విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి రూ.100 టిక్కెట్‌ను తిరిగి ప్రారంభించారు. గతంలో ధర్మ దర్శనం, రూ.20, రూ.100, రూ.300 దర్శన టిక్కెట్లు ఉండేవి. పుష్కరాలకు ముందు రూ.20, రూ.100 టిక్కెట్ల విక్రయాలను నిలిపివేశారు. దసరా ఉత్సవాల సమయంలో రూ.500 టిక్కెట్టును ప్రవేశపెట్టి భక్తుల వినతుల మేరకు రూ.300కు తగ్గించారు.
దర్శనం టిక్కెట్లపై ఆదాయం తగ్గడంతోపాటు పెద్ద నోట్ల రద్దు ప్రభావం కూడా పడింది. దీంతో దర్శన టిక్కెట్లపై ఆదాయం పెంచాలని ఈవో సూర్యకుమారి నిర్ణయించారు. ఈమేరకు రూ.100 దర్శన టిక్కెట్టును ఆదివారం నుంచి ప్రారంభించారు. దీనికోసం కొండమీద ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఒక్కరోజే రూ.100 టిక్కెట్లు పదివేల వరకు అమ్ముడైనట్లు తెలిసింది. వంద టిక్కెట్టుతో ముఖ మండపం ద్వారా దర్శనం చేసుకోవచ్చు. రూ.300 టికెట్టు కొన్నవారికి అంతరాలయ దర్శనంతోపాటు రెండు చిన్న లడ్లు అందజేస్తారు.
ఇంద్రకీలాద్రిపై మళ్లీ రూ.100 టిక్కెట్టు
Published Tue, Nov 29 2016 8:25 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
Advertisement
Advertisement