ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
● రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఈఈ ● బిల్లుల మంజూరు కోసం రూ.లక్ష డిమాండ్
ఆదిలాబాద్‌రూరల్: ఓ అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. ఆదిలాబాద్‌లోని ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నాంవార్ శంకర్ కాంట్రాక్టర్ నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. టీజీఐడీసీ డిప్యూటీ ఈఈ శంకర్ ఇటీవల కాంట్రాక్టర్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కేఆర్కే కాలనీ సమీపంలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల పనుల కాంట్రాక్ట్‌ను కరుణాకర్‌రావు దక్కించుకున్నాడు. రూ.14.36 కోట్లతో జిల్లా కేంద్రానికి చెందిన సబ్ కాంట్రాక్టర్ నారాయణరెడ్డి తీసుకుని పనులు చేపడుతున్నాడు. విడతల వారీగా పూర్తయిన పనులకు సంబంధించి రూ.2 కోట్లు విడుదలయ్యాయి. మంజూరైన ఈ బిల్లులను డీఈఈ శంకర్ మరో భవన నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్‌కు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. విష యం తెలుసుకున్న నారాయణరెడ్డి మంగళవారం డిప్యూటీ ఈఈని కార్యాలయంలో కలిశాడు. తాను చేసిన పనులకు గాను మంజూరైన డబ్బులు విడుదల చేయాలని కోరాడు. 0.5 శాతం ఇవ్వాలని సదరు అధికారి సూచించాడు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఆ సమయ ంలోనే అధికారి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. తాను నిర్మాణం చేపడుతున్న భవనం దగ్గరికి రావాలని పేర్కొన్నాడు. మంగళవారం రూ.50వేలు, మిగతా రూ. 50వేలు బుధవారం ఇవ్వాలని కాంట్రాక్టర్‌తో సదరు అధికారి ఒప్పందం కుదుర్చుకున్నాడు. బిల్లులు విడుదలైన ప్రతీసారి కమీషన్ ఇవ్వాలని పేర్కొన్నాడు. మధ్యాహ్నం సదరు అధికారి నిర్మాణం చేపడుతున్న భవనం దగ్గరికి రాగా కాంట్రాక్టర్ ఆయనకు రూ.50వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ అధికారిని కరీంనగర్‌కు తరలించారు. బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐలు కిరణ్‌రెడ్డి, స్వామి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment