kanakadurga
-
రెండో పెళ్లి చేసుకున్న కనకదుర్గ.. ఆమె ఎవరో గుర్తుందా..?
శబరిమల ఆలయ విషయంలో వివాదాస్పద మహిళా కార్యకర్త కనకదుర్గ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తోటి కార్యకర్త విలయోడి శివన్‌కుట్టీని ఆమె పెళ్లాడింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారిద్దరూ తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, కనకదుర్గకు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. అయితే, 2019లో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో కేరళ నిరసనలు, ర్యాలీలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి జనవరి 2, 2019లో ఇద్దరు మహిళా కార్యకర్తలు వెళ్లిన విషయం తెలిసిందే. మహిళా కార్యకర్త కనకదుర్గతో పాటు లాయర్ బిందు అమ్మిని.. ప్రత్యేక భద్రత మధ్య ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. దీంతో, ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న మహిళలు వెళ్లవచ్చు అని సుప్రీం తీర్పు అనంతరం ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో భర్తతో గొడవల కారణంగా కనకదుర్గ విడాకులు తీసుకుంది. 2019 జూన్‌లో ఆమె విడాకులు తీసుకున్నది. శబరిమల వెళ్లి వచ్చిన తర్వాత అత్త తనపై దాడి చేసినట్లు కనకదుర్గ మీడియాతో ఎదుట చెప్పుకొచ్చింది. అనంతరం.. మావో సానుకూల అయ్యంకలి పద గ్రూపులో కామ్రేడ్‌గా చేస్తున్న శివన్‌కుట్టితో పరిచయం అనంతరం వీరిద్దరి మధ్య అంగీకారంతో మంగళవారం వివాహం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి జీవించాలని భావిస్తున్నట్లు శివన్కుట్టి వెల్లడించారు. -
ఆలయ ప్రవేశం తర్వాత ఆమెకు గృహప్రవేశం లేదు
అయ్యప్పస్వామిని దర్శించడంలో సఫలమైన కేరళ స్త్రీ కనకదుర్గ ఇప్పుడు తన ఇంట్లో ప్రవేశించడానికి పెనుగులాడుతోంది.అయ్యప్పని హరిహరసుతుడుగా భక్తులు పూజిస్తారు. విష్ణుమూర్తి, శివుడు పురుషులుగా ఉండగా అయ్యప్ప జన్మ సాధ్యపడలేదు. విష్ణుమూర్తి మోహినీ అవతారం– అంటే స్త్రీ అవతారం దాల్చాకనే అయ్యప్ప జన్మ సాధ్యమైంది. అంటే అయ్యప్ప జన్మలో స్త్రీ ప్రమేయం ఉంది. కాని అయ్యప్ప ఆరాధనలో, దర్శనంలో మాత్రం వయసులో ఉన్న స్త్రీల ప్రవేశం వందల ఏళ్లుగా నిషేధించబడింది.దీని గురించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై దేశంలో భిన్నమైన స్పందనలు వెలువడ్డాయి. రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కు అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశంలో భంగపాటుకు లోనవుతున్నదని, స్త్రీలకు ఆ ఆలయంలో ప్రవేశించే హక్కు సంపూర్ణంగా ఉందని కోర్టు చెప్పింది. ఆ వెంటనే ఎందరో స్త్రీలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించి భక్తుల నిరసనల వల్ల విఫలమయ్యారు. అయితే కేరళకు చెందిన కనకదుర్గ (39), బిందు అమ్మిని (40) జనవరి 2, 2019న శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. పోలీసులు వీరికి సహకరించారు. ఈ విషయం బయటకు తెలిసిన వెంటనే భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆలయాన్ని ప్రధాన అర్చకులు శుద్ధి చేశారు. భద్రతా కారణాల రీత్యా కొన్నాళ్లు అజ్ఞాతంగా ఉన్న ఆ స్నేహితురాళ్లు ఇద్దరూ తిరిగి సామాన్య జీవనంలోకి అడుగు పెట్టే ప్రయత్నం చేశారు. ఆ వివరాలను కనకదుర్గ ఇలా చెబుతోంది.‘మలప్పురం జిల్లాలోని అంగడిపురం మా ఊరు. డిసెంబర్ 22, 2018న నేను మా ఇంటి నుంచి అయ్యప్ప దర్శనం కోసం నా స్నేహితురాలితో బయలుదేరాను. మాకు ఆలయ ప్రవేశం వెంటనే సాధ్యపడలేదు. శబరిమలకు సమీపంలోని ఒక రహస్య ప్రదేశంలో వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు జనవరి 2, 2019న మేము అయ్యప్ప దర్శనం చేసుకున్నాం. స్త్రీల గౌరవం కోసం, సుప్రీం కోర్టు తీర్పు గౌరవం కోసం, దేశంలో స్త్రీల సమానత్వం కోసం మేము ఈ పని చేశాం. కాని ఆ వెంటనే పెద్దస్థాయిలో నిరసన వ్యక్తమైంది. మేము తీవ్రమైన తప్పు చేసినట్టుగా వ్యాఖ్యానాలు వచ్చాయి. అంత తప్పు మేము ఏం చేశాం. చట్టం మాకు కల్పించిన ఒక అవకాశాన్ని వినియోగించుకోవడం తప్పా? దర్శనం అయ్యాక మా భద్రతకోసం కొన్నాళ్లు మళ్లీ ప్రభుత్వం మమ్మల్ని వేరే చోటులో ఉంచింది. జనవరి 15న నేను ఇంటికి చేరుకున్నాను. అయితే ఇంట్లో ప్రవేశానికి నా భర్త, అత్త అడ్డు చెప్పారు. నాకు ఇద్దరు పిల్లలు. వారిని కొద్ది నిమిషాల సేపే నేను చూడగలిగాను. ఎందుకు నేను ఇంట్లోకి రాకూడదు అని ఎదురు ప్రశ్నించినందుకు నా అత్త నా బుర్ర పగుల గొట్టింది. మా ఊరిలోని ఆస్పత్రిలో వైద్యం సరిపోక కోజికోడ్ ఆస్పత్రిలో వారం రోజులు ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా తల తప్పలేక, సరిగ్గా మాట్లాడలేక అవస్థ పడుతున్నాను. నా ఇంట్లో నుంచి నన్ను తరిమేయడానికి నేనేం పాపం చేశాను? కొందరు పెద్దలు నా భర్తతో మాట్లాడితే నేను నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆలోచిస్తానని అన్నాడట. నేను చేసిన పనికి నేను ఎవరికైనా క్షమాపణ చెప్పడం కానీ, ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కానీ చేయను. నేను నా ఇంట్లో ప్రవేశానికి చట్టబద్ధంగా పోరాడతాను. కోర్టుకు వెళతాను’ అని అందామె.అయితే కనకదుర్గ పరిస్థితి పుట్టింట్లోనూ సరిగ్గా లేదు. పుట్టింటికి వెళదామనుకుంటే ఆమె సోదరుడు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ‘వారు నా మీద కోపంగా ఉన్నారు’ అంది కనకదుర్గ. ఆమె ప్రస్తుతం ఒక ప్రభుత్వ హోమ్‌లో ఉంటోంది. మరోవైపు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ‘మూడుసార్లు వెంటవెంటనే తలాక్ చెప్పి స్త్రీకు అన్యాయం చేసిన పురుషుడికి జైలు శిక్ష ఉంటుందని చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం కనకదుర్గ భర్త వంటి వ్యక్తులు ఉన్న పళంగా భార్యను బయటకు గెంటేస్తే వేయాల్సిన శిక్ష గురించి ఎందుకు చట్టం చేయదు’ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవుడు దగ్గరైతే కన్నపిల్లలు దూరమయ్యే పరిస్థితి రావడం కనకదుర్గ ఉదంతంలో కనిపిస్తోంది. సాంస్కృతిక విశ్వాసాలు, చట్టం... వీటి మధ్య సాగుతున్న పోరులో మగ పెత్తనమే పై చేయి కావడం కూడా కనిపిస్తోంది. -
శబరిమలలో ప్రవేశించిన కనకదుర్గకు మరో అవమానం
-
క్షమాపణ చెబితేనే ఇంట్లోకి రానిస్తాం
-
ఆమెను ఇంటి నుంచి గెంటేశారు!
తిరువనంతపురం : అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళగా చరిత్రకెక్కిన కనకదుర్గ కష్టాల్లో చిక్కుకుంది. ఇటీవల ఆమె అత్త కనదుర్గను చితకబాదగా.. ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచే గెంటేశారు. ఆమెను ఇంట్లోకి రానివ్వడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. చేసిన పాపానికి ప్రాయశ్చితం చేసుకొని.. లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు బహిరంగ క్షమాపణ చెబితేనే ఇంట్లోకి రానిస్తామని తెగేసి చెబుతున్నారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా తమ కుటుంబం పరువును కనకదుర్గ గంగలో కలిపిందని.. సమాజంలో తలెత్తుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గ ఇంట్లోకి రావడానికి వీల్లేకుండా.. ఇంటికి తాళం వేసి ఆమె భర్త బంధువుల దగ్గరకు వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంలో పోలీసులు, జిల్లా అధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతం కనకదుర్గ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హోంలో తలదాచుకుంటోంది. జనవరి 2న బిందు (40) అనే మరో మహిళతో కలిసి కనకదుర్గ (39) శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దీంతో అయ్యప్ప సన్నిధానం చేరుకున్న నిషిద్ధ వయసున్న తొలి మహిళల్లో ఒకరిగా ఆమె నిలిచింది. వాస్తవానికి అంతకు ముందే డిసెంబర్ 24 ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా.. భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గారు. దీంతో పోలీసులు రక్షణ మధ్య వారిని ఇళ్లకు పంపించేశారు. మళ్లీ జనవరి 2న ఆలయంలోకి వెళ్లారు. మరోవైపు తిరువనంతపురంలో మీటింగ్ ఉందని అబద్దం చెప్పి శబరిమలకు వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మలప్పురం జిల్లా అరిక్కోడెకు చెందిన కనకదుర్గ దళిత్ యాక్టివిస్ట్. తన స్నేహితురాలు కనకదుర్గను ఇంట్లోకి రానీయకపోవడానికి కొందరి ఒత్తిడే కారణమని, న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని బిందు తెలిపింది. ఇక బిందు కూడా ఈ తరహా వేధింపులు ఎదుర్కొంది. ఆమెకే కాకుండా తన కూతురుకు కూడా ఈ వేధింపులు ఎదురయ్యాయి. ‘నువ్వు మీ అమ్మలా కావద్దు’’అంటున్నారట. మా అమ్మాయి క్లాస్‌లోని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు మా అమ్మాయితో మాట్లాడొద్దని, డిస్టెన్స్ మెయిన్టైన్ చేయమని వాళ్ల పిల్లలకు చెప్తున్నారట. ఈ అవమానంతో మా అమ్మాయి ఇప్పుడు స్కూల్‌కి వెళ్లడానికే ఇష్టపడట్లేదు’’ అని బిందు మీడియాతో ఆవేదన వ్యక్తం చేసింది. -
‘వారికి 24/7 రక్షణ కల్పించండి’
న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు బిందు, కనకదుర్గలకు 24 / 7 రక్షణ కల్పించాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయంలోకి ప్రవేశించినందుకు తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ.. ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు బిందు, కనకదుర్గలకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసింది. ఆడవారిని ఆలయంలోకి ప్రవేశించకుండా ఆందోళనకారులు అడ్డుగిస్తున్నారు. ఈ క్రమంలో బిందు, కనకదుర్గలు ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. కానీ ఆలయంలోకి వెళ్లి వచ్చినప్పటి నుంచి వారికి బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 15న కనకదుర్గ మీద ఆమె అత్త, బంధువలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాంతో బిందు, కనకదుర్గలు తమకు ప్రాణ హాని ఉందని గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఆలయంలోకి వెళ్లాలనుకునే మహిళలకు పోలీసు రక్షణ కల్పించేలా కోర్టు ఆదేశించాలని కోరారు. వీరి పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టాలని వీరి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ను కోరారు. -
మీ అమ్మలా కావద్దు!
బిందు తెలుసుకదా. జనవరి 1న శబరిమల అయ్యప్పను దర్శించుకుని వచ్చిన ఇద్దరు మహిళల్లో ఒకరు. (ఇంకొకరు కనకదుర్గ). దళిత్ యాక్టివిస్ట్. నిజానికి ఆమె అక్టోబర్ నెలలోనే శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించారు. కాని నిరసనకారులు అడ్డుకోవడంతో వెనక్కి తిరిగారు. ఆ నిరసన ఆమెకు దైవర్శనం కానివ్వకుండా అడ్డుకోవడం వరకే ఆగలేదు. బిందు ఇంటిదాకా, ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేవరకూ వెంటాడింది. తొలిసారి దర్శనానికి వెళ్లి విఫలమై వచ్చినప్పటి నుంచే బిందు సంప్రదాయవాదుల వేధింపులను ఎదుర్కొంటూ ఉన్నారు. బిందు కుటుంబం కోళికోడ్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసముంటోంది. ఆ ఇంటి యజమాని ముందస్తు సమాచారం, తగిన సమయం ఇవ్వకుండా అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయించారు. చేసేదిలేక ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకుంటుంటే అక్కడా వేధింపులు తప్పలేదు. అక్కడినుంచీ ఆమె వెళ్లిపోయేలా చేశారు. బిందుకు పదకొండేళ్ల కూతురు ఉంది. ఆ అమ్మాయి ప్రస్తుతం అగాలీ ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుతోంది. వచ్చే యేడాది కోసం కూతురిని విద్యావనమ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేర్పించాలనుకున్నారు బిందు. దాని తాలూకు ఇంటర్వ్యూ, పేరెంట్స్ మీటింగ్‌నూ పూర్తి చేశారు. అమ్మాయికి అడ్మిషన్ ఇస్తున్నాం అని కూడా స్కూల్ యాజమాన్యం కూడా చెప్పింది. మొన్న సోమవారం.. అంటే జనవరి ఎనిమిదో తారీఖున అడ్మిషన్‌కు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తిచేసుకోవాల్సి ఉంది. బిందు స్కూల్‌కి వెళ్లారు.‘‘నా కూతురితో స్కూల్లోకి అడుగుపెట్టాను. అక్కడ దాదాపు అరవై మంది గుమిగూడి ఉన్నారు. వాళ్లంతా స్థానికులు, మగ వాళ్లు. మమ్మల్ని ఏమీ అనలేదు. ప్రిన్సిపల్ రూమ్‌లోకి వెళ్తుంటే కూడా ఏమీ అడ్డుకోలేదు. తీరా లోపలికి వెళ్లాక చూస్తే.. ప్రిన్సిపలే వింతగా ప్రవర్తించారు. ‘‘నేను మీలాగా యాక్టివిస్ట్‌ని కాను. కాని ఎడ్యుకేషనల్ యాక్టివిస్ట్‌ని’’ అంటూ సందర్భంలేకుండా మాట్లాడారు. నేను వెళ్లింది మా అమ్మాయి అడ్మిషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం కోసం. ఆ ఊసెత్తకుండా ప్రిన్సిపల్ ఏవేవో మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది. చివరకు ‘‘మీ అమ్మాయికి అడ్మిషన్ ఇచ్చి ఈ స్కూల్ వాతావరణాన్ని పాడు చేయదలచుకోలేదు మేము’’ అంటూ అసలు సంగతి చెప్పారు. గది నుంచి స్కూల్ ఆవరణలోకి వస్తుంటే ఓ టీచర్ చెప్పారు అక్కడున్న అరవై మంది మగవాళ్లను చూపిస్తూ ‘‘మీ అమ్మాయికి అడ్మిషన్ ఇవ్వద్దని వీళ్లంతా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు’’ అని. పాత స్కూల్లో కూడా టీచర్స్ మా అమ్మాయితో ‘‘నువ్వు మీ అమ్మలా కావద్దు’’అంటున్నారట. మా అమ్మాయి క్లాస్‌లోని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు మా అమ్మాయితో మాట్లాడొద్దని, డిస్టెన్స్ మెయిన్టైన్ చేయమని వాళ్ల పిల్లలకు చెప్తున్నారట. ఈ అవమానంతో మా అమ్మాయి ఇప్పుడా స్కూల్‌కి వెళ్లడానికే ఇష్టపడట్లేదు’’ అని చెప్పారు బిందు. -
పీరియాడిక్
సమానత్వాన్ని మూటకట్టుకుని ఇరుముడిలా నెత్తి పైనేమీ పెట్టుకోవడం లేదు మహిళలు. ఇరుముడిలోని అసమానత్వాన్ని దేవుడి దగ్గర విడిపించుకోవాలని అనుకుంటున్నారంతే. బిందు, కనకదుర్గే అనుకున్నాం. అంతకుముందు జనవరి ఒకటిన తమిళ సంతతి మలేసియా మహిళలు ముగ్గురు, వాళ్లు కాకుండా మరో నలుగురు కూడా గర్భగుడిలోకి వెళ్లొచ్చినట్లు బయటపడింది. బిందు, కనకదుర్గ వెళ్లొచ్చిన మర్నాడు కూడా శ్రీలంక మహిళొకరు దర్శనం చేసుకుని వచ్చారు. అయితే ఈ పది మందిలో బిందు, కనకదుర్గ తప్ప మిగతా వారెవరూ తాము గుడిలోకి ప్రవేశించినట్లు ఒప్పుకోవడం లేదు. బిందు, దుర్గ యాక్టివిస్టులు కనుక సుప్రీం కోర్టే అనుమతి ఇస్తే అడ్డుకోడానికి మీరెవరు అన్నట్లు చొచ్చుకుని వెళ్లొచ్చారు. ఒకవేళ సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోయినా వాళ్లు ఇదే పని చేసి ఉండేవారు. స్త్రీ, పురుషులు సమానమన్నది కోర్టు మాత్రమే చెప్పగలిగిన విషయం కాదు. ‘తమరి దగ్గర తక్కెడ ఉంది కదండీ, కాస్త తూచి చెప్పండి.. అటువైపు ఆడ మనిషి, ఇటు వైపు మగ మనిషి.. ఎవరి బరువు ఎక్కువుందో’ అని మనమే వెళ్లి అడిగాం. ‘ఎవరి బరువు ఎంతున్నా, దేవుడి దగ్గర అందరి బరువూ ఒకటే’ అని కోర్టు తీర్పు చెప్పేసింది. చెప్పి, ఊరుకోలేదు. తీర్పుకు విరుద్ధంగా ఏమైనా జరిగితే శిక్ష ఉంటుంది అని కూడా హెచ్చరించింది. తీర్పు కోసం వెళ్లి శిక్షను తూయించుకొచ్చాం! వేరే గ్రహాల్లో మనిషికి బరువుండదు. దైవం దగ్గరా అంతే. స్వర్గం అనేది కూడా ఒక గ్రహమే అని మనం అనుకుంటే. తీర్పు ఒకటుండబట్టి, ఆ తీర్పును గాఢభక్తులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి.. ఒకటి.. రెండు.. మూడూ.. అని దర్శనం చేసుకున్న యాభై ఏళ్ల లోపు మహిళా భక్తుల్ని లెక్కిస్తున్నాం కానీ, తీర్పుకు ముందు సంవత్సరాల్లో మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకుని ఉండరా?! ఇంతకంటే ఎక్కువమందే ఉండి ఉంటారు. పట్టింపు కోసమే దర్శనానికి వచ్చేవాళ్లెవరూ ఉండరు. ఆ ఒకరిద్దరు పంతం కోసమే వచ్చారనుకున్నా.. తీర్పు తర్వాత అయ్యప్ప దర్శనం కోసం ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న యాభై ఏళ్ల లోపు వయసున్న మహిళల సంఖ్య నాలుగు వేలకు పైగానే ఉంది! అంటే, అయ్యప్ప దర్శనభాగ్యం కోసం ఏళ్లుగా మహిళలు ఎదురు చూస్తున్నారనే కదా. ‘ఘనకార్యమా ఇది! వీళ్లేమైనా చంద్రమండలం మీద కాలు మోపారా?’ ఎందుకింత రాస్తున్నారు, ఎందుకింత చూపిస్తున్నారు?’.. అనే ఆగ్రహాలు, ఆవేశాలు శరణు ఘోషలా ప్రకంపిస్తు న్నాయి. ఘనకార్యమే. చంద్రమండలంపైకి వెళ్లడం కన్నా, మండలపూజా దర్శనానికి వెళ్లి రావడం ఘనకార్యమే. చంద్రుడి పైకి వెళ్లడానికి తోడుగా భూలోకపు పంచభూతాలను తీసుకెళతారు. భూలోకంలో ఉన్న ఈ ‘నిషిద్ధ’ భక్తి మండలాన్ని చేరుకోడానికి మహిళలకు అరచేతుల్లో పెట్టుకుని వెళ్లే ప్రాణాలు తప్ప వేరే తోడు ఉండదు. మరి ఊరుకోవచ్చుగా. దర్శనాన్ని కోరుకుంటున్న మనసు ఊరుకోనిస్తుందా? ఇష్టంలేని పనిని చేయవలసి వచ్చినప్పుడు మనసెంత బాధపడుతుందో, ఇష్టమున్న పనిని చేయకుండా ఉండాల్సి వచ్చినప్పుడూ అంతే బాధపడుతుంది. ఇష్టంలేని పనిని ‘చెయ్యి’ అనడం, ఇష్టమున్న పనిని ‘చెయ్యొద్దు’ అనడం.. ‘నేను నీ కన్నా ఎక్కువ’ అనే భావనలోంచి వచ్చే ఆజ్ఞాపనే. స్త్రీ విషయంలో.. ‘నీ ఇష్టం’ అనే మాట మనకింకా రాలేదు. ఇంత భాషొచ్చి, ఇంత కవిత్వం రాసీ.. ఆమె దగ్గర ‘నీ ఇష్టం’ అనే మాట మనకు నోరు తిరగడం లేదు. శబరిమల వెళ్లొచ్చిన మహిళల్ని అభినందిస్తూ.. ‘విక్టరీ కాదు. పీరియడ్ ఇది’.. అన్నారు శోభా డే. చరిత్రలో ఇదొక ‘ఎర్ర’ గుర్తు అని. కచ్చితంగా. బిందు, దుర్గ సాధించిన విజయాన్ని హిస్టారిక్ విక్టరీ అంటే తక్కువ చేసినట్లే అవుతుంది. ‘పీరియాడిక్’ హిస్టరీ ఇది. శోభా డే స్త్రీవాద రచయిత్రి. స్త్రీ జీవితంలో అనివార్యమైన ఎరుపు రంగు గురించి కదా మన అభ్యంతరాలు. వాటిని నవ్వుతూ తవ్వుతారు ఆవిడ. మగవాళ్ల గుండె జారిపోతుంది. మానవ సంతతికి ఎరుపు, తెలుపు రెండూ అవసరమైనప్పుడు తెలుపు కూడా బ్లీడింగే కదా.. అది మాత్రం పవిత్రమై, రెండోది కాకుండా పోతుందా అని శోభా డే సందేహం. సందేహం కాదు. క్లారిటీ అది. సమానత్వ ప్రదర్శనకు దేవుడి గుడే దొరికిందా అనే మాటలో న్యాయం లేదనలేం. అయితే సమానత్వాన్ని మూటకట్టుకుని ఇరుముడిలా నెత్తి పైనేమీ పెట్టుకోవడం లేదు మహిళలు. ఇరుముడిలోని అసమానత్వాన్ని దేవుడి దగ్గర విడిపించుకోవాలని అనుకుంటున్నారంతే. ఆలయాలకు పద్ధతులుంటాయి నిజమే. ఏ ఇంటికి ఆ పద్ధతి ఉన్నప్పుడు, ఏ ఆలయానికి ఆ పద్ధతి ఉండదా! ఇళ్లల్లో కూడా తమ ఇష్టాలను ఇంటి పద్ధతులకు భిన్నంగా నెరవేర్చుకోకుండా ఏమీ లేరు అమ్మాయిలు. స్వేచ్ఛ, సమానత్వాల కోసం పోరాటం కాదది. గుండె నిండా ఊపిరి తీసుకునే ప్రయత్నం. స్పేస్ సరిపోవడం లేదనిపిస్తే పద్ధతుల్ని పక్కకు తోసేయడం సహజంగా జరిగే పనే. ∙ -
ఆ ఇద్దరూ శబరిమలకు ఎలా వెళ్లారు?
దేవుడి సన్నిధే ఒక అలౌకిక అనుభూతి. దాన్ని ఆస్వాదించడానికే ఆలయానికి వెళ్తాం! రుతుచక్ర వయసులో ఉన్న మహిళల శారీరక శుభ్రత ఆధారంగానే అయ్యప్ప దర్శనం ఆడవాళ్లకు ఇవ్వలేదు. రుతుస్రావం ప్రకృతి ఇచ్చిన ప్రత్యుత్పత్తి ప్రక్రియ. అదే లేకపోతే సృష్టే లేదు అనే తర్కంతో దేవుడి దర్శనం కోసం స్త్రీలు ఉద్యమించారు. సాధించారు. నలభై రెండేళ్ల బిందు అమ్మిని, నలభై ఒక్క ఏళ్ల కనకదుర్గ... చట్టం కల్పించిన హక్కును వినియోగించుకున్నారు. ప్యూబర్టీ రాని, మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్లే శబరిమల అయ్యప్పను దర్శించుకోవాలనే నియమాన్ని సవరించారు. శబరిమల అయ్యప్పను దర్శించుకున్న మొదటి మహిళలు (రుతుక్రమ వయసులో ఉన్న)గా చరిత్ర సృష్టించారు. మొన్న మంగళవారం రాత్రి (ఒకటవ తారీఖు) ఎర్నాకులం నుంచి బయలుదేరి బుధవారం తెల్లవారు జామున శబరిమల ప్రారంభ ప్రాంతమైన పంపానది దగ్గరకు చేరుకున్నారు. అక్కడ పోలీసుల రక్షణతో శబరిమలకు వెళ్లారు. బుధవారం (రెండో తారీఖు) ఉదయం 3 గంటల 45 నిమిషాలకల్లా ఆలయంలోకి అడుగుపెట్టారు. ఆ ఇద్దరి నేపథ్యం బిందు... ఒక యాక్టివిస్ట్. దళిత్ యాక్టివిస్ట్. కన్నూర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్‌లో ప్రొఫెసర్. చిన్నప్పటి నుంచీ బిందు రెబల్. కాలేజీరోజుల్లో కేరళ విద్యార్థి సంఘటన (వామపక్ష విద్యార్థి సంఘం)నాయకురాలిగా పనిచేశారు. కేరళ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. కమిట్మెంట్కు మరోపేరు ఆమె. జెండర్ ఈక్వాలిటీ, సాంఘిక న్యాయ పోరాటాల్లో ముందున్నారు. ఆ విషయాల మీద ఆమె ఇచ్చే ఉపన్యాసాలు వినడం కోసం కేరళలో స్టూడెంట్స్ చెవి కోసుకుంటారు. బిందు వ్యక్తిగత విషయానికి వస్తే ప్రముఖ పొలిటికల్ యాక్టివిస్ట్ హరిరన్ ఆమె భర్త. వాళ్లకు పదకొండేళ్ల కూతురు ఓల్గా. కోజీకోడ్ జిల్లాలోని పోక్కాడ్ ఆమె నివాసం. కనకదుర్గ.. ఓ భక్తురాలు ... కనకదుర్గ నాయర్ కేరళ రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఉద్యోగి. భర్త ఉన్ని కృష్ణన్. ఇంజనీర్. వాళ్లకు ఇద్దరు పిల్లలు. మలప్పరంలో ఉంటారు. ఓ భక్తురాలిగా శబరిమల దర్శనానికి వెళ్లాలనుకున్నారు. బిందు, కనకదుర్గ ఎలా కలిశారు? సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ స్త్రీల ఆలయ ప్రవేశానికి ఇతరత్రా తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే సరికి రహస్యంగా ప్రణాళికలు వేసుకోవాల్సి వచ్చింది. ఆసక్తి ఉన్న మహిళలు కొంత మంది ‘నవోథన కేరళం శబరిమలయిలెక్కు’ అనే ఒక ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేశారు. అలా బిందు, కనకదుర్గ ఒకరికొకరు పరిచయం అయ్యారు. డిసెంబర్ 24న మొదటి ప్రయత్నం చేశారు. ఆలయంలో ఆడవాళ్లకు ప్రవేశం లేదు అని గట్టిగా నమ్మే వారి నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆ దాడి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులు సహా పోలీసులు, మీడియా కంట కూడా పడకుండా ఓ వారం రోజుల పాటు రహస్యంగా ఉండి ఈ నెల ఒకటవ తారీఖున మళ్లీ ప్రయత్నించారు. అలా దైవ దర్శనం సాధించారు. ‘‘దర్శనం అయ్యేదాకా కదిలేది లేదని చాలా మొండిగా ఉన్నాం. దాంతో పోలీసులకు సెక్యూరిటీ కల్పించక తప్పలేదు’’ అని చెప్పారు బిందు. ప్రవేశం కోసం ఇప్పటివరకు ప్రయత్నించిన మహిళలు గుడి తలుపులు తెరిచినప్పటి నుంచి కనీసం పదమూడు మంది మహిళలు దర్శనం కోసం శబరిమల బాట పట్టారు. నీలక్కల్ బేస్‌క్యాంప్ దాకా రాగలిగారు. తర్వాత హేళనకు, హెచ్చరికలకు, దాడులకు గురయ్యి బలవంతంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అలా విఫలయత్నం చేసిన మహిళల్లో మొదటి వ్యక్తి సీఎస్ లిబి. అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నాను అని ఫేస్బుక్లో పోస్ట్‌చేసి మరీ బయలుదేరిన లిబిని గుడికి 65 కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకున్నారు వ్యతిరేకులు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలభై ఏళ్ల మాధవిని పంబ నుంచి వెనక్కి పంపించేశారు భక్తులు. ఢిల్లీకి చెందిన సుహాసినీ రాజ్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. హైదరాబాద్ రిపోర్టర్ కవితా జక్కల్ ‘వాలియ నడప్పాంధాల్’ క్యూకాంప్లెక్స్ వరకూ వెళ్లగలిగింది. కవితాతో కలిసి వెళ్లిన మరో యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా. ఇతర భక్తులు, ఆడవాళ్ల ఎంట్రీని వ్యతిరేకిస్తున్న వాళ్లు గనుక అడ్డుకోకపోయి ఉంటే రెహాన ఫాతిమా చరిత్ర సృష్టించి ఉండేది. రెహానా మీద ఆగ్రహం ఆమెను వెనక్కి పంపించేంత వరకే ఆగలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిని ధ్వంసం చేసేదాకా సాగింది. అంతేకాదు మతసంబంధమైన నమ్మకాలను కించపరిచిందని రెహానా మీద కేసూ నమోదు చేశారు. ఆ తర్వాత మేరీ స్వీటీ అనే తిరువనంతపురం వాసి యత్నమూ ఫలించలేదు. అనంతరం వచ్చిన ఆరుగురు మహిళలనూ అడ్డగించారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 47 ఏళ్ల బాలమ్మ అనే మహిళ వెళ్లింది. నడప్పాంధాల్లో ఆమెనూ అడ్డుకున్నారు భక్తులు. -
సరస్వతి అవతారంలో కనకదుర్గమ్మ
సాక్షి, విజయవాడ: ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహామంటపంలో విద్యార్ధుల కోసం విజయీభవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేయించుకునేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న విద్యార్ధులకు శక్తి కంకణాలతోపాటు పెన్ను, అమ్మవారి చిత్రపటం, కంకుమ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. -
దుర్గమ్మ గుడిలో జరిగింది ఏంటి!
-
కనకదుర్గమ్మ ఆభరణాల చిత్రమాలిక
-
ఇంద్రకీలాద్రిపై మళ్లీ రూ.100 టిక్కెట్టు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి రూ.100 టిక్కెట్‌ను తిరిగి ప్రారంభించారు. గతంలో ధర్మ దర్శనం, రూ.20, రూ.100, రూ.300 దర్శన టిక్కెట్లు ఉండేవి. పుష్కరాలకు ముందు రూ.20, రూ.100 టిక్కెట్ల విక్రయాలను నిలిపివేశారు. దసరా ఉత్సవాల సమయంలో రూ.500 టిక్కెట్టును ప్రవేశపెట్టి భక్తుల వినతుల మేరకు రూ.300కు తగ్గించారు. దర్శనం టిక్కెట్లపై ఆదాయం తగ్గడంతోపాటు పెద్ద నోట్ల రద్దు ప్రభావం కూడా పడింది. దీంతో దర్శన టిక్కెట్లపై ఆదాయం పెంచాలని ఈవో సూర్యకుమారి నిర్ణయించారు. ఈమేరకు రూ.100 దర్శన టిక్కెట్టును ఆదివారం నుంచి ప్రారంభించారు. దీనికోసం కొండమీద ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఒక్కరోజే రూ.100 టిక్కెట్లు పదివేల వరకు అమ్ముడైనట్లు తెలిసింది. వంద టిక్కెట్టుతో ముఖ మండపం ద్వారా దర్శనం చేసుకోవచ్చు. రూ.300 టికెట్టు కొన్నవారికి అంతరాలయ దర్శనంతోపాటు రెండు చిన్న లడ్లు అందజేస్తారు. -
జలోత్సవం.. జన సమ్మోహనం
రేయితోటకు పూసిన విద్యుత్ పూలతో అలంకరించిన రంగురంగుల రాయంచ రథం.. దానిపై చిరునవ్వులు చిందిస్తూ ఆదిదంపతులు ఆశీనులై అలల దారులపై అలాఅలా విహరిస్తుంటే.. ఒడ్డున ఉన్న జనమే కాదు.. జలమూ పులకించిపోయింది. జగదానందకారకమైన ఈ మహోత్సవాన్ని చూసి జాబిలి పరవశించిపోగా, నక్షత్రాలు బాణసంచా టపాసులై జయజయధ్వానాలు పలికాయి. ముక్కోటి దేవతలు ముమ్మారు అమ్మను అనుసరించాయి. దసర ఉత్సవాల్లో చివరి ఘట్టమైన తెప్పోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. విజయవాడ (ఇంద్రకీలాద్రి) : విద్యుద్దీపకాంతులతో దైదీప్యమానంగా వెలిగిపోతున్న హంస వాహనంపై మంగళవారం సాయంసంధ్యవేళ గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్లు నదీవిహారం చేశారు. దుర్గాఘాట్‌లో జరిగిన ఈ సంబరానికి అశేష భక్తజనవాహిని హాజరైంది. ప్రకాశం బ్యారేజీ భక్తులతో కిక్కిరిసింది. తొలుత ఉత్సవమూర్తులకు దుర్గాఘాట్‌లో ఈవో సూర్యకుమారి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఘాట్‌లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తిభావాన్ని చాటాయి. డాక్టర్ పాలపర్తి శ్యామలానందప్రసాద్, దూళిపాళ్ల రామకృష్ణ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుష్కరాల నేపథ్యంలో దుర్గాఘాట్‌ను అభివృద్ధి చేయడంతో ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు ఘాట్‌కు చేరుకుని తెప్పోత్సవాన్ని తిలకించారు. అయితే, కమాండ్ కంట్రోల్ రూమ్ వైపునకు అనుమతించకపోవడంతో ఘాట్ వెలవెలబోయింది. కనులపండువగా ఊరేగింపు తొలుత ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయం నుంచి గంగా పార్వతులతో పాటు మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను పల్లకీపై ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పంచ వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, కోలాటకాలతో ఊరేగింపు కనులపండువగా సాగింది. కలెక్టర్ బాబు.ఏ, సీపీ గౌతమ్ సవాంగ్, ఎంపీ కేశినేని నాని, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, పలువురు పోలీసు అధికారులతో పాటు దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. నదీ విహారం అనంతరం ఉత్సవమూర్తులను బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు వద్దకు తరలించారు. వన్‌టౌన్ పీఎస్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు దంపతులు శమీపూజ నిర్వహించారు. -
శుభంకరి...కాళరాత్రి దుర్గ
మహానంది: రూపంలో భయకంరం ఉన్నప్పటికీ కాళరాత్రి దుర్గ ఎల్లప్పుడు శుభఫలితాలను ఇస్తూ ఉంటుంది. భయంకర రూపంలో ఉన్న శ్రీ కాళరాత్రి దుర్గాదేవి శత్రువులను సంహరిస్తుందని, భక్తులను మాత్రం ఎల్లవేళలా కాపాడుతుంటుందని మహానంది దేవస్థానం వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. మహానంది క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు శ్రీ కాళరాత్రి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండు కుడిచేతులు, రెండు ఎడమచేతులను కలిగిన ఈమె ఒక కుడిచేతిలో వరముద్ర, మరొక కుడిచేతిలో అభయముద్రలను కలిగి భక్తులకు వరాలిస్తుంటుంది. అలాగే ఎడమచేతిలో ఇనుప ముళ్ల ఆయుధం, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్ని ధరించి శత్రువులను సంహరిస్తుంటుందని తెలిపారు. ఉత్సవాల్లో నంద్యాలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అశ్వవాహనంపై గ్రామోత్సవం శ్రీ కాళరాత్రిదుర్గ అమ్మవారిని అశ్వవాహనంపై అధిష్టింపజేసి శుక్రవారం రాత్రి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని శుభంకరీ...నమోస్తుతే అంటూ వేలవందనాలు సమర్పించారు. దేవస్థానం ఈఓ శంకర వరప్రసాద్, ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు
ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. దసరా సందర్భంగా టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్బంగా టీటీడీ తరపున డిప్యూటీ ఈవో బాలాజీ పట్టు వస్త్రాలను దుర్గ గుడి ఆలయ అధికారులకు అందజేశారు. అమ్మవారికి సమర్పించే సమయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. -
శ్రీ లలితాదేవిగా పెద్దమ్మతల్లి
పాల్వంచ రూరల్ : మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శ్రీ దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం శ్రీ లలితాదేవి అవతారంలో పెద్దమ్మతల్లి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో శ్రీ చక్రాఅర్చన, సూర్యనమాస్కార పూజలు నిర్వహించారు. యాగశాలల్లో అర్చకులు హోమ పూజలు నిర్వహించారు. కాగా, శ్రీ దేవిశరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారం కేటీపీఎస్ ఓఅండ్ఎం సీఈ మంగేష్‌కుమార్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్, ఆలయ సూపరింటెండెంట్ సత్యనారాయణ సీఈకి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
రూ.4.50 కోట్లతో దుర్గమ్మకు ఆభరణాలు
- హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి విరాళం విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను విరాళంగా అందజేశారు. ఉత్సవాల్లో తొలిరోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఇందుకు అవసరమైన స్వర్ణకవచం, బంగారు కిరీటం, ముక్కుపుడక, బొట్టుబిళ్ల, కర్ణాభరణాలు, మంగళసూత్రం, త్రిశూలాన్ని బండి పార్థసారథిరెడ్డి తయారుచేయించారు. శుక్రవారం ఆలయానికి విచ్చేసిన ఆయన తన కుటుంబసభ్యుల చేతులమీదుగా ఆభరణాలను ఈవో సూర్యకుమారికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు. ఈ బంగారు ఆభరణాలు, కవచాన్ని శనివారం అమ్మవారికి అలంకరిస్తారు. -
దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
విజయవాడ: నగరంలోని కనకదుర్గ అమ్మవారిని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో చినరాజప్పకు దేవస్థానం ఈవో స్వాగతం పలికారు. అనంతరం బెంజిసర్కిల్‌లో జరుగుతున్న విశ్వశాంతి ఉద్గీద మహామృత్యుంజయ హోమం కార్యక్రమంలో చినరాజప్ప దంపతులు పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. -
పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు
-
వడ్డీ వ్యాపారి వేధింపులు: మహిళ ఆత్మహత్య
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని జేఎస్ఎన్ కాలనీకి చెందిన కనకదుర్గ(43) అనే మహిళ వడ్డీవ్యాపారుల వేధింపులకు తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంచిలి మండలానికి చెందిన వెంకట లక్ష్మీ అనే వడ్డీ వ్యాపారి వద్ద ఇంటి పత్రాలు కుదువపెట్టి రూ. 5 లక్షల అప్పు తీసుకుంది. ఇప్పటి దాకా రూ. 7 లక్షల రూపాయల దాకా అసలు, వడ్డీ చెల్లించినా వడ్డీ వ్యాపారులు పత్రాలు ఇవ్వకపోగా ఇంకా డబ్బు కట్టాలని వేధించడంతో మనస్థాపానికి గురైన కనకదుర్గ బుధవారం ఉదయం బాత్రూమ్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా అప్పటితే మృతి చెందింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణలు
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్ష పరుల రద్దీ మొదలైంది. ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణ గురువారం ఉదయం ఏడుగంటల నుంచి ప్రారంభమైంది. ఐదు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాన్ని మహామంటపం సమీపంలోని హోమగుండం వెలిగించి అగ్నిప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో న ర్సింగరావు దంపతులు, అర్చకులు పాల్గొన్నారు. ఇప్పటికే దాదాపు 10వేల మంది దీక్ష ధారులు క్యూల్లో వేచి ఉన్నారు. -
దుర్గమ్మకు టీటీడీ పట్టు వస్త్రాలు
ఇంద్రకీలాద్రి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మంగళవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. దసరా సందర్భంగా టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ అర్చకులతో కలసి దుర్గమ్మ ఆలయానికి వచ్చారు. వారికి దేవస్థానం ఈవో నర్సింగరావు స్వాగతం పలికారు. అమ్మవారికి టీటీడీ తరఫున పట్టు చీర, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. చదలవాడకు ఈవో నర్సింగరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. -
రెండు తలల వింత శిశువు
మార్కాపురం (ప్రకాశం): రెండు తలలు, మూడు కాళ్లు, మూడు చేతులతో ఓ వింత శిశువు జన్మించి వెంటనే కన్నుమూసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడుకు చెందిన కాకర్ల భూలక్ష్మి రెండో కాన్పు కోసం శనివారం సాయంత్రం మార్కాపురం పట్టణంలోని శ్రావణి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో చేరింది. చేరిన వెంటనే నొప్పులు రావడంతో వైద్యురాలు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ కాన్పు చేశారు. పుట్టిన శిశువుకు రెండు తలలు, మూడు కాళ్లు, మూడు చేతులు ఉన్నాయి. పుట్టిన వెంటనే శిశువు మరణించినట్లు డాక్టర్ కనకదుర్గ తెలిపారు. వైద్య పరిభాషలో కన్జాయింట్ ట్విన్స్ అంటారని వివరించారు. లోపల రెండు పిండాలు విడిపోకుండా ఒకటిగా ఉండటం వల్లే ఇలాంటి జననం సంభవించిందని తెలిపారు. సాధారణంగా అయితే కవలలు పుట్టేవారన్నారు. -
దుర్గమ్మకు 8 టన్నుల కూరగాయలు
ఇంద్రకీలాద్రి: శాకంబరి ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని వ్యాపారులు 8 టన్నుల కూరగాయాలను విరాళంగా ఇచ్చారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో మరి కొద్ది సేపట్లో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మూడు రోజుల పాటు భక్తులు అమ్మవారికి కూరగాయలను, ఆకుకూరలను కానుకలుగా సమర్పించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. వేకువజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.