దుర్గమ్మకు టీటీడీ పట్టు వస్త్రాలు | ttd offers silk fabrics to durgamma | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు టీటీడీ పట్టు వస్త్రాలు

Published Tue, Oct 20 2015 3:04 PM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

ttd offers silk fabrics to durgamma

ఇంద్రకీలాద్రి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మంగళవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. దసరా సందర్భంగా టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది.

ఇందులో భాగంగా చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ అర్చకులతో కలసి దుర్గమ్మ ఆలయానికి వచ్చారు. వారికి దేవస్థానం ఈవో నర్సింగరావు స్వాగతం పలికారు. అమ్మవారికి టీటీడీ తరఫున పట్టు చీర, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. చదలవాడకు ఈవో నర్సింగరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement