లడ్డూ ప్రసాదం.. నో స్టాక్
విజయవాడ (రైల్వేస్టేషన్) :
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రైల్వేస్టేషన్‌లో ఏర్పాటుచేసిన దుర్గమ్మ ప్రసాదాల విక్రయ కౌంటర్‌లో లడ్డూల కొరత ఏర్పడింది. ఇక్కడ 24 గంటలు ప్రసాదం విక్రయిస్తామని అధికారులు చెప్పారు. అయితే పూర్తిస్థాయిలో ప్రసాదం సరఫరా చేయడంపై అధికారులు దృష్టి సారించలేదు. రెండు రోజులుగా రైల్వేస్టేషన్‌లోని కౌంటర్‌కు ప్రసాదాలు పంపించలేదు. ప్రయాణికులు, భక్తులు ప్రసాదం కోసం స్టేషన్‌లోని కౌంటర్ వద్దకు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ‘నో స్టాక్’ బోర్డు పెట్టారు. దీంతో భక్తులు నిరుత్సాహంగా వెళ్లిపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి 24 గంటలూ ప్రసాదం అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు.