- హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి విరాళం
విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను విరాళంగా అందజేశారు. ఉత్సవాల్లో తొలిరోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు.
ఇందుకు అవసరమైన స్వర్ణకవచం, బంగారు కిరీటం, ముక్కుపుడక, బొట్టుబిళ్ల, కర్ణాభరణాలు, మంగళసూత్రం, త్రిశూలాన్ని బండి పార్థసారథిరెడ్డి తయారుచేయించారు. శుక్రవారం ఆలయానికి విచ్చేసిన ఆయన తన కుటుంబసభ్యుల చేతులమీదుగా ఆభరణాలను ఈవో సూర్యకుమారికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు. ఈ బంగారు ఆభరణాలు, కవచాన్ని శనివారం అమ్మవారికి అలంకరిస్తారు.
రూ.4.50 కోట్లతో దుర్గమ్మకు ఆభరణాలు
Published Sat, Oct 1 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
Advertisement
Advertisement