అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళగా చరిత్రకెక్కిన కనకదుర్గ కష్టాల్లో చిక్కుకుంది. ఇటీవల ఆమె అత్త కనదుర్గను చితకబాదగా.. ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచే గెంటేశారు. ఆమెను ఇంట్లోకి రానివ్వడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. చేసిన పాపానికి ప్రాయశ్చితం చేసుకొని.. లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు బహిరంగ క్షమాపణ చెబితేనే ఇంట్లోకి రానిస్తామని తెగేసి చెబుతున్నారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా తమ కుటుంబం పరువును కనకదుర్గ గంగలో కలిపిందని.. సమాజంలో తలెత్తుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గ ఇంట్లోకి రావడానికి వీల్లేకుండా.. ఇంటికి తాళం వేసి ఆమె భర్త బంధువుల దగ్గరకు వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంలో పోలీసులు, జిల్లా అధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతం కనకదుర్గ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హోంలో తలదాచుకుంటోంది.
కనకదుర్గను ఇంటి నుంచి గెంటేసిన అత్తింటివారు
Published Wed, Jan 23 2019 12:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement