చెన్నై: కాంగ్రెస్‌లో మహిళలకు చోటు లేదని తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తమిళనాడు ఎమ్మెల్యే విజయ వర్థిని అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గత 14 ఏళ్లుగా ఉన్న ఒకే ఒక మహిళా ఎమ్మెల్యేను నేను. నన్ను కూడా పార్టీలో నుంచి వెళ్లకుండా ఆ పార్టీ ఆపలేకపోయింది.
దీన్ని బట్టే ఆ పార్టీ ఎలా పనిచేస్తోందో అర్థమవుతోంది. ఒక మహిళ ఎమ్మెల్యే పదవి దగ్గరే ఎందుకు ఆగిపోవాలి. బీజేపీ మహిళలకోసం ఎంతో చేస్తోంది. ఆపార్టీ తరపున పార్లమెంట్‌లో మహిళా ఎంపీలు చాలా మంది ఉన్నారు. బీజేపీ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు ఇచ్చింది. త్రిపుల్ తలాక్‌ను రద్దు చేసింది.
ముస్లిం మహిళలు కేవలం బీజేపీకే ఓటు వేస్తారు’అని విజయవర్థిని అన్నారు. కన్యాకుమరి జిల్లాలో విల్వన్‌కోడ్ నియోజకవర్గం నుంచి 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవర్థిని ఎమ్మెల్యేగా గెలిచారు. శనివారం(ఫిబ్రవరి 24)న ఆమె కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment