ప్రతీకాత్మక చిత్రం
వేలూరు(తమిళనాడు): వివాహేతర సంబంధం కొనసాగించేందుకు నిరాకరించిందని వితంతు మహిళను హత్య చేసిన ఘటన వేలూరు జిల్లాలో జరిగింది. అనకట్టు తాలుకా వాయపందల్ గ్రామానికి చెందిన మలర్(28) భర్త వినోద్‌కుమార్ కొద్ది నెలల క్రితం మృతిచెందాడు. ఐదేళ్ల కుమారుడితో కలిసి అదే ప్రాంతంలో ఉంటోంది. ఈ నెల 17వ తేదీ వితంతు పింఛన్ కోసం వెళ్లిన మలర్ తిరిగి ఇంటికి రాలేదు.
బుధవారం సాయంత్రం అటవీ ప్రాంతంలో మృతదేహంగా కనిపించింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనకట్టు పోలీసులు విచారణ చేపట్టారు. హత్య కేసులో అదే గ్రామానికి చెందిన షణ్ముగం(30)ను అరెస్ట్ చేసి విచారణ జరిపారు. అందులో షణ్ముగంకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మలర్ భర్త మృతి చెందడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఉల్లాస జీవితాన్ని అనుభవించారు.
ఈ విషయం గ్రామంలో తెలియడంతో గ్రామ పెద్దలు ఇద్దరిని హెచ్చరించి పంపారు. అయినా షణ్ముగం మలర్‌ను వదలకుండా వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈనెల 17వ తేదీ దారిలో వస్తున్న మలర్‌ను రమ్మని పిలవడంతో ఆమె నిరాకరించారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. షణ్ముగం పక్కనే ఉన్న రాతిని మలర్ తలపై వేసి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
చదవండి: వివాహేతర సంబంధం.. ఆ టైంలో గడిపిన వీడియోను ఆమె భర్తకు పంపి..
Comments
Please login to add a commentAdd a comment