మంచిర్యాలరూరల్(హాజీపూర్): వేసవి కాలంలో చల్లని బీరు తాగాలని ఆశించే మద్యంప్రియులకు బీర్లు దొరకడం కష్టంగా మారుతోంది. ఇ ప్పటికే హాజీపూర్ మండలం గుడిపేటలోని మ ద్యం డిపోకు బీర్ల సరఫరా చాలావరకు నిలిచి పోయింది. వచ్చిన నిల్వలను డిపో పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లకు రేషియో పద్ధతిన సరఫరా చేస్తోంది. బీర్లకు కొరత ఏర్పడగా.. కొ ద్ది రోజుల్లో తీవ్రం కానున్నట్లు తెలుస్తోంది. గ తంలో పలు కంపెనీలు ప్రభుత్వ లిక్కర్ గోదా ములకు సరఫరా చేసిన బీరు నిల్వలకు బకా యిల చెల్లింపులో జాప్యమే కొరతకు కారణమని తెలుస్తోంది.
గుడిపేట లిక్కర్ డిపో పరిధిలో 135 మద్యం దుకాణాలు, 28వరకు బార్లు ఉన్నా యి. వేసవిలో పెద్దయెత్తున బీర్ల అమ్మకాలు సాగుతాయి. గత ఏడాది మార్చిలో రెండు లక్షల వరకు బీరు కేసుల విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో 1.80లక్షల వరకు బీరు కేసులు మాత్రమే అమ్మకాలు జరిగాయి. గత ఏడాది బీరు కేసులు మద్యం దుకాణాల డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా జరిగి డిపోలో లక్షల కేసుల నిల్వలు ఉండేవి. ఇప్పుడు బీరు కేసులు వచ్చినవి వచ్చినట్లు విక్రయిస్తుండగా.. డిపోలో నిల్వలు ఉండడం లేదు. ఈ లెక్కన డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేదని తెలుస్తోంది.
బిల్లులు పెండింగ్‌లో..
లిక్కర్ తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వం వివిధ బ్రాండ్లకు సంబంధించి బీర్లు కొనుగోలు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం డిపోలకు సరఫరా చేస్తోంది. అక్కడి నుంచి రిటైల్ దుకాణాలకు సరఫరా జరుగుతుంది. లిక్కర్ తయారీ కంపెనీలు సరఫరా చేసిన మద్యం బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కొన్ని డిస్టిలరీస్, బ్రేవరేజేస్‌లు మద్యం ఉత్పత్తి తగ్గించడంతోపాటు బీరు నిల్వల సరఫరా చాలా వరకు తగ్గించేశాయి. వేసవిలో మార్చి నుంచి మే వరకు దాదాపు రూ.2కోట్ల విలువైన బీర్ల అమ్మకాలు జరుగుతాయి. ఒక్కో మద్యం దుకాణానికి రోజుకు సుమారుగా 50 బీరు కేసుల వరకు విక్రయాలు జరిగేవి. కానీ ఈ వేసవిలో 30 బీరు కేసుల వరకు కూడా సరఫరా చేయడం లేదని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో బీర్ల కొరత తీవ్రం కానుంది.
డిపో పరిసరాలు వెల వెల
గుడిపేట మద్యం డిపో పరిసరాలు నిత్యం కళకళలాడుతూ కనిపించేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా వెల వెలబోతున్నాయి. పలు మద్యం కంపెనీలు బీరు నిల్వల సరఫరా తగ్గించడంతో లారీలు, ఇతర వాహనాల రాకపోకలు తగ్గాయి. మొన్నటి వరకు రోజుకు 20 వాహనాలకు పైగా మద్యం నిల్వలతో వచ్చిన సందర్భాలు ఉండగా ఇప్పుడు 10 వాహనాలు కూడా డిపోకు రావడం లేదు. డిపో మేనేజర్ శ్రీనివాస్‌ను సంప్రదించగా.. డిపోకు వచ్చిన బీరు నిల్వలను అన్ని రిటైల్ మద్యం దుకాణాలకు రేషియో పద్ధతిన సమానంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment