3న దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం | Telangana Bangaru Bonam to Offer Goddess Kanaka Durga on July 3 | Sakshi
Sakshi News home page

3న దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

Jun 23 2022 6:42 PM | Updated on Jun 23 2022 6:42 PM

Telangana Bangaru Bonam to Offer Goddess Kanaka Durga on July 3 - Sakshi

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ జూలై 3న ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనుంది.

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ జూలై 3న ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనుంది. కమిటీ సభ్యులు బుధవారం విజయవాడలో దుర్గగుడి ఈవో భ్రమరాంబతో సమావేశమై చర్చించారు.

కార్యక్రమ వివరాలను ఆలయ ఈవో, ఇంజనీరింగ్‌ అధికారులకు వివరించారు. ఈ ఏడాది బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు కమిటీ ప్రతినిధులు ఈవోకు వివరించారు. ఈవోను కలిసిన వారిలో వైస్‌ చైర్మన్‌  ఆనందరావు, గాజుల అంజయ్య, మధుసూదన్‌గౌడ్, అన్సరాజ్‌ తదితరులున్నారు. (చదవండి: అమ్మవారి హుండీల్లో ఫారిన్‌ కరెన్సీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement