మార్కాపురం (ప్రకాశం): రెండు తలలు, మూడు కాళ్లు, మూడు చేతులతో ఓ వింత శిశువు జన్మించి వెంటనే కన్నుమూసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడుకు చెందిన కాకర్ల భూలక్ష్మి రెండో కాన్పు కోసం శనివారం సాయంత్రం మార్కాపురం పట్టణంలోని శ్రావణి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో చేరింది. చేరిన వెంటనే నొప్పులు రావడంతో వైద్యురాలు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ కాన్పు చేశారు.
పుట్టిన శిశువుకు రెండు తలలు, మూడు కాళ్లు, మూడు చేతులు ఉన్నాయి. పుట్టిన వెంటనే శిశువు మరణించినట్లు డాక్టర్ కనకదుర్గ తెలిపారు. వైద్య పరిభాషలో కన్‌జాయింట్ ట్విన్స్ అంటారని వివరించారు. లోపల రెండు పిండాలు విడిపోకుండా ఒకటిగా ఉండటం వల్లే ఇలాంటి జననం సంభవించిందని తెలిపారు. సాధారణంగా అయితే కవలలు పుట్టేవారన్నారు.
రెండు తలల వింత శిశువు
Published Sun, Aug 16 2015 6:53 PM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM
Advertisement
Advertisement