కళ్లెదుటే ఒక్కొక్కటిగా ఆక్రమణ | - | Sakshi
Sakshi News home page

కళ్లెదుటే ఒక్కొక్కటిగా ఆక్రమణ

Published Wed, Jan 24 2024 6:14 AM | Last Updated on Wed, Jan 24 2024 11:05 AM

- - Sakshi

నిర్మల్‌చైన్‌గేట్‌: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్‌గాంధీ తలపెట్టిన యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుందని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు పేర్కొన్నారు. అ స్సాంలో ఏఐసీసీ నాయకుడు రాహుల్‌గాంధీ పాదయాత్రను బీజేపీ నాయకులు అడ్డుకోవడంపై జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. స్థానిక గాంధీ పార్క్‌లోని బాపూజీ విగ్రహం ఎదుట బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి దాడులు సరికాదని పేర్కొన్నారు. రాహుల్‌ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, గుడి సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి సరికాదని పేర్కొన్నారు.

కళ్ల ముందే..
ఈ చిత్రాల్లో మొదటిది నెలక్రితం తీసింది. జిల్లాకేంద్రంలోని ప్రియదర్శినినగర్‌లో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వెనుక గజ్‌గఢ్‌ చుట్టూ ఉన్న కందకమిది. రెండో చిత్రం.. తాజాగా తీసింది. నిండుగా నీటితో ఉన్న చారిత్రక కందకాన్ని ఇలా.. మొరంతో నింపేశారు. ఇదంతా అధికారులు, ప్రజాప్రతినిధుల కళ్లముందే కొనసాగుతోంది. ఏవేవో కారణాలు చెబుతూ చారిత్రక కందకాలను ఖతం చేస్తున్నారు. భూగర్భ జలాలకు ఎసరు పెడుతున్నారు.

చైన్‌గేట్‌ వద్ద..
నిత్యం వేలాదిమందితోపాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగించే జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనే కందకం క్ర మంగా కనుమరుగవుతోంది. నిర్మల్‌ ముఖద్వారంగా వెలుగొందిన చైన్‌గేట్‌ పక్కనే ఓ వైపు ఇప్పటికే కందకం చిన్నకాలువగా మార్చేశారు. ఇక ఇంకోవైపూ అదే కథ మొదలైంది. బస్‌డిపో గోడను ఆనుకుని వస్తున్న కందకాన్ని క్రమంగా ఆక్రమి స్తూ వస్తున్నారు. త్వరలోనే ప్రారంభించేందుకు సి ద్ధం చేస్తున్న ఓ షాపింగ్‌మాల్‌ పక్కనే ఉన్నా.. సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.

క్రమక్రమంగా కనుమరుగు..
నిర్మల్‌లో చాలా తెలివిగా కందకాలను కబ్జా చేస్తున్నారు. ముందుగా కందకాన్ని ఆనుకుని కొంత భూమి చదును చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ చిన్నగా షెడ్డులా వేస్తున్నారు. క్రమంగా దాని వెనుకభాగంలో మట్టి నింపేసి ఆక్రమిస్తున్నారు. కాలక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది చేతులు తడుపుతూ ఆ భూమిని తమపేరిట చేసుకుంటున్నారు. ఈమధ్యకాలంలోనే చేపల మార్కెట్‌ కాలంలో కందకం ఓ వైపు మొత్తం కనిపించకుండా పోయింది. అక్కడ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. సాక్షాత్తు ప్రధాన రహదారిపై చైన్‌గేట్‌ (బస్‌డిపో) దగ్గర గల కందకాన్ని ఓవైపు నామరూపాలు లేకుండా చేసేశారు. ఇప్పుడు ఇంకోవైపు అదే కథ మొదలుపెట్టారు. క్రమంగా దాన్నీ కబ్జా చేసే పని కొనసాగుతోంది. బస్‌డిపో పక్కన, రిలయన్స్‌ స్మార్ట్‌ వెనుక రెండుచోట్లా మట్టిని నింపేస్తున్నారు.

నిర్మల్‌: ‘పేరుకు జిల్లాకేంద్రం. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉంటారు. కానీ.. ఏం లాభం సార్‌..? వాళ్ల కళ్ల ముందే ఇన్ని కబ్జాలు, ఆక్రమణలు జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోరు..’ అంటూ నిర్మల్‌వాసులు పెదవి విరుస్తున్నారు. దాదాపు 450ఏళ్లకు పైగా చారిత్రక నేపథ్యమున్న నిర్మల్‌లో కందకాలు, కాలువలు, చారిత్రక కట్టడాలు ఒక్కటేమిటీ.. అన్నీ ఆక్రమణదారుల కబ్జాల్లోకి వెళ్లిపోతున్నాయి. పట్టణంలోని పాతకాలనీల్లో ఇప్పటికే ఒక్కటంటే ఒక్క కందకమూ మిగల్లేదు. ఉన్న జౌళినాలానూ ఆక్రమిస్తూ వస్తున్నారు.

అప్పుడు తవ్విస్తే..
నిమ్మనాయుడి చేతిలో పురుడుపోసుకుని శ్రీనివాసరావు లాంటి ముందుచూపున్న పాలకుల కాలంలో నిర్మల్‌ ఓ ప్రణాళికాబద్ధంగా నిర్మితమైంది. పట్టణం చుట్టూ ఉన్న రక్షణ గఢ్‌, బురుజులను ఆనుకుని లోతైన కందకాన్ని తవ్వారు. దీంట్లో అప్పట్లో మంచినీళ్లు, మొసళ్లు ఉండేవని చరిత్ర చెబుతోంది. కనీసం 30అడుగుల వెడల్పుతో ఇవి ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా రాజ్యరక్షణతోపాటు నిమ్మలలో నీటికి కరువు ఏర్పడకుండా ఉండేలా నిర్మించారు. గొలుసుకట్టు చెరువులు, కందకాల కారణంగానే ఇప్పటికీ నిర్మల్‌లో నీటికరువు అన్న మాట కూడా రాలేదు. అలాంటిది వీటిని కబ్జాలు చేస్తూ పోతుంటే.. కరువుకాలం ఎంతో దూరం ఉండదని నిర్మల్‌వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఫిర్యాదులు వచ్చినా..
జిల్లాకేంద్రంలోని ఎస్సార్‌ డీజీ స్కూల్‌ (ప్రభుత్వ ప్రధానాస్పత్రి) వెనుక కందకాన్ని కబ్జా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పురావస్తుశాఖకు చెందిన కట్టడాలు, కందకాలను మున్సిపల్‌కు చెందిన కొందరు ఇష్టారీతిన కబ్జాలు చేయడంపైనా ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరితే.. జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.

కళానగర్‌లో అదే కథ..
జిల్లాకేంద్రంలోని ప్రియదర్శినినగర్‌కు వెళ్లే దారిలో కళానగర్‌ వద్ద గల కందకం కూడా కబ్జాలతో కనుమరుగవుతోంది. ఇప్పటికే బాలాజీ, బాహుబలి అపార్ట్‌మెంట్లు, వివేక్‌ స్కూల్‌, జోహ్రనగర్‌ వైపు కందకం చిన్నపాటి మురుగు కాలువలా మార్చేశారు. ఇక రోడ్డుపైనే కల్వర్టు పక్కన కందకంలోనే మట్టి పోసి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. దీన్ని తొలగిస్తామని అధికారులు చెప్పి ఏళ్లు గడుస్తున్నాయి. దీన్ని చూసి వెనుకవైపు మిగతా ప్లాట్ల వాళ్లు కందకంలోకి చొచ్చుకువచ్చి నిర్మాణాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నెలక్రితం నీటితో నిండుగా కందకం1
1/1

నెలక్రితం నీటితో నిండుగా కందకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement