Kanaka Durgamma
-
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రేణూ దేశాయ్, యాంకర్ రవి (ఫోటోలు)
-
కనకదుర్గమ్మకు వజ్ర కిరీటం సమర్పించిన అజ్ఞాత భక్తుడు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి పై ఘనంగా వసంత నవరాత్రి ఉగాది మహోత్సవాలు
-
చదువుల తల్లి సరస్వతిగా జగన్మాత
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఆదివారం జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. త్రిశక్తి స్వరూపిణి నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తూ శ్వేత దండ, కమండలం ధరించి అభయ ముద్రలో శ్రీ సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. అందుకే చదువుల తల్లిగా కొలువుదీరిన దుర్గమ్మను రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. శనివారం రాత్రికే క్యూలైన్లు నిండిపోయాయి. అమ్మవారి దర్శనం ఆదివారం తెల్లవారు జామున 1.10 గంటల నుంచే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు 2.30 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక కుంకుమార్చనలు, పిల్లలకు అక్షరాభ్యాసాలు జరిగాయి. అమ్మవారి నగరోత్సవం కనుల పండువగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడి కళాకారులు తమ నాట్య విన్యాసాలతో అలరించారు. నేడు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం కాగా, సోమవారం దుర్గాదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోక కంటకుడైన దుర్గమాసురిడిని వధించిన అమ్మవారు దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై ఆవిర్భవించారు. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుంది. శరన్నవరాత్రులందు దుర్గాదేవిని అర్చించడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో భాగంగా సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మను డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్లారు. అక్కడ అర్చకస్వాములు అమ్మవారికి పూజలు చేయించారు. ఆశీర్వాద మండపంలో వేద పండితులు డీజీపీకి ఆశీస్సులందించారు. -
బెజవాడ కనక దుర్గమ్మ దసరా అలంకారాలు... నైవేద్యాలు
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు శక్తి ఆలయాలన్నింటా అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి అంగరంగవైభవంగా, అత్యంత సంప్రదాయబద్ధంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆ చల్లని తల్లి భక్తులకు రోజుకో అలంకారంలో దర్శనం ఇస్తుంది. వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడినుంచో విచ్చేస్తారు. అయితే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అవతరించిన దుర్గాదేవికి చేసే అలంకారాలకే ఎనలేని ప్రాధాన్యం ఉంది. అందుకే విజయవాడ కనకదుర్గమ్మ దసరా అలంకారాలను అందిస్తున్నాం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో బెజవాడ కనక దుర్గమ్మ రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. మొదటి రోజు: స్వర్ణకవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవి (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి, సోమవారం) శరన్నవరాత్రి మహోత్సవాల్లో తొలిరోజు శ్రీ అమ్మవారిని స్వర్ణకవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. ఈ అలంకారంలో అమ్మ బంగారు రంగు చీరలో దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మను దర్శించుకుంటే సకల దారిద్య్రాలూ తొలగుతాయని ప్రతీతి. నైవేద్యం: చక్కెరపొంగలి. రెండవ రోజు: శ్రీబాలాత్రిపుర సుందరీదేవి(ఆశ్వయుజ శుద్ధ విదియ, మంగళవారం) దసరా ఉత్సవాల్లో రెండవ రోజు శ్రీ దుర్గమ్మను లేత గులాబీ రంగు చీరలో శ్రీ బాలాత్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. బాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్పది. అందుకే శ్రీ విద్యోపాసకులకి మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యంకొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలాదేవి. బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. నివేదన: కట్టెపొంగలి మూడవరోజు: శ్రీగాయత్రి దేవి (ఆశ్వయుజ శుద్ధ తదియ, బుధవారం ) దసరా మహోత్సవాల్లో మూడవరోజున అమ్మవారు శ్రీ గాయత్రిగా దర్శనం ఇస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ గాయత్రీదేవిని నారింజ రంగు చీరలో అలంకరిస్తారు. పంచముఖాలతో, వరదాభయహస్తాలను ధరించిన శ్రీ గాయత్రి అలంకారంలోని అమ్మవారిని దర్శించుకుంటే సర్వపాప హరణం జరుగుతుంది. నివేదన: పులిహోర నాలుగవ రోజు: శ్రీ అన్నపూర్ణాదేవి (ఆశ్వీయుజ శుద్ధ చవితి, గురువారం) సకల జీవరాశులకు అహారాన్ని అందించే దేవత అన్నపూర్ణాదేవి. గంధం రంగు లేదా పసుపు రంగు చీరను ధరించి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో అమృతాన్నాన్ని, వజ్రాలు పొదిగిన గరిటెతో తన భర్తౖయెన ఆదిభిక్షువు పరమ శివుడికి అన్నం పెడుతున్న అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే క్షుద్బాధలు ఉండవని భక్తుల నమ్మకం. నివేదన: దద్ధ్యోదనం, క్షీరాన్నం, అల్లం గారెలు. ఐదవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి (ఆశ్వీయుజ శుద్ధ పంచమి, శుక్రవారం ) త్రిమూర్తులకన్నా పూర్వం నుంచి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలుస్తారు. లలితా త్రిపుర సుందరీ దేవియే శ్రీ చక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా తనను కొలిచే భక్తులను అనుగ్రహిస్తోంది. లక్ష్మి, సరస్వతి ఇరువైపులా వింజామర లు వీస్తుండగా, చిరు దరహాసంతో చెరుకుగడను చేతపట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చున్న శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిని దర్శించుకున్న భక్తులకు కోరిన కోరికలు నెరవేరతాయని ప్రతీతి. నివేదన: అల్లం గారెలు ఆరవ రోజు: శ్రీ మహాలక్ష్మీదేవి (ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి, శనివారం) మంగళప్రదమైన దేవత శ్రీమహాలక్ష్మీదేవి. లోక స్థితికారిణిగా ధన, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి, సమష్టిరూపమైన అమృతస్వరూపిణిగా గులాబీ రంగు చీరను ధరించి, సర్వాభరణ భూషితురాలై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే అషై్టశ్వర్యాలకు కొదవ ఉండదని ప్రతీతి. నివేదన: రవ్వకేసరి ఏడవ రోజు: శ్రీ సరస్వతీదేవి (ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, ఆదివారం) మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణిమైన దుర్గాదేవి తన అంశలోని నిజరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూలా నక్షత్రం నాడు చేసే సరస్వతీ అలంకారం ప్రత్యేకత. తెల్లని పట్టుచీర ధరించి, చేతిలో వీణతో సరస్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారి జన్మనక్షత్రం రోజున దర్శించుకుంటే భక్తుల కష్టాలు తీరతాయని, కోరిన విద్యలు వస్తాయనీ నమ్మకం. విద్యను, బుద్ధిని ప్రసాదించే సరస్వతీదేవి అలంకారంలోని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. నివేదన: పెరుగన్నం ఎనిమిదవ రోజు: శ్రీ దుర్గాదేవి (ఆశ్వీయుజ శుద్ధ అష్టమి, సోమవారం) దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించింది అష్టమి రోజునే. అందుకే అమ్మవార్ని దుర్గాదేవిగా కీర్తిస్తారు. అందుకే ఈ అష్టమిని దుర్గాష్టమి అంటారు. దేవి త్రిశూలం ధరించి సింహవాహనాన్ని అధిష్ఠించి, బంగారు కిరీటాన్ని ధరించి తన కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపెట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తుంది. దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు దూరం అవుతాయి. నివేదన: కదంబం (కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం కలిపి వండే వంట) తొమ్మిదవ రోజు: శ్రీ మహిషాసుర మర్దిని దేవి, (ఆశ్వయుజ శుద్ధ నవమి, మంగళవారం) అష్ట భుజాలతో ఒక చేత త్రిశూలాన్ని ధరించి, సింహవాహనంపై దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకానికి మేలు చేసింది. ఈ రూపంలో అమ్మ దర్శనం మానవాళికి సమస్త భయాల్ని పోగొట్టి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదిస్తుంది. నవమి రోజున మహిషాసురుని సంహరించింది కాబట్టి ఈ పర్వదినాన్ని మహర్నవమి అని వ్యవహరిస్తారు. నివేదన: గుడాన్నం విజయదశమి: శ్రీరాజరాజేశ్వరీ దేవి (ఆశ్వీయుజ శుద్ధ దశమి, బుధవారం ) దసరా ఉత్సవాల్లో ఆఖరు రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. షోడశ మహామంత్ర స్వరూపిణీ, మహాత్రిపురసుందరి, శ్రీ చక్ర అధిష్ఠాన దేవత శ్రీరాజరాజేశ్వరీదేవి విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి విజయ అని అంటారు. పరమ శాంత స్వరూపంలో చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడను చేతిలో పట్టుకొని ఉన్న అమ్మవారిని విజయదశమినాడు దర్శించుకుంటే అన్నింటా విజయం సాధిస్తారని నమ్మకం. నివేదన: పరమాన్నం (పాయసం) --డీ.వీ.ఆర్ భాస్కర్ ఫొటోల సహకారం: షేక్ సుబాని, సాక్షి, ఇంద్రకీలాద్రి -
3న దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ జూలై 3న ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనుంది. కమిటీ సభ్యులు బుధవారం విజయవాడలో దుర్గగుడి ఈవో భ్రమరాంబతో సమావేశమై చర్చించారు. కార్యక్రమ వివరాలను ఆలయ ఈవో, ఇంజనీరింగ్ అధికారులకు వివరించారు. ఈ ఏడాది బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు కమిటీ ప్రతినిధులు ఈవోకు వివరించారు. ఈవోను కలిసిన వారిలో వైస్ చైర్మన్ ఆనందరావు, గాజుల అంజయ్య, మధుసూదన్‌గౌడ్, అన్సరాజ్ తదితరులున్నారు. (చదవండి: అమ్మవారి హుండీల్లో ఫారిన్ కరెన్సీ) -
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ ఫొటోలు
-
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు.. సీఎంకు స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సీఎం సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం అంతరాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందజేశారు. (చదవండి: దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ) ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు సీఎంకు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య వైఎస్ జగన్.. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. సీఎం జగన్ తో పాటు దుర్గమ్మను దర్శించుకున్న వారిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని... ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మకు సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించారని తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.6782 కోట్లు ఆసరా అందించారని తెలిపారు. ఎంతమంది విఘ్నాలు తలపెట్టినా.. రాక్షసుల రూపంలో అడ్డుతగిలినా కనకదుర్గమ్మ, వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు సీఎం జగన్‌పై ఉంటాయని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. చదవండి: ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్ర (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇంద్రకీలాద్రి: గాజుల ఉత్సవం
-
శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు
అంబా శాంభవి చంద్రమౌళి రబలా– ఉపర్ణా హ్యుమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయవ్వనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ సాక్షి, విజయవాడ : శరన్నవ రాత్రి మహోత్సవాలలో భాగంగా 9వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. చెరుకుగడను వామహస్తంతో ధరించి దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదింపజేసే రూపంలో శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్టానదేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరిదేవిని దర్శించి, అర్చించటం వలన మనకు సకల శుభాలు కలుగుతాయి. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని మనందరికీ అందింపజేసే చల్లని తల్లిగా దుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరిదేవి అలంకారంలో కనిపించే అపూర్వమైన రోజు. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం.. సకల శుభాలు, విజయాలు ఈ రోజు అమ్మవారి దివ్యదర్శనం ద్వారా మనకు లభిస్తాయి. అమ్మవారి దర్శనార్దం వేలాదిగా భవానీ భక్తులు తరలి వస్తున్నారు. దుర్గమ్మ దర్శనానిని గంటన్నరకు పైగా సమయం పడుతోంది. అలాగే ఇవాళ ఉదయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దుర్గమ్మను దర్శించుకున్నారు. ('అమ్మ'కు ఆరగింపు) -
దుర్గాదేవిగా, మహిషాసుర మర్ధినీగా దుర్గమ్మ
సాక్షి, విజయవాడ: దేవి శరన్నవ రాత్రి మహోత్సవాలలో భాగంగా శనివారం దుర్గమ్మ రెండు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అష్టమి, నవమి తిథులు (ఒకేరోజు రెండు తిథులు) ఉండటంతో రెండు అలంకారాల్లో కనువిందు చేయనున్నారు. ఉదయం దుర్గాష్టమిని పురస్కరించుకొని దుర్గాదేవిగా, మధ్యాహ్నం నుంచి మహిషాసురమర్ధినీదేవిగా అమ్మ దర్శనమిస్తారు. లోకకంటకుడైన దుర్గమాసురుడిని అష్టమి తిథినాడు వధించి ఇంద్రకీలాద్రిపై స్వయంగా అమ్మవారు ఆవిర్భవించారు. అలాగే మధ్యాహ్నం అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధని దేవీగా భక్తులకు దర్శనమిస్తారు. అష్టబుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి దేవతలు, ఋషులు, మానవుల కష్టాలను తొలగించింది ఈ తల్లే... ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీకనకదుర్గమ్మ వారి నిజ స్వరూపం కూడా ఇదే కావడం విశేషం. (చదవండి: శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే) దుర్గమ్మ సన్నిధిలో డీజీపీ సవాంగ్ ఇక సాధారణ భక్తుల రద్దీకి తోడు పలువురు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం ఉదయం దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆలయ ఈవో సురేష్ బాబు.. అమ్మవారి లడ్డూ ప్రసాదం డీజీపీకి అందచేశారు. -
సర్వం శక్తిమయం
అఖిలానికి ‘అయ్య’ అయిన శంకరుని గురించి అలవోకగా శ్లోకాన్ని చెప్పబోతూ ఆది శంకరులవారు గలగలా నవ్వేశారట. దానిక్కారణం ఎక్కడెక్కడ అయ్య గురించి అలోచించినా అక్కడక్కడ అమ్మ మాత్రమే కనిపించడం! అందుకే ఆయన అమ్మ గురించి చెప్పదలచిన సౌందర్యలహరి ప్రారంభ శ్లోకంలో ‘శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చే దేవం దేవో న ఖలుః కుశలః స్పందితు మపి‘ అనేశాడు. (అమ్మతో కూడి ఉంటేనే అయ్య దేన్నైనా చేయ సమర్థుడౌతాడు. ఆమె లేకుంటే అసలాయన దేన్నీ చేయలేడు అని అర్థం). పోనీ ఆది శంకరులవారు అలా రాసారు అనుకున్నా, ‘నేను నేనే’ అని అయ్య ఏమైనా అన్నాడేమోనని వెతికి వెతికి చూస్తే ఆయనంతట ఆయన అననే అనేశాడు– ‘అంతా నిన్ను పెళ్లాడాకే సుమా! లేకపోతే నా మహిమేముంది?’ (భవాని! త్వత్పాణి గ్రహణ పరిపాటీ ఫలమిదమ్) అని. సరే బ్రహ్మగారేమైనా తన భార్య లేకుండా శక్తిమంతుడా అని అలోచిస్తే, ఆయన తన నాలుగు ముఖాల నుండీ నిరంతరం వేద గానాన్ని చేస్తూండడాన్ని బట్టి ఆయనంటూ ఒకరున్నారని లోకానికి తెలుస్తోంది కానీ అసలు బ్రహ్మ ఉనికికి కూడా కారణం ఆయనకున్న శక్తి (భార్య అయిన సరస్వతి) అనే అర్థమౌతోంది. ఇక శ్రీహరి మాట చెప్పేదేముంది? విష్ణుశక్తి మొత్తం లక్ష్మిదే కదా! ఆ శక్తి లేని పక్షంలో విష్ణుదర్శనానికి ఎవరొస్తారు? నిత్య కల్యాణమెక్కడ? పచ్చతోరణమెక్కడ? కాబట్టి ఏ బ్రహ్మకి శక్తి సరస్వతి ఔతోందో, ఏ విష్ణువుకి శక్తి లక్ష్మిగా కనిపిస్తోందో, ఏ శంకరునికి శక్తి పార్వతి మాత్రమే అని రుజువయిందో ఆ కారణంగా ‘శక్తి’ అంటే పురుషునికి సహకరించే భార్య అనీ, శక్తిపూజ (అమ్మవారి పూజ) చేయడం అంటే దంపతుల అన్యోన్యత కోసం చేయబడే పూజ అనీ, ఈ త్రిశక్తుల పూజ ఆశ్వయుజ మాసంలో నెలరోజుల పొడుగునా జరుగుతోందనీ గ్రహించాలి. అయితే ఈ త్రిశక్తుల్లో కూడా ఎవరు అత్యంత ముఖ్యం? అని ఆలోచించారు రుషులు. నెల మొదట్లో పది రోజులు పార్వతీదేవికి ఉత్సవాలు జరుగుతాయి. మూలా నక్షత్రం రోజున సరస్వతీ పూజ జరుగుతుంది. తర్వాత దీపావళి అమావాస్యనాడు లక్ష్మీపూజ. పౌరుషంలో శక్తి శక్తి అంటే అమ్మవారే అనుకున్నాం కదా. అమ్మ భండుడనే రాక్షసుణ్ణి వధించడానికి గజసైన్యం, అశ్వసైన్యం, రథబలం, పదాతి బలంతో బయల్దేరడమే కాకుండా తనకు సహాయకునిగా వచ్చిన వినాయకునితోపాటు, విఘ్నయంత్రాన్ని కూడా తీసుకెళ్లింది. ఇతర దేవతాయుధాలన్నింటినీ తనే ఒక్కొక్క చేతిలోనూ (మొత్తం ఇరవై చేతులు) ఉంచుకుని యుద్ధానికి తలపడింది. ఆమె రాక, ఆమె యుద్ధ ప్రణాళిక చూసి అందరూ కూడా దుర్గ (ఆమెను సమీపించలేం సుమా! గంతుం దుర్గమా) అన్నారు. గమనించవలసిన విషయం ఏమిటంటే అమ్మ తానింత పౌరుషంతో (పురుష లక్షణంతో) ఉన్నా కూడా తన భర్తని తక్కువ చేయకుండా భర్త అయిన కామేశ్వరుని పేరిట ఉన్న అస్త్రాన్ని ప్రయోగించి భండాసురుని రాజధానిని నాశనం చేసింది. తన విజయంలో ఆయన్ని కూడా భాగస్వామిగా ప్రకటించి లోకంలో స్త్రీలందరికీ మార్గదర్శకురాలయింది. ఆలోచనలో శక్తి ఏ రాక్షసుణ్ణి ఎలా వధించాలో అలా ఆలోచన చేయగలిగిన తల్లి ఆమె. ఒక్క బొట్టు రక్తం తన నుండి నేల పడినా తనలాంటి లక్షణాలున్న దుర్మార్గులు వేల సంఖ్యలో పుట్టాలనే వరాన్ని పొందిన రక్తబీజుణ్ణి వధించడానికి తన నాలుకని పృ«థివితో సమానంగా పెంచి దాని మీద వాణ్ని వధించింది. అలాగే సుందోపసుందుల్ని వధించేందుకు– మీలో ఎవరు బలిష్టులు? అని ప్రశ్నించి పరస్పరం చంపుకునేలా పథకం రచించింది. అలాగే హయగ్రీవుడనే రాక్షసుడు కోరిన వరానికి అనుగుణంగా శ్రీహరికి హయముఖం వచ్చేందుకై శ్రీహరి శిరస్సును ఖండింపజేసింది పరమ సాహసంతో. ఇలా సాహసోపేత విధానంతో రాక్షసవధని చేపట్టి మళ్లీ ఆ రాక్షస జాతితోనే శక్తి పూజలు చేయించుకున్న నేర్పరి అమ్మ. చక్రాల్లో శక్తి ప్రతి వ్యక్తికీ ఉండే సప్త చక్రాల్లోనూ, సప్త రూపాల్లోనే అమ్మ ఉంటుంది. లోకమంతా ఆమెని నాలుగు చేతులున్న రూపంతో ఊహిస్తుంది కానీ, ఆమె ప్రతి వ్యక్తి శరీరంలోని భాగంలోనూ ఉంటుంది. లోకంలో ప్రజలకు 1000 విధాల కష్టాలుంటాయని గ్రహించి, ఏ కష్టానికి ఏ నామం పఠిస్తే కష్ట నివారకమో చెప్తూ, అలాంటి వెయ్యి కష్టాలకీ వెయ్యి నామాలని కూర్పించి, ఆ నామాలకి శక్తి పెరిగేందుకై వాటన్నిటినీ ఒకేచోట ‘లలితా సహస్ర నామాలు’ అంటూ చేర్చి మననం చేసుకుంటూ ఉండవలసిందని చెప్తోంది అమ్మ. మహిషాసుర మర్ధిని కథ మహిషాసురుడు గొప్ప బలవంతుడు. అతనికున్న వరమహిమ అతన్ని మరింత బలవంతునిగా చేసింది. ఆ బలగర్వంతో మూడు లోకాలను జయించి విజయ గర్వంతో తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించసాగాడు. దేవతలను, ఋషులను, మానవులను క్రూరంగా హింసించసాగాడు. ఏమీ చేయలేక, భయంతో – బాధతో, మునులు, దేవతలు, మానవులు త్రిమూర్తులను ( బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ) రక్షణ కల్పించమని వేడుకున్నారు. దేవతల, మునుల, మానవుల వేడుకోలుకు త్రిమూర్తులు కరిగిపోయారు. మహిషాసురుని మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం నుంచి ఓ తేజస్సు ( అంటే ఒక వెలుగు – ఒక శక్తి అని అర్ధం ) పుట్టింది. దానికి ఒక రూపం ఏర్పడింది. ఆ తరువాత మూడుకోట్ల దేవతల కోపం, ఆవేశం ఈ తేజో రూపంతో కలిసి మరింత శక్తిమంతమైన ఆదిశక్తి అయింది. ఈ రూపాన్నే సర్వదేవతా స్వరూపం అంటారు. దేవతలందరూ తమతమ శక్తిని, ఆయుధాలను అమ్మకు యిచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని, శ్రీమహావిష్ణువు తన చక్రాన్ని, విశ్వకర్మ పరశువుని అంటే పదునైన గొడ్డలిని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను ఆ ఆదిపరాశక్తి కి ఆయుధాలుగా యిచ్చారు. హిమవంతుడు సింహాన్ని వాహనంగా సమర్పించాడు. సింహాన్ని వాహనంగా చేసుకొని పైన చెప్పిన ఆయుధాలను తీసుకొని వరుణుడు యిచ్చిన శంఖాన్ని వూదింది. ఆ శంఖ నాదశక్తికి తట్టుకోలేక రాక్షసులు తలకిందులయ్యారు మహిషాసురుడును అణిమాది అష్టసిద్ధుల సహాయంతో సింహరూపంలో దేవితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఖడ్గం, కత్తి చేపట్టి మానవ రూపంలోనూ యుద్ధం చేశాడు. మత్తగజంలా మారి ముట్టడించబోయాడు. చివరకు తన సహజ రూపమైన దున్నపోతు రూపంలో వాడి కొమ్ములతో దాడి చేశాడు. అమ్మ ఇక తన ఆగ్రహాన్ని అణచుకోలేక త్రిశూలంతో మహిషాసురుడి గుండెలు చీల్చి పారేసింది. రాక్షసుడు చచ్చిపోయాడు. ఆమె రౌద్ర రూపాన్ని చూసి దేవతలు అందరూ భయపడిపోయి, ఆమె ఆగ్రహాన్ని చల్లబరిచేందుకు అమెను అనేకవిధాలుగా స్తుతించారు. అలానే శంకరాచార్యులవారు మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని పాడారు అది మంచిగా గుర్తింపు ఉన్న పాట. నవరాత్రుల తరువాత ఈ రోజు మహిషాసుర మర్ధిని స్తోత్రం చదువుతారు. అమ్మ వారి ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే మహార్నవమిగా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించి, అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తిగా ఈ రోజు దర్శనం ఇస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి హోమం చెయ్యాలి. అమ్మవారికి ‘‘ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా’’ అనే మంత్రాన్ని జపించాలి. పూజానంతరం చిత్రాన్నం (పులిహోర), గారెలు, వడపప్పు, పానకం నివేదనం చెయ్యాలి. -
మహిషాసురమర్దినీదేవీ
ఆశ్వయుజ శుద్ధ నవమి, గురువారం, 18–10–2018 అయిగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతి హే శితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే‘‘ శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తుంది. అష్టభుజాలతో అవతరించి సింహ వాహినిౖయె, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది దుర్గాదేవి.ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మవారి సహజ స్వరూపం ఇదే. మహిషాసురమర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే అరిషడ్వర్గాలను జయించగలుగు తామని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు... సాత్విక భావం ఉదయించి, సర్వ పాపాలూ, దోషాలూ పటాపంచలవుతాయని కూడా చెబుతారు. వీటితో పాటు ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరతాయని తెలుస్తోంది.(ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిస్తుంది) రాజరాజేశ్వరీదేవి ఆశ్వయుజ శుద్ధ దశమి, గురువారం, 18–10–2018 అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణాహ్యుమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నమయవ్వనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గాదేవి చిరునగవులతో రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. వామ హస్తంలో చెరకు గడను ధరించి, దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదింపచేసే రూపంతో శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా, శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా వెలుగొందే రాజరాజేశ్వరీదేవిని దర్శించి, అర్చించటం వలన సర్వశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని మనందరికీ అందింప చేసే చల్లని తల్లిగా దుర్గమ్మ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో కనిపించే అపూర్వమైన రోజు ఈ రోజు. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఈ రోజు అమ్మవారి దివ్య దర్శనం ద్వారా సకల శుభాలు, విజయాలు మనకు లభించాలని అర్చిద్దాం.(మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది) -
వస్త్రం సమర్పయామి
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గమ్మకు పట్టుచీరలంటే మక్కువ అని అర్చకులు చెబుతారు. ఆ జగజ్జననికి వంద రూపాయల నుంచి వేలరూపాయల వరకు ఖరీదు చేసే చీరలను భక్తులు సభక్తికంగా సమర్పించుకుంటారు. దుర్గమ్మను అలంకరించేందుకు భక్తులు పట్టుచీరలతో పాటు శక్తి కొలదీ నూలు, సిల్క్‌చీరలను కూడా సమర్పిస్తుంటారు. దుర్గమ్మకు అలంకరించే చీరలను ప్రత్యేకంగా ఎక్కడా నేత నేయించరు. భక్తులు సమర్పించిన వస్త్రాలలో పెద్ద అంచు ఉన్న చీరలను అమ్మవారికి అలంకరించేందుకు ఉపయోగిస్తారు. భక్తులు తమకు నచ్చిన పట్టు చీరలను కొనుగోలు చేసి దేవస్థానం కౌంటర్లో అందచేస్తారు. కొంతమంది భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా పట్టుచీరలను నేత నేయించి కానుకలుగా అందచేస్తారు. అమ్మవారికి ఇచ్చే ప్రతి చీరను అంతరాలయంలో ఉత్సవమూర్తికి చూపుతారు. నిత్యం నాలుగు నుంచి ఐదు చీరలను అమ్మవారి మూలవిరాట్టుకు అలంకరిస్తారు. దసరా ఉత్సవాలలోనూ ఇదే తరహాలో అలంకరిస్తారు. ఇక ఉత్సవ మూర్తులు, అమ్మవారి ఆలయం చుట్టూ కొలువుదీరిన అష్టలక్ష్ములకు కూడా పట్టుచీరలను అలంకరిస్తారు. ప్రభుత్వం నుంచి పట్టుచీర దసరా ఉత్సవాలలో అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం, సరస్వతీదేవి అలంకారం రోజున ప్రభుత్వం తరపున రాష్ట్రముఖ్యమంత్రి పట్టుచీరను సమర్పిస్తారు. దసరా ఉత్సవాల ప్రారంభం రోజున పోలీసు శాఖ నుంచి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అమ్మవారికి పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. దీనితోపాటు దుర్గ గుడి ఆలయ అధికారి ఈవో హోదాలో అమ్మవారికి పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీ. సమర్పించే పట్టుచీరలను అమ్మవారికి అలంకరించిన అనంతరం దేవస్థానం వాటిని వస్త్ర ప్రసాదంగా భక్తులకు విక్రయిస్తుంది. వివాహం, గృహప్రవేశం, కంపెనీల ప్రారంభోత్సవం వంటి శుభకార్యాల సందర్భంగా భక్తులు అమ్మవారికి చీరలను సమర్పిస్తుంటారు. సాధారణ రోజులలో కొండపై ఆలయ ప్రాంగణంలో రెండు కౌంటర్లు, మహామండపం దిగువన ఒక కౌంటర్లో ఈ వస్త్రప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంటుంది. దసరా, భవానీ దీక్షల విరమణ సమయంలో కొండ దిగువన మహామండపం, కనకదుర్గ నగర్లలో వస్త్ర ప్రసాద కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. అమ్మవారి చీరల విక్రయాలు ఆలయ ఈవో పర్యవేక్షణలో జరుగుతుంది. భక్తులు అమ్మవారికి అలంకరించే నిమిత్తం సమర్పించిన చీరను... పుట్టినరోజు, పెళ్లిరోజు... ఇలా తమకు నచ్చిన తేదీలలో అమ్మవారికి అలంకరింపచేసుకునే అవకాశం ఉంటుంది. అమ్మవారి వస్త్ర ప్రసాదం దేవస్థానానికి వచ్చే ఆదాయంలో చీరల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు నాటికి రూ. 1.98 కోట్ల ఆదాయం వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా దేవస్థానమే చీరల విక్రయాలను నిర్వహిస్తోంది. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు సైతం అమ్మవారి చీరలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఆ వస్త్రాలను అమ్మవారి దివ్య ప్రసాదంగా భావిస్తారు. దసరా ఉత్సవాలలో అమ్మవారికి అలంకరించే పట్టు చీరలు శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవి – బంగారు రంగు శ్రీబాలాత్రిపుర సుందరీదేవి – లేత గులాబీ రంగు శ్రీగాయత్రీదేవి – ముదురు నారింజ రంగు శ్రీలలితా త్రిపుర సుందరీదేవి – అచ్చమైన బంగారు రంగు శ్రీసరస్వతీదేవి (మూలానక్షత్రం) – తెలుపు రంగు శ్రీఅన్నపూర్ణాదేవి – గంధపు రంగు శ్రీమహాలక్ష్మీదేవి – నిండు గులాబీ రంగు శ్రీదుర్గాదేవి– నిండు ఎరుపు రంగు శ్రీమహిషాసురమర్దినీదేవి – గోధుమ, ఎరుపు రంగుల కలనేత జరీ పట్టు చీర శ్రీరాజరాజేశ్వరీదేవి – పచ్చరంగు – ఎస్.కె.సుభానీ (ఇంద్రకీలాద్రి), విజయవాడ -
ఏపీ భవన్లో కొలువుదీరనున్న కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఢిల్లీలోని ఏపీ భవన్లో కనకదుర్గమ్మ అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. అమ్మవారికి నిత్యం పూజలు నిర్వహించేలా ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారులు అక్కడి వారితో సంప్రదింపులు జరిపారు. దీంతో నాలుగు అడుగుల అమ్మవారి ప్రతిమను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆదివారం ఢిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల అనంతరం ఏపీ భవన్లో దుర్గమ్మ ప్రతిమను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. -
లడ్డూ ప్రసాదం.. నో స్టాక్
విజయవాడ (రైల్వేస్టేషన్) : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రైల్వేస్టేషన్లో ఏర్పాటుచేసిన దుర్గమ్మ ప్రసాదాల విక్రయ కౌంటర్లో లడ్డూల కొరత ఏర్పడింది. ఇక్కడ 24 గంటలు ప్రసాదం విక్రయిస్తామని అధికారులు చెప్పారు. అయితే పూర్తిస్థాయిలో ప్రసాదం సరఫరా చేయడంపై అధికారులు దృష్టి సారించలేదు. రెండు రోజులుగా రైల్వేస్టేషన్‌లోని కౌంటర్‌కు ప్రసాదాలు పంపించలేదు. ప్రయాణికులు, భక్తులు ప్రసాదం కోసం స్టేషన్‌లోని కౌంటర్ వద్దకు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ‘నో స్టాక్’ బోర్డు పెట్టారు. దీంతో భక్తులు నిరుత్సాహంగా వెళ్లిపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి 24 గంటలూ ప్రసాదం అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్
విజయవాడ: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. గవర్నర్ కు దుర్గగుడి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతరాలయంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గగుడి పై జరుగుతున్న అభివృద్ధి, పుష్కర ఘాట్ల నమూనాను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నరసింహన్ కు వివరించారు. ఈ సందర్భంగా నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణాపుష్కరాలకి ఇంకా నెలరోజులు మాత్రమే గడువు ఉందని, అందరూ పుష్కరాల్లో సమిష్టిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. -
నయనానందకరంగా కనకదుర్గమ్మ తెప్పోత్సవం
-
మాతాశిశు మరణాలపై విచారణ
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది మధ్య సమన్వయలోపం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) విజిలెన్స్ జాయింట్ కమిషనర్ డాక్టర్ కనకదుర్గమ్మ అన్నారు. 2011 -12 సంవత్సరాలలో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సంభవించిన మాతాశిశు మరణాలపై విచారణ చేపట్టేందుకు సోమవారం ఆమె ఖమ్మం వచ్చారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఆమె తొలుత ఆస్పత్రిలోని ఓపీ, కాన్పుల వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. అక్కడి నుంచి సర్జరికల్ వార్డు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి డీసీహెచ్ఎస్ ఆనందవాణి వెంట వెళ్లారు. ఒక అధికారిణి గురించి విచారణ చేపట్టేందుకు వచ్చిన ఉన్నతాధికారిణి చివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె వెంటే వెళ్లడం వివాదాస్పదంగా మారింది. 2011 - 12 మధ్య కాలంలో జిల్లా ఆరుగురు మృతి చెందారు. మరోమహిళకు ఆపరేషన్ నిర్వహించే సమయంలో మాపు( ఆపరేషన్ సమయంలో ఉపయోగించే గుడ్డ)ను కడుపులో వదిలేశారు. ఈ ఏడు సంఘటనల్లో నాలుగు కేసులపై ఆమె విచారణ చేపట్టారు. ఈ నాలుగు కేసుల్లో కూడా రెండు కేసులకు సంబంధించి బాధితుల బంధువులు విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు వైద్యులు కృపా ఉషశ్రీ, మంగళ, శ్రీనివాసరావు, సమ్మయ్య, డీసీహెచ్ఎస్ ఆనందవాణి, నర్సింగ్ సిబ్బంది హాజరయ్యారు. వారి వద్ద నుంచి రాతపూర్వకంగా వివరాలు సేకరించారు. అలాగే కేస్ షీట్ జీరాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణాధికారిణి డాక్టర్ కనకదుర్గ విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రిలో రోగులకు సేవలు సక్రమంగానే అందుతున్నాయని అన్నారు. అయితే వైద్యులు, సిబ్బంది మధ్యే సమన్వయలోపం ఉన్నట్లు తన పరిశీలనలో వెల్లడయిందని అన్నారు. దీర్ఘ కాలంగా ఒకే చోట పని చేస్తున్నందున ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారని, అలాగే ఇక్కడ గ్రూపులు కూడా ఉన్నాయన్నారు. సేవలందించడంతో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు రోగులు ఆమె దృష్టికి తీసుకురాగా పక్కనే ఉన్న సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్లను ప్రశ్నించారు. వైద్యులు, సిబ్బంది తమ మాటలు వినడం లేదని వారు సమాధానం ఇవ్వడంతో ఇద్దరు అధికారులు ఉండి చర్యలు తీసుకోవడం లేదని, తామే వచ్చి అన్నింటికి చర్యలు తీసుకోలేమని అన్నారు. ఇటీవల ఆస్పత్రిలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరారు. రోగుల సహాయకుల భోజనశాల ప్రారంభం ఆస్పత్రిలోని మహిళల సర్జికల్ వార్డు వద్ద రోగుల సహాయకుల కోసం నిర్మించిన భోజనశాలను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ ఆనందవాణి, సూపరిటెండెంట్ సుబ్బయ్య, ఆర్ఎంఓ శోభాదేవి, రహిమ్, జగ్గయ్య పాల్గొన్నారు. విజిలెన్స్ అధికారిణికి నర్సింగ్ సిబ్బంది ఫిర్యాదులు... ఆస్పత్రిలోని నర్సింగ్ సిబ్బంది విజిలెన్స్ అధికారిణి కనకదుర్గమ్మకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తొలుత ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన హెడ్ నర్స్ ఆంథోనమ్మ నర్సింగ్ సూపరింటెండెంట్‌పై ఫిర్యాదు చేయగా, మరి కొద్ది సేపటికి నర్సింగ్ సూపరింటెండెంట్.. హెడ్ నర్సు నాగలక్ష్మి ఆధ్వర్యంలో హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు కొందర్ని తీసువచ్చి ఫిర్యాదు చేయించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ ఎవరినీ వేధించడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని తెలపడంతో కొంతమంది సంతకం చేసేందుకు నిరాకరించారు. విజిలెన్స్ అధికారిణి కలిసిన వారిలో నాగలక్ష్మి, సునీత, లక్ష్మి, మనోహరం, స్టెలా, విజయశ్రీ, ఎంఎల్ఏ మేరి, జి. కవిత, వి.కవిత, ఇందిర ఉన్నారు.