Child born
-
కడుపులో ఉండగానే.. బిడ్డ అమ్మకానికి ఒప్పందం?
నిజామాబాద్: అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటనలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. ఏసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గోసంగి దేవీ ఈ నెల 3న మగబిడ్డకు జన్మనిచ్చింది. పోషించేస్థాయి లేనందున ఆశావర్కర్ జయ సహకారంతో బిడ్డను విక్రయించేందుకు సిద్ధమైంది. అదే ప్రాంతానికి చెందిన హుమేరా బేగం, షబానా బేగంలు మగబిడ్డ పుడితే రూ. లక్ష, ఆడబిడ్డ పుడితే రూ. 1.50లక్షలు ఇస్తామని దేవీతో ఒప్పందం చేసుకున్నారు. ముందుగా ఒకరికి తెలియకుండా మరొకరు రూ. ఐదు వేలు చొప్పున దేవీకి ఇచ్చారు. ఈ నెల 3న నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలో షబానా బేగం రూ. 20 వేలు చెల్లించింది. దీంతో పుట్టిన బిడ్డ తనకే కావాలంటూ షబానా బేగం, హుమేరా బేగం నగరంలోని రాధాకృష్ణ థియేటర్వద్ద ఆశావర్కర్ జయతో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని పీఎస్‌కు తరలించారు. బిడ్డను విక్రయించేందుకు సిద్ధమైన తల్లి దేవీని, విక్రయానికి సహకరించిన ఆశా వర్కర్ జయను, కొనుగోలు యత్నించిన హుమేరాబేగం, షబానాబేగంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో నగర సీఐ నరహరి, ఎస్సై ప్రవీణ్‌కుమార్, ఏఎస్సై లీలాకృష్ణ, కానిస్టేబుళ్లు అప్సర్, చాందిమి, సుమలత ఉన్నారు. -
Tamilnadu: ఆ బిడ్డకు నేనే తండ్రిని.. ఇద్దరు యువకుల ఘర్షణ
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): వివాహితతో ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆమె గర్భం దాల్చడంతో నేనంటే నేనే తండ్రిని అని గొడవపడ్డారు. కత్తితో దాడి చేయడంతో ఒకరు మృతిచెందారు. వివాహేతర సంబంధం ఎప్పటికైనా విషాదాంతం అవుతుందని తెలిపే ఈ ఘటన సేలం జిల్లాలో జరిగింది. వివరాలు.. అయోధ్య పట్టణం రామ్‌నగర్ కాలనీకి చెందిన మురుగేశన్ రెండో భార్య కలైమణి (23)కి అదే ప్రాంతానికి చెందిన కలై అరసన్(23), కృపై రాజ్(23)తో ఒకరికి తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో కలైమణి గర్భం దాల్చింది. శుక్రవారం ఈ విషయం ఇద్దరు ప్రియులకు తెలియడంతో గొడవపడ్డారు. కడుపులోని బిడ్డకు నేనంటే నేనే తండ్రిని అని వాదించుకున్నారు. ఆగ్రహించిన కలైఅరసన్ కత్తితో కృపైరాజ్‌పై దాడి చేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కలైమణి, కలై అరసన్‌లను అరెస్టు చేశారు. చదవండి: నిఖా అయిన నిమిషానికే ప్రియుడితో పెళ్లికూతురు పరార్! -
రెండు తలల వింత శిశువు
మార్కాపురం (ప్రకాశం): రెండు తలలు, మూడు కాళ్లు, మూడు చేతులతో ఓ వింత శిశువు జన్మించి వెంటనే కన్నుమూసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడుకు చెందిన కాకర్ల భూలక్ష్మి రెండో కాన్పు కోసం శనివారం సాయంత్రం మార్కాపురం పట్టణంలోని శ్రావణి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో చేరింది. చేరిన వెంటనే నొప్పులు రావడంతో వైద్యురాలు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ కాన్పు చేశారు. పుట్టిన శిశువుకు రెండు తలలు, మూడు కాళ్లు, మూడు చేతులు ఉన్నాయి. పుట్టిన వెంటనే శిశువు మరణించినట్లు డాక్టర్ కనకదుర్గ తెలిపారు. వైద్య పరిభాషలో కన్జాయింట్ ట్విన్స్ అంటారని వివరించారు. లోపల రెండు పిండాలు విడిపోకుండా ఒకటిగా ఉండటం వల్లే ఇలాంటి జననం సంభవించిందని తెలిపారు. సాధారణంగా అయితే కవలలు పుట్టేవారన్నారు. -
ఐదు కిలోల బరువుతో బాలిక జననం
శృంగవరపుకోట:విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వాస్పత్రిలో శనివారం ఉదయం ఓ మహిళ 5 కిలోల బరువు కలిగిన పాపకు జన్మిచ్చింది. లక్కవరపుకోట మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన ముల్లవరపు సంతోషి అనే గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం 6 గంటలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉదయం 6.30గంటల సమయంలో ఆమెకు సాధారణ ప్రసవం జరిగి, ఐదు కిలోల బరువు ఉన్న ఆడపిల్ల జన్మిం చింది. శిశువు బరువు ఎక్కువగా ఉండడంతో విస్మయం చెందిన వైద్యులు పరీక్షలు చేశారు. అన్నివిధాలా బిడ్డ, తల్లీ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సంతోషికి మూడేళ్ల క్రితం తొలి కాన్పులో సాధారణ ప్రసవం జరిగి 3.5 కిలోల బరువుతో మగబిడ్డ పుట్టాడు. ప్రస్తుతం రెండవ కానుపులో పుట్టిన శిశువు బరువు ఐదు కిలోలు ఉండడం పట్ల ఆస్పత్రి ఇన్చార్జ్ దిలీప్‌కుమార్, డాక్టర్ ఎం.హరిలు మాట్లాడుతూ సాధారణంగా సరాసరి 2.8కిలోల బరువుతో శిశుజననాలు నమోదవుతాయి. ఇంతవరకూ 4కిలోల బరువు ఉన్న వారిని చూశాం. కొన్ని కేసుల్లో మధుమేహం, హైపోథైరాయిడ్, జన్యుపరమైన సమస్యలు ఉన్న వారిలో అధిక బరువుతో బిడ్డ పుట్టడం జరుగుతుందని చెప్పారు. తల్లి, బిడ్డలకు షుగర్ టెస్ట్ చేయిస్తే, మధుమేహం లేదని తేలింది. ైథైరాయిడ్ పరీక్షలతో పాటూ బిడ్డ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపేందుకు, పూర్తి వివరాలు తెలుసుకోవటానికి విశాఖ కేజీహెచ్‌కు ప్రత్యేకంగా రిఫర్ చేస్తామంటూ చెప్పారు. పుట్టిన బిడ్డ బొద్దుగా, ఎర్రగా ఉండటంతో వార్డులో మహిళలు, వైద్య సిబ్బంది బిడ్డను అపురూపంగా చూస్తూ ఎత్తుకుని ముద్దాడుతున్నారు.