శబరిమల ఆలయ విషయంలో వివాదాస్పద మహిళా కార్యకర్త కనకదుర్గ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తోటి కార్యకర్త విలయోడి శివన్‌కుట్టీని ఆమె పెళ్లాడింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారిద్దరూ తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, కనకదుర్గకు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.
అయితే, 2019లో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో కేరళ నిరసనలు, ర్యాలీలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి జనవరి 2, 2019లో ఇద్దరు మహిళా కార్యకర్తలు వెళ్లిన విషయం తెలిసిందే. మహిళా కార్యకర్త కనకదుర్గతో పాటు లాయర్ బిందు అమ్మిని.. ప్రత్యేక భద్రత మధ్య ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. దీంతో, ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కాగా, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న మహిళలు వెళ‍్లవచ్చు అని సుప్రీం తీర్పు అనంతరం ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో భర్తతో గొడవల కారణంగా కనకదుర్గ విడాకులు తీసుకుంది. 2019 జూన్‌లో ఆమె విడాకులు తీసుకున్నది. శబరిమల వెళ్లి వచ్చిన తర్వాత అత్త తనపై దాడి చేసినట్లు కనకదుర్గ మీడియాతో ఎదుట చెప్పుకొచ్చింది. అనంతరం.. మావో సానుకూల అయ్యంకలి పద గ్రూపులో కామ్రేడ్‌గా చేస్తున్న శివన్‌కుట్టితో పరిచయం అనంతరం వీరిద్దరి మధ్య అంగీకారంతో మంగళవారం వివాహం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి జీవించాలని భావిస్తున్నట్లు శివన్‌కుట్టి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment