయటకు రావడమే జరుగుతుంది. ఈ నేపథ్యంలో భవానీలు ఇబ్బందులు పడకుండా ఏయే ప్రాంతాల నుంచి వెళ్లాలి, ఎంత సమయం పడుతుందనే విషయాలను ‘సాక్షి’ సేకరించింది. ఆ వివరాలు.. గిరిప్రదక్షిణ మార్గం - సమయం టోల్‌గేటు నుంచి కుమ్మరిపాలెం సెంటర్‌కు : 15 నిమిషాలు కుమ్మరిపాలెం నుంచి నాలుగు స్తంభాల సెంటర్‌కు : 10 నిమిషాలు నాలుగు స్తంభాల నుంచి చెరువు సెంటర్‌కు : 10 నిమిషాలు చెరువు సెంటర్ నుంచి సితారా జంక్షన్‌కు : 10 నిమిషాలు సితార జంక్షన్ నుంచి కబేళాకు : 20 నిమిషాలు పాలప్రాజెక్టు నుంచి చిట్టినగర్‌కు : 25 నిమిషాలు చిట్టినగర్ నుంచి నెహ్రూబొమ్మ సెంటర్‌కు : 25 నిమిషాలు నెహ్రూబొమ్మ నుంచి బ్రాహ్మణ వీధి మీదుగా రథం సెంటర్‌కు : 35 నిమిషాలు అనువైన సమయాలివీ : 31వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దీక్ష విరమణకు ముందు రోజు నుంచే భవానీలు నగరానికి చేరుకునే అవకాశం ఉంది. గిరిప్రదక్షిణకు తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకూ, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ, తిరిగి రాత్రి 9 నుంచి 12 గంటల వరకూ మార్గం సుగమమవుతుంది. విరమణకు విస్తృత ఏర్పాట్లు మరో 24 గంటల్లో ప్రారంభంకానున్న భవానీ దీక్షల విరమణకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ఐదు రోజులు పాటు జరిగే ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు ఎనిమిది లక్షల మంది భవానీ భక్తులు జగన్మాతను దర్శించుకుని ఇరుముళ్లు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు దుర్గగుడి ఈవో సీహెచ్ నర్సింగరావు. భవానీ దీక్షల విరమణను పురస్కరించుకుని మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... తెల్లవారుజామునుంచే దర్శనాలు వచ్చేనెల నాల్గో తేదీ వరకూ జరిగే భవానీ దీక్షల విరమణ గురువారం అగ్నిప్రతిష్టాపనతో ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు దర్శనాలకు అనుమతిస్తాం. తరువాత నాలుగు రోజులూ తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకూ దర్శనం చేసుకోవచ్చు. పంచ హారతులు, అమ్మవారి నివేదన కోసం సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకూ దర్శనం నిలిపివేస్తాం. దర్శనానికి ఐదు లైన్లు దర్శనానికి ఐదు క్యూలైన్లు ఏర్పాటుచేశాం. రూ.200 చెల్లించి అంతరాలయ దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన క్యూలైన్ల ద్వారా ఉచిత దర్శనం చేసుకునే సదుపాయం కల్పించాలి. దర్శనానంతరం మహామండపం ద్వారా మూడు లైన్లు, శివాలయం మెట్లమార్గం ద్వారా రెండు లైన్ల ద్వారా భక్తుల్ని కొండ కిందకు పంపుతాం. కొండ దిగువన హోమగుండాలు ఏటా మాదిరిగానే కొండ దిగువన నాలుగు హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే భవానీ బంధనాలు తీసి హోమగుండాల్లో పూజా ద్రవ్యాలు వేయవచ్చు. భక్తుల కోరిక మేరకు గురుభవానీలే వచ్చి వారి బృందంలోని భక్తులకు బంధనాలు తీసే ఏర్పాటు ఈ ఏడాది ప్రత్యేకంగా చేస్తున్నాం. కావాలంటే దేవస్థానం అర్చకుల సహాయం తీసుకోవచ్చు. ఇతర సౌకర్యాలు దుర్గా, పున్నమి, భవానీ, పద్మావతి, కృష్ణవేణి స్నానఘట్టాల్లో భక్తులు ఇబ్బంది పడకుండా జల్లు స్నానాలు ఏర్పాటు చేస్తున్నాం. దుస్తులు మార్చుకునేందుకు మరుగుదొడ్లు, 300 తాత్కాలిక టాయిలెట్లు నిర్మించాం. ప్రతి స్నానఘట్టంలోనూ క్షురకులు సిద్ధంగా ఉంటున్నారు. భక్తుల ఇబ్బందుల్ని తెలుసుకుని పరిష్కరించేందుకు సిబ్బందిని ఏర్పాటుచేశాం. 24 గంటలూ మైక్ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. గిరిప్రదక్షిణ కు ఏర్పాట్లు ప్లైవోవర్ పనులను కలెక్టర్ ఆదేశాల మేరకు 4వ తేదీ వరకూ నిలిపివేశాం. మార్గంమధ్యలో భక్తులు ఇబ్బంది పడకుండా వైద్య శిబిరాలు, మంచినీటి సౌకర్యం కల్పించాం. తెల్లవారుజామున భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన లైటింగ్ ఏర్పాటుచేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నందున చిన్నచిన్న ఇబ్బందులు భక్తులు పట్టించుకోకుండా సహనంతో ముందుకు వెళ్లాలి. రోజూ పదివేల మందికి అన్నప్రసాదం శృంగేరి వడ్లమన్నాటి సత్రంలో రోజుకు పదివేల మంది చొప్పున ఐదు రోజుల్లో 50వేల మందికి ఉచితంగా అన్నప్రసాదం అందజేస్తాం. గత ఏడాది 11 లక్షల వాటర్ ప్యాకెట్లు వినియోగించగా.. ఈ ఏడాది 15 లక్షల వాటర్ ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్నాం. రెండురోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండ కుండా ప్యాకెట్లు తయారు చేస్తాం. భక్తులకు సేవలు అందించేందుకు 600 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సిద్ధంగా ఉంటారు. అందుబాటులో 15 లక్షల లడ్డూ గత ఏడాది 11 లక్షల లడ్డూ ప్రసాదాలు తయారు చేయించగా, ఈ ఏడాది 15 లక్షలు తయారు చేయిస్తున్నాం. గతంలో 14 ప్రసాదాల కౌంటర్లు ఉండగా, ఈసారి 20 కౌంటర్లకు పెంచాం. రైల్వేస్టేషన్, బస్టాండ్‌లోనూ ప్రసాదాల కౌంటర్లు ఉంటాయి. భక్తులు సహనం వహిస్తే.. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు సహనం వహించి భక్తిభావంతో దర్శనం చేసుకుంటే దీక్షల విరమణ మధురస్మృతిగా మారుతుంది. ఆ దిశగా ప్రతి భక్తుడూ ప్రయత్నించాలి.