no stock
-
Telangana: మద్యం ప్రియులకు షాక్.. ఇక బీర్లు దొరకడం కష్టమే..!
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వేసవి కాలంలో చల్లని బీరు తాగాలని ఆశించే మద్యంప్రియులకు బీర్లు దొరకడం కష్టంగా మారుతోంది. ఇ ప్పటికే హాజీపూర్ మండలం గుడిపేటలోని మ ద్యం డిపోకు బీర్ల సరఫరా చాలావరకు నిలిచి పోయింది. వచ్చిన నిల్వలను డిపో పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లకు రేషియో పద్ధతిన సరఫరా చేస్తోంది. బీర్లకు కొరత ఏర్పడగా.. కొ ద్ది రోజుల్లో తీవ్రం కానున్నట్లు తెలుస్తోంది. గ తంలో పలు కంపెనీలు ప్రభుత్వ లిక్కర్ గోదా ములకు సరఫరా చేసిన బీరు నిల్వలకు బకా యిల చెల్లింపులో జాప్యమే కొరతకు కారణమని తెలుస్తోంది. గుడిపేట లిక్కర్ డిపో పరిధిలో 135 మద్యం దుకాణాలు, 28వరకు బార్లు ఉన్నా యి. వేసవిలో పెద్దయెత్తున బీర్ల అమ్మకాలు సాగుతాయి. గత ఏడాది మార్చిలో రెండు లక్షల వరకు బీరు కేసుల విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో 1.80లక్షల వరకు బీరు కేసులు మాత్రమే అమ్మకాలు జరిగాయి. గత ఏడాది బీరు కేసులు మద్యం దుకాణాల డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా జరిగి డిపోలో లక్షల కేసుల నిల్వలు ఉండేవి. ఇప్పుడు బీరు కేసులు వచ్చినవి వచ్చినట్లు విక్రయిస్తుండగా.. డిపోలో నిల్వలు ఉండడం లేదు. ఈ లెక్కన డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేదని తెలుస్తోంది. బిల్లులు పెండింగ్‌లో.. లిక్కర్ తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వం వివిధ బ్రాండ్లకు సంబంధించి బీర్లు కొనుగోలు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం డిపోలకు సరఫరా చేస్తోంది. అక్కడి నుంచి రిటైల్ దుకాణాలకు సరఫరా జరుగుతుంది. లిక్కర్ తయారీ కంపెనీలు సరఫరా చేసిన మద్యం బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కొన్ని డిస్టిలరీస్, బ్రేవరేజేస్‌లు మద్యం ఉత్పత్తి తగ్గించడంతోపాటు బీరు నిల్వల సరఫరా చాలా వరకు తగ్గించేశాయి. వేసవిలో మార్చి నుంచి మే వరకు దాదాపు రూ.2కోట్ల విలువైన బీర్ల అమ్మకాలు జరుగుతాయి. ఒక్కో మద్యం దుకాణానికి రోజుకు సుమారుగా 50 బీరు కేసుల వరకు విక్రయాలు జరిగేవి. కానీ ఈ వేసవిలో 30 బీరు కేసుల వరకు కూడా సరఫరా చేయడం లేదని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో బీర్ల కొరత తీవ్రం కానుంది. డిపో పరిసరాలు వెల వెల గుడిపేట మద్యం డిపో పరిసరాలు నిత్యం కళకళలాడుతూ కనిపించేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా వెల వెలబోతున్నాయి. పలు మద్యం కంపెనీలు బీరు నిల్వల సరఫరా తగ్గించడంతో లారీలు, ఇతర వాహనాల రాకపోకలు తగ్గాయి. మొన్నటి వరకు రోజుకు 20 వాహనాలకు పైగా మద్యం నిల్వలతో వచ్చిన సందర్భాలు ఉండగా ఇప్పుడు 10 వాహనాలు కూడా డిపోకు రావడం లేదు. డిపో మేనేజర్ శ్రీనివాస్‌ను సంప్రదించగా.. డిపోకు వచ్చిన బీరు నిల్వలను అన్ని రిటైల్ మద్యం దుకాణాలకు రేషియో పద్ధతిన సమానంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. -
లాక్డౌన్: వైన్స్, మార్ట్‌ల్లో మద్యం ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ అని ప్రకటించగానే మందుబాబులు షాక్‌కు గురయ్యారు. పది రోజుల లాక్డౌన్ ప్రకటన వెలువడిన వెంటనే మద్యంప్రియులు వైన్స్ దుకాణాలు, మార్ట్‌లకు పరుగులు పెట్టారు. గతేడాది అనుభవం దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా మద్యం కొనుగోలుకు ఎగబడ్డారు. ఏ మద్యం దుకాణం చూసినా కూడా మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు కిటకిటలాడాయి. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర క్యూలైన్ కొనసాగాయి. మద్యం దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటలకు తెరచి ఉంటుందని తెలిసినా కూడా మందు కోసం ఎగబడ్డారు. సంపన్నులతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా తమ స్థాయికి మించి మద్యం కొనుగోళ్లు చేశారు. కొందరు తమ వద్ద డబ్బు లేకున్నా అప్పు చేసి మరి మద్యం తీసుకెళ్లారు. ఈ పది రోజులకు సరిపడా తీసుకెళ్లారు. మరికొందరేమో లాక్డౌన్ గడువు పెరుగుతుందని భావించి భారీగా కొనుగోలు చేశారు. మద్యం దుకాణాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో నిర్వాహకులు, యజమానులు ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. ఉన్న అరకొర సిబ్బందితోనే విక్రయాలు కొనసాగించారు. మద్యంప్రియులు ఒక్కసారిగా ఎగబడడంతో మద్యం దుకాణాల్లో స్టాకంతా అయిపోయింది. నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సాధారణ మద్యం దుకాణం నుంచి వైన్స్ మార్ట్ వరకు ఇదే పరిస్థితి. ఒక వైన్స్ మార్ట్‌లో మద్యం సీసాలన్నీ ఖాళీ అవడంతో కబోర్డులన్నీ వెలవెలబోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా హైదరాబాద్‌లోని ఓ వైన్స్ మార్ట్‌లో ఖాళీగా ఉన్న ర్యాక్‌లు -
రూ.100 విలువగల స్టాంప్ పేపర్ల కొరత
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లకు కొరత ఏర్పడింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, ఒప్పం దాలు, ధ్రువీకరణలు, న్యాయపరమైన లావాదేవీలకు అత్యధికంగా వినియోగించే రూ.100లు విలువ గల స్టాంప్ పేపర్ల పంపిణీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి నిలిచిపోయింది. స్టాంప్ వెండర్స్ వద్ద పాత స్టాక్ ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.50ల విలువగల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు పత్తాలేకుండా పోగా, తాజాగా రూ.100ల స్టాంప్ పేపర్లు సైతం అదే జాబితాలో చేరుతున్నట్లు కనిపిస్తోంది. డిమాండ్ ఉన్నా ఫలితం లేకుండా పోయింది. వాస్తవంగా రెండు మాసాల నుంచి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ ముద్రణాలయానికి స్టాంప్ పేపర్ల కోసం ఇండెంట్ పెట్టనట్లు తెలుస్తోంది. ఫలితంగా అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్ డిపోలకు సరఫరా ఆగిపోయింది. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి కేవలం రూ.20ల స్టాంప్ పేపర్లు మాత్రమే పంపిణీ జరుగుతోంది. దీంతో స్థిరాస్తి దస్తావేజులు మినహా మిగిలిన అన్ని లావాదేవీలు వీటిపైనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ నిల్వలు కూడా ఖాళీ అవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇండెంట్‌పై అనాసక్తి.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల ఇండెంట్‌పై అనాసక్తి కనబరుస్తోంది. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల డిమాండ్ ఉన్నప్పటికీ నాసిక్ ముద్రణాలయానికి ఇండెంట్ పెట్టకపోవడం వెనుక కొత్త వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు తరహాలో బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా కొత్త తరహాలో స్టాంప్ విలువ విక్రయ సేవలు అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల ఇండెంట్‌పై అనాసక్తి కనబర్చడం ఇందుకు బలం చేకూరుస్తోంది. స్టాంప్ నిల్వలు లేకపోవడంతో జిల్లా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి వివిధ విలువలు గల స్టాంప్ పేపర్ల విక్రయాలు లేకుండా పోయాయి. దీంతో బహిరంగ మార్కెట్లో పాత స్టాక్‌కు డిమాండ్ పెరిగినట్లయ్యింది. నాసిక్‌లోనే ముద్రణ.. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు దిగుమతి అవుతాయి. నాసిక్‌లోని ముద్రణాలయంలో నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లు, రెవెన్యూ స్టాంపులు ముద్రిస్తారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ ముద్రణాలయానికి అవసరమైనంత ఇండెంట్ పంపించి నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను తెప్పిస్తోంది. జిల్లా రిజిస్ట్రార్ల ఇండెంట్ ప్రకారం వాటిని సరఫరా చేస్తోంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ నుంచి స్టాక్ తెప్పించిన ప్రతిసారి ముందస్తుగా 20 శాతం వరకు సరుకు నిల్వ చేసి మిగితాది జిల్లా రిజిస్ట్రార్ సరఫరా చేస్తోంది. జిల్లా రిజిస్టార్ ఆఫీస్ కూడా స్టాంప్ డిపోలో కొంత స్టాక్ రిజర్వ్డ్ చేసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ఇండెంట్ డిమాండ్ మేరకు పంపిణీ చేస్తోంది. స్టాక్ పూర్తి కాకముందే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవడం ఆనవాయితీ. తాజాగా స్టాక్ పూర్తయినా ఇండెంట్ ఊసే లేకుండా పోయింది. -
ఐఫోన్ లవర్స్‌కు నిరాశ : మూడురోజుల్లోనే..
సాక్షి, న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్. ఈ నెలలో లాంచ్ చేసిన యాపిల్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఈ నెల 20 నుంచి ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న యాపిల్ ఐఫోన్ 11 వేరియంట్ అవుట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచింది. అమెజాన్ ఇండియా, ప్లిప్‌కార్ట్‌లో ఇది ప్రీ ఆర్డర్‌కు లభించడంలేదు. కేవలం మూడు రోజుల్లో ఐఫోన్11 అవుట్ ఆఫ్ స్టాక్‌గా నిలవడం విశేషం. అయితే ఐఫోన్ 11 ప్రొ అమెజాన్‌లో మాత్రమే అందుబాటులోవుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే బుక్ అయిపోయాయి. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ (256 జీబీ స్టోరేజ్) వేరియంట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఆవిష్కరించిన ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు దేశీయంగా ఈ నెల 23నుంచి ప్రీ బుకింగులను ఆరంభించగా, ఈ నెల 27నుంచి విక్రయానికి రానున్నసంగతి తెలిసిందే. -
విజయవాడలోనూ నో స్టాక్ బోర్డులు
విజయవాడ:: బిఎస్ 3 నాణ్యత కలిగిన వాహనాల అమ్మకాలపై ఆంక్షల నేపథ్యంలో పలు వాహనాల కంపెనీలు తమ వాహనాల విక్రయం కోసం భారీగా డిస్కౌంట్లు ప్రకటించాయి. విజయవాడలోని ప్రముఖ వాహనాల కంపెనీలు ఒక్కరోజు మాత్రమే రూ.12 వేల నుంచి రూ. 22 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించడంతో కొనుగోలుదారులు ఒక్కసారిగా ఆయా షోరూంల వద్ద బారులు తీరారు. బిఎస్ 3 మోడల్ వాహనాలకు ఫైనాన్స్ ఇచ్చేందుకు ఫైనాన్స్ కంపెనీలు నిరాకరిస్తున్నాయి. అయినప్పటికీ నగదుతో కొనుగోలు చేసేందుకు కస్టమర్స్ పోటెత్తడంతో పలు షోరూంల వద్ద నో స్టాక్ అని బోర్డులు పెట్టాల్సి వచ్చింది. -
లడ్డూ ప్రసాదం.. నో స్టాక్
విజయవాడ (రైల్వేస్టేషన్) : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రైల్వేస్టేషన్లో ఏర్పాటుచేసిన దుర్గమ్మ ప్రసాదాల విక్రయ కౌంటర్లో లడ్డూల కొరత ఏర్పడింది. ఇక్కడ 24 గంటలు ప్రసాదం విక్రయిస్తామని అధికారులు చెప్పారు. అయితే పూర్తిస్థాయిలో ప్రసాదం సరఫరా చేయడంపై అధికారులు దృష్టి సారించలేదు. రెండు రోజులుగా రైల్వేస్టేషన్‌లోని కౌంటర్‌కు ప్రసాదాలు పంపించలేదు. ప్రయాణికులు, భక్తులు ప్రసాదం కోసం స్టేషన్‌లోని కౌంటర్ వద్దకు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ‘నో స్టాక్’ బోర్డు పెట్టారు. దీంతో భక్తులు నిరుత్సాహంగా వెళ్లిపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి 24 గంటలూ ప్రసాదం అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు. -
రెవెన్యూ స్టాంప్ నో స్టాక్
* రెండు నెలలుగా పోస్టాఫీసుల్లో నిలిచిన విక్రయాలు * బహిరంగ మార్కెట్లో ఐదు రెట్ల ధర సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెవెన్యూ స్టాంప్‌ల కొరత తీవ్రంగా ఏర్పడింది. 2 నెలలుగా పోస్టాఫీసుల్లో వాటి విక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి. ఫలితం గా బహిరంగ మార్కెట్లో 2 నుంచి 5 రెట్లు అధిక ధరకు ఈ స్టాంపులను విక్రయిస్తున్నారు. నాసిక్ ముద్రణాలయం నుంచి సరఫరా నిలిచిపోవడంతో హైదరాబాద్ సర్కిల్ స్టాంప్ డిపోలో నిల్వలు లేకుండా పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉమ్మడి రాష్ట్రాల్లో మొత్తం 95 ప్రధాన పోస్టాఫీసులుండగా, వాటి పరిధిలో మరో 16,150 పోస్టాఫీసులున్నాయి. ప్రతి నెలా 60 నుంచి 80 లక్షల వరకు రెవెన్యూ స్టాంప్‌ల డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది మార్చి 14న పోస్టల్ శాఖ జీపీవో చీఫ్ పోస్ట్‌మాస్టర్ సుమారు రూ.8 కోట్ల విలువైన రెవెన్యూ స్టాంప్‌లు సరఫరా చేయాలని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ఇండెంట్ పెట్టారు. కానీ, స్టాంప్‌ల సరఫరా లేకపోవడంతో తిరిగి 2 నెలల క్రితం కనీసం రూ.6 కోట్ల విలువైన స్టాంపులైనా ఇవ్వాలని మరో లేఖ రాశారు. నేటికీ అవి అందకపోవడంతో సర్కిల్ స్టాంప్ డిపోలో నిల్వలు నిండుకున్నాయి. 20 రోజుల్లో సరుకు వచ్చే అవకాశం ఉంది... ‘రెవెన్యూ స్టాంప్‌ల కోసం స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు రెండు పర్యాయాలు ఇండెంట్ పెట్టాం. 4 నెలలు కావస్తున్నా సరఫరా కాలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు కమిషన్‌పై మాత్రమే పోస్టల్ శాఖ విక్రయిస్తుంది’ అని హైదరాబాద్ జీపీఓ చీఫ్ పోస్టుమాస్టర్ కె.జనార్దన్‌రెడ్డి చెప్పారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ... ‘నాసిక్‌లో మాత్రమే రెవెన్యూ స్టాంపులు ముద్రణ జరుగుతుంది. సుమారు రూ.10 కోట్ల విలువగల స్టాంప్‌ల కోసం ఇండెంట్ పెట్టాం. 20 రోజుల్లో సరుకు వచ్చే అవకాశం ఉంది’ అన్నారు. -
నల్లబజారుకు కందిపప్పు
రేషన్ డీలర్ల చేతివాటం రెండు రోజులకే కోటా ఖతం కంది పప్పు నో స్టాక్ కొరవడిన అధికారుల నిఘా సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్దఎత్తున ‘రేషన్ కంది పప్పు’ నల్లబజారుకు తరలినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన రెండు మూడు రోజులకే కంది పప్పు నో స్టాక్‌గా మారడం ఇందుకు బలం చేకూర్చుతోంది. కొందరు రేషన్ డీలర్లు వచ్చిన కంది పప్పు ఆయిపోయిందంటూ... మరి కొందరు పూర్తి కోటాను దిగమింగి సబ్సిడీ కంది పప్పు ఈ సారి రైతుబజార్, ప్రత్యేక కేంద్రాల్లో విక్రయిస్తున్నారని లబ్ధిదారులకు పేర్కొంటూ చేతులు దులుపుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో ధర పెరగడంతో డీలర్లు చేతివాటం ప్రదర్శించి లబ్ధిదారులు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ధర కిలో రూ.200 లు పలుకుతుండగా.. చౌకధరల దుకాణాల ద్వారా సబ్సిడీపై రూ.50లకు పంపిణీ చేయా ల్సి ఉంటుంది. ఈ వ్యత్యాసం ఫలితంగా చౌక ధర కంది పప్పు గుట్టుచప్పుడు కాకుండా డీలర్లు సొమ్ము చేసుకుం టున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయి లో కంది పప్పు కోసం పూర్తిస్థాయి కోటా కోసం డీడీలు కట్టి ఇండెంట్ పెట్టిన డీలర్లు మొదటి విడతగా కేటాయించిన సుమారు 70 శాతం వరకు కోటాను గోదాముల నుంచి నేరుగా నల్లబజారుకు తరలించినట్లు తెలుస్తోంది. దాల్‌మిల్లర్స్, పప్పు దినుసుల వ్యాపారులు, దళారులు రేషన్ పుప్పుపై దృష్టి సారించడం డీలర్లకు మరింత కలిసివచ్చింది. అధికారుల నిఘా కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో నల్లబజారుకు తరలిపోయింది. సగానికి పైగా దుకాణాల్లో నో స్టాక్.. గ్రేటర్‌లోని సగానికిపైగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో గురువారం నాటికి కంది పప్పు లేకుండా పోయింది. మొత్తం 13.96 లక్షల కార్డుదారులు ఉండగా, ప్రతి కార్డు కు కిలో కంది పప్పు చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకు పౌరసరఫరా శాఖ హైదరాబాద్‌లోని తొమ్మిది సర్కిల్స్‌లోని రేషన్ షాపులకు 817 మెట్రిక్ టన్నులు, రంగారెడ్డి జిల్లా అర్బన్‌లోని మూడు సర్కిల్స్లోగల షాపులకు 578 మెట్రిక్ టన్నుల చొప్పున కంది పప్పు కోటాను కేటాయించి మొదటి విడతగా 75 శాతం విడుదల చేసిం ది. చౌకధరల దుకాణాల డీలర్లకు కిలో రూ.49.45 పైసల చొప్పున సరఫరా చేసి రూ.50ల చొప్పున లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సూచించింది. అయితే కంది పప్పుకు డిమాండ్ పెరగడం డీలర్లకు కాసులు కురిపిస్తోంది. -
పెన్సిడిల్.. నో స్టాక్!
కామారెడ్డి : దగ్గుమందు పెన్సిడిల్‌కు కృత్రిమ కొరత ఏర్పడింది. కామారెడ్డికి చెందిన అజంతా మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు అధిక సంపాదనకు ఆశపడి పెన్సిడిల్ మందులను పెద్ద ఎత్తున బంగ్లాదేశ్‌కు తరలించిన వ్యవహారంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో డ్రగ్ మాఫియా తమ వద్ద స్టాక్‌ను సర్దుకున్నట్టు తెలుస్తోంది. దీంతో కామారెడ్డిలో పెన్సిడిల్ సిరప్ కోసం మందుల దుకాణాలకు వెళితే ‘నో స్టాక్’ అనే సమాధానం వస్తోంది. మందుల దందాలో ఆరితేరిన కొందరు వ్యాపారులు అడ్డగోలు సంపాదనకు అలవాటుపడి అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న వ్యవహారం వెలుగుచూసిం ది. ఈ విషయం బయటకు పొక్కకుం డా అక్రమ రవాణాకు పాల్పడి చిక్కిన వ్యాపారులు ఔషధ నియంత్రణ శాఖ అధికారులను మేనేజ్ చేసినట్టు ప్రచా రం జరిగింది. అయితే సరిహద్దులు దా టిన అక్రమ దందాపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం స్థానికంగా కలకలం రేపింది. రహస్య ప్రాంతాలకు పెన్సిడిల్ స్టాక్.... పెన్సిడిల్ను భారీ మొత్తంలో తెప్పించి సరఫరా చేసే సదరు ఏజెన్సీ నిర్వాహకులు తమ వద్ద ఉన్న స్టాక్‌ను రహస్య ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. దీంతో స్థానిక రిటైల్ వ్యాపారులకు సదరు ఏజెన్సీ వారు స్టాక్ లేదని చెప్పినట్లు సమాచారం. పెన్సిడిల్ కొరత మూలంగా మందుల దుకాణాల వాళ్లు వేరే సిరప్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నాలు.. పెన్సిడిల్ సిరప్‌ను నిబంధనలకు విరుద్ధంగా, తప్పుడు బిల్లులతో ఇతర దేశాలకు సరఫరా చేసిన వ్యవహారంలో కేసుల నుంచి తప్పించుకునేందుకు సదరు ఏజెన్సీ నిర్వాహకులు పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని కేసులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తమకున్న పలుకుబడి ద్వారా ప్రభుత్వ పెద్దలను కలిసి ఈ కేసు నుంచి బయటపడేయాలని కోరినట్టు తెలిసింది. -
రైతన్నకు ఎరువు కష్టం
-
రైతన్నకు ఎరువు కష్టం
సాక్షి, హైదరాబాద్, నెట్వర్క్: కరువు పరిస్థితుల మధ్య కురిసిన వర్షాలతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న తెలంగాణ రైతన్నకు మరో కష్టం వచ్చి పడింది. సరిగ్గా నాట్లు వేసే సమయంలో తీవ్ర ఎరువుల కొరత అన్నదాతను కన్నీరు పెట్టిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, డీలర్ల తెంపరితనం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచటంలో సర్కారుకు ముందు చూపు కొరవడటం యూరియా కొరతకు కారణమైంది. దీనికితోడు అదనులో ఎరువు తప్పనిసరి కావడాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఒక్కో యూరియా బస్తాపై రూ. 120 వరకు అధికంగా వసూలు చేస్తూ.. పంటలు ఎండిపోయే దశలో వర్షాలు కురవడంతో యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యం.. డిమాండ్‌కు తగ్గ కేటాయింపులు లేకపోవడం.. సీజన్ పూర్తయిపోయిందన్న నిర్లక్ష్యం వెరసి రాష్ట్రంలో యూరియాకు తీవ్ర కొరత ఏర్పడింది. నిబంధనల ప్రకారం జిల్లాలకు వచ్చిన యూరియాలో కనీసం 50 శాతాన్ని సహకార సంఘాలకు కేటాయించాల్సి ఉంది. కానీ అధికారులు ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు డీలర్లకు ఎక్కువ మొత్తం యూరియాను ఇస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించి రూ. 284 ఉండాల్సిన యూరియా బస్తా ధర రూ. 350 నుంచి రూ. 400 వరకు పెంచేసి రైతులను దోపిడీ చేస్తున్నారు. రవాణా చార్జీల పేరిట ఒక్కో బస్తాపై రూ. 120 వరకూ అధికంగా వసూలు చేస్తున్నారు. భారీ కొరత.. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నెల వినియోగం కోసం 1.68 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా.. ఇప్పటివరకు 1.42 లక్షల టన్నులను మాత్రమే వ్యవసాయశాఖ సరఫరా చేయగలిగింది. ఇంకా 25,820 టన్నుల కొరత ఉంది. ఏ జిల్లాలోనూ అవసరమైన మేరకు యూరియా నిల్వలు అందుబాటులో లేవు. దీనికితోడు మరింతగా యూరియాకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ నెలాఖరుకు ఖరీఫ్ ముగుస్తున్న తరుణంలో ఎరువును ఇంకెప్పుడు సరఫరా చేస్తారో తెలియడం లేదు. సరఫరా అయిన యూరియాను కూడా డీలర్లు అక్రమంగా నిల్వ చేసి కొరతను ఇంకా పెంచుతున్నారు. పీఏసీఎస్‌లకు, హాకా సంస్థలకు కేటాయిస్తున్న ఎరువులను వ్యాపారులు రైతుల పేర్లతో దారి మళ్లిస్తున్నారు. వాటిని బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇప్పుడు అత్యవసరం.. తెలంగాణలో 7.53 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. 16.50 లక్షల ఎకరాల్లో పత్తి, 5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వరి ప్రస్తుతం పిలక దశ ముగింపులో ఉండడంతో.. ఇప్పుడు యూరియా చల్లితేనే అధిక దిగుబడి వస్తుంది. ఇక పత్తి, మొక్కజొన్న పంటలకూ ప్రస్తుత దశలో యూరియా అవసరం. ప్రైవేటు ‘మార్క్’ఫెడ్! సాధారణంగా మార్క్‌ఫెడ్ నుంచి ప్రాథమిక సహకార సంఘాల ద్వారా వ్యవసాయశాఖ యూరియాను రైతులకు సరఫరా చేస్తుంది. అయితే కొన్ని జిల్లాల్లో సహకార సంఘాలు మార్క్‌ఫెడ్‌కు బకాయి ఉండటంతో... వాటికి అవసరమైన మేరకు యూరియా సరఫరా చేయడం లేదు. ప్రైవేటు డీలర్లకు మాత్రం ఎక్కువశాతం యూరియాను ఇస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మార్క్‌ఫెడ్‌కు రూ. 8 కోట్లు బకాయిపడ్డాయి. దీంతో అవసరమైన మేరకు యూరియా ఇవ్వడానికి మార్క్‌ఫెడ్ నిరాకరిస్తోంది. దీంతో ఆ జిల్లాలో బ్లాక్మార్కెట్లో యూరియా బస్తా రూ. 380 వరకు విక్రయిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవలే వరి నాట్లు వేయడంతో.. డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ వ్యవసాయశాఖ ఒక రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తుండటంతో.. రైతులు బ్లాక్‌మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో బస్తా యూరియాను ఏకంగా రూ. 400కు విక్రయిస్తున్నారు. ఇటీవల జడ్చర్ల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌లలో విజిలెన్స్ దాడులు నిర్వహించింది. జడ్చర్లలో యూరియాను బ్లాక్మార్కెట్లో అమ్ముతున్న 6 షాపులను సీజ్ చేశారు. భారీగా యూరియా కొరత తలెత్తడంతో కల్వకుర్తికి వచ్చిన జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ వాహనంపైనా రైతులు దాడి చేయడానికి ప్రయత్నించారు. యూరియా కొరత ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో రైతులు తమ పంటలు కాపాడుకునేందుకు సమీపంలోని మహారాష్ట్రకు వెళ్లి అధిక ధరలకు కొనుగోలు చేసుకుంటున్నారు. అధికారుల అండదండలు! యూరియా వంటి ఎరువులతో పాటు విత్తనాలు.. పురుగుమందులు... ఇలా రైతులకు సంబంధించి ఏ అవసరాన్నైనా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధిత ప్రభుత్వాధికారులు కూడా వీలయినంతగా తోడ్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. అధికారుల సహకారంతోనే డీలర్లు, వ్యాపారులు ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించి.. అధిక ధరలకు అమ్ముకుంటున్నారన్న విమర్శలున్నాయి. లెసైన్స్ లేని కంపెనీల ఉత్పత్తులతో పాటు అనుమతి లేకుండా ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు అమ్ముతున్న విషయాలు తనిఖీల్లో వెలుగు చూస్తుం డడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నా యి. ప్రతి ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో ఉండే నిల్వలు, అమ్మకాలపై సంబంధిత ఏడీఏలకు సమాచారం ఉంటుంది. అయినా ఎరువులు, పురుగుమందులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతూనే ఉన్నాయి. కొరత పెద్దగా లేదు.. రాష్ట్రంలో యూరియా కొరత పెద్దగా లేదని వ్యవసాయ శాఖ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. రోజుకు 6 నుంచి 7 వేల టన్నుల యూరియా అవసరం అవుతుందని... ఇందులో వరి, పత్తికి యూరియా కావాలని, మొక్కజొన్న చివరి దశకు చేరినందున దానికి అవసరం లేదని చెప్పారు. మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో యూరియాకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. - బి.జనార్దన్‌రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ ‘బ్లాక్’ చేస్తే లెసైన్స్ రద్దు.. అనివార్య కారణాల వల్ల అక్కడక్కడా యూరియా సరఫరా ఆలస్యమవుతోందని, కొరత లేదని వ్యవసాయ శాఖ (ఎరువుల విభాగం) డిప్యూటీ డెరైక్టర్ కె.రాములు చెప్పారు. ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధరకు యూరియాను విక్రయిస్తే సంబంధిత డీలర్ల లెసైన్సులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. అక్రమంగా దాచిపెట్టినట్లు రుజువైతే వారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని పేర్కొన్నారు. రైతులు తమకు ఫోన్ ద్వారాగానీ, ఎస్ఎంఎస్ ద్వారాగానీ ఫిర్యాదు చేస్తే దాడులు చేసి చర్య తీసుకుంటామని చెప్పారు. - కె.రాములు, వ్యవసాయశాఖ డిప్యూటీ డెరైక్టర్ (ఎరువుల విభాగం) -
నో స్టాక్
రైతులను వేధిస్తున్న యూరియా కొరత కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు వరినాట్లు వేసే తరుణంలో స్టాకు లేదంటూ ప్రచారం జిల్లాకు 35.500 టన్నుల యూరియా అవసరం మచిలీపట్నం : ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎరువుల వ్యాపారుల లాభాపేక్ష రైతులకు మరో కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టాయి. వర్షాభావం, సాగునీటి విడుదలలో జాప్యం వల్ల ఆలస్యంగా అయినా వరినాట్లు పూర్తి చేస్తున్న రైతులను యూరియా కొరత రూపంలో మరో సమస్య వేధిస్తోంది. వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో గ్రామాల్లోని పీఏసీఎస్, పట్టణ ప్రాంతాల్లోని ఎరువుల దుకాణాల వద్దకు యూరియా కోసం వెళితే స్టాకు లేదనే సమాధానం ఎదురవుతోంది. దీంతో రైతులు కంగుతింటున్నారు. అసలే వరినాట్లు ఆలస్యంగా వేస్తున్నామని, నాటు వేసే సమయంలో ఎకరానికి కనీసం 25 కిలోల యూరియా తప్పనిసరిగా అవసరమని రైతులు చెబుతున్నారు. మొక్కల ఎదుగుదలకు యూరియా కచ్చితంగా అవసరమని, ఈ తరుణంలో అందుబాటులో లేకపోతే నష్టాలు తప్పవని పలువురు వాపోతున్నారు. వ్యాపారుల మాయాజాలం! యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని, అధిక ధరకు విక్రయించేందుకు పావులు కదుపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరినాట్లు నెల రోజుల పాటు ఆలస్యం కావడంతో మొక్కల ఎదుగుదల కోసం యూరియాను అధికంగా వినియోగిస్తామని, కాబట్టి కొరత లేకుండా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు. 35,500 టన్నులు అవసరం ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. సాగునీటి విడుదలలో జాప్యం కారణంగా సెప్టెంబరు నెలలోనూ వరి నాట్లు వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4.40 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. మరో రెండు లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని మండలాల్లో వరి నాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. ఒక్కసారిగా అన్ని ప్రాంతాల్లో వరినాట్లు ఊపందుకోవడంతో యూరియా వాడకం పెరిగింది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు తమ వద్ద యూరియా స్టాకు లేదని రైతులను తిప్పి పంపుతున్నారు. ఒకటి, రెండు రోజుల తర్వాత అధిక ధరకు యూరియా విక్రయాలు జరిపేందుకే వ్యాపారులు ఈవిధంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించకుండా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 18వేల టన్నుల సరఫరా ఇప్పటి వరకు జిల్లాలోని పీఎసీఎస్‌లకు, హోల్‌సేల్ వ్యాపారులకు, రిటైల్వ్యారులకు 18వేల టన్నుల యూరియా సరఫరా చేశామని జిల్లా వ్యవసాయశాఖ జేడీ నరసింహులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి 35,500 టన్నుల యూరియా దిగుమతి కావాల్సి ఉందని ఆయన చెప్పారు. కొద్ది రోజుల్లో యూరియా వస్తుందని వివరించారు. -
సీఎన్జీ.. నో స్టాక్
మహా నగరానికి సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) సరఫరా నిలిచి పోయింది. దీంతో నగరంలోని సుమారు 25 వేల సీఎన్జీ ఆటోలు, పదివేల కార్లు, 131 ఆర్టీసీ బస్సులు ఇంధనం (గ్యాస్) లేక ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాక్షి, హైదరాబాద్: మహా నగరానికి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) సరఫరా నిలిచిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నగర శివారులోని శామీర్పేటలోగల మదర్స్టేషన్కు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ ఆగిపోయింది. ఫలితంగా మదర్ స్టేషన్‌కు సమీపంలోని నల్సార్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 30 ఫ్లాట్లతో పాటు మేడ్చల్ మండల కేంద్రంలో సుమారు 410 కుటుంబాలకు వంటగ్యాస్(పీఎన్జీ), నగరంలోని 15 ఫిల్లింగ్ స్టేషన్లకు సీఎన్జీ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో జరిగిన గెయిల్ పైప్‌లైన్ ఘటన ప్రభావం పైప్‌లైన్ గ్యాస్ సరఫరాపై పడినట్లయింది. ఆగిన సీఎన్జీ వాహనాలు: నగరంలోని సుమారు 25వేల సీఎన్జీ ఆటోలు, పదివేల కార్లు, 131 ఆర్టీసీ బస్సులు ఇంధనం(గ్యాస్) లేక ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సీఎన్జీ సరఫరా లేకపోవడంతో పెట్రోల్ బంకుల్లోని స్టేషన్లను మూసివేసి నో స్టాక్ అని బోర్డులను ప్రదర్శించారు. దీంతో మంగళవారం రాత్రి పలు ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వాహనాలు కిక్కిరిసిపోయాయి. వాస్తవంగా నగరంలోని ఒక్కో స్టేషన్‌కు ప్రతి రోజూ 1000 ఆటోలు, 200 కార్ల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్జీ కిట్స్ సామర్థ్యం నాలుగున్నర కిలోలుకాగా 4 కిలోల వరకు, కార్ల సామర్థ్యం పదికిలోలు కాగా ఎనిమిది కిలోల వరకు నింపుతారు. ఒక్కో స్టేషన్‌కు ప్రతిరోజూ 6 వేల కిలోల వరకు గ్యాస్ డిమాండ్ ఉంటుంది. అంటే సగటున ప్రతిరోజూ మొత్తం స్టేషన్లకు 90 వేల కిలోల గ్యాస్ సరఫరా అవసరం. వారం వరకు సరఫరా బంద్: గెయిల్ దుర్ఘటన దృష్ట్యా పైప్‌లైన్ పనుల మరమ్మతులకు వారం పట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పలు సీఎన్జీ వాహనాలకు ప్రత్యాయ్నాయం లేకుండా పోయింది. ఆటోడ్రైవర్ల ఆందోళన: సీఎన్జీ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆటో్రైడె వర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఆటోలను నడిపితే రాయితీలతో పాటు ఐదేళ్ల పాటు రోడ్డు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో వేల రూపాయలు ఖర్చు చేసి సీఎన్జీ కిట్స్ అమర్చుకున్న ఆటో డ్రైవర్లు గ్యాస్ కోసం స్టేషన్ల ముందు పడిగాపులు గాస్తున్నారు. -
ఎంతైనా.. కొనేద్దాం!
ముగిసిన ‘మునిసిపల్’ ప్రచారం ఓటర్లను ఆకట్టుకునే పనిలో నేతలు {పలోభాలకు గురిచేసేందుకు సిద్ధం సాక్షి, హన్మకొండ : మునిసి‘పోల్స్’కు ప్రచారం ముగిసింది.. ఇక ఎన్నికలకు మరో 24 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఇంతవరకు వినూత్న ప్రచారాలతో ఆకట్టున్న అభ్యర్థులు.. ఇప్పుడు ఓటర్లను మభ్యపెట్టే పనిలో పడ్డారు. మద్యం, నోట్ల కట్టలను ఎరగా చూపుతూ తమకే ఓటేయాలంటూ ప్రమాణాలు సైతం చేయించుకుంటున్నారు. వార్డును బట్టి.. అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులను బట్టి ఒక్కో ఓటుకు ధర రెండువేల రూపాయల వరకు పలుకుతోంది. మరికొన్ని చోట్ల యువతను ఆకట్టుకునేందుకు క్రికె ట్ కిట్లను సైతం పంపిణీ చేస్తున్నారు. మహిళా ఓట్ల కోసం చీరలు, స్టీలు సామన్లు పంచేందుకు వెనుకడాడం లేదు. ఇక అన్ని మున్సిపాలిటీల్లో మద్యం షాపుల్లో ఉన్న సరుకంతా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులే కొనుగోలు చేశారు. దీంతో సాధారణంగా మద్యం కొనేందుకు వైన్స్‌కు వెళ్లిన వారికి నో స్టాక్ అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వైన్ షాపుల్లో ఆఫీసర్స్ ఛాయిస్, అరిస్ట్రోక్రాట్ ప్రీ మియం, మెక్‌డోవెల్, ఇంపీరియల్‌బ్లూ వంటి బ్రాండ్లు లభించట్లేదంటే అతిశయోక్తి కాదు. అంతకంటే ఎక్కువ మేమిస్తాం జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, నర్సంపేట, భూపాలపల్లి, పరకాల నగర పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 116 వార్డుల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఐదింటిలో డిమాండ్ ఉన్న వార్డుల్లో ఓటుకు బహిరంగానే కనిష్టంగా రూ. 500 నుంచి రూ. 1000 వరకు పలుకుతోంది. ఈ ముడుపులు చెల్లించే ముందు అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యర్థి ఓటుకు ఎంత ఇస్తున్నాడో ముందుగానే ఆరా తీస్తున్నారు. ఆ త ర్వాత అంతకు మూడొంతులు ఇస్తామని ఓటరుతో బేరం పెట్టుకుంటున్నారు. కాదు కూడదంటే ఇంకా పెంచేందుకు సిద్ధపడుతున్నారు. ఎటుచేసి ఓటరు మనసును ఎలా కొల్లగొట్టాలనే దానిపైనే అభ్యర్థులు దృష్టి సారించారు. కాగా, నర్సంపేటలోని 12, 16, 17 వార్డుల్లో, పరకాలలోని 8, 9, 18, 16 వార్డుల్లో, మహబూబాబాద్‌లోని 14, 16 వార్డుల్లో ఓటుకు రెండు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళా ఓటర్లకు గాలం మహబూబాబాద్, జనగామ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ స్థానం మహిళలకు రిజర్వు కావడం తో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు చీరలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఒకటో వార్డులో చీరలు పంపిణీ చేస్తు న్న సీపీఎం నాయకుడిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. అతడి నుంచి పది చీరలు స్వా దీనం చేసుకున్నారు. మరో పద్ధతిలో కుండ గు ర్తు వచ్చిన అభ్యర్థులు అందుకు గుర్తుగా స్టీలు బిందెలు ఇస్తున్నారు. ఉంగరాలు గుర్తు వచ్చిన అభ్యర్థులు రోల్డ్‌గోల్డ్ ఉంగరాలు ఇస్తూ మహి ళా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చివరి అస్త్రంగా పొన్నాల ప్రచారం మునిసిపాలిటీ ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగియడంతో టీపీసీసీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య జనగామలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. నర్సంపేటలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మిగిలిన చోట్ల స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ రాలేదు. కాగా, నర్సంపేట నగర పంచాయతీలో 16వ వార్డు టీఆర్ఎస్ అభ్యరి జి.రవీందర్ సతీమణి శుక్రవారం ఎస్బీహెచ్ నర్సంపేట బ్రాంచ్ నుంచి గోల్డ్‌లోన్ కింద రూ. 12 లక్షలు డ్రా చేశారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పోలీసు లు తనిఖీలు చేస్తుండగా, వీరి గుమస్తా వాహ నం దిగి పారిపోవడంతో అనుమానించిన పోలీసులు ఆ సొమ్ము పూర్వపరాలపై విచారణ చేస్తున్నారు. మహబూబాబాద్‌లోని 23 వార్డు లో కాంగ్రె స్ నాయకులు డబ్బు పంపిణీ చేస్తుం డగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 8,000 స్వాధీనం చేసుకున్నారు. -
నో స్టాక్
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి : జిల్లాలో ఓ వైపు పంటలకు అనుకూలంగా వర్షాలు కురుస్తుండటం.. మరో యూరియా తీవ్రంగా వేధిస్తుండటంతో రైతన్నకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఎక్కడ యూరియాను పంపిణీ చేస్తున్నారంటే అన్నదాతలు అక్కడికి పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడ నో స్టాక్..అనే మాట వినిపించడంతో బిక్కమోహం వేసుకుని కొద్దిసేపు వేచిచూసి ఇంటిబాట పడుతున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురియడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలు సాగుచేశారు. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో ఎరువులకు ముఖ్యంగా యూరియాకు బాగా డిమాండ్ పెరిగింది. అవసరానికి సరిపడా దొరక్కపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో యూరియా కొరత లేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా దొరకడం లేదు. రైతులు ఆందోళనలకు దిగిన చోట మరో మూడు నాలుగు రోజుల్లో యూరియా పంపిణీ చేస్తామని రైతులను మభ్యపెట్టేందుకు అధికారులు ముందస్తుగా టోకెన్లు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే గోపాల్పేట మండలంలో మంగళవారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో 200 మందికి అడ్వాన్స్‌గా టోకన్లు ఇచ్చి పంపారు. యూరియా ఎప్పుడు వచ్చే ది మాత్రం రైతులకు సమాచారం ఇవ్వలేదు. గోపాల్‌పేటలో క్యూలైన్లో నిల్చునేందుకు ఇబ్బందులు పడుతూ ఆఖరుకు తమ పాసుపుస్తకాలను క్యూలైన్లో పెట్టి అతికష్టం మీద టోకెన్లు సంపాదించుకున్నా యూరియా మా త్రం దొరకలేదు. మరికల్ మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్నారులు సైతం తమ తల్లిదండ్రులకు బదులుగా ఎరువుల కోసం క్యూలో నిల్చున్నారంటే యూరియా కొరత ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అలాగే బుధవారం తెల్లవారకముందే వందలాది మంది రైతులు దేవరకద్రలో క్యూలో నిల్చున్నా యూరియా దొరకలేదు. ఇక్కడి సొసైటీలో అరకొరగా ఉన్న స్టాకును పంపిణీచేసి అధికారులు చేతులెత్తేశారు. కేటాయింపులు ఇలా.. జిల్లాకు కేటాయించిన ఎరువుల్లో 50 శాతం మార్క్‌ఫెడ్, మరో 50 శాతం ప్రైవేట్ డీలర్లకు కేటాయిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌కు వచ్చిన ఎరువులను సొసైటీలకు పంపుతున్నా చాలా సొసైటీల్లో అక్కడకు చేరేలోపే మాయమవుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రైతులు తప్పని పరిస్థితుల్లో బయట ఎరువుల దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి బస్తా యూరియాపై రూ.200 వరకు అదనంగా వసూలు చేస్తూ రైతులను పిండేస్తున్నా.. వ్యవసాయశాఖ విజిలెన్స్అధికారులు కన్నెత్తిచూడటం లేదు. ప్రతి ఎరువుల దుకాణంలో ధరల పట్టికను విధిగా ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. జిల్లాకేంద్రంలోని కొన్ని దుకాణాల్లోనే అది కనిపిస్తుంది. ఆగస్టులో 31,426 టన్నుల యూరియా అవసరం ఉండగా, వ్యవసాయశాఖ అధికారులు 20,050 టన్నుల యూరియా కోసం ప్రణాళికలు సిద్ధంచేసి ఆ మేరకు స్టాక్ పంపించాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. నెలరోజులు గడిచినా అందులో ఇప్పటివరకు సగం స్టాక్ కూడా రాలేదు. వచ్చిన స్టాక్ ఎక్కడా కనిపించడం లేదు. గతేడాది కంటే ఈ సారి ఎక్కువ యూరియా వచ్చిందని మాత్రమే అధికారులు చెబుతున్నారే తప్ప అవసరమైన మేరకు తెప్పించడంలో విఫలమవుతున్నారు. -
అసలుకు కొసరు
సాక్షి, సిటీబ్యూరో : సమైక్యాంధ్ర సమ్మె కారణంగా నగరానికి కొన్నిరకాల కూరగాయల దిగుమతి నిలిచిపోయింది. ఈ కొరతను ఆసరా చేసుకొని వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. తక్కువ రేటుకు తాజా కూరగాయలు లభిస్తాయని రైతుబ జార్‌కు వెళితే అక్కడ తిరుక్షవరం అవుతోంది. అక్కడ బోర్డుపై రాసినరేట్లకు... అమ్మే ధరకు ఏమాత్రం పొంతన ఉండట్లేదు. పచ్చిమిర్చి, ఉల్లి, క్యాప్సికం, క్యారెట్ వంటి వాటి ధరల్లో కేజీకి 5-20 రూపాయలు తేడా ఉంటోంది. నిజానికి నగరంలోని అన్ని రైతుబ జార్లలో ఒకే ధరను అమలు చేయాల్సి ఉండగా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నగర మార్కెట్లో పచ్చిమిర్చి, ఉల్లి కొరతను ఆసరా చేసుకొని ఉల్లి వ్యాపారులు, రైతులు ఎవరికిష్టమొచ్చినట్లు వారు ధర నిర్ణయించి వినియోగదారులను దగా చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని పది రైతుబ జార్లలో కూరగాయల ధరలు ఒక్కోచోట ఒక్కోవిధంగా ఉండటం అక్రమాల తీరుకు అద్దం పడుతోంది. బోర్డుతో సరి నగరంలోని అన్ని రైతుబజార్లలో బోర్డుపై కూరగాయల ధరలు పెద్దఅక్షరాలతో రాస్తున్నా... వాటినెవరూ అనుసరించట్లేదు. డిమాండ్ అధికంగా ఉన్న కూరగాయలకు బోర్డుపై ఉన్న ధరకు రూ.5-20లు ఎక్కువ ధర చెప్పి, కంటితుడుపుగా రూ.2-3 తగ్గించి విక్రయాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా పచ్చిమిర్చి, క్యాప్సికం, క్యారెట్, ఉల్లి, వెల్లుల్లి, అల్లం వంటి వాటి విషయంలో వ్యాపారులు చెప్పిందే సిసలైన ధరగా చెలామణి అవుతోంది. వీటి ధరలు హోల్‌సేల్ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా నిర్ణయించేస్తున్నారు. వీరికి రైతుబజార్ల సిబ్బంది కూడా పూర్తిగా సహకరిస్తుండటంతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్, ఫలక్‌నుమా, వనస్థలిపురం రైతుబజార్లలో ఏకంగా వారికిష్టమొచ్చిన ధరనే బోర్డుపై రాయిస్తూ వినియోగదారుడిని నిలువునా దగా చేస్తున్నారు. ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లలో వ్యాపారుల తీరు మరీ దారుణంగా ఉంది. మిర్చి పావు కిలో రూ.20ల ప్రకారం వసూలు చేస్తున్నారు. ఎవరైనా నిల దీస్తే... ‘మీకు ఇష్టమైతే కొనండి, లేదంటే వెళ్లండి’ అంటూ సమాధానమిస్తున్నారు. దీనిపై రైతుబ జార్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోవట్లేదని వినియోగదారులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఉదయం 10గం.లు దాటితే రైతుబజార్లలో ఎస్టేట్ ఆఫీసర్, సూపర్వైజర్లే కన్పించరనీ, ఈ అక్రమాల్లో వారికీ వాటా ఉండటంతో ముఖం చాటేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తనిఖీలు ఏవీ..? రైతుబజార్లపై అధికారుల తనిఖీలు లేకపోవడం వల్లే అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. సబ్సిడీ ఉల్లి గుట్టు గా తరలిపోతున్నా.. ప్రశ్నించే నాధుడే లేడు. అందుకే రైతుబజార్‌కు సరుకు వచ్చిన గంటలోనే కౌంటర్లో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తోంది. నిజానికి హోల్‌సేల్ మార్కెట్ ధరకు 20శాతం అధికంగా రేటు నిర్ణయించి రైతుబ జార్లలో అమలు చేయాలి. ఈ ధరలు కూడా అన్ని రైతుబజార్లలో ఒకే విధంగా ఉండాలన్నది నిబంధన. అయితే... ఆ ధరతో సంబంధం లేకుండా వ్యాపారులు సొంత ధరలను అమలు చేస్తున్నారు. సిబ్బందితో కుమ్మక్కై అధిక ధరలు బోర్డుపై రాయిస్తూ... అందుకు ప్రతిఫలంగా ఏరోజుకారోజు మామూళ్లు ముట్టచెప్పే వ్యవహారం గుట్టుగా సాగుతోంది. ఈ అవకతవకలపై రైతుబజార్ సీఈఓ ఎం.కె.సింగ్ దృష్టిపెట్టక పోవడంతో అక్రమాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి.