
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను ఓ పూజారి హత్య చేశాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పూజారి సాయికృష్ణ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇది వరకే అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు కాగా, అప్సర అనే మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
సరూర్ నగర్ నుంచి మహిళను కారులో ఎక్కించుకొని వచ్చిన సాయికృష్ణ.. శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోదీ హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కవర్‌లో కట్టి కారులో తీసుకెళ్లి మ్యాన్ హోల్‌లో పడేశాడు. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్‌జీఐ ఏ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు పోలీసులు బయటపెట్టారు. నిందుతుడికి ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉందని, ఈనెల 3 తేదీన హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: హైదరాబాద్ యువతి హత్య కేసు.. అపార్ట్‌మెంట్‌లో ఆ రోజు ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment