రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4, 5వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన వర్డ్ పవర్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూపీసీ)రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ పోటీల్లో స్పెల్లింగ్, రీడింగ్, అర్థం రౌండ్ల అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేశారు. 4వ తరగతి నుండి ఆడే విజయ్‌కుమార్ (నిర్మల్), యశ్వంత్ (ఆసిఫాబాద్), రాజేశ్ (ఆసిఫాబాద్), కోట్నాక్ కళ్యాణ్ (ఆసిఫాబాద్), కుర్సెంగ వినోద్ (ఆసిఫాబాద్) విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 5వ తరగతి నుండి కృష్ణ ధృవ (ఆసిఫాబాద్), తొడసం వైష్ణవి(ఆదిలాబాద్), మడావి వరలక్ష్మి (ఆదిలాబాద్), రాథోడ్ బాలాజీ(నిర్మల్), లక్ష్మణ్‌చౌదరి (నిర్మల్), కిరణ్ రాథోడ్ (ఆసిఫాబాద్) జిల్లాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. విజేతలకు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏసీఎంవో జగన్, విభా ఫౌండేషన్ సీనియర్ ప్రొగ్రాం మేనేజర్ వీరనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment