
అతనొక టైలర్. వృత్తి చేసుకుంటూ జీవనం సాగించడానికి ఒక ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అంతా ప్రశాంతంగానే గడిచింది. తిరిగి సొంతూరికి వచ్చిన తర్వాత ఒక మహిళతో వివాహేతర సంబంధానికి దారి తీయగా, అ సంబంధం కాస్తా ఇప్పుడు అతన్ని ప్రాణాలు తీసింది. చాలా కాలం ఆమెతో వివాహేతర బంధాన్ని కొనసాగించిన సదరు వ్యక్తి.. ఆమె బ్లాక్ మెయిలింగ్ కు బలయ్యాడు. ఆమె వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతున్న విషయాన్ని ఆమెకు వీడియో కాల్ లో తెలిపి మరీ చనిపోయాడు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావ్ జిల్లాకు చెందిన అల్తాఫ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని థానేలో టైలర్ గా జీవనం సాగిస్తున్నాడు. గతేడాది తన తల్లి చనిపోయినప్పుడు ఇంటికి వచ్చిన అల్తాఫ్.. ఆపై థానేకు తిరిగి వెళ్లిపోయాడు. అయితే అతని కుటుంబ సభ్యులు ఇక్కడే(థానే)లో పని చేసుకోమని చెప్పడంతో అక్కడకు తిరిగి వచ్చేశాడు. ఈ క్రమంలోనే సమీప బంధువులైన ఒక మహిళతో అల్తాఫ్ కు వివాహేతర బంధం ఏర్పడింది. అయితే మహిళతో వివాహేతర సంబంధాన్ని గ్రహించిన అతని కుటుంబ సభ్యులు.. తిరిగి థానేకు పంపించేశారు.
అయినప్పటికీ ఆ మహిళ.. అతన్ని ఫోన్ లో వేధింపులకు గురి చేసింది. తాను కడుపుతో ఉన్నానని, రూ. 10 వేల నుంచి లక్ష వరకూ పంపాలంటూ డిమాండ్ చేసిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసు బనాయించిన సదరు మహిళ.. డబ్బుల కోసం వేధించేదని అల్తాఫ్ సోదరి అంటోంది. జైలుకు పంపుతానని బెదిరింపులకు గురి చేయడంతోనే తన సోదరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని సోదరి రేష్మ స్పష్టం చేసింది.
చనిపోతున్నానని చెప్పినా..
తాను చనిపోయే ముందు వివాహేత బంధం కొనసాగించిన మహిళకు వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, నీ వేధింపులు భరించలేక చనిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ‘చనిపోతే చనిపో.. నాకేమీ నష్టం లేదు. నాకు భర్త ఉన్నాడు. నువ్వు చనిపోవడం వల్ల నేనేమీ కోల్పోను’ అని చెప్పినట్లు వీడియో కాల్ లో రికార్డు అయ్యింది.
నేను విషం తీసుకుంటున్నా. నేనేమీ డ్రామా ఆడటం లేదు. నేను బాధలో ఉన్నా. నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నీవల్ల నా జీవితాన్ని ఇక్కడితో ముగిస్తున్నా’ అంటూ మరొక వీడియో కాల్ లో రికార్డు అయ్యింది.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment