indrakiladri
-
ఇంద్రకీలాద్రిపై వసంతపంచమి వేడుకలు (ఫొటోలు)
-
రెండవ రోజు దీక్షల విరమణకు తరలివచ్చిన భవానీలు
-
మహిషాసురమర్ధనిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు చివరి దశకు చేరాయి. తొమ్మిదోరోజు శుక్రవారం మహిషాసురమర్ధని రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక ఈ ఉత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగియనున్నాయి. ఈ ఏడాది ఉత్సవాల్లో మూలానక్షత్రం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ముందస్తు అంచనాలకు అనుగుణంగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేసినప్పటికీ గత ఏడాదితో పోల్చుకుంటే భక్తుల సంఖ్య తగ్గింది. ఇప్పటికి దాదాపు 7 లక్షల నుంచి 7.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మహర్నవమి సందర్భంగా తరలి వచ్చిన భక్తులు నగరోత్సవంలో అమ్మవారిని దర్శించుకుని తరించారు. పట్టువ్రస్తాలు సమర్పించిన టీటీడీ కనకదుర్గమ్మకు టీటీడీ తరఫున శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ అధికారులకు, దుర్గమ్మ దేవస్థానం ఈవో కేఎస్ రామారావు, సిబ్బంది, అర్చకులు స్వాగతం పలికారు. మేళతాళాలతో సంప్రదాయ బద్ధంగా అమ్మవారి అంతరాలయానికి తోడ్కొని వెళ్లారు. మహిషాసురమర్థిని అలంకారంలో ఉన్న దుర్గమ్మకు పట్టు వ్రస్తాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ అధికారులకు ఈవో రామారావు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదం అందజేశారు. నేడు తెప్పోత్సవం దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయదశమి రోజు కనకదుర్గాదేవికి కృష్ణానదిలోని దుర్గాఘాట్‌లో సాయంత్రం 5 గంటలకు శ్రీగంగా, దుర్గ అమ్మవార్ల సమేత మల్లేశ్వరస్వామి తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కమనీయ దృశ్యాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా గుర్తించిన పది ప్రాంతాల్లో ఎల్ఈడీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చివరిరోజు అమ్మవారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. -
ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం
‘నా పేరు నందిని. మాది కోదాడ. కుటుంబంతో దుర్గమ్మ దర్శనానికి వచ్చాను. పావు గంటలో అమ్మవారి దర్శనం అవుతుందని చెప్పడంతో రూ.500 టికెట్లు తీసుకున్నాం. క్యూ లైన్లోకి వచ్చి గంటన్నర గడచినా చిన గాలిగోపురం వద్దే పోలీసులు నిలిపేశారు. టికెట్లు కొనని వారిని మాత్రం పంపించారు. ఇదేం అన్యాయం అని అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను పంపిస్తూ టికెట్లు కొన్న భక్తులను గంటల తరబడి నిలబెట్టేశారు’. ఇది ఒక్క నందిని అభిప్రాయమే కాదు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల అందరి విమర్శ.విజయవాడస్పోర్ట్స్: ఇంద్రకీలాద్రిపై ఈ నెల మూడో తేదీన దసరా ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొండను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని భక్తులతో పాటు, ఉత్సవ విధులకు హాజరైన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తొలి రోజు నుంచే పోలీసుల దౌర్జన్యంపై పలువురు అధికారులు, సిబ్బంది తమ శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా వారి తీరులో మార్పు రాలేదు. మంగళవారం పోలీసుల తీరు మరింత శృతిమించడంతో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై ఎన్నడూ లేని విధంగా నల్ల రిబ్బన్లతో నిరసనలు కొనసాగాయి. అన్నింటా వారే.. పోలీస్‌శాఖ అధికారులు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించిన తరువాత దసరా ఉత్సవాలు ప్రారంభం కావడం కొన్నేళ్లగా ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అమ్మవారు తమ ఆడపడుచని, ఉత్సవం తమదేననే ధోరణిలో పోలీసులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దసరా ఉత్సవాలకు దేవదాయ శాఖ 1,200 మంది, మునిసిపల్ 1,500 మంది, ఎన్సీసీ 400 మంది, రెవెన్యూ 300 మంది, వైద్య–ఆరోగ్య 250 మంది, అగి్నమా పక శాఖ 150 మంది అధికారులు, సిబ్బందిని ఉత్సవాలకు కేటాయించగా. పోలీస్ శాఖ మాత్రం ఆరు వేల మందిని కొండ చుట్టూ మోహరించింది. భక్తులకు అవసరమైన సేవలను దేవదాయ, రెవెన్యూ, మునిసిపల్, ఎన్సీపీ, వైద్య ఆరోగ్య శాఖలు అందిస్తుంటే రక్షణ పేరుతో వచ్చిన పోలీసులు పెత్తనం చెలాయిస్తున్నారు. మహామంటపం దిగువనున్న లిఫ్ట్‌ను పూర్తిగా స్వాదీనం చేసుకుని తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మినహా ఎవరినీ లిఫ్ట్‌లోకి అనుమతించడం లేదని, క్యూ లైన్ సజావుగా సాగకుండా నిరంతరం అడ్డుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజే దేవదాయ శాఖ ఇంజినీర్‌ను పోలీసులు అడ్డుకుని జులుం ప్రదర్శించారు. దీంతో సదరు ఉద్యోగి మహామంటపం కింద పోలీసుల కోసం వేసిన టెంట్లు, కురీ్చలను తొలగించేశారు. ఈ పంచాయితీ రాష్ట్ర సచివాలయం అధికారులు వరకు వెళ్లింది. లిఫ్ట్‌ల వద్ద పోలీసులు చేస్తున్న అతికి నిరసనగా అదే లిఫ్ట్‌ల వద్దే పారిశుద్ధ్య కార్మికులు చెత్తను డంప్ చేస్తున్నారు. ఓం రింగ్ నుంచి ప్రొటోకాల్ వరకు వెళ్లకుండా ఓ న్యాయమూర్తిని పోలీసులు ఇబ్బంది పెట్టారు. చివరకు పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి సదరు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. రూ.500 టిక్కెట్లు కొన్న భక్తులను నిలిపివేసి, తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పోలీసులు పంపించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్, వినాయకుడి గుడి, ఘాట్‌రోడ్డు గాలిగోపురం ప్రాంతాల్లో తమను నిలిపివేస్తున్నారని, ఆలయంపై వరకు బైక్‌లను అనుమతించడం లేదని, తమను ఆలయంలోకి వెళ్లనీయడంలేదని పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు అసభ్యకరంగా ఉందని పోలీస్ కమిషనర్ వద్ద పలువురు మహిళలు వాపోయారు. ఉత్సవ సేవా కమిటీలో ఉన్న తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. నల్ల రిబ్బన్లతో నిరసన ఖాకీల తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు మంగళవారం ఆందోళనకు దిగారు. మీడియా పాయింట్ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నినాదాలు చేశారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిరసన కొనసాగింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వస్తున్నారని తెలుసుకున్న పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు హుటా హుటిన మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. మీడియా పాయింట్ నుంచే డీజీపీ అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంది. డీజీపీ వెళ్లే సమయంలో పోలీస్ శాఖకు వ్యతిరేకంగా మీడియా ప్రతినిధులు నినాదాలు చేస్తే పరువు పోతుందని గ్రహించి, వారితో చర్చలు జరిపారు. డీసీపీ గౌతమి సాలి తీరు సరిగ్గా లేదని సీపీకి మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మీడియా వాళ్లను కొండపైకి అనుమతించవద్దని డీసీపీ పదేపదే ఆదేశాలిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని సీపీ హామీ ఇవ్వడంతో మీడియా ప్రతినిధులు నిరసన విరమించారు. ఆ వెంటనే అదే మార్గంలో డీజీపీని అమ్మవారి దర్శనానికి సీపీ వెంట బెట్టుకుని వెళ్లారు. -
మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు మంగళవారం మహాలక్ష్మిదేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. సాయంత్రం నగరోత్సవం కనులపండువగా సాగింది. కనకదుర్గానగర్‌లో కళావేదికపై ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. బుధవారం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం రాత్రి 11 గంటల నుంచే ఇంద్రకీలాద్రిపైకి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మూలా నక్షత్రం నాడు 2 లక్షల మందికిపైగా భక్తులు రానున్న నేపథ్యంలో అందుకు తగినట్లు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. క్యూలైన్లలో మార్పులు చేసింది. వీఐపీ దర్శనాలనూ రద్దు చేసింది. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటల నంచి రాత్రి 11 గంటల వరకు భక్తులందరికీ ఉచితంగా అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తోంది. ఫ్లైవోవర్ కింద వాహనాలకు అనుమతి రద్దు చేసింది. సీఎం చంద్రబాబు బుధవారం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.నేడు శ్రీ సరస్వతిదేవిగా... ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం శ్రీ సరస్వతిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. ఈ రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తారు. -
మేయరా...అయితే మాకేంటి?
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలా ద్రిపై విజయవాడ నగ ర మేయర్‌కు సోమవా రం ఘోర అవమానం ఎదురైంది. కొండపై ఆమెను అడుగడుగునా అధికారులు అవమానించారు. ఆమె కారు ను పదేపదే నిలిపివేశారు. ఆమె కారులోంచి బయటకు వచ్చి తాను మేయర్‌ని అని, తనకు ప్రొటోకాల్ ఉంటుందని చెబుతున్నా ఎవరూ లెక్క చేయలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కష్టాలుపడి కొండపైకి చేరుకున్న ఆమెను ఆలయ చిన్న రాజగోపురం వద్ద పోలీసులు, దేవస్థానం సిబ్బంది నిలిపివేశారు.దీంతో ఆమె కొద్దిసేపు పక్కనే నిలబడి ఎదురు చూశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న మీడియా ఆమె వద్దకు వచ్చి వీడియో తీస్తుండగా అప్పటికప్పుడు సిబ్బంది స్పందించి గేట్ తీసి ఆమెను లోపలకు పంపించారు. రూ.300 క్యూ లైన్ నుంచి అమ్మవారికి నమస్కారం చేసుకొని మేయర్ బయటకు వచ్చేశారు. సాధారణంగా మేయర్ వచ్చినప్పుడు ఆమెకు ప్రొటోకాల్ అధి కారులు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించి, ఆశీర్వాదాలను, ప్రసాదాలను అందించి పంపాల్సి ఉంటుంది.బీసీ మహిళను అవమానించారు ‘అమ్మవారి దర్శనానికి వస్తే నన్ను అవమానించారు. దేవస్థానం చెప్పిన సమయంలోనే నేను కొండపైకి వచ్చాను.నాకు వెహికల్ పాస్ ఇవ్వమని కలెక్టర్, సీపీ, నగర కమిషనర్‌ను కోరాను. మీరు మేయర్.. మిమ్మల్ని ఎవరు ఆపుతారని అధికారులు అన్నారు. కానీ నాకు అడుగడుగునా అడ్డంకులే. నేను మేయర్‌ని అని అందరికీ చెప్పుకోవాలి్సన పరిస్థితి కల్పించారు. పోలీసులు, దేవస్థానం అధికారుల తీరు సరిగాలేదు. గతంలో ఏనాడైనా ఇలా జరిగిందా..? కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరం. నగర పాలకసంస్థ సహకారం లేకుండా భవానీదీక్షలు, దసరా ఉత్సవాలను నిర్వహించగలరా? మేయర్‌ను అందులోనూ బీసీ వర్గానికి చెందిన మహిళను కావాలనే నన్ను అవమానించారు. –రాయన భాగ్యలక్ష్మి, మేయర్ విజయవాడ -
లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. సాయంత్రం ఆదిదంపతుల నగరోత్సవం కనులపండువగా సాగింది. కనకదుర్గానగర్‌లో కళావేదికపై ప్రదిర్శించిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. సోమవారం శ్రీ మహా చండీదేవి అలంకరణలో భక్తులకు దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. వీఐపీలకే పెద్దపీట... ఇంద్రకీలాద్రిపై రోజు రోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల సిఫారసు లేఖలు రావడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు. వీఐపీలు తమకు నిర్దేశించిన సమయంలోనే దర్శనానికి రావాలని కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదు. రూ.500 టికెట్ కొన్నవారికి దర్శనానికి ఐదు గంటలు పట్టింది. రూ.100, రూ.300 దర్శనం టికెట్లు కొన్న వారికే త్వరగా దర్శనమవుతోంది. జత్వానీకి రాచమర్యాదలు చీటింగ్ కేసులో నిందితురాలు, సినీ నటి కాదంబరీ జత్వానీకి ఇంద్రకీలాద్రిపై రాచమర్యాదలు చేశారు. తల్లిదండ్రులతో కలిసి ఆదివారం ఇంద్రకీలాద్రికి వచ్చిన ఆమెకు పోలీసులు ప్రత్యేక ప్రొటోకాల్ ఏర్పాటు చేశారు. ఆమెకు ఇద్దరు కానిస్టేబుళ్లు దగ్గరుండి మరీ వీఐపీ దర్శనం చేయించారు. -
నవరాత్రి అలంకరణలో నవనవోన్మేషంగా...
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు.3వ తేదీ గురువారం – శ్రీబాలా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో తొలిరోజున దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి.4వ తేదీ శుక్రవారం – శ్రీగాయత్రిదేవిరెండోరోజున దుర్గమ్మ శ్రీ గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి అమ్మవారిని దర్శించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. వేదమాత గా గాయత్రిదేవిని దర్శించుకోవడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం ΄÷ందుతారు.5వ తేదీ శనివారం – శ్రీఅన్నపూర్ణాదేవిదసరా ఉత్సవాలలో మూడోరోజున దుర్గమ్మను శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మను దర్శించడం వల్ల అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే భాగ్యాన్ని ΄÷ందగలుగుతారు.6వ తేదీ ఆదివారం- శ్రీలలితా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో నాల్గో రోజున దుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులు దర్శించుకున్నారు. శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా, అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తుల పూజలందుకుంటారు.7వ తేదీ సోమవారం – శ్రీ మహాచండీదేవిఐదవ రోజున దుర్గమ్మ శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు మిత్రులుగా మారి కోరికలు అన్ని సత్వరమే తీరుతాయి.8వ తేదీ మంగళవారం – శ్రీమహాలక్ష్మీదేవిఆరో రోజున దుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక స్ధితికారిణిగా, «అమృత స్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీమహాలక్ష్మీదేవిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్య్ర΄ాప్తి కలుగుతుంది. 9వ తేదీ బుధవారం – శ్రీసరస్వతిదేవిఏడవరోజయిన మూల నక్షత్రం రోజున సరస్వతి అవతారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వల్ల సర్వ విద్యలయందు విజయం ΄÷ందుతారు.10వ తేదీ గురువారం – శ్రీదుర్గాదేవి 8వ రోజున దుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను ΄ోగొట్టి దుర్గగా వెలుగొందినది. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని ఆర్చించటం సద్గతులను ప్రసాదిస్తుంది.11వ తేదీ శుక్రవారం – శ్రీమహిషాసుర మర్ధనిదేవిదసరా ఉత్సవాలలో 9వ రోజున దుర్గమ్మ శ్రీమహిషాసురమర్ధనిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినిౖయె, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్ధనిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల అరిష్ట్వర్గాలు నశించి, సాత్విక బావం ఉదయిస్తుంది. సర్వ దోషాలు పంటాపంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.12వ తేదీ శనివారం – శ్రీరాజరాజేశ్వరిదేవిదసరా ఉత్సవాలలో 10వ రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరుకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తం తో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహా మంత్ర స్వరూపిణి గా, శ్రీచక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరిదేవిని దర్శించి అర్చించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.– సుభాని, సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) -
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇంద్రకీలాద్రి(విజయవాడ పర్పింమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మూడోరోజు అన్నపూర్ణాదేవీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. సెలవుల నేపథ్యంలో ఆదివారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దర్శనానికి వచ్చే వీఐపీలు తమకు నిర్దేశించిన సమయంలోనే రావాలని కలెక్టర్ డాక్టర్ సృజన, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేశారు. దుర్గమ్మకు మంగళ సూత్రాల సమర్పణ ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన చిరువ్యాపారి కళ్లకుంట అంకులయ్య, రాజేశ్వరి దంపతులు దుర్గమ్మకు బంగారు మంగళ సూత్రాలు తయారు చేయించారు. రూ.18 లక్షలు విలువ చేసే 203 గ్రాముల బంగారు మంగళ సూత్రాలను శనివారం సమర్పించారు. అలాగే గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే భక్తుడు 5.7 కిలోల వెండితో తయారు చేసిన హంస వాహనాన్ని శనివారం జగన్మాతకు సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో కె.ఎస్.రామారావు దాతలను అభినందించారు. కనులవిందుగా నగరోత్సవం దసరా మహోత్సవాల్లో భాగంగా ఆది దంపతుల నగరోత్సవం నయనమనోహరంగా సాగింది. ఉత్సవమూర్తులతో మల్లేశ్వరాలయం దిగువన ఉన్న మహామండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవంలో అర్చకులు, పండితులు, కళాకారులు, అధికారులు పాల్గొని సేవలందించారు. కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నేటి అలంకారం.. శ్రీలలితా త్రిపుర సుందరీదేవిఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో నాలుగోరోజైన ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహా మంత్రాధిదేవతగా వేం చేసి ఆరాధించే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. శ్రీలక్ష్మీదేవి, శ్రీ సరస్వతిదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా, చిరు మందహాసంతో, వాత్సల్యరూపిణిగా చెరుకుగడను చేత పట్టుకుని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నది.ద్వారకా తిరుమల నుంచి పట్టువ్రస్తాలు దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టువ్రస్తాలను సమర్పించేందుకు ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో మూర్తి, ఆలయ అర్చకులు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం ఆయనకు, దేవస్థాన అర్చకులకు, దుర్గగుడి దేవస్థానం తరఫున ఈవో కె.ఎస్.రామారావు అమ్మవారి ప్రసాదాలను అందచేశారు. -
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
-
అంబరాన్నంటిన అమ్మ పండుగ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా మహోత్సవాల తొలి రోజున అమ్మవారు శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున దుర్గమ్మకు స్నపనాభిõÙకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం ఉదయం 8.40 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. తొలిగా రాష్ట్ర మంత్రులు ఆనం, పార్థసారథి అమ్మవారి తొలి దర్శనం చేసుకున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తి వద్ద గణపతి పూజ నిర్వహించారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తి వద్ద ప్రత్యేక కుంకుమార్చన, ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద శ్రీచక్ర నవార్చన, యాగశాలలో చండీహోమాలు నిర్వహించగా ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవ సేవ కనుల పండువగా సాగింది. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, ఘాట్‌రోడ్డు మీదగా ఆలయానికి చేరుకుంది. మహారాష్ట్రకు చెందిన సౌరభ్‌గౌర్‌తో పాటు ఏపీకి చెందిన రాజే‹Ù, సూర్యకుమారి రూ.4 కోట్ల విలువైన వజ్రాభరణాలను అమ్మవారికి సమర్పించారు. ఇందులో వజ్రాలు పొదిగిన 2 కిలోల బంగారంతో తయారు చేసిన వజ్ర కిరీటం, సూర్యచంద్ర ఆభరణాలు, ముక్కెర, నత్తు, బులాకీ ఉన్నాయి. ఈ ఆభరణాలతో శుక్రవారం అమ్మవారు శ్రీగాయత్రిదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు.వైభవంగా మైసూరు దసరా ఉత్సవాలుదసరా నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ ప్రఖ్యాత మైసూరులో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవత చాముండేశ్వరి దేవి కొలువైన చాముండి కొండపై ఉదయం శుభ వృశ్చిక లగ్నంలో దీపాన్ని వెలిగించి, అమ్మవారి ఉత్సవమూర్తికి పుష్పార్చన గావించి అగ్ర పూజ చేయడం ద్వారా దసరా సంబరాలకు నాంది పలికారు. ఈ ఏడాది ప్రముఖ సాహితీవేత్త డా.హంపా నాగరాజయ్య ఉత్సవాలను ప్రారంభించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉదయం కొండకు విచ్చేసిన హంపా, సీఎం తదితరులకు కళాబృందాల ప్రదర్శనల మధ్య పూర్ణకుంభ స్వాగతం లభించింది. జానపద కళా బృందాలతో ఊరేగింపుగా చాముండేశ్వరి ఆలయానికి చేరుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయం వెలుపల ఉన్న దసరా వేదికకు చేరుకుని వెండి రథంలో ప్రతిష్టించిన చాముండేశ్వరి దేవికి పూజలు చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. మైసూరు రాజప్రసాదంలో రాజవంశీకుడు, స్థానిక బీజేపీ ఎంపీ యదువీర్ చామరాజ ఒడియార్ దర్బార్ నిర్వహించారు. బంగారు, వజ్రకచిత సింహాసనంపై ఆశీనులైన అలనాటి రాజుల కాలంలో మాదిరిగా దర్బార్ చేశారు. రాజమాత ప్రమోదాదేవి, యదువీర్ భార్య, తనయుడు పాల్గొన్నారు. బెంగళూరులో 10 కి పైగా వేదికల్లో సాంస్కృతిక నృత్య ప్రదర్శనల కోలాహలం మిన్నంటింది. – మైసూరు -
దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి
-
ఇంద్రకీలాద్రి అమ్మవారి అలంకారాలు నైవేద్యాలు (ఫొటోలు)
-
హిందువులంతా ఏకం కావాలి
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా ఏకమై.. కలసికట్టుగా మాట్లాడాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందువులు మౌనం వహిస్తే, ఆ మౌనం భవిష్యత్తు తరాలను నాశనం చేస్తుందన్నారు. ధర్మాన్ని పరిరక్షించడం గుడికి వెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా, నా ఒక్కడి బాధ్యతేనా అంటూ ప్రశ్నించారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కనక దుర్గమ్మవారి దర్శనం అనంతరం ఇంద్రకీలాద్రిపై ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సనాతన ధర్మానికి సంబంధించి పోరాటం చేయాలనుకుంటే తనను ఆపేవారు ఎవరూ లేరన్నారు. ధర్మం కోసం పోరాటం చేస్తే చనిపోవడానికి సిద్ధమని, కానీ, అక్కడిదాకా తీసుకెళ్లనని చెప్పారు. సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. సనాతన ధర్మానికి, పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడడం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా..? మాట్లాడేవారు ఒకటికి వందసార్లు ఆలోచించి మాట్లాడండి అని చెప్పారు. సెక్యులరిజం అనేది వన్ వే కాదని అది టూ వే అని చెప్పారు. హిందువులు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మసీదులో చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతారా అని అన్నారు. హిందూ దేవుళ్లపైన మాట్లాడేవారు అల్లాహ్ పైన, మహ్మద్ ప్రవక్తపైన, జీసస్పైన మాట్లాడగలరా అంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఇస్లాంపైన మాట్లాడితే ఆ మతం వారు పెద్దఎత్తును బయటకు వస్తారు అంటూ చెప్పారు. హిందువులను రోడ్లపైకి రమ్మని చెప్పడం లేదన్నారు. కనీసం హిందువులకు కోపం రాకపోతే ఏం చేస్తామన్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ వారికి కూడా విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మంపై ఇష్టానుసారం జోకులు వేయడం, మీమ్స్ చేయడం సరికాదన్నారు. ఓ సినిమా ఫంక్షన్లో జోకులు వేస్తున్నారని, ఎంతోమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. దేశమంతటికి కలిపి ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ తప్పనిసరి అని చెప్పారు. అంతకుముందు పవన్ కళ్యాణ్‌కు ఆలయ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. ఆలయం మెట్లను కడిగి, పసుపు రాశారు.మహిళలను అడ్డుకున్న సిబ్బంది ఆలయంలో మెట్లను పవన్‌కళ్యాణ్ శుభ్రం చేసే కార్యక్రమానికి అర్ధగంట ముందు, ఆ తర్వాత కూడా మహిళా భక్తులు మెట్ల పూజ చేసుకోకుండా ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. మెట్ల పూజ చేసుకుంటూ వస్తున్న మహిళా భక్తులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని క్యూలైన్లోకి పంపేందుకు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి, మహిళా భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. మెట్ల పూజ మొక్కు పూర్తి చేసుకోకుండా దర్శనానికి వెళ్లమని చెప్పడం ఎంత వరకు సబబని మహిళలు మండిపడ్డారు. -
అందుబాటులో దుర్గమ్మ దసరా ఆర్జిత సేవా టికెట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో వచ్చాయి. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమాలను నిర్వహిస్తారు. ఆయా టికెట్ల ధరలను దేవస్థానం ఖరారు చేయగా, ఆన్‌లైన్‌తో పాటు దేవస్థానం ఆవరణలోని టికెట్ కౌంటర్, మహామండపం దిగువన టోల్‌ఫ్రీ నంబర్ కౌంటర్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ. 5,116, ప్రత్యేక కుంకుమార్చనకు రూ. 3 వేలుగా నిర్ణయించారు. మూలా నక్షత్రం రోజున నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన టికెట్ ధర రూ. 5 వేలు. ఇక ప్రత్యేక శ్రీచక్రనవార్చనకు టికెట్ ధర రూ. 3 వేలు, ప్రత్యేక చండీహోమం టికెట్ ధర రూ. 4 వేలుగా నిర్ణయించారు. ఇక ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించే వేద విద్వత్ సభ అక్టోబర్ 10న, అర్చన సభ 11న నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారికి విశేష అలంకారాలు, ప్రత్యేక పూజలు, నివేదనలు, వేద సభ, అర్చక సత్కారం వంటి వైదిక కార్యక్రమాలపై వైదిక కమిటీ సభ్యులతో ఈవో రామారావు గురువారం సమావేశం నిర్వహించారు. -
ఇంద్రకీలాద్రీపై ఇవాళ్టి నుంచి భవానీ దీక్షల విరమణ
-
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
ఇంద్రకీలాద్రిపై రూ. 216 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
Updates 9:13AM, Dec 7 , 2023 రూ. 216 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ. 57 కోట్ల రాష్ట్ర నిధుల్లో రూ. 30 కోట్లతో అన్నప్రసాద భవన నిర్మాణం రూ. 27 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం రూ. 13 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ రూ. 15 కోట్లతో రాజగోపారం ముందు భాగం వద్ద మెట్ల నిర్మాణం రూ. 23.50 కోట్లతో దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్ రూ. 7. 75 కోట్లతో కనకదుర్గానగర్ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం రూ. 18.30 కోట్లతో మల్లికార్జున మహా మండపం వద్ద క్యూ కాంప్లెక్స్ మార్పు రూ. 19 కోట్లతో నూతన కేశఖండన శాల నిర్మాణం రూ. 10 కోట్లతో ప్రస్తుత గోశాల భవనాన్ని బహుళ సముదాయంగా మార్పు 9:01AM, Dec 07, 2023 ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్ 8:35AM, Dec 07, 2023 విజయవాడకు బయల్దేరిన సీఎం జగన్ దుర్గగుడిపై పలు ప్రారంభోత్సవాలు, శంకస్థాపనలు చేయనున్న సీఎం జగన్ అనంతరం కనకదుర్గమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్ రూ. 216 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకస్థాపనలు కనకదుర్గ గుడి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తోంది. అందులో భాగంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. గురువారం ఈ మాస్టర్ ప్లాన్‌లోని రూ. 216.05కోట్ల విలువైన పలు పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇప్పటికే పూర్తయిన మల్లేశ్వరాలయంతో పాటు పలు ఆలయాలను ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవాలు ఇవే.. ప్రభుత్వ నిధులు రూ.5.60 లక్షలతో చేపట్టిన మల్లేశ్వర స్వామి వారి ఆలయం, రూ.4.25 కోట్లతో ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, రూ.3.25 కోట్లతో చేపట్టిన ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, స్కాడా పనులు పూర్తయ్యాయి. దుర్గగుడి అభివృద్ధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.70 కోట్ల నుంచి ఈ పనులు చేపట్టారు. వీటిని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. దేవదాయ శాఖ నిధులు రూ. 3.87 కోట్లతో చేపట్టిన 8 ఆలయాల పునఃనిర్మాణ పనులు పూర్తి కావడంతో ఆయా ఆలయాలను కూడా ప్రారంభించనున్నారు. అలాగే పాతపాడు గ్రామంలోని ఆలయానికి చెందిన స్థలంలో దేవస్థాన నిధులు రూ. 5.66 కోట్లతో ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం, కొండ దిగువన రూ. 23 లక్షలతో బొడ్డు బొమ్మ, అమ్మవారి పాత మెట్ల మార్గంలోని ఆంజనేయస్వామి, వినాయక స్వామి ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. శంకుస్థాపనలు ఇలా.. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అమ్మవారి అన్నప్రసాద భవనం రూ.30 కోట్లు, అమ్మవారి లడ్డూ ప్రసాదం పోటు భవనం రూ. 27 కోట్లతో నిర్మించనున్నారు. వీటితో పాటు దేవస్థాన నిధులు రూ.13 కోట్లతో కనకదుర్గనగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్, రూ.23.50 కోట్లతో రాజగోపురం ముందు మెట్ల నిర్మాణం, రూ.7.75 కోట్లతో కనకదుర్గనగర్ ప్రవేశ ద్వారం వద్ద మహారాజ ద్వారం నిర్మాణం, రూ.7 కోట్లతో కొండపైన పూజా మండపం, రూ.18.30 కోట్లతో మల్లికార్జున మహామండపం క్యూకాంప్లెక్స్ నిర్మాణం, రూ.19 కోట్లతో నూతన కేశఖండనశాల, రూ.10 కోట్లతో గోశాల వద్ద బహుళ ప్రయోజన సౌకర్య సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇవే కాకుండా దాతలు సహకారంతో అమ్మవారి ఆలయం నుంచి మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకునే మార్గంలో రూ.5 కోట్లతో గ్రానైట్ రాతి యాగశాల, దేవస్థానం, ప్రయివేటు భాగస్వామ్యంతో రూ.33 కోట్ల వెచ్చించి కనకదుర్గనగర్‌లో మల్టీలెవల్ కారు పార్కింగ్ నిర్మాణం జరుగుతుంది. ఈ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 8.35గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి బయలుదేరి, 8.45 గంటలకు విజయవాడ కనకదుర్గానగర్‌కు చేరుకుంటారు. అక్కడ పలు పనులను ప్రారంభిస్తారు. 9.05 నుంచి 9.25 గంటల మధ్య కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. 9.25 గంటలకు తిరిగి బయలుదేరి 9.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఏర్పాట్ల పరిశీలన ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం ఇంద్రకీలాద్రికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. మహా మండపం దిగువన శంకుస్థాపన కోసం చేస్తున్న ఏర్పాట్లను దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో కేఎస్ రామారావులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రూ.216 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావడంతో వాటిని ప్రారంభిస్తారని చెప్పారు. దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, సబ్‌కలెక్టర్ అదితి సింగ్, డీసీపీ విశాల్‌గున్ని, ఆలయ ఈఈలు కోటేశ్వరరావు, ఎల్.రమాదేవి, పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రి : దుర్గమ్మకు 2 లక్షల గాజులతో అలంకరణ మహోత్సవం (ఫొటోలు)
-
23 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై నవంబర్ 23 నుంచి భవానీ మండల దీక్షలు ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్.రామారావు తెలిపారు. ఆలయం మహామండపం ఆరో అంతస్తులో ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, వైదిక కమిటీ సభ్యులతో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దీక్షలు 27 వరకు స్వీకరించవచ్చన్నారు. 23న మూలవిరాట్‌కు పూజలు నిర్వహించి పగడాల మాలాధారణ చేస్తారని, అనంతరం ప్రధాన ఆలయం నుంచి ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకువచ్చి అఖండ జ్యోతి ప్రజ్వలనతో దీక్ష స్వీకరణ మహోత్సవం ప్రారంభమవుతుందని వివరించారు. అర్ధమండల దీక్షలు డిసెంబర్ 13–17 వరకు స్వీకరించవచ్చన్నారు. 26న అమ్మవారి కలశజ్యోతి మహోత్సవం సత్యనారాయణపురంలోని శ్రీశివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతుందన్నారు. జనవరి 3–7 వరకు దీక్ష విరమణలు కొనసాగుతాయని తెలిపారు. 14 నుంచి కార్తీక మాసోత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి డిసెంబర్ 12 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం మల్లేశ్వర స్వామి, నటరాజ స్వామి వారి ఆలయాల వద్ద ఆకాశదీపాన్ని వెలిగించనున్నారు. 26న కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం, 27న కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షణ, బిల్వార్చన చేపడతారు. 15న దుర్గమ్మను గాజులతో అలంకరిస్తారు. 16న సరస్వతి యాగాన్ని, 17న నాగుల చవితి నిర్వహిస్తారు. -
ముగిసిన గ్రహణం..తెరుచుకున్న ఆలయం
తిరుమల/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం/శ్రీకాళహస్తి: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ ఆదివారం తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైల క్షేత్రాల్లో గ్రహణ కాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతించారు. తిరుమలలో ఆదివారం ఉదయం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం ఉదయం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. శ్రీకాళహస్తిలో గ్రహణ కాల పూజలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణకాల పూజలను శాస్త్రోక్తం గా నిర్వహించారు. గ్రహణాల సమయాల్లో రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేసినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది. గ్రహణ కాల సమయంలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేకాభిõషేకాలు నిర్వహించారు. ఆదివారం వేకువజాము 1 గంటకు మొదటి కాలాభిషేకం, 1:45 గంటలకు రెండోకాలాభిషేకం, 2.30 గంటలకు మూడో కాలాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ అభిషేకాలకు భక్తులు పోటెత్తారు. -
28న పాక్షిక చంద్రగ్రహణం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం టెంపుల్: ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6:30 గంటలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ తెలిపింది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం కవాట బంధనం (తలుపులు మూసివేయడం) చేయనున్నట్లు పేర్కొంది. 29న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేపట్టి 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. 29న సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చనను రద్దు చేశారు. శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణాలు యథావిధిగా జరగనున్నాయి. 28న శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలాలయ ద్వారాలు 28న సాయంత్రం 5 గంటల నుంచి 29న ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. 29న ఉదయం 7 గంటలకు దర్శనాలు ప్రారంభిస్తారు. 28న మధ్యాహ్నం 3.30 గంటల వరకే సర్వదర్శనం, మధ్యాహ్నం 12.30 గంటల వరకే గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తారు. సర్వదర్శనానికి ఉదయం మాత్రమే అవకాశం ఉంటుంది. 28న అన్నప్రసాద వితరణ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని..ఆ రోజు సాయంత్రం అల్పాహార వితరణ నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. -
ముగిసిన దసరా ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/కోడూరు/పెందుర్తి/శ్రీశైలం టెంపుల్: ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తోన్న దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం 9వ రోజున దుర్గమ్మ 2 అలంకారాల్లో అభయమిచ్చారు. ఉదయం మహిషాసురమర్దినిగా.. మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరిదేవిగా దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమ్మవారి అలంకరణ మార్పు కారణంగా దర్శనాలను నిలిపివేశారు. 2 రోజుల్లో రికార్డు స్థాయిలో 4 లక్షలకుపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో మహా పూర్ణాహుతిని నిర్వహించారు. సోమవారం రాత్రి ఆది దంపతులకు కృష్ణా నదిలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. దుర్గాఘాట్ వద్ద హంస వాహనంపై శ్రీగంగా పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వారు తెప్పపై విహరించారు. 8.95 లక్షల మందికి దర్శనం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15–23 వరకు నిర్వహించిన దసరా ఉత్సవాల్లో 8.95 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 14.17 లక్షల లడ్డూలను విక్రయించినట్లు చెప్పారు. స్వర్ణం, వెండి, పట్టుతో నేసిన చీరలో నాంచారమ్మ కృష్ణా తీరంలో భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లిలోని అద్దంకి నాంచారమ్మ అమ్మవారికి బంగారం, వెండి, పట్టుతో నేసిన చీరను అలంకరించారు. పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన పసుపులేటి మణికంఠ వృత్తి పరంగా విదేశాల్లో స్థిరపడ్డాడు. దసరా ఉత్సవాలకు నాంచారమ్మ అమ్మవారికి రూ.2 లక్షలతో బంగారం, వెండితో ప్రత్యేకంగా తయారు చేయించిన చీరను మణికంఠ కుటుంబసభ్యులు సోమవారం ఆలయాధికారులకు అందజేశారు. పట్టుతో పాటు చీర మొత్తం బంగారం, వెండి తీగలతో నేయించారు. ఈ చీరను మూలమూర్తికి అలంకరించారు. బంగారం, వెండి చీరలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మణికంఠ కుటుంబీకులను ఆలయ ఈవో పామర్తి సీతారామయ్య సన్మానించారు. విశాఖ శ్రీశారదాపీఠంలో.. విశాఖ శ్రీశారదాపీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం విజయదశమి సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిలు శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చిన శారదాస్వరూప రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డి శ్రీశారదాపీఠాన్ని మంగళవారం సందర్శించి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో.. శ్రీశైలంలో ఆధ్యాత్మికభరితంగా సాగిన దసరా మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. అమ్మవారు నిజరూప అలంకారంలో భ్రమరాంబాదేవిగా దర్శనమిచ్చారు. నంది వాహన సేవలో ఆది దంపతులు విహరించారు. ప్రత్యేక అలంకృతులైన అమ్మవారికి, స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక వేదికలో ఆశీనులను చేయించి విశేష పూజలు నిర్వహించారు. విజయదశమి రోజున స్వామి అమ్మవార్లకు విశేష పూజలతో పాటు శమీ పూజ చేపట్టారు. అమ్మవారి యాగశాలలో, స్వామివారి యాగశాలలో శాస్త్రోక్తం గా పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంతో శ్రీగిరిలో దసరా మహోత్సవాలు ముగిశాయి. కాగా, సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు మంత్రి గుమ్మనూరు జయరాం దంపతులు పట్టువ్రస్తాలను సమర్పించారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు, దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో పెద్దిరాజు పాల్గొన్నారు. -
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..4వ రోజు పోటెత్తిన జనం
-
సిఫారసులకు చెల్లుచీటీ!.. టికెట్ ఉంటేనే దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ దర్శనంలో అధికారులు భారీ మార్పులు చేశారు. సిఫారసులు ఉన్నవారికే దుర్గమ్మ దర్శనం అనే భావన తొలగించి, ఎటువంటి సిఫారసులతో పనిలేకుండా కేవలం గంటన్నర వ్యవధి లోపే దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవదాయశాఖ మంత్రితోపాటు అధికారులు, చైర్మన్ చెబుతూనే ఉన్నారు. ఏటా ఇలానే చెబుతారు కదా అని సాధారణ భక్తులు భావించినా, ఈసారి దాన్ని చేతల్లో అమలు చేసి చూపించారు. టికెట్ ఉంటేనే దర్శనం అనే రీతిలో ఏర్పాట్లు జరిగాయి. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి దర్శనం పూర్తయి కొండ దిగేవరకూ కేవలం గంటన్నర వ్యవధిలోపే దర్శన సమయం పడుతుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఏర్పాట్లను మంగళవారం విజయవాడ సీపీ టీకే రాణా తనిఖీ చేశారు. క్యూలైన్లో ఉన్న భక్తులతో మాట్లాడారు. దర్శనానికి ఎంత సమయం పడుతుందనే వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రొటోకాల్ వాహనాలపైనే కొండకు... పాలకమండలి, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరైనా దేవస్థానానికి చెందిన ప్రొటోకాల్ వాహనాలపైనే కొండపైకి చేరుకోవాలి. టికెట్ ఉంటేనే వాహనాల్లోకి ప్రవేశం అని ప్రకటించారు. వారితో వచ్చిన ఎవరైనా టికెట్ తీసుకోవాల్సిందే అని పేర్కొన్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లోనైనా, వీఐపీలైనా టికెట్ కొనుగోలు చేస్తున్నారు. ఇక టికెట్ కొనుగోలు చేసిన సామాన్య భక్తులు ఎవరైనా నేరుగా ఆలయానికి చేరుకునే వీలులేకుండా పక్కా ప్రణాళికతో కట్టడి చేశారు. ఘాట్ రోడ్డులోని ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి ఆలయం చేరుకునే లోపు ఐదు చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వాటికి ఎంఆర్వోలు, ఇతర రెవెన్యూ ముఖ్య అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో సీఎం గేట్, ఆలయ సిబ్బంది రాకపోకలు సాగించే మార్గాల్లో ఉన్న గేట్లకు సైతం తాళాలు వేశారు. ఎవరైనా సరే క్యూలైన్లోనే దర్శనానికి వెళ్లాలని అటు పోలీసులు, ఇటు రెవెన్యూ శాఖల అధికారులు చెబుతున్నారు. అలానే సిఫారసులు ఉన్నా, నేరుగా దర్శనానికి కాకుండా, క్యూలైన్లోనే అనుమతిస్తుండటంతో ఆలయ ప్రాంగణం ప్రశాంతంగా కనబడుతోంది. మరోవైపు డీసీపీ విశాల్‌గున్నీ ఆలయ ప్రాంగణంలోనే ఉంటూ భక్తులు ఎవ్వరూ అనధికార మార్గాల్లో అమ్మవారి దర్శనానికి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. పోలీసు అధికారులు సిఫారసు చేసిన వారిని సైతం పోలీసులు నేరుగా దర్శనానికి కాకుండా రూ.500 టికెట్ క్యూలైన్లోనే పంపుతున్నారు. చదవండి: దసరాకు ప్రత్యేక రైళ్లు -
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన విశేష ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా దుర్గమ్మకు అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానం నుంచి పట్టువ్రస్తాలను సమర్పించారు. అన్నవరం దేవస్థాన ఈవో, దుర్గగుడి దసరా ఉత్సవాల ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ అమ్మవారికి సమర్పింంచేందుకు పట్టువ్రస్తాలను తీసుకురాగా, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో కేఎస్ రామారావు సాదరంగా స్వాగతం పలికారు. ఉత్సవాల ఏర్పాట్లను సీపీ టీకే రాణా పర్యవేక్షించగా, ఆలయ ప్రాంగణంలో డీసీపీ విశాల్‌గున్ని క్యూలైన్లను పర్యవేక్షించారు. సాయంత్రం ఆది దంపతుల నగరోత్సవం కన్నుల పండువగా సాగింది. నగరోత్సవంలో ఆలయ చైర్మన్ రాంబాబు, ఈవో కెఎస్ రామారావు పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిలో దసరా నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
బాలాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వేద పండితులు, అర్చకుల సుప్రభాత సేవతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం బాలా త్రిపుర సుందరీ దేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.40గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆదివారం, దసరా సెలవులు కావడంతో తొలి రోజు నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం కల్పించారు. స్నానఘాట్లల్లో ప్రత్యేకంగా షవర్లు, తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం కలుగకుండా వీవీఐపీల సమాచారం ముందుగా తెలియజేస్తే ప్రొటోకాల్‌కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు చెప్పారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులతో నగరోత్సవం నిర్వహించి, పంచహారతులను సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండోరోజైన సోమవారం నాడు శ్రీ కనకదుర్గమ్మవారు భక్తులకు శ్రీ గాయత్రీదేవీగా దర్శనమివ్వనున్నారు. దుర్గమ్మ సేవలో గవర్నర్ దంపతులు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఆదివారం బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. దర్శనానికి విచ్చేసిన గవర్నర్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. గవర్నర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, చైర్మన్ కర్నాటి రాంబాబు అందజేశారు. గవర్నర్ వెంట కలెక్టర్ ఢిల్లీరావు తదితరులున్నారు. అలాగే, మంత్రులు ఆర్కే రోజా, విశ్వరూప్ కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు. -
నేటి నుంచి దేవీ శరన్నవరాత్రులు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నందు ఆదివారం నుంచి దేవీ శరన్నవరాత్రులు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీని అంచనా వేసేందుకు పోలీస్, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం నిరంతరం ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం శనివారం నాటికి మూడు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం సాయంత్రం పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేలా చూడాలని ఆలయ ఈవో కెఎస్ రామారావు, ఫెస్టివల్ ఆఫీసర్ ఆజాద్‌కు పలు సూచనలు చేశారు. నేడు శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను తొలిరోజు ఆదివారం శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వి తమైనది. శ్రీ బాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్పది, ముఖ్యమైనది. శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీబాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీబాలా త్రిపురసుందరీదేవి. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వరస సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ సోమవారం కూడా కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్నాటక నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు తమ వాహనాలను సీతమ్మవారి పాదాలు, కుమ్మరిపాలెం, పున్నమి ఘాట్, వీఎంసీ కార్యాలయాల వద్ద నిలుపుకొని దేవస్థాన బస్సుల్లో కొండపైకి చేరుకున్నారు. పలువురు భక్తులు కనకదుర్గనగర్ మీదుగా మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సర్వ దర్శనానికి రెండు గంటలు, రూ.100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్లో గంటకు పైగా సమయం పట్టింది. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో కానుకలు, మొక్కుబడులను సమర్పిస్తున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను మంగళవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 22 రోజులకు గాను రూ.2,92,28,842ల నగదు లభించింది. సరాసరిన రోజుకు రూ.13.28 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు చెప్పారు. 740 గ్రాముల బంగారం, 6.95 కిలోల వెండి, భారీగా ఇతర దేశాల కరెన్సీ లభించినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ–హుండీ ద్వారా రూ.89,193 విరాళాలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు సమర్పించినట్లు చెప్పారు. -
దసరాకు సన్నాహాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సన్నాహాలు జరుగు తున్నాయని సుమారు రూ.7 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాంబాబు, ఈవో భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే దసరా ఉత్సవాల ఏర్పాట్లను వారు మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు 10 విశేష అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రూ.2.50 కోట్లతో ఇంజినీరింగ్ పనులు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో గతేడాది ఆరు లక్షలకు పైగా భక్తులు అమ్మ వారిని దర్శించుకుంటే ఈ ఏడాది అంతకు మించి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఉత్సవాల్లో 16 లక్షలకు పైగా లడ్డూలను దేవస్థానం అందించిందని, ఈ ఏడాది సుమారు 20 లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. మూలా నక్షత్రం రోజున రూ.500 వీఐపీ టికెట్లు ఉత్సవాల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం రోజున రూ. 500 వీఐపీ టికెట్లను విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేస్తారని తెలిపారు. రూ.500 వీఐపీ టికెట్ తీసుకున్నా ముఖ మండపం దర్శనం మాత్రమే కల్పిస్తామని వివరించారు. మిగిలిన రోజుల్లో రూ. 100, రూ.300, రూ. 500 టికెట్ల విక్రయాలు ఉంటాయన్నారు. ఉత్సవాలకు సుమారు రెండు వందల మంది పని చేస్తున్నారని, భక్తుల తలనీలాలు తీసేందుకు ఇతర ఆలయాలు, బయట నుంచి ఆరు వందల మంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 22న వేదసభ ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిర్వహించే ఆది దంపతుల నగరోత్సవం మల్లేశ్వరస్వామి ఆలయం మెట్ల వద్ద యాగశాల నుంచి ప్రారంభమవుతుందన్నారు. మహా మండపం, కనకదుర్గనగర్, దుర్గాఘాట్, దేవస్థాన ఘాట్‌రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందన్నారు. రాజగోపురం ఎదుట పూజతో నగరోత్సవం ముగుస్తుందన్నారు. 21న అర్చక సభ, 22న వేద సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల్లో చివరి రోజు 23వ తేదీ నుంచి భవానీల రాక ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, మూడు రోజుల పాటు తాకిడి ఉండే అవకాశాలున్నాయన్నారు. సమావేశంలో పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, బచ్చు మాధవీకృష్ణ, చింకా శ్రీనివాసులు, తొత్తడి వేదకుమారి, వైదిక కమిటీ సభ్యులు యజ్జనారాయణశర్మ, మురళీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 20న పట్టువస్త్రాల సమర్పణ ఉత్సవాల్లో తొలిసారిగా అమ్మవారిని మహా చండీదేవిగా అలంకరిస్తామని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య పేర్కొన్నారు. తొలిరోజున అమ్మవారి శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారన్నారు. 20వ తేదీ మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించ నున్నారన్నారు. 23వ తేదీ రెండు అలంకారాల్లో అమ్మవారిని భక్తులు దర్శించుకోవచ్చునన్నారు. ఉదయం మహిషాసురమర్దని, మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. 23వ తేదీ సాయంత్రం శ్రీ గంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి వార్లకు పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందన్నారు. -
రవికల పేరుతో నిలువు దోపిడీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులు అమ్మవారికి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు అమ్మవారికి చీరలు సమర్పిస్తే మరి కొందరు రవికలు సమర్పిస్తుంటారు. భక్తులు తమకు కావాల్సిన చీరలు, రవికలను ఆలయ పరిసరాల్లోని దుకాణాల నుంచి కొనుగోలు చేస్తారు. అయితే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కనకదుర్గనగర్, మహా మండపం 5వ అంతస్తులోని దుకాణాల్లో రవికల పేరిట గుడ్డ పీలికలను అందమైన ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి శనివారం విచ్చేసిన ఎం. హారిక దంపతులు అమ్మవారికి రవికను సమర్పించేందుకు మహా మండపం ఐదో అంతస్తులోని షాపునకు వెళ్లి రూ. వంద చెల్లించి రవికను కొనుగోలు చేశారు. రూ. 10 చెల్లించి పసుపు, కుంకుమ ప్యాకెట్‌ను కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దేవస్థాన కౌంటర్లో ఆ రవికను ఇచ్చారు. అయితే దేవస్థాన కౌంటర్లోని సిబ్బంది అది చెత్తలో వేయాలని సూచించారు. దీంతో షాక్‌కు గురైన వారు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. తమకు విక్రయించినది రవిక ముక్క కాదని, కనీసం ఖర్చీపు కూడా కాదని తెలుసుకున్నారు. అడిగినంత ఇస్తున్నా.. ఆలయ ప్రాంగణంలోనే ఇలా భక్తులను మోసం చేయడం ఎంత వరకు సబబని కౌంటర్లో సిబ్బందిని నిలదీశారు. దీనిపై మీరు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. దీంతో ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆలయ ప్రాంగణంలో ఇదంతా సాధారణమని ఆ అధికారి సలహా ఇవ్వడంతో వారు ఆలయ ఈవో భ్రమరాంబను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఈవో అందుబాటులో లేరని తెలుసుకుని వెను తిరిగారు. ప్రతి నిత్యం ఇలా వందలాది మంది భక్తులను మోసం చేస్తున్న వ్యాపారులపై ఆలయ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. -
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్‌పై రాకపోకలు బంద్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి ఘాట్ రోడ్ మీదుగా వెళ్లే భక్తుల రాకపోకలను నిలుపుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండపై ఉన్న రాళ్లు మెత్తబడటంతో మంగళవారం రాత్రి కొండపై నుంచి చిన్నపాటి రాళ్లు ఘాట్ రోడ్‌పై జారి పడ్డాయి. కొండ చరియలు విరిగి కింద పడకుండా ఘాట్ రోడ్లో కొండ చుట్టూ మెష్ ఏర్పాటు చేసినప్పటికీ భక్తుల రక్షణను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యలుగా వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలను బంద్ చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో దర్భముళ్ల భ్రమరాంబ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం బంగారు బోనం సమర్పించింది. 11 రకాల బోనాలు, పట్టుచీర, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి బంగారు బోనంతో పాటు అందజేసింది. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీన్మార్ డప్పులు, కోలాట నృత్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఇంద్రకీలాద్రికి చేరిన ఊరేగింపునకు దుర్గగుడి చైర్మన్ రాంబాబు, ఈవో భ్రమరాంబ, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులకు బంగారు బోనం అందజేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న శాకంబరీదేవి ఉత్సవాలు ఆదివారం రెండో రోజూ వైభవంగా కొనసాగాయి. రికార్డు స్థాయిలో సుమారు 70 వేల పైచిలుకు భక్తులు అమ్మవారిని శాకంబరీదేవిగా దర్శించుకున్నారు. కాగా, దుర్గమ్మను శాకంబరీదేవి అలంకారంలో రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం దర్శించుకున్నారు. -
శాకంబరీదేవిగా కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాకంబరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించారు. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు, వ్యాపారులు, భక్తుల నుంచి సేకరించిన కూరగాయలతో అమ్మవారి ఆలయాన్ని ముస్తాబు చేశారు. తొలి రోజు రాత్రి 9.30గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. ఆలయ పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.సుజాత, జస్టిస్ సుబ్బారెడ్డి, జస్టిస్ శ్రీనివాసరెడ్డి తదితరులు శనివారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో వేర్వేరుగా ఆలయానికి వచ్చిన న్యాయమూర్తులకు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈఈ కె.వి.ఎస్.కోటేశ్వరరావు అమ్మవారి ప్రసాదం, శేషవ్రస్తాలతో సత్కరించారు. -
దుర్గమ్మ సన్నిధిలో శాకంబరీ దేవి ఉత్సవాలు ప్రారంభం
-
ఘనంగా ఆషాడమాసం ఉత్సవాలు ప్రారంభం
-
దుర్గమ్మకు రూ.7.50 లక్షల ఆభరణాల సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు రూ.7.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సమర్పించారు. హైదరాబాద్ ఏఎస్రావు నగర్‌కు చెందిన డి.వెంకట సత్యవాణి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 104 గ్రాముల బంగారపు లక్ష్మీకాసుల హారం, 29 గ్రాముల బంగారపు పచ్చల నక్లెస్, 391 గ్రాముల వెండి పళ్లెం దేవస్థానానికి సమర్పించారు. వీటిని అమ్మవారి ఉత్సవాలలో ఉపయోగించాలని దాత కోరారు. కాగా, దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి చెన్నై ఇందిరానగర్‌కు చెందిన భోగరం వెంకట మార్కాండేయ శర్మ కుటుంబం రూ.5 లక్షల విరాళాన్ని ఆలయ ఈవో భ్రమరాంబకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందచేశారు. -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మీ యాగం
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఓ భక్తురాలు అత్యుత్సాహం
-
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు
-
దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది : వైవి సుబ్బారెడ్డి
-
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
-
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్ జగన్
-
ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్
-
విజయవాడ : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
పండగ వేళ : మూడవ రోజు గాయత్రీ అలంకారంలో అమ్మవారు
-
ఇంద్రకీలాద్రిపై మూడో రోజు శరన్నవరాత్రులు
-
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
-
దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధమైన ఇంద్రకీలాద్రి
-
Ashada Masam 2022: ముగిసిన ఆషాఢ మాసం ఉత్సవాలు
-
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
ద్వారకాతిరుమల/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): సకల శుభాలు కలిగించే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు వచ్చి పూజలు చేశారు. ప్రధానంగా అన్నవరం, సింహాచలం, అరసవిల్లి వంటి ముఖ్యమైన ఆలయాల్లో భక్తజనం పెద్దఎత్తున వచ్చారు. ఇక ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలోని దాదాపు అన్ని విభాగాలూ భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్రంలో రద్దీ కొనసాగింది. భజన మండళ్ల సభ్యులు కోలాట భజనలతో ఆకట్టుకున్నారు. అలాగే, ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూడా ఆదివారం ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. విజయవాడ లబ్బీపేట, వన్‌టౌన్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో స్వామి వారికి పలు ప్రత్యేక పూజలు, లక్ష తులసీదళార్చన నిర్వహించారు. అభినవ మేల్కొటెగా పేరుగాంచిన కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఉల్లిపాలెంలోని శ్రీగోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో పులకించింది. 11 అడుగుల శ్రీమన్నారాయణుడి మూలమూర్తికి అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మచిలీపట్నం చిలకలపూడి కీర పండరీపురంలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు జరిపించారు. అలాగే, బెజవాడ కనకదుర్గమ్మ, పట్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో పెద్దఎత్తున బారులుతీరారు. -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ మాల దీక్షల విరమణ
-
కార్తీక పౌర్ణమి: దేదీప్యం.. ఇంద్రవైభోగం
సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): కోటి కార్తిక జ్యోతులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలుగొందింది. పున్నమి చంద్రుడితో పోటీ పడినట్లు.. కృష్ణమ్మ బంగారు తరంగాలను మైమరపిస్తూ దీప కాంతులతో మెరిసిపోయింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ విశిష్ట అతిథిగా విచ్చేశారు. అమ్మవారికి పంచహారతుల అనంతరం స్వా మిజీ పూజలు నిర్వహించి.. రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన కోటి ఒత్తుల భారీ దీపాన్ని వెలిగించారు. ఆలయ మర్యాదలతో స్వామీజీకి స్వాగతం కోటి దీపోత్సవానికి విచ్చేసిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, దుర్గగుడి చైర్మన్ పైలాసోమినాయుడు, ఈవో భ్రమరాంబ సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శనానంతరం రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై స్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. పుష్పాలతో రంగవల్లులు కోటి దీపోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పుష్పాలతో ముగ్గులను తీర్చిదిద్దారు. వివిధ వర్ణాల పుష్పాలతో శ్రీచక్రాన్ని తీరిదిద్ది దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు, మహా గణపతి ప్రాంగణం, మల్లేశ్వర స్వామి వారి ఆలయం, మహా మండప, కనకదుర్గనగర్‌లో దీపాలను ఏర్పాటు చేయగా, భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని దీపార్చన నిర్వహించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జ్వాలా తోరణాన్ని అర్చకులు వెలిగించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు.. సీఎంకు స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సీఎం సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం అంతరాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందజేశారు. (చదవండి: దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ) ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు సీఎంకు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య వైఎస్ జగన్.. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. సీఎం జగన్ తో పాటు దుర్గమ్మను దర్శించుకున్న వారిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని... ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మకు సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించారని తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.6782 కోట్లు ఆసరా అందించారని తెలిపారు. ఎంతమంది విఘ్నాలు తలపెట్టినా.. రాక్షసుల రూపంలో అడ్డుతగిలినా కనకదుర్గమ్మ, వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు సీఎం జగన్‌పై ఉంటాయని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. చదవండి: ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్ర (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజయవాడ: కనక దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్
-
విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్
సాక్షి, విజయవాడ: సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు. అనంతరం నేరుగా ఇంద్రకిలాద్రికి వెళ్లి కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ తరువాత ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా వల్ల ఎంతో మంది అనేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, అందరిని చల్లగా కాపాడాలని ఆ అమ్మవారిని కొరుకున్నా అని తెలిపారు. కాగా కరోనా కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరోగా మారారు సోనూసూద్. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి సాయం అందించి వారి పాలిట దేవుడిగా నిలిచారు. విద్య, వైద్యం, ఉపాధి ఇలా అనేక రకాలుగా సేవలు అందించారు. ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలెండర్లను సప్లై చేశారు. అంతేగాక ఇందుకోసం ఆయన ప్రత్యేకం ఫౌండేషన్ కూడా ప్రారంభించి దాని ద్వారా ప్రజల కోసం విరాళాలు సేకరించి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను సైతం సోనూ సూద్ తన బాధ్యత భావించిన లక్షలాదిమంది అవసరాలు తీర్చి అపర దాన కర్ణుడుగా కీర్తించబడుతున్నారు. దీంతో ఈ రీయల్ హీరోను నేరుగా చూసేందుకు విజయవాడకు ప్రజలు గుంపులుగా తరలివచ్చారు. -
దసరాకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి
-
ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతములు
-
ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ
-
ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
-
ఇంద్రకీలాద్రి పై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
-
భవానీ భక్తులపై కోవిడ్ ఎఫెక్ట్
సాక్షి, విజయవాడ: అమ్మవారి మాల ఎక్కడైతే స్వీకరిస్తారో అక్కడే దీక్ష విరమణ చేయాలని దుర్గగుడి ఈఓ సురేష్ బాబు భక్తులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నదీ స్నానానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. కాగా కోవిడ్ నిబంధనల కారణంగా భవానీ దీక్షా విరమణకు వచ్చే భక్తులకు ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ బ్రేక్ పడింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు భవానీ దీక్షా విరమణ ఆన్లైన్ స్లాట్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ సురేష్ బాబుతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన.. జనవరి 5 నుంచి 9 వరకు భవానీ దీక్షా విరమణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ దృష్ట్యా భవానీ దీక్షకు వచ్చే భక్తులను రోజుకు పది వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. కొండ చుట్టూ గిరి ప్రదక్షణను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ‘‘దీక్షా విరమణ రోజుల్లో రోజుకు 9 వేల మందికి ఉచిత దర్శనం... 100 రూపాయల టిక్కెట్లు 1000 ఆన్లైన్లో అందుబాటులో ఉంచాం. ప్రతిభక్తుడు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సిందే. అమ్మవారి దర్శనానికి వచ్చే సమయంలో ఐడీ తప్పనిసరి. www.kanakadurgamma.org వెబ్సైట్లో టిక్కెట్లు పొందవచ్చు. దీక్షా విరమణ రోజుల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. కాగా రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 6 గంటలకు ఆలయ సిబ్బందితో కలిసి ఆలయ అధికారులు అమ్మవారి గిరిప్రదక్షిణ చేయనున్నారు.(చదవండి: మూడు బ్యారేజీల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు) -
శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడవరోజు దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్బుత ఘట్టం మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీమహాలక్ష్మీ అమితరమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోకస్ధితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టిరూపమైన అమృత స్వరూపాణిగా శ్రీ దుర్గమ్మను మహాలక్ష్మిగా దర్శించవచ్చు. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుంది. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. (చదవండి: నవరాత్రులు.. నవ వర్ణాలు) దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మహాలక్ష్మి రూపంలో కనక దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రీ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే! శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే!! -
దుర్గమ్మకు సారె
-
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ ఫొటోలు
-
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బుధవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు కుంకుమలను సమర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీఎం వైఎస్ జగన్ దుర్గగుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో జగన్‌కు ఘనస్వాగతం పలికారు. కొండమీదకు చేరుకున్న సీఎం జగన్ కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం వస్త్రధారణ పంచెకట్టు, తలపాగా చుట్టి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం జగన్ వెంట మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు పార్థ సారధి, వల్లభనేని వంశీ,అబ్బయ్య చౌదరి, దూలం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. దుర్గగుడి అభివృద్ధికి రూ.70 కోట్లు దుర్గగుడి అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.70 కోట్లు ప్రకటించారని ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. లడ్డూ పోటు, ఘాట్‌రోడ్ అభివృద్ధి, సోలార్ సిస్టమ్‌తో పాటు అభివృద్ధి పనులకు సీఎం నిధులు ప్రకలించారని తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు
సాక్షి, విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రీ సమీపంలో కొండచరియలు బెంబేలెత్తిస్తున్నాయి. కొండమీద మౌనస్వామి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనతో పరుగులు తీశారు. ఇటీవల చిన్న చిన్న రాళ్లు విరిగిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డుపెట్టారు. రెండు మూడు రోజుల్లో అక్కడి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ అధికారులు ముందే హెచ్చరించారు. అయితే బుధవారమే కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంద్రకీలాద్రికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల అప్రమత్తమై సహాయక చర్యలు వేగవంతం చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోగిరమేష్, వసంత కృష్ణ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. -
కనకదుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనం
-
రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫోన్లో సమీక్షించారు. రేపు(బధవారం) ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న సందర్భంగా మంగళవారం మంత్రి ఏర్పాట్లను సమీక్షించారు. దసరా ప్రారంభమై గత మూడు రోజులుగా చేసిన ఏర్పాట్లను భక్తుల విషయంలో తీసుకున్న జాగ్రత్తల గురించి అధికారులను అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు. మంత్రితోపాటు ఈవో సురేష్ బాబు ఇతర అధికారులు ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు: రేపు(బుధవారం) మూల నక్షత్రం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అమ్మవారికి పట్టు వస్త్తాలు సమర్పించనున్నారు. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరన్నారు. మధ్యాహ్నం 3:40 గంటలకు దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం 4 గంటలకు తిరిగి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. -
ఇంద్రకీలాద్రి : గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం
-
ఇంద్రకీలాద్రిపై కొవిడ్ అంక్షలు
-
ఇంద్రకీలాద్రీపై భారీ వర్షం
-
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
-
విగ్రహాలు మాయం కావడం దురదృష్టకరం
-
దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే!
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వెండి రథానికి ఉండాల్సిన మూడు సింహం ప్రతిమలు మాయం కావడంపై భక్తుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. సింహం ప్రతిమలు మాయమైనట్లు ఇప్పుడు బయటపడినప్పటికీ, అవి ఎప్పుడు మాయం అయ్యాయనే అంశంపై విచారణ జరగనుంది. రథంపై అమ్మవారు ఉగాది రోజున, చైత్ర మాసోత్సవాల్లోనూ భక్తులకు దర్శనం ఇస్తారు. 2019 ఏప్రిల్ 6న నిర్వహించిన ఉగాది ఉత్సవాలు తర్వాత ఈ రథాన్ని దేవస్థానం ఉపయోగించలేదు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించలేదు. గతంలో పాలక మండలి హయాంలోనే.. దుర్గగుడికి గత ఏడాది ఉగాది ఉత్సవాల నాటికి చంద్రబాబు ప్రభుత్వం నియమించిన పాలకమండలి ఉంది. ఆ రోజున అమ్మవారి పూజా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత మల్లికార్జున మహామండపం కింద దాన్ని ఉంచి మొత్తం ప్లాస్టిక్ కవర్‌తో కప్పేశారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత పైలా సోమినాయుడు సారథ్యంలో పాలకమండలి ఏర్పటైంది. రథం యథావిధిగా ఉందని భావించారే తప్ప రథం మీద ఉన్న సింహం బొమ్మలు మాయం అవుతాయని అనుమానించలేదు. రథాన్ని పరిశీలించలేదు. గతంలో పాలకమండలి సభ్యులకు, దేవాలయ ఈఓలకు మధ్య సఖ్యత ఉండేది కాదు. దీంతో వారే ప్రతిదాన్ని వివాదస్పదం చేసుకునేవారు. వారిపై అనుమానాలు.. ఇక దుర్గగుడి పరిసరాల్లో టీడీపీ నేతలు కొంతమంది కొన్నేళ్లుగా పాగా వేశారు. వారు ఇంద్రకీలాద్రిపైనే చిరు వ్యాపారం చేసి తర్వాత రూ.కోట్లకు పడగలెత్తి, రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అధికార పార్టీని ముఖ్యంగా దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఇరకాటంలో పెట్టాలని రథంపై సింహాల ప్రతిమలను మాయం చేసి పాపానికి ఒడికట్టారా.. అనే అనుమానాలు దేవస్థానం సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక సంస్థకు గతంలో సెక్యురిటీ బాధ్యతలను అప్పగించారు. ఈ ఏడాది వారి కాంట్రాక్టు పూర్తి కావడంతో తిరిగి వేలం నిర్వహించడంతో మాక్స్ సంస్థ టెండర్ దక్కించుకుంది. అయితే గత సంస్థలో పనిచేసిన అనేక మంది సిబ్బంది మాక్స్ సంస్థలో చేరి ఇక్కడే దుర్గగుడిలో పనిచేస్తున్నారు. తమ ప్రతిష్ట దెబ్బతీయడానికి గత సంస్థలో పనిచేసిన వారు ఎవరైనా ఈ తప్పుడు పని చేశారా? అనే అనుమానం మాక్స్ సెక్యురిటీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే! టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రార్థనా స్థలాలపై ఏ విధమైన భక్తి భావం లేదు. తన హయాంలో దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించారు. 2016లో పుష్కరాల సమయంలో కృష్ణానది ఒడ్డున ఉన్న 40 దేవాలయాలను కూల్చి వేయించారు. అప్పట్లో ఈ కూల్చివేతల్లో ఎంపీ కేశినేని నాని, నాటి కలెక్టర్ అహ్మద్ బాబు కీలకపాత్ర పోషించారు. రామవరప్పాడులో ఉన్న మసీదును కూల్చివేయడంతో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన్ను సంతోష పరచడానికే స్థానిక టీడీపీ నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాలుపడుతున్నారని హిందూ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. రథాన్ని పరిశీలించిన మంత్రి వెలంపల్లి ఇంద్రకీలాద్రికి ఉన్న వెండి రథాన్ని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. పెనుగంచిప్రోలు ఈఓ ఎన్వీఎస్ఎస్ మూర్తిని విచారణాధికారిగా నియమించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఇంద్రకీలాద్రి: ఆషాఢ సారె మహోత్సవం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొలి ఆషాడమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆషాడ మాస సారెను దేవస్థానం తరపున అందజేయటం ఆనందంగా ఉందన్నారు. ఆషాఢంలో ప్రతి ఏడాది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారన్నారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 20 వరకు సారె మహోత్సవం.. వచ్చే నెల 20వ తేదీ వరకు ఆషాఢ సారె మహోత్సవం కొనసాగుతుందని దుర్గ గుడి ఈవో సురేష్‌బాబు తెలిపారు. సారె సమర్పించడానికి వచ్చే భక్తులు ముందుగా ఆన్లైన్లలో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే అమ్మవారికి సారె సమర్పించాలని వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించి, మాస్క్‌లు ధరించాలని కోరారు. గుంపులు గుంపులుగా రావొద్దని భక్తులకు ఈవో సురేష్‌బాబు విజ్ఞప్తి చేశారు.