
విజయవాడ: అంబా భవానీ శారదే.. అంటూ భవానీ దీక్షధారులు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను మనసారా పూజిస్తున్నారు. దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి భవానీల రద్దీ కొనసాగుతోంది.

దీక్ష విరమణల్లో రెండో రోజు గురువారం భవానీలు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఇరుముడులు సమర్పించి దీక్షలను విరమించారు.

తొలిరోజు సుమారు 70 వేల మంది భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో కేఎస్ రామారావు పేర్కొన్నారు.

గురువారం సుమారుగా మరో 60 వేల మంది దీక్షలు విరమించారని, రెండు రోజుల్లో 5 లక్షల మేర లడ్డూలను విక్రయించినట్లు తెలిపారు.











































