వైద్యురాలు శృతికి సన్మానం
మంచిర్యాలటౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పు రస్కరించుకొని మంగళవారం పట్టణంలోని వైశ్యభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన మహిళలను మంచిర్యాల వాసవీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన బర్త్‌రూట్ ఆస్పత్రి వైద్యురాలు శృతి గోలిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవీ వనిత క్లబ్ అధ్యక్షురాలు మల్యాల సంగీత, సెక్రటరి కే.గాయత్రి, కోశాధికారి గుండా సునీత, పలువురు మహిళలు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
భైంసారూరల్: మండలంలోని కోతల్‌గాం గ్రామానికి చెందిన రైతు పోలబోయిన భోజన్న(62) విద్యుత్ షాక్‌తో మంగళవారం మృతి చెందినట్లు సీఐ నైలు తెలిపారు. గ్రామానికి చెందిన భోజన్న అడవి జంతువుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు విద్యుత్ తీగలు అమర్చాడు. ఎప్పటిలాగే మంగళవారం రైతు తన పంటపొలంలోకి వెళ్లగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
ఐదుగురు జూదరుల అరెస్టు
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): భోరజ్ మండలంలోని గిమ్మ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపారు. గండ్రత్ సతీష్, అయిండ్ల కిరణ్ కుమార్, కందుల సాయికృష్ణ, జి సతీష్, ఎన్ రాకేష్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 52 పేక ముక్కలు, రూ. 43,290 నగదును సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్ అనే మరో వ్యక్తి పరారయ్యాడన్నారు.
భైంసాలో బైక్ చోరీ
భైంసాటౌన్: పట్టణంలో చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుస చోరీలు పట్టణ వాసులను కలవరపెడుతున్నాయి. తాజాగా పట్టణంలోని గాంధీగంజ్ ప్రాంతంలో బైక్ చోరీకి గురైంది. సీఐ జీ. గోపినాథ్ కథనం ప్రకారం.. మండలంలోని హంపోలికి చెందిన ఊరే సుభాష్ పట్టణంలో ప్రైవే ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం దుకాణం ఎదుట బైక్ నిలిపి ఉంచాడు. సాయంత్రం కనిపించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment