Extra Marital Affair Leaves Tragedy in Tamilnadu - Sakshi
Sakshi News home page

Tamilnadu: వివాహితతో ఇద్దరు యువకుల వివాహేతర సంబంధం..

Published Sun, Sep 19 2021 11:20 AM | Last Updated on Sun, Sep 19 2021 3:44 PM

Extra Marital Affair Tragedy In Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): వివాహితతో ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆమె గర్భం దాల్చడంతో నేనంటే నేనే తండ్రిని అని గొడవపడ్డారు. కత్తితో దాడి చేయడంతో ఒకరు మృతిచెందారు. వివాహేతర సంబంధం ఎప్పటికైనా విషాదాంతం అవుతుందని తెలిపే ఈ ఘటన సేలం జిల్లాలో జరిగింది. వివరాలు.. అయోధ్య పట్టణం రామ్‌నగర్‌ కాలనీకి చెందిన మురుగేశన్‌ రెండో భార్య కలైమణి (23)కి అదే ప్రాంతానికి చెందిన కలై అరసన్‌(23), కృపై రాజ్‌(23)తో ఒకరికి తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ క్రమంలో కలైమణి గర్భం దాల్చింది. శుక్రవారం ఈ విషయం ఇద్దరు ప్రియులకు తెలియడంతో గొడవపడ్డారు. కడుపులోని బిడ్డకు నేనంటే నేనే తండ్రిని అని వాదించుకున్నారు. ఆగ్రహించిన కలైఅరసన్‌ కత్తితో కృపైరాజ్‌పై దాడి చేసి హత్య చేశాడు.  సమాచారం అందుకున్న పోలీసులు కలైమణి, కలై అరసన్‌లను అరెస్టు చేశారు.   

చదవండి: నిఖా అయిన నిమిషానికే ప్రియుడితో పెళ్లికూతురు పరార్‌!
      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement