
శబరిమల అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోతోంది. భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో అయ్యప్ప కొండ కిటకిటలాడుతోంది. నిన్న ఒక్కరోజే(ఆదివారం) సుమారు లక్ష మంది అయ్యప్పను దర్శించుకున్నారు. లక్షమంది దర్శనం చేసుకున్నా.. క్యూలైన్ మళ్లీ అలానే కనిపిస్తుండటం శబరిమలలో భక్తుల రద్దీకి నిదర్శనంగా కనబడుతోంది.
పంబ నుంచి శబరిమల కొండకు వెళ్లేందుకు 10 గంటల సమయం పడుతుండటంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు ఉన్నా అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు అన్నదానం, మంచి నీటి సౌకర్యాలతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment