Nirmal District News
-
పరీక్షా కేంద్రాల సందర్శన
తానూరు: మండలంలోని ఎల్వి, భోసి, తానూరులోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను బుధవారం డీఈవో పీ రామారావ్ సందర్శించారు. తానూరులో పదో తరగతి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఎంఈవో నరేందర్, సీఎస్‌లు శంకర్, రాజశేఖర్, మల్లన్న, సిబ్బంది లింబాద్రి తదితరులున్నారు. రేషన్ దుకాణం తనిఖీ సోన్: మండలంలోని న్యూ బొప్పారం గ్రామంలోని రేషన్‌షాపును బుధవారం అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు. మంగళవారం ఇదే షాపులో తహసీల్దార్ మల్లేశ్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం గమనార్హం. ఆయన వెంట ఆర్ఐ అలీమున్నీసా, డీలర్ హన్మంతు తదితరులున్నారు. -
కలెక్టరేట్లో పాపన్న వర్ధంతి
నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్ హాజరై పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దొరలు, భూస్వాములు, పెత్తందార్లకు వ్యతిరేకంగా పాపన్నగౌడ్ పోరాడిన తీరును వివరించారు. పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, సీపీవో జీవరత్నం, గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌గోపాల్, కుల సంఘాల నాయకులు అమరవేణి నర్సాగౌడ్, అనుముల భాస్కర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘హామీలు మరిచిన ప్రభుత్వం’
నిర్మల్‌చైన్‌గేట్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో తమ కు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక విస్మరించిందని వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాక ర్ ఆరోపించారు. వీవోఏల సమస్యలు పరిష్కరించాలని బుధవారం కలెక్టర్ కార్యాలయాన్ని వీవోఏ లు ముట్టడించారు. దీనిని ముందే గ్రహించిన పోలీ సులు కలెక్టరేట్ ఎదుట భారీ బందోబస్తు చేపట్టి వీవోఏలను లోనికి అనుమతించకుండా అడ్డుకున్నా రు. దీంతో వీవోఏలు గేటు బయట బైఠాయించా రు. అనంతరం ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. మూడేళ్లుగా రావాల్సిన సీ్త్రనిధి ఇన్సెంటివ్ డబ్బులు వీవోఏలు, వీవోలకు ఇప్పించాలని కోరారు. సీ్త్రనిధి బ్యాంక్ నుంచి వీవోఏలకు నేరుగా రూ.10వేల వేతనంతో పాటు ట్యాబ్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, సీనియారిటీ ప్రాతిపదికన వీవోఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని సూచించారు. పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. వీవోఏలు స్వప్న, సంగీత, శరత్, పవన్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీ రాయితీ వచ్చింది!
నిర్మల్కొరవడిన పర్యవేక్షణ జన్నారం అటవీ డివిజన్లో చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అధికారులు పర్యవేక్షించడంలేదు. దీంతో ఇక్కడి సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ● బ్యాంక్ లింకేజీ రుణాలపై పది నెలల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం ● జిల్లాకు రూ.21 కోట్లు మంజూరు ● 9,911 మంది సభ్యులకు ప్రయోజనం9న రాంజీగోండ్ వర్ధంతి గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 20258లోu ఎస్పీ ప్రజావాణికి స్పందన భైంసాటౌన్: పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిల్ బుధవారం నిర్వహించిన ప్రజావాణికి స్పందన లభించింది. భైంసా సబ్ డివిజన్ వ్యాప్తంగా వచ్చిన బాధితులు నేరుగా ఎస్పీని కలిసి అర్జీలు అందజేశారు. సమస్యలు తెలిపి పరిష్కరించాలని కో రారు. ఈ సందర్భంగా ఎస్పీ స్పందించి సమస్యల పరిష్కారానికి సంబంధిత స్టేషన్ అధి కారులకు ఫోన్లో సూచనలు చేశారు. అనంతరం భరోసా కేంద్రంలో పలు కేసుల్లో కుటుంబ సభ్యులకు సిబ్బందితో కౌన్సెలింగ్ ఇప్పించారు. వివిధ కారణాలతో విడిపోయిన దంపతులకు కౌన్సెలింగ్ కోసం ఏర్పాటు చేసిన భరో సా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐ లు గోపీనాథ్, మల్లేశ్, ఎస్సైలు శ్రీనివాస్‌యాదవ్, శంకర్, ప్రొబేషనరీ మహిళా ఎస్సై సుప్రి య, భరోసా సెంటర్ సిబ్బంది జ్యోతి, శిరీష, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ పాల్గొన్నారు. నిర్మల్‌చైన్‌గేట్: స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సంఘాల ఆర్థిక బలోపేతానికి చేయూతనిస్తోంది. సభ్యుల ఆ ర్థిక స్వావలంబనకు తోడ్పాటునందిస్తోంది. బ్యాంకుల నుంచి వడ్డీలేని రుణాలు తీసుకుని వాయిదాల ప్రకారం సక్రమంగా చెల్లించిన సంఘాలకు వడ్డీ రాయితీ నిధులు మంజూరు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025 వరకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, అధికారులు అర్హులైన సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. వడ్డీ రాయితీ నిధులు మంజూరు చేయడంపై సంఘాల్లోని సభ్యులు హర్షం వ్యక్తంజేస్తున్నారు. పది నెలల బకాయిలు విడుదల 2019 నుంచి 2022 వరకు మూడేళ్ల వడ్డీ నిధులు మంజూరు కాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2023–24 సంవత్సరానికి నాలుగు నెలల బకాయిలను కొన్ని నెలల క్రితం విడుదల చేశారు. నాలుగు నెలల బకాయిలు మాత్రమే విడుదల చేయడంతో పొదుపు సంఘాల సభ్యులు నిరాశకు లోనయ్యారు. తాజాగా 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు పది నెలల వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలోని 9,911 సభ్యులకు రూ.21కోట్ల 94వేల 124 బకాయిలను విడుదల చేయడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఊరట లభించినట్లయింది. స్వయం ఉపాధికి ఊతం స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు బ్యాంక్ లింకేజీ కింద తీసుకున్న వడ్డీ లేని రుణాల (వీఎల్ఆర్)తో ఆర్థికంగా ఎదగటంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వం మహిళలను పా రిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పలువురు చిన్న తరహా పరిశ్రమలు, యూనిట్లు నెలకొల్పుతున్నారు. క్యాంటీన్ల ఏ ర్పాటు, పెరటి కోళ్ల పెంపకం, గేదెల పోషణ, కిరా ణం, క్లాత్ స్టోర్లు, టైలరింగ్, శానిటరీ న్యాప్కిన్ల తయారీ తదితర రంగాలను ఎంచుకుని ఆదాయం పొందుతూ ఆర్థికంగా రాణిస్తున్నారు. పాత బకాయిల ఎప్పుడిస్తరో! గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు అలాగే పేరుకుపోయాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన హయాం నుంచి వడ్డీ బకాయిలు విడతల వారీగా చెల్లిస్తూ వస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేరుకుపోయిన భారీ మొత్తంలోని బకాయిల గురించి ఎవరూ ఊసెత్తడం లేదు. అధికారులు, ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో అయోమయం నెలకొంది. ● పెరిగిన యంత్రాల వినియోగం ● డ్రోన్‌తో రసాయనాల పిచికారీ ● పంటల చుట్టూ సోలార్ కంచెన్యూస్రీల్మండలాల వారీగా ఇలా.. మండలం చెల్లించిన సొమ్ము చెల్లించాల్సిన సొమ్ము మంజూరైన సొమ్ము (రూపాయల్లో) (రూపాయల్లో) (రూపాయల్లో) బాసర 72,53,715 28,740 73,32,132 భైంసా 1,51,34,054 1,87,061 1,53,21,115 దస్తురాబాద్ 52,81,692 1,31,496 54,13,188 దిలావర్పూర్ 1,19,69,347 11,947 1,19,81,294 కడెం 1,22,46,739 1,13,438 1,23,60,177 ఖానాపూర్ 91,87,154 97,682 92,84,836 కుభీర్ 1,21,80,194 5,04,171 1,26,84,365 కుంటాల 1,03,81,669 2,88,123 1,06,69,792 లక్ష్మణచాంద 1,32,75,698 2,18,991 1,34,94,689 లోకేశ్వరం 1,82,35,204 54,136 1,82,89,340 మామడ 90,29,955 1,08,698 91,38,653 ముధోల్ 1,75,87,596 1,04,490 1,76,92,086 నర్సాపూర్ (జి) 1,14,41,397 25,978 1,14,67,375 నిర్మల్ రూరల్ 1,32,83,321 1,446 1,32,84,767 పెంబి 21,54,056 28,855 21,90,096 సారంగపూర్ 2,04,77,889 4,59,958 2,09,37,847 సోన్ 89,81,325 94,696 90,76,021 తానూరు 93,73,289 1,03,062 94,76,351 -
కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● అధికారులతో సమావేశంనిర్మల్చైన్గేట్: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధి కారులతో ఆమె యాసంగి వరి కొనుగోళ్ల ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. త్వరగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సి బ్బందికి శిక్షణ ఇవ్వాలని, కేంద్రాల్లో సరిపడా తూకపు, తేమ, ప్యాడీ క్లీనింగ్ యంత్రాలు, గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాల ని తెలిపారు. సరిపడా హమాలీలు, లారీలను సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ధాన్యం తూకం జరిగిన 24 గంటల్లోపు ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. రోజువా రీగా ధాన్యం కొనుగోళ్ల నివేదికలు అందజేయాలని తెలిపారు. మిల్లర్లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. సమా వేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుధాకర్, ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్, ఇన్చార్జి ఏడీ మార్కెటింగ్ గజానంద్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌గోపాల్, డీసీవో కార్యాలయ అధి కారి రాజమల్లు, జిల్లాలోని రైస్‌మిల్లర్లు, లారీ ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘యువ వికాసం’ దరఖాస్తు గడువు పెంపు
నిర్మల్‌చైన్‌గేట్: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు ఈనెల 14 వరకు పెంచినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసం పథకంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. శాఖలవారీగా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు సంబంధిత దరఖాస్తు పత్రాలను మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. పథకంపై సందేహాల ను నివృత్తి చేసేందుకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దరఖాస్తుదారులు ఎంచుకున్న స్వయం ఉపాధి యూనిట్ల ఆధారంగా శిక్షణ ఉంటుందని తెలిపారు. అనంతరం రాజీవ్ యువ వికాసం హెల్ప్‌డెస్క్ పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాస్, శంకర్, అంబాజీ, మోహన్‌సింగ్, ఏసీడీపీవో నాగలక్ష్మి, ఈడీఎం నదీమ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్వీస్ బుక్‌లో వివరాలు నమోదు చేయాలి
నిర్మల్ రూరల్: జిల్లాలో ఇటీవల జరిగిన బదిలీలు, ప్రమోషన్లలో ప్రత్యేక కేటగిరి వాడుకున్న ఉపాధ్యాయుల సర్వీస్ వివరాలను వారి సర్వీస్ బుక్‌లలో న మోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు బుధవారం డీఈవో రామారావుకు వినతిపత్రం ఇచ్చారు. ఉపాధ్యాయుల సర్వీస్‌కు సంబంధించిన ప్రత్యేక కేటగిరి, భార్యాభర్తల కేటగిరి, ప్రమోషన్ వద్దని నాట్ విల్లింగ్ ఇచ్చిన వారి పూర్తి వి వరాలు సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయకపోవడంతో అర్హత కలిగిన ఇతర ఉపాధ్యాయులకు వచ్చే బ దిలీలు, ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుంద న్నారు. విచారణ చేపట్టి ఉపాధ్యాయుల పుస్తకంలో నమోదు చేయిస్తామని డీఈవో హామీ ఇచ్చారు. జి ల్లా అధ్యక్షుడు రాజేశ్‌నాయక్ తదితరులున్నారు. -
సాగునీరు అందించాలి
కడెం: కడెం, సదర్మాట్ చివరి ఆయకట్టు వర కు సాగునీరు అందించాలని బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ అభిలాష అభినవ్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు. మండలంలోని మొ ర్రిగూడం, చిన్నబెల్లాల, పెద్దబెల్లాల, పెద్దూర్ తండా, చిట్యాల, కొత్త మద్దిపడగ, లక్ష్మీసాగర్ గ్రామాల్లోని పంటలకు మరో రెండు తడులకు సాగునీరు అందించాలని కోరారు. వరి పంట పొట్ట దశలో ఉండగా సాగునీరు అందక పొలా లు ఎండిపోతున్నాయని తెలిపారు. చెరువులు, కుంటలు నింపి సాగునీరు ఇవ్వాలని కోరారు. కలెక్టర్‌ను కలిసినవారిలో రైతులు వెంకటేశ్, మల్లేశ్, రాజేశ్వర్, శ్రీనివాస్, సత్తన్న, గంగన్న, హనుమాండ్లు, చిన్న రాజం, నర్సయ్య, లింగన్న, లచ్చన్న, రవి, తిరుపతి, శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్, ఉపేందర్ తదితరులున్నారు. -
పింఛన్.. ఇప్పించరూ!
ఈ చిత్రంలోని దివ్యాంగురాలి పేరు తిమ్ముపురే సునీత. భైంసా పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన ఈమెకు పుట్టుకతోనే బుద్ధిమాంద్యం ఉంది. తండ్రి పాండురంగ్ అనారోగ్యంతో బాధపడుతుండగా, తల్లి విమల 37 ఏళ్ల కూతురి బాగోగులు చూస్తుంటుంది. 90శాతం వైకల్యంతో ఉన్న సునీతకు పర్మనెంట్ వ్యాలిడిటీతో సదరం సర్టిఫికెట్ జారీ అయింది. గత ప్రభుత్వ హయాంలో ఆసరా పథకం కింద పింఛన్ మంజూరైంది. 2018 జనవరి నుంచి 2019 జనవరి వరకు నెలకు రూ.1,500 చొప్పున బ్యాంక్ ఖాతాలో పింఛన్ మొత్తం జమయ్యేది. కానీ, తరువాత పింఛన్ నిలిచిపోయింది. దీంతో ఆమె అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఆర్థికంగా ఎలాంటి ఆధారం లేదని, దివ్యాంగురాలైన తన కూతురికి పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఆమె తల్లి విమల కోరుతోంది. ఈ చిత్రంలోని దివ్యాంగురాలి పేరు భూసారి దివ్య. పట్టణంలోని గుజిరిగల్లికి చెందిన ఈమె డిగ్రీ పూర్తి చేసి కొద్దిరోజులు ప్రైవేట్ ఉద్యోగం చేసింది. కచేరీల్లోనూ పాటలు బాగా పాడేది. ఈ క్రమంలో ఒకసారి తీవ్ర జ్వరం రాగా, అస్వస్థతకు గురై బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడింది. అప్పటి నుంచి కాలు, నోరు, చేయి పడిపోయి ఇంటికే పరిమితమైంది. 22ఏళ్ల దివ్యను చూస్తే ఎవరికై నా జాలి కలగకమానదు. తండ్రి మృతిచెందగా, తల్లి ప్రతిభపై కుటుంబభారం పడింది. దివ్య ప్రస్తుతం ఇంట్లో మంచానికి పరిమితమై సదరం సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తోంది. ఆన్లైన్లో స్లాట్‌బుక్ చేసి శిబిరానికి వెళ్లినా.. ధ్రువపత్రం రాలేదని వాపోయింది. తన కూతురికి సదరం సర్టిఫికెట్ ఇప్పించి, పింఛన్ మంజూరు చేయాలని ప్రతిభ కోరుతోంది. ఇలా.. వీరేకాకుండా జిల్లాలో ఎంతోమంది దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు పింఛన్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. భైంసాటౌన్: ప్రభుత్వాలు ఏళ్ల తరబడి కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో అర్హులు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ఏ పనీ చేయలేక కు టుంబానికి భారంగా మారి అసహాయ స్థితిలో కొ ట్టుమిట్టాడుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వం ఆసరా పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఇతరులకు నెలకు రూ.2,016 చొప్పున పింఛన్ అందించేది. దివ్యాంగులకు రూ.2,516 అందించగా, ప్రస్తుతం దాన్ని రూ.4,016కు పెంచారు. ప్రస్తుతం ప్రభుత్వం చేయూత పేరిట పింఛన్లు అందిస్తోంది. అయితే, కొత్తగా ఎలాంటి పింఛన్లు మంజూరు చే యడం లేదు. దీంతో కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారో నని ఎంతోమంది అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు ఎదురుచూస్తున్నారు. కార్యాలయాల్లోనే దరఖాస్తులు కొన్నేళ్లుగా ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదు. ప్రస్తుతం ఇంట్లో పింఛన్ పొందుతున్న భార్య లేదా భర్త చనిపోతే వారి పింఛన్‌ను మాత్రమే రెండో వ్యక్తికి ఇస్తున్నారు. కొత్తగా ఎలాంటి పింఛన్లు అందడం లేదు. భర్త చనిపోయి ఎంతోమంది వితంతువులు పింఛన్ రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది దివ్యాంగులు కూడా పింఛన్లు లేక, ఎలాంటి ఆసరా లేక అవస్థలు పడుతున్నారు. పింఛన్ల కోసం పట్టణాల్లో ప్రజలు మున్సిపల్ కార్యాలయాలు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు అందజేస్తున్నారు. పింఛన్ మంజూరు చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అధి కారులు కూడా చేసేది లేక దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇలా మున్సిపల్, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ, ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేయడంలేదు. దీంతో పింఛన్లు ఎప్పు డు మంజూరవుతాయోనని అర్హులంతా ఆశగా ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ‘ఆసరా’ కరువైన దివ్యాంగులు ‘చేయూత’ కోసం ఎదురుచూపు ఈ చిత్రంలోని బాలుడి పేరు రావుల శ్వేజన్. భట్టిగల్లికి చెందిన సుజాత, రవి దంపతుల కుమారుడైన ఇతడు పుట్టుకతోనే బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. సదరం సర్టిఫికెట్ పొందినా.. ఇప్పటికీ పింఛన్ మంజూరు కాలేదు. తండ్రి వ్యవసాయం చేస్తూ, తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. దివ్యాంగుడైన తమ కొడుకుకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ఘనంగా వీరహనుమాన్ విజయయాత్ర
ఖానాపూర్: బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణంలో మంగళవారం వీర హనుమాన్ విజయయాత్రను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి హాజరై ఎన్టీఆర్ చౌరస్తాలో మాట్లాడారు. భారతీయులంతా దేశం కోసం.. ధర్మం కోసం పని చేయాలని సూచించారు. హిందువులకు సంతాన ని యంత్రణతో ముప్పు ఉందని, ఆదాయంతో పాటు సంతానం పెంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ బోర్డు బిల్లుకు త్వరలో ఆమోదం లభించనుందని, దీనిని అడ్డుకునేందుకు చేస్తున్న కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పి కొడు తూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. యువ త భక్తి మార్గంతో ధర్మాన్ని రక్షించుకోవాలని సూ చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో పాటు రాముడు, ఆంజనేయ విగ్రహాల దాత ఒమన్ తెలంగాణ సమితి అధ్యక్షుడు గుండేటి గణేశ్‌ను బజరంగ్దళ్ నాయకులు శాలువాలతో సన్మానించారు. స్థాని క జగన్నాథ్రావుచౌరస్తా వద్ద ఆదిలాబాద్ గోపాల మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి ర్యాలీని ఉద్దేశించి ధార్మిక ప్రసంగం చేశారు. గుండేటి గణేశ్ సహకారంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు బజరంగ్దళ్ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధా న వీధుల వెంట వీరహనుమాన్ శోభాయాత్రతో ఖానాపూర్ కాషాయమయమైంది. అనంతరం శ్రీ రాంనగర్‌లోని హన్మాన్ మందిర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్‌రాథోడ్, ఆర్ఎస్ఎస్ వక్త నాగమణి లింగన్న, బజరంగ్దళ్ జిల్లా సంయోజక్ కాసవేణి ప్రణయ్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు సురేశ్, నాయకులు అంకం మహేందర్, ఆకుల శ్రీనివాస్, చిన్నం సత్యం, అంకం రాజేందర్, దయానంద్, రమేశ్, రాజశేఖర్, హనుమాన్ దీక్షాపరులు పాల్గొన్నారు. విజయయాత్రలో ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, నాయకులు, భక్తులు -
అమాత్యయోగం ఎవరికో..?
● కేబినెట్ బెర్త్‌పై వీడని ఉత్కంఠ ● ముహూర్తం ఖరారు.. నేతల్లో టెన్షన్ ● ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చర్చసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల 3వ తేదీన ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కేబినెట్ బెర్త్ ఎవరిని వరిస్తుందనే చర్చ సామాన్యుల నుంచి రాజకీయవర్గాల వరకు జరుగుతోంది. హైకమాండ్ నిర్ణయంపై ఆసక్తి పెరిగిన వేళ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ ఎ మ్మెల్యేకు అవకాశం వస్తుందా.. లేదా.. అనే టెన్ష న్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా..ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఖానాపూర్ నుంచి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిలో మంచిర్యాల జిల్లాకు చెందినవారే ముగ్గురు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును కూడా పరిగణనలోకి తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోటీలో ఎవరెవరు?బెల్లంపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గడ్డం వినోద్ తానే సీనియర్‌నని చెప్పుకొంటూ ఢిల్లీలో లాబీ యింగ్ చేస్తున్నారు. సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పార్టీ కోసం కష్టపడిన తనకే పదవి రావాలని వాదిస్తున్నారు. ఒక దశలో ఆయనకు కేబినెట్ బెర్త్ ఖాయమని సంకేతాలు వచ్చాయి. తాజా పరిణామాలతో సందిగ్ధత నెలకొంది. ఆయన అనుచరులు మంత్రి పదవి కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వర్గం ఉత్సాహంలో ఉంది. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి.. వివేక్‌ను మంత్రి వివేక్‌గారూ అని సంబోధించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మాల సామాజిక వర్గం నుంచి ఆయనకు బెర్త్ దక్కినట్లు చర్చలు ఊపందుకున్నాయి. అయితే హైకమాండ్ నుంచి ఎవరికీ స్పష్టత రాలేదు. దీంతో తుది జాబితాలో ఎవరుంటారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. హైకమాండ్ జాగ్రత్తలుకాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీలో వ్యతిరేకత రాకుండా అభిప్రాయాలు సేకరిస్తూ, ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీ సుకుంటోంది. మొదటి విస్తరణలోనే జిల్లాకు అ వకాశం దక్కుతుందని అంతా భావించారు. త ర్వాత ఈ ప్రక్రియ ఏడాదిన్నరగా వాయిదా పడు తూ వచ్చింది. లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఇప్పుడు ముహూర్తం ఖరారవడంతో రాజ కీయ వర్గాల్లో ఆసక్తి రేగింది. ఈ విస్తరణ ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఎవరికి అవకాశం దక్కుతుందనే కొన్ని గంటల్లో తెరపడుతుందనే చర్చ జరుగుతోంది. -
విద్యార్థులపై నిర్బంధం ఆపాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజాఉద్యమాలు, విద్యార్థుల పోరా టాలపై పోలీసు నిర్బంధాన్ని వెంటనే ఆపాలని సీపీఎం జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశా రు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూము ల రక్షణకు చేపట్టిన విద్యార్థుల పోరాటం అణచివేత, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులపై జరుగుతున్న అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం నూతన్‌కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాఉద్యమాలను అణచివేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భూముల అమ్మ కం ద్వారా అధికారం నిలుపుకొనే యత్నాన్ని ప్రజ లు సహించరని హెచ్చరించారు. 400 ఎకరాల హె చ్సీయూ భూమిని విక్రయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని పేర్కొన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్థులు, సీపీఎం నాయకత్వాన్ని విడుదల చేయాలని, విద్యార్థులపై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకో వాలని డిమాండ్ చేశారు. ఇది విద్యావ్యవస్థను నిర్వీ ర్యం చేసే చర్య అని పేర్కొన్నారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. నాయకులు ఫసీ ఉద్దీన్, పోశెట్టి, డాకూరు తిరుపతి తదితరులున్నారు. -
‘తెలంగాణలో బుల్డోజర్ల ప్రభుత్వం’
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణలో బుల్డోజర్ల ప్రభుత్వం నడుస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలని ఎస్ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్న నేపథ్యంలో మంగళవారం దిగంబర్ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దిగంబర్ మాట్లాడు తూ.. కార్పొరేట్, ప్రైవేట్ వ్యక్తులకు యూనివర్సిటీ భూములను కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. విద్యార్థులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దొరల రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికి వెళ్లనని ప్రకటిస్తూ.. యూనివర్సిటీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు ఉధృతం చేస్తామని దిగంబర్ హెచ్చరించారు. -
ఎల్ఆర్ఎస్ 16.41శాతమే..
నిర్మల్ బల్దియాలో దరఖాస్తులు స్వీకరిస్తున్న సిబ్బంది (ఫైల్) మరో అవకాశమివ్వాలి నాకు పట్టణంలో ఒక ప్లాట్ ఉంది. దీనికోసం 2020లో రూ.వెయ్యి కట్టి ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న. ఫీజు చెల్లిద్దామంటే నా దగ్గర సమయానికి డబ్బులు లేవు. దీంతో ప్రభుత్వం కల్పించిన 25 శాతం ఫీజు రాయితీ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిన. – లింగమ్మ, నిర్మల్ ప్రొసీడింగ్ అందలేదు నేను గతంలో ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నాను. ఇటీవల క్రమబద్ధీకరించుకోమని అధికారులు తెలుపగా నా మొబైల్ ద్వారా ఫీజు చెల్లించాను. ఇప్పటివరకు ప్రొసీడింగ్ కాపీ అందలేదు. ఇది ఎక్కడ తీసుకోవాలో తెలియడం లేదు. – జోగు శేఖర్, నిర్మల్ సమకూరింది రూ.6.3 కోట్లే.. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ కోసం కల్పించిన 25శాతం రాయితీ ద్వారా నిర్మల్ మున్సిపాలిటీకి రూ.6.3 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం గడువు పొడగింపు గురించి ఎలాంటి ఆదేశాలు రా లేదు. ప్రభుత్వ ఆదేశానుసారం నడుచుకుంటాం. – జగదీశ్వర్‌గౌడ్, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ నిర్మల్‌చైన్‌గేట్: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఫీజులో 25 శాతం రాయితీ కల్పించినా దరఖాస్తుదారులు అంతగా ఆసక్తి చూపలేదు. ఫీజు చెల్లింపు గడువు మార్చి 31తో ముగియగా 16.41 శాతం మంది దరఖాస్తుదారులే ఫీజు చెల్లించారు. మెజార్టీ ఇంటి స్థలాల యజమానులు ఫీజు చెల్లిస్తారని భావించిన సర్కారు లక్ష్యం నెరవేరలేదు. చేతి లో డబ్బులు లేక కొందరు, ప్రభుత్వం మరో అవకా శం కల్పిస్తుందని మరికొందరు చెల్లింపులకు దూ రంగా ఉంటూనే వచ్చారు. నెల గడువు ఇచ్చినా.. ఎల్ఆర్ఎస్ ఫీజులో 25శాతం రాయితీ కల్పించి సర్కారు నెల గడువు ఇచ్చింది. 2020 డిసెంబర్ 31 వరకు రూ.వెయ్యి చెల్లించి ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికే ఫీజు చెల్లింపు అవకాశం ఉంది. ఇందులో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలో 26,487 మంది, 18 మండలాల పరిధిలో 17,716 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రభుత్వ నిబంధనల మేరకు 39,006 దరఖాస్తులు సరైనవిగా ఉన్నట్లు నిర్ధారించి ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించారు. భూయజమానులకు ఆయా మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు ఫోన్ల ద్వారా, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. దీంతో మూడు మున్సిపాలిటీలతో గ్రామపంచాయతీల పరిధిలో 6,401 ప్లాట్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించారు. 16.41శాతం మంది మాత్రమే ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. చివరిరోజు మొరాయించిన సర్వర్ ఫీజు చెల్లింపునకు యూజర్ మాన్యువల్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్–2020 పేరిట ప్రభుత్వం వెబ్సైట్ రూపొందించింది. అర్జీల పరిష్కారం కోసం మూ డంచెల (లెవల్–1, లెవల్–2, లెవల్–3) విధానా న్ని అమలు చేసింది. దరఖాస్తుదారులు బల్దియాల్లో బారులు తీరినా.. సర్వర్ మొరాయించడంతో కొందరి క్రమబద్ధీకరణ ప్రక్రియ లెవల్–1 వద్దే నిలిచింది. కొందరు దరఖాస్తుదారులు ఫీజు చెల్లించేందుకు యత్నించినా వెబ్సైట్లో వివరాలు కనిపించలేదు. ఇంకొందరికి క్షేత్రస్థాయి పరిశీలన పెండింగ్‌లో ఉన్నట్లు చూపించింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు చూపిస్తే నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. వీటన్నింటికీ ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు చెప్పారు. ఆసక్తిచూపని సామాన్యులు ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని ఎక్కువగా ‘రియల్’ వ్యాపారులు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్ల కొనుగోలుదారులు వినియోగించుకున్న ట్లు తెలుస్తోంది. గతంలో అనధికారిక ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు ఎల్ఆర్ఎస్ చెల్లింపునకు పెద్దగా ఆసక్తి చూపనట్లు సమాచారం. కొత్తగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బఫర్ జోన్, చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ స్థలాలు, హోల్డ్‌లో పెట్టినవి, కోర్టుకేసులో ఉన్న ప్లా ట్లతో పాటు కొన్ని సజావుగా ఉన్న వాటిని కూడా ఆన్లైన్లో చూపించకపోవడం, ఫీజు తీసుకోకపోవడం, ఇన్ని చేసినా.. ప్రాసీడింగ్ రాక ఇబ్బందిపడి చివరకు వెనుతిరిగి వెళ్లినవారూ ఉన్నారు. కాగా, గడువు ముగియడంతో మరోసారి అవకాశం ఇవ్వాలని, ఎల్ఆర్ఎస్ కొత్త దరఖాస్తులు తీసుకునే వెసులుబాటు కల్పించాలని ఇళ్ల స్థలాల యజమానులు కోరుతున్నారు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని, తమ చేతుల్లో ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల వారీగా ఇలా.. బల్దియా దరఖాస్తులు చెల్లించినవారు ఆదాయం ఖానాపూర్ 1,928 106 రూ.27లక్షలు నిర్మల్ 15,515 1,975 రూ.6.30కోట్లు భైంసా 9,044 582 రూ.83లక్షలు 18 మండలాల్లో 17,716 2,700 రూ.5.85కోట్లు జిల్లాలో ఎల్ఆర్ఎస్ వివరాలు ఇలా.. వచ్చిన దరఖాస్తులు : 44,203 అర్హత పొందినవి : 39,006 ఫీజు చెల్లించిన వారు : 6,401 ప్రొసీడింగ్ పొందినవారు : 1,418 వచ్చిన ఆదాయం : రూ.12.28కోట్లు 31తో ముగిసిన రాయితీ గడువు ఆసక్తి చూపని దరఖాస్తుదారులు ఫీజు చెల్లించింది 6,401 మందే.. సమకూరింది రూ.12.98 కోట్లు గడువు పెంపునకు ఎదురుచూపు -
ఆన్లైన్లో పేరున్నా సన్న బియ్యం
● నేటి నుంచి పంపిణీకి ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కొత్తగా రేషన్‌కార్డులు మంజూరై పౌరసరఫరాల శాఖ పోర్టల్‌లో పేర్లు ఉన్న వారికి కూడా సన్న బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నూతనంగా కార్డులు జారీ కాకున్నా పోర్టల్‌లో పేర్లు ఉన్న వారికి సైతం సన్న బియ్యం అందనున్నాయి. ఉగాది రోజున సీఎం రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ ఆ మేరకు పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో కొత్త కార్డులు మంజూరైనా గ్రామసభల్లో అర్హుల జాబితా వెల్లడి సమయంలో తలెత్తిన సమస్యలతో ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడ్డాయి. మరోవైపు మీ సేవల్లో కొత్త కార్డుల మార్పులు, చేర్పుల కోసం ఇంకా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇక సన్న బియ్యం ఇప్పటికే రేషన్ దుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి మొత్తం కోటాలో కనీసం 50శాతం వరకు సరఫరా చేశారు. ప్రతినెలా బియ్యం రవాణాలో అనేక చోట్ల జాప్యం జరుగుతున్నా ఈసారి అలా జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు రేషన్ దుకాణాల వద్ద హాజరు కానున్నారు. ఉమ్మడి జిల్లా వివరాలు రేషన్ దుకాణాలు : 1712రేషన్ కార్డులు: 7.59లక్షలు లబ్ధిదారులు: 24.12లక్షలు కొత్త రేషన్ కార్డుల అర్జీలు 1.55లక్షలు (ప్రజాపాలనలో వచ్చినవి) కొత్తగా మంజూరైనవి: 72,276 -
ప్రైవేట్‌గా అమ్ముకోవాల్సిన పరిస్థితి..
ఏటా మొక్కజొన్న పంట నుసాగు చేస్తా. ఈసారి దిగుబడి కూడా మంచిగానే వచ్చింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. – అరిగెల మహేందర్, కుంటాల వర్షం వస్తే ఇబ్బంది.. ఎనిమిది ఎకరాల్లో జొన్నసాగు చేసిన. గతేడాది మా గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి ఇప్పటి వరకు ఏర్పా టు చేయలేదు. పంట ఆరబెట్టాం. అకాలవర్షం వస్తే నష్టం తప్పదు. – కదం సాయి, పెంచికల్ పాడ్ సాగు రెట్టింపు అయింది.. జిల్లాలో ఈ సారి జొన్న సాగు రెట్టింపు అయింది. ప్రభుత్వం ఎకరానికి 7 క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేస్తామని నిబంధన సడలించాలి. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – తోట రాఘవేందర్, కుంటాల -
అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలి
నిర్మల్‌చైన్‌గేట్: రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కువమంది అర్హులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి కలెక్టర్లు, అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వెనకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలి పారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతుందన్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 14 లోపు దరఖాస్తు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. రూ.50 వేలలోపు రుణం వంద శాతం మాఫీ, రూ.లక్ష లోపు రుణం 90 శాతం మాఫీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ లభిస్తుందని వివరించారు. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకులోన్ల ద్వారా అందిస్తారని తెలిపారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందన్నారు. దరఖాస్తులు చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాలన్నింటినీ మున్సిపల్ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, మైనార్టీ అధికారి మోహన్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కోతలు షురూ.. కొనుగోళ్లు ఎప్పుడో..!
● ఇప్పటికే ఇంటికి చేరుతున్న పంట ఉత్పత్తులు ● కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం ● రైతులకు తప్పని తిప్పలు కుంటాల: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు ప్రతి ఏటా ఎదుర్కొంటున్న సమస్యలు తీరడం లేదు. మొక్కజొన్న, జొన్న వంటి పంటలను పండించినా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం కారణంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్య పట్ల ఉదాసీనంగా ఉండటం రైతులకు శాపంగా మారింది. కల్లాల్లోనే ధాన్యం మండలంలోని గ్రామాల్లో రైతులు 8,150 ఎకరాల్లో మొక్కజొన్న, 6,234 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. మొక్కజొన్న కోతలు ఇప్పటికే పూర్తయ్యాయి, పంట ఉత్పత్తులు ఇంటికి చేరాయి. ఈ సీజన్లో గత ఏడాది కంటే జొన్న సాగు రెట్టింపు అయింది. 50 శాతం జొన్న పంట ఇంటికి చేరగా, మిగిలిన పంట నూర్పిడికి సిద్ధంగా ఉంది. మరో 15 రోజుల్లో జొన్న పంట కూడా ఇంటికి చేరనుంది. కానీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో పంట కల్లాల్లోనే మిగిలిపోతోంది. కొనుగోలు ఏర్పాట్లలో జాప్యం.. రైతుల పరిస్థితి ‘మూలిగే నక్కపై తాటి పండు పడ్డ‘ చందంగా తయారైంది. ఎంతో కష్టపడి పంటలు పండించినా, వాటిని అమ్ముకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కుంటాల పీఏసీఎస్ పరిధిలో గొల్లమాడ, ఓలా, లింబా(కె), అంబకంటి గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, అలాగే కల్లూరు, కుంటాల, పెంచికల్‌పాడ్ గ్రామాల్లో జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.2,090 చెల్లించగా, ఈ ఏడాది రూ.2,225గా నిర్ణయించారు, అంటే రూ.135 పెరిగింది. జొన్న క్వింటాల్‌కు గత ఏడాది రూ.3,180 ఇవ్వగా, ఈ సారి రూ.3,371గా నిర్ణయించారు, అంటే రూ.191 అదనంగా చెల్లిస్తున్నారు. మద్దతు ధర కల్పించిన ప్రభుత్వం, జొన్న ధర మొక్కజొన్న కంటే ఎక్కువగా ఉండటంతో రైతులు జొన్న సాగుపై ఆసక్తి చూపారు. పరిమితి వద్దు.. గత ఏడాది ఎకరానికి 7 క్వింటాళ్ల జొన్న మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే, ఎక్కువ దిగుబడి రావడంతో రైతుల విజ్ఞప్తి మేరకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా 7 క్వింటాళ్ల పరిమితిని సడలించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం పంటను కల్లాల ఎదుట, రోడ్లపై ఆరబెడుతుండగా, కొందరు ఇళ్లలో నిల్వ చేస్తున్నారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పంటను సకాలంలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని వారు ఆశిస్తున్నారు. త్వరలో కొనుగోళ్లు.. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జొన్న కొనుగోలు కేంద్రాలను అవసరమున్న చోట ఏర్పాటు చేస్తాం. త్వరలో కొనుగోళ్లు ప్రారంభించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. – ప్రవీణ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్, డీఎం అందాకూర్ లో జొన్నను ఆరబెట్టిన రైతు -
టోల్ మోత!
● అర్ధరాత్రి నుంచి పెరిగిన చార్జీలు ● జిల్లాలో రెండు టోల్ ప్లాజాలుచార్జీల పెంపు ఇలా.. గంజాల్ ప్లాజాలో.. కార్లు, జీపులు సింగిల్ జర్నీ చార్జి : రూ.60 నుంచి రూ.65 కు పెరుగుతుంది. రిటర్న్ జర్నీ చార్జీ : పెంచలేదు. పాస్ చార్జీ రూ.2075 నుంచి నుంచి రూ.2145 పెరుగుతుంది. లైట్ కమర్షియల్ వాహనాలకు... సింగిల్ ట్రిప్ రూ. 100 నుంచి రూ.105కు.. రిటర్న్ జర్నీ రూ.150 నుంచి రూ.155కు నెలవారీ పాస్ చార్జీ రూ.3,350 నుంచి రూ.3470.. బస్సు, ట్రక్కులకు సింగిల్ ట్రిప్ రూ.210 నుంచి రూ.220.. రిటర్న్ జర్నీ రూ.315 నుంచి రూ.325 నెలపాస్ చార్జీ రూ.7,015 నుంచి రూ.7,265కు .. ఓవర్ సైజ్డ్ వెహికల్స్.. సింగిల్ ట్రిప్ రూ.400 నుంచి రూ.415కు.. రిటర్న్ జర్నీ రూ.605 నుంచి రూ. 625కు.. నెల పాస్ చార్జీ రూ.13,395 నుంచి రూ.13,875కు సవరించారు. దిలావర్పూర్ ప్లాజాలో.. కార్లు, జీపులు.. సింగిల్ జర్నీ చార్జి పెంచలేదు.. రిటర్న్ జర్నీ రూ.77 నుంచి రూ.80కు.. నెల పాస్ రూ.1,675 నుంచి రూ.1735కు.. లైట్ కమర్షియల్ వాహనాలకు సింగిల్ ట్రిప్ రూ.80 నుంచి రూ.85, రిటర్న్ జర్నీ రూ.120 నుంచి రూ.125.. నెలపాస్ రూ.2,710 నుంచి రూ.2,805.. బస్సు, ట్రక్కులకు.. సింగిల్ ట్రిప్ రూ.170 నుంచి రూ.175.. రిటర్న్ జర్నీ రూ.255 నుంచి రూ.265 నెలపాస్ రూ.5,675 నుంచి రూ.5,880.. ఓవర్ సైజ్డ్ వెహికల్స్.. సింగిల్ ట్రిప్ రూ.325 నుంచి రూ.335కు.. రిటర్న్ జర్నీ రూ.490 నుంచి రూ.505.. నెల పాస్ చార్జీ రూ.10,835 నుంచి రూ.11,220కు సవరించారు. నిర్మల్‌చైన్‌గేట్: జాతీయ రహదారులపై వసూలు చేసే టోల్ చార్జీలు పెరిగాయి. రాష్ట్రంలో ఉన్న 29 ప్లాజాల్లో హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సవరించింది. పెరిగిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఆయా రోడ్ల నిడివి, వెడల్పు, వాటి మీద ప్రయాణించే వాహనాల సంఖ్య, టోల్గేట్ల సామర్థ్యం, నిర్వహణ వ్యయం.. పలు అంశాల ప్రాతిపదికగా టోల్ ధరలను సవరించారు. జిల్లాలో రెండు.. జిల్లాలో సోన్ మండలం గంజాల్‌లో ఒకటి, దిలావర్పూర్ మండల కేంద్రంలో ఒక టోల్‌ప్లాజా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో 10 కిలోమీటర్ల దూరంలో గంజాల్ టోల్‌ప్లాజా, భైంసా వెళ్లే మార్గంలో 13 కిలోమీటర్ల దూరంలో దిలావర్పూర్ టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారు. కనీస సౌకర్యాలు కరువు.. టోల్ చార్జీలను కేంద్రం పెంచింది. నిర్మల్ భైంసా 61వ జాతీయ రహదారిపై దిలావర్పూర్ సమీపంలో ఉన్న టోల్గేట్ నుంచి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులపై మరింత భారం పడింది. ఈ టోల్ గేట్ ద్వారా నిత్యం రూ.2.38 లక్షల టోల్ వసూలవుతోంది. పెంచిన చార్జీలతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రహదారిపై ఎలాంటి నాణ్యతా చర్యలు తీసుకోకున్నా, వేగాన్ని గుర్తించే సూచిక బోర్డులు ఏర్పాటు చేయకున్నా, టోల్ చార్జీలు పెంచుతూ పోతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రంజాన్ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
నిర్మల్‌టౌన్: రంజాన్‌ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఈద్గాం చౌరస్తా వద్ద ఈ ద్గాను ఆదివారం ఎస్పీ జానకీ షర్మిల పరి శీలించారు. భద్రత ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశా రు. ప్రార్థన సమయంలో ట్రాఫిక్ సమస్యలేకుండా చూసుకోవాలన్నారు. వాహనాల కోసం తగినంత పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఈద్గా, మసీదులు, ముఖ్యమైన ప్రదేశాల్లో పికెట్స్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో దా దాపు 350 మంది సిబ్బందితో బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పటిష్ట బందోబస్తు ఉంటుందన్నారు. నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ప్రేంకుమార్, సిబ్బంది ఉన్నారు. భైంసాటౌన్: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రా జెక్టు సమీపంలో గల ఈద్గాను ఎస్పీ సందర్శించారు. భద్రతా ఏర్పాట్లపై అడిగి తెలు సుకున్నారు. ముస్లింల ప్రార్థనల నేపథ్యంలో ట్రాఫిక్, వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఐ గోపీనాథ్‌కు సూచించారు. ఆమె వెంట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండీ జాబీర్ అహ్మద్, ఎంఐఎం నాయకులు ఉన్నారు. -
సైనిక్‌స్కూల్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ
కడెం: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో లింగాపూర్ శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు కరస్పాండెంట్ నిశిత విజయ్ కుమార్ తెలి పారు. నస్పురి వెంకటేశ్వర్ 1వ, రాజశేఖర్ 9వ, రాథోడ్ లోకేష్ 11వ, కుంసోత్ దీపక్ 12వ, రితీష్ నాయక్ 22వ, మాలవత్ కిషోర్ 94వ, గుండా అనిరుధ్ 135వ, చోలే ఆయుష్ 208వ, బొమ్మ మహాశ్రీ 222వ, క్రిష్ణరా జ్ 266వ, సాత్విక్ 469వ ర్యాంక్‌లు సాధించారు. విద్యార్థులను పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. దిలావర్పూర్: మండల కేంద్రానికి చెందిన పసుల లావణ్య, పవన్ దంపతుల కుమారుడు పసుల అద్విత్ సైనిక్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించాడు. శనివారం రాత్రి వెలువడిన ఫలితాల్లో సదరు విద్యార్థి సత్తా చాటాడు. స్థానిక విజేత పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్న విద్యార్థి నవోదయ, సైనిక్ పరీక్షలకు శిక్షణ తీసుకున్నాడు. -
బాధ్యతలు స్వీకరించిన రితీశ్ రాథోడ్
నిర్మల్‌చైన్‌గేట్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రితీశ్ రాథోడ్ ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సమక్షంలో కార్యాలయ రిజిస్టర్లో తొలి సంతకం చేశారు. అనంతరం బీజేపీ నేతలు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాచకొండ సాగర్, అంకం మహేందర్, నల్లా రవీందర్‌రెడ్డి, ఒడిసెల అర్జున్, ఆకుల కార్తీక్, సాయి కుమార్, మల్లేశ్, తోకల భూచన్న, పుప్పాల ఉపేందర్, కాశవేణి శ్రీనివాస్, వెంకటేష్, బొడ్డు కిరణ్, పిట్టల భూమన్న, కంతి లింబాద్రి, తిరుమల గిరి, ఇనుముల స్వామి, జీవన్ పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరిస్తున్న రితీశ్ రాథోడ్ -
ఆధ్యాత్మిక మార్గం కావాలె..
ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఆ ప్రాంతానికి సరైన రవాణా సౌకర్యాలు ఉండాలి. జిల్లాలో ఇప్పటికీ సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధికి దూరంలోనే ఉన్నాయి. హైదరాబాద్–నర్సాపూర్–బోధన్ మీదుగా బాసర–భైంసా వరకు 161బీబీ హైవే నిర్మిస్తున్నారు. ఇదే హైవేను ఇప్పుడు మహారాష్ట్రలోనే శక్తిపీఠమైన మహోర్ వరకు పొడగించాలని జిల్లావాసులు కోరుతున్నారు. బాసర నుంచి భైంసా మీదుగా మహోర్ వరకు పొడగిస్తే.. ఇటు సరస్వతీ క్షేత్రం నుంచి అటు శక్తిపీఠం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అవుతుందంటున్నారు. ఈ విషయంపై ఇటీవల అసెంబ్లీలోనూ ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. – భైంసాసరిహద్దులో అవసరం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రకు ఆనుకుని ఉంది. నిర్మల్ జిల్లాలో ముధోల్ నియోజకవర్గం పూర్తిగా సరిహద్దుకు కలిసి ఉంది. ఈ ప్రాంతంలో మరాఠీ ఎక్కువగా మాట్లాడుతారు. ఇక్కడ ఉండేవారికి మహారాష్ట్రతో బంధుత్వం ఉంది. ఎన్నో ఏళ్లుగా శుభకార్యాలకు ఇతర కార్యక్రమాలకు జిల్లా ప్రజలు సరిహద్దు మహారాష్ట్రకు వెళ్తుంటారు. పక్కనే సరిహద్దు ఉన్నా అక్కడికి వెళ్లేందుకు వీలుగా రహదారులు అంతంతగానే ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతవాసులు ఆధ్యాత్మిక కారిడార్‌ను కలుపుతూ హైవే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర, నాందేడ్ జిల్లాలోని మహోర్‌ను కలుపుతూ హైవే నిర్మించాలని కోరుతున్నారు. అభివృద్ధికీ మార్గం... బాసర నుంచి భైంసా మీదుగా మహోర్ వరకు హైవే పొడగిస్తే.. సరిహద్దు ప్రాంతంలో అభివృద్ధికీ మార్గం వేసినట్లవుతుంది. ఈ మార్గాల మధ్య పలు పట్టణాలు ఉన్నాయి. భైంసా, కుభీర్, హిమాయత్‌నగర్, కిన్వట్, సాసర్‌కుండ్, ఇస్లాపూర్ పట్టణాలను కలుపుతూ ఈ మార్గం వెళ్లనుంది. హైవే పూర్తయితే వాణిజ్య సంబంధాలూ మెరుగవుతాయి. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తులు బాసర వరకే వచ్చి ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాస పూజలు జరిపించి తిరిగివెళ్తున్నారు. సరైన రోడ్డులేక మహోర్‌కు వెళ్లలేకపోతున్నారు. నాందేడ్ జిల్లా పరిధిలో చారిత్రక పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ సరైన మార్గం లేకే బాసర నుంచే వెనుదిరుగుతున్నారు. కేంద్రం ఇప్పటికై నా దృష్టి సారించి రెండు పుణ్యక్షేత్రాల మధ్య ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. భైంసా–బాసర రహదారి బాసర హైవే మహోర్ దాకా పొడగించాలి.. ఆధ్యాత్మిక కారిడార్‌తో పాటు.. పర్యాటకపరంగా అవకాశాలు ‘మరాఠీ’ సంబంధాలు బలోపేతం సరిహద్దు ప్రాంతాల్లో హైవే అవసరం రెండింటి మధ్య సాసర్‌కుండ్ జలపాతం రెండు క్షేత్రాల వారధిగా... చదువుల తల్లిగా పూజలందుకుంటున్న సరస్వతీదేవి బాసరలో కొలువుదీరింది. పక్కనే మహారాష్ట్రలోని మహోర్‌లో రేణుకా ఎల్లమ్మగా అమ్మవారు కొలువయ్యారు. అలాగే ఇక్కడ ప్రసిద్ధ దత్తాత్రేయ మందిరం కూడా ఉంది. మహారాష్ట్రతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహానుబావు ఆచారం పాటించే మరాఠీయులు దత్తాత్రేయ స్వామినే కొలుస్తారు. ఏటా బాసర, మహోర్ పుణ్యక్షేత్రాలకు లక్షల మంది భక్తులు వెళ్తుంటారు. బాసరలో సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న యాత్రికులు 164 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహోర్ ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నారు. హైవేను పొడగిస్తే రవాణా ఇబ్బందులు తీరుతాయి. ఇక రెండు క్షేత్రాల మధ్య మహారాష్ట్రలోని సాసర్కుండ్లో ప్రసిద్ధ జలపాతం ఉంది. ఈ క్షేత్రాలకు వెళ్లే యాత్రికులంతా జలపాతం వద్ద ఆగి అక్కడి అందాలు వీక్షిస్తుంటారు. మహారాష్ట్ర యాత్రికులు ముందుగా మహోర్‌లో దర్శనాలు చేసుకుని బాసరకు వస్తుంటారు. దసరా నవరాత్రుల్లో బాసర, మహోర్లలో ప్రత్యేక ఉత్సవాలు, దర్శనాలు ఉంటాయి. ఈక్రమంలోనే రెండు పుణ్యక్షేత్రాల మధ్య ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రస్తావించా బాసర నుంచి భైంసా మీదుగా చేపడుతున్న హైవేను మహారాష్ట్రలోని మహోర్ వరకూ పొడగించాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని గతంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లా. తాజాగా అసెంబ్లీలోనూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చా. స్థానిక ప్రాంతాల అభివృద్ధికి ఇలాంటి రోడ్డుమార్గాలు అవసరం. – రామారావుపటేల్, ఎమ్మెల్యే, ముధోల్ -
సెర్ప్‌లోకి.. మెప్మా
● ఒకే గొడుగు కిందికి మహిళా సంఘాలు ● ప్రతిపాదనలు రూపొందించిన ప్రభుత్వం ● మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు డీఆర్డీఏ పరిధిలోకి.. జిల్లా వివరాలు మొత్తం మండలాలు : 18 స్వయం సహాయక సంఘాలు : 12,215 సభ్యులు : 1,34,002 గ్రామైక్య సంఘాలు : 505 మొత్తం మున్సిపాలిటీలు : 03 మెప్మా ఉద్యోగులు : 11 రిసోర్స్ పర్సన్లు : 95 నిర్మల్‌చైన్‌గేట్: పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘా ల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మెప్మా.. ఇక నుంచి డీఆర్డీఏ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లోని మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో పాటు జిల్లా కేంద్రంలోని మెప్మా జిల్లా కార్యాలయ ఉద్యోగులంతా సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు. కమిషనర్ల ఆధ్వర్యంలో విధులు మున్సిపాలిటీల్లో మహిళలను గ్రూపుగా ఏర్పాటు చేసే మెప్మా ఉద్యోగులు జిల్లాలో 11 మంది, వార్డుల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే మెప్మా రిసోర్స్ పర్సన్లు 95 మంది వరకు ఉన్నారు. వీరంతా మున్సిపల్ క మిషనర్ల ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. మహిళా సంఘాలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించడంతో పా టు నెలనెలా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పనిని సెర్ప్ కార్యాలయం కింద పనిచేసే ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నా రు. ఈ రెండు శాఖలను విలీనం చేస్తే సెర్ప్ కార్యాలయంలో విధులు నిర్వర్తించనున్నారు. పట్టణాల్లో సర్వేలకు ఇబ్బందే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ఇతరత్రా పనులను క్షేత్రస్థాయిలో మెప్మా ఆర్పీలు, మెప్మా సీవోలు సర్వే చేస్తుంటారు. మెప్మా ఆర్పీలకు కాలనీల్లో ఉండే వివరాలు తేలికగా తెలిసే అవకాశం ఉంటుందని.. ప్రతీ సర్వేకు వారి సేవలను వినియోగించుకున్నారు. ఇక నుంచి వారు ఇతర శాఖ పరిధిలోకి వెళ్తే.. మున్సిపాలిటీ సేవలకు వారు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రభుత్వం చేపట్టే సర్వే చేయాలంటే ఇక నుంచి మున్సిపల్ యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జీత భత్యాల్లో తేడా... పట్టణాల్లోని మెప్మా రిసోర్సు పర్సన్లకు నెలకు రూ.6వేల వేతనం చెల్లిస్తుంటే, సెర్ప్ ఆర్పీలకు రూ.5వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు గ్రూపులు కలిపితే జీతాలు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సంఘాల విలీనంపై త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. విలీన అంశంపై అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. కార్యకలాపాలు ఎప్పటిలాగేనా? పురపాలక, గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటిలాగే కార్యకలాపాలు ఉండే అవకాశమున్నట్లు సమాచారం. ఒకేశాఖ పరిధిలో ఉద్యోగులంతా పనిచేసేలా విధివిధానాలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. సర్వేలు, ఓటర్ల జాబితాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన, ఇతర సంక్షేమ పథకాలతో పాటు మహిళా సంఘాల పనితీరు యధావిధిగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. గతంలో మాదిరిగా గ్రామీణ, పట్టణ సంస్థలు కాకుండా ఒకేచోట ఒకే అధికారి పర్యవేక్షణలో ఉద్యోగులంతా పనిచేయనున్నట్లు మెప్మా ఉద్యోగులు అంటున్నారు. మొత్తానికి విలీన అంశాన్ని ఉద్యోగులు స్వాగతిస్తున్నట్లుగా చెబుతున్నారు. శుభ పరిణామం.. రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ఉద్యోగులను సెర్ప్‌లో విలీనం చేయడం శుభపరిణామం. అలాగే మెప్మా ఉద్యోగులకు కూడా సెర్ప్ ఉద్యోగుల మాదిరి అన్నిరకాల బెనిఫిట్స్ అందించాలి. అధికారుల ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటాం. – సుభాష్, మెప్మా ఇన్చార్జి పీడీ -
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు
● పలువురు అభ్యర్థులు కలెక్టరేట్లో ఫిర్యాదు నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ మెడికల్ కళాశాల గత సంవత్సరం నవంబర్ 4న విడుదల చేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించి ఉద్యోగాల భర్తీ అనుభవం ప్రామాణికంగా కాకుండా డబ్బే ప్రామాణికంగా చేశారని పలువురు అభ్యర్థులు కలెక్టరేట్ ఏవోకు శనివారం వినతిపత్రం అందించారు. గతంలో తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆధీనంలో ఉన్న నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ విభాగంలో విధులు నిర్వహించిన వారికి ఈ నియామకంలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఇన్చార్జి మంత్రి సీతక్క, కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారన్నారు. శుక్రవారం విడుదల చేసిన 52 మంది జాబి తాలో ఒక్కరు కూడా అనుభవం ఉన్నవారు లేరని తెలిపారు. ఏజెన్సీ నిర్వాహకులు డబ్బుల కోసం అనుభవం ఉన్నవారిని పక్కన పెట్టారని ఆరోపించారు. ఫలితంగా కొన్నేల్లుగా జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 18 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అధికారులు విచారణ జరిపి అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అప్పటివరకు నియామక ప్రక్రియ నిలిపివేయాలన్నారు. నిరసనలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నరహరి, రవి, సుమ, మమత, రమేష్, రాజేశ్వర్ పాల్గొన్నారు. -
సాగు పనులకు శ్రీకారం..
ఉగాది రోజే కొత్త సంవత్సర వ్యవసాయ పనులను సైతం ప్రారంభిస్తారు. ఇప్పటికే రైతులు తమ చేలల్లో పత్తి పంటను పీకేసి, భూములను చదును చేశారు. ఈ భూముల్లో దుక్కిదున్ని వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన పనుల శ్రీకారానికి రైతులు సన్నద్ధం అయ్యారు. ఈమేరకు అవసరమైన పరికరాల కొనుగోలు, తయారీ చేపట్టడంలో నిమగ్నమయ్యారు. వ్యవసాయమే జీవనాధారమైన గ్రామీణ రైతులు సంప్రదాయ బద్ధంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. పండుగకు రెండుమూడు రోజుల ముందు నుంచే గ్రామాల్లో వడ్రంగులతో సాగుకు కావాల్సిన కర్రలు, దౌరలు, గొడ్డళ్లను సరి చేయించుకున్నారు. ఇప్పటికీ ఎడ్లు, నాగళ్లు ఉన్నవాళ్లు అరకలను సిద్ధం చేయించి పెట్టుకున్నారు. -
‘ఎడారి గోస’కు కాసింత ఊరట
● గల్ఫ్మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ● రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత ఆర్థికచేయూత ● జిల్లాకు రూ.35 లక్షలు విడుదల.. నిర్మల్‌ఖిల్లా: ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి ఉపాధి కోసం ఎడారిదేశాల బాట పట్టిన వలస కార్మికులు అనుకోని ప్రమాదాల్లో, అనారోగ్య కారణాలతో అక్కడే తుదిశ్వాస విడిస్తే అతనిపై ఆధారపడిన కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. వలస కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు చాలా ఏళ్లుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికుల కోసం భరోసానిచ్చేలా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు గతంలోనే ఉత్తర్వులిచ్చింది. మార్చి 2న తొలివిడతలో జిల్లాకు రూ.25 లక్షలు విడుదల చేసింది. ఒక్కో మృతుడి కుటుంబ సభ్యులు అకౌంటులో రూ.5 లక్షలను జమచేసింది. తాజాగా శుక్రవారం రెండోవిడత మరో రూ.35 లక్షలు బాధిత కుటుంబాలకు మంజూరు చేసింది. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు ఈ నగదు కాసింత ఆర్థిక భరోసా ఇవ్వనుంది. గల్ఫ్ గాయాలు నిత్యకృత్యమే... ఎన్నో దశాబ్దాలుగా ఉపాధి కోసం విదేశాల బాట పడుతున్న కార్మికులు అక్కడ అనుకోని ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం కొన్ని నెలల క్రితం గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు జీవో 205 విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం గత డిసెంబర్– 2003 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల్లో మృతిచెందిన కుటుంబానికి రూ.5 లక్షలు అందించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాల్లో దాదాపు 60 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని ప్రజాభవన్‌లో కూడా ప్రవాసీ ప్రజావాణి పేరిట ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని కూడా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కూడా బాధితగల్ఫ్ కార్మికుల సమస్యల నివేదన కోసం కలెక్టర్ ప్రత్యేక చొరవతో హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలో ఇలా... నిర్మల్ జిల్లాకు చెందిన ఏడుగురు గల్ఫ్ మృతుల కుటుంబాలకు రెండవ విడతలో ఈ పరిహారం దక్కింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆయా బాధిత కుటుంబ సభ్యుల అకౌంట్లో నగదు జమ కానుంది. కడెం మండలం పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన బత్తుల నరసయ్య, ఇదే మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ నబి రసూల్, మామడ మండలం కొరటికల్ గ్రామానికి చెందిన గువ్వల రవి, ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన పుల్కం రాజేశ్వర్, లక్ష్మణచాంద మండలం బోరేగాం గ్రామానికి చెందిన మక్కల వెంకటి, ముధోల్ మండలం మచ్కల్ గ్రామానికి చెందిన మల్లెపూల సాయన్న, సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన అప్పాల నవీన్ కుటుంబసభ్యులకు ఈ పరిహార జాబితాలో చోటుదక్కింది.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ హర్షణీయం.. ఉపాధి కోసం ఎడారి దేశాల బాట పడుతున్న కార్మికులు ఎందరో విగత జీవులుగా స్వస్థలాలకు వస్తున్న ఘటనలు జిల్లాలో కనిపిస్తాయి. గల్ఫ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున బాసటగా నిలవడం వారికి భరోసా ఇస్తుంది. విడతల వారీగా జిల్లాలోని బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించడం సంతోషం. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు కొంతమేర ప్రయోజనం కల్పిస్తుంది. – స్వదేశ్ పరికిపండ్ల, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రవాసీమిత్ర కార్మికసంఘంఎక్స్గ్రేషియా నిధుల విడుదల... గత 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల్లో 200 మందికి పైగా తెలంగాణ కార్మికులు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం తొలివిడతగా ఈనెల 1న 113 కుటుంబాలకు రూ.5.65 కోట్లు, రెండవ విడతలో ఇదే నెల28న(గత శుక్రవారం) 66 కుటుంబాలకు రూ.3.3 కోట్లు ఆయా జిల్లాలకు విడుదల చేసింది. ఇందులో తాజాగా నిర్మల్ జిల్లాకు రూ.35 లక్షలు కేటాయించి బాధిత కుటుంబాల అకౌంట్లలో జమచేశారు. -
డాక్టర్ చంద్రికకు ఎక్స్‌లెన్స్ అవార్డు
నిర్మల్‌టౌన్: రాష్ట్రస్థాయిలో గైనకాలజీ, ఇన్ఫ ర్టిలిటీ విభాగంలో జిల్లా కేంద్రంలోని దేవీబాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ చంద్రిక అవినాష్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. ఈ అవార్డును హైదరాబాద్‌లో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద శనివారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రిక మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. తనను ఆదరిస్తున్న పేషెంట్లకు, హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
నిర్మల్ పంచాంగం @ 95ఏళ్లు
నిర్మల్: వందల ఏళ్ల చారిత్రక నేపథ్యమున్న నిర్మల్‌లో ఉగాది పర్వదినానికీ ప్రత్యేకత ఉంది. రాష్ట్ర వ్యా ప్తంగా పేరుగాంచిన ‘నిర్మల పంచాంగం’ ఇక్కడే మొదలైంది. శైవపీఠాధిపతిగా, శివారాధకులుగా పేరొందిన నిర్మల అంబయ్య సిద్ధాంతి జ్యోతిష్యశాస్త్రంలోనూ పట్టుకలిగి ఉండేవారు. పౌరోహితులుగా ఉండి వారి వద్ద నుంచి బ్రహ్మపురికి చెందిన గాడిచర్ల నారాయణసిద్ధాంతి, గుడి రాజేశ్వరశర్మ, గుడినర్సింహ పంచాంగ రచనను ప్రారంభించారు. నిర్విరామంగా.. నిర్మల్‌లోని బ్రహ్మపురి రథాలగుడి ఎదురుగా ఉన్న గాడిచర్ల నారాయణసిద్ధాంతి తన 20వ ఏట నుంచే పంచాగం రాస్తున్నారు. మొదట్లో తన గురువులు నిర్మల అంబయ్యసిద్ధాంతి, చెన్నూరు మత్స హన్మత్సిద్ధాంతి సహకారంతో వరంగల్‌లో పంచాంగాన్ని ముద్రించారు. గాడిచర్ల నిర్మల పంచాంగం పేరిట ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అప్పట్లోనే మంత్రులు, ప్రముఖులు గాడిచర్ల పంచాంగాన్ని అనుసరించేవారు. ఏకంగా 64 ఏళ్లపాటు పంచాంగాన్ని అందించిన నారాయణసిద్ధాంతి మరణానంతరం ఆయన దత్తపుత్రుడు గాడిచర్ల నాగేశ్వరశర్మ సిద్ధాంతి ఆ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికీ పంచాంగ రచన కొనసాగిస్తున్నారు. ఈయన 35వ ఏట నుంచి రాస్తున్నారు. గత 95ఏళ్లుగా ఏ ఒక్క ఏడాది కూడా ఆపకుండా పంచాంగాన్ని ప్రజలకు అందిస్తూ వస్తున్నారు. నిర్మల్ ప్రత్యేకం.. రాష్ట్రంలో ఎంతోమంది పంచాంగాలను రాస్తున్నా.. నిర్మల్ సిద్ధాంతుల పంచాంగానికి మంచి పేరుంది. బ్రహ్మపురికే చెందిన గుడి రాజేశ్వరశర్మ సిద్ధాంతి, గుడినర్సింహ సిద్ధాంతి ఏళ్లపాటు పంచాంగ రచన కొనసాగించారు. మధ్యలో కొంత విరామం వచ్చినా మళ్లీ వారి వారసుడిగా గుడి ఉమామహేశ్వరశర్మ పంచాంగాన్ని రాస్తున్నారు. ప్రతీ ఉగాదికి నిర్మల్ పంచాంగాలను ఈ సిద్ధాంతులు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నిర్మల అంబయ్యసిద్ధాంతి శిష్యులుగా.. నిర్విరామంగా అందిస్తున్న ‘గాడిచర్ల’ ‘గుడి’ కుటుంబం నుంచీ రచన పూర్వజన్మ సుకృతం.. గాడిచర్ల నిర్మల పంచాంగాన్ని ఏటా నిర్విరామంగా అందించే భాగ్యం కలుగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. రథాలగుడి కాశీవిశ్వేశ్వరుడి ఆశీస్సులతో శ్రీవిశ్వావసునామ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. – గాడిచర్ల నాగేశ్వరసిద్ధాంతి, నిర్మల్ -
కులవృత్తుల వారికి ప్రత్యేకం...
గ్రామాల్లో ఉండే వడ్రంగి, కమ్మరి తదితర విశ్వబ్రాహ్మణ కులవృత్తుల వారు ఉగాది ఘనంగా నిర్వహిస్తారు. తమకు జీవనాధారమైన పనిముట్లకు పండుగరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. పూజలు చేశాక నాలుగైదు రోజుల వరకు పనులు చేపట్టరు. కొత్త పంచాంగంలో మంచి ముహూర్తం చూసి తిరిగి పూజలు చేశాకే వాటిని తీసుకొని మళ్లీ పనుల్లో నిమగ్నమవుతారు. క్రోధి ముగిసి, విశ్వావసుతో ఉగాది పండుగొచ్చింది. కాలగమనంలో మరో కొత్త ఏడాదిని తీసుకొచ్చింది. ఇంటిల్లిపాది ఆదివారం తెలుగు సంవత్సర‘ఆది’ని ఘనంగా జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. ప్రధానంగా వ్యవసాయ కుటుంబాల్లో ఉగాది పండుగ చాలా ప్రత్యేకమైంది. పండుగకు ముందస్తుగానే రైతుకుటుంబాలు సిద్ధమవుతాయి. తమ ఇళ్లల్లో గ్రహబలం ఉన్నవారి పేరిట కొత్త పంచాంగాల్లో ముహూర్తాలు చూపించి, ఉగాది పర్వదినాన పంటక్షేత్రాల్లో కొత్త ఏడాదికి సంబంధించి వ్యవసాయ పనులను ఆరంభించనున్నారు. అలాగే కొత్త ఏడాదికి సంబంధించిన కౌలు లెక్కలు, పాలేర్ల జీతాలనూ ఉగాది రోజే మాట్లాడుకుంటారు. – భైంసా ●సాగు పనులకు ముహూర్తం ● కౌలు, జీతాల లెక్కలకు శ్రీకారం ●గ్రామ గ్రామాన పంచాంగ పఠనం ● పప్పు బూరెలతో భోజనం ప్రత్యేకం ●ఇంటింటా షడ్రుచుల పచ్చడి భైంసాలో ఉగాది రోజు సాగు పనులు ప్రారంభిస్తున్న రైతు (ఫైల్) గ్రామాల్లో గమ్మత్తుగా... ఉగాది రోజు పనులు చేసిన రైతులంతా గ్రామాల చుట్టూ ఉన్న చెట్లకు తాళ్లు కట్టి ఉయ్యాలలు ఊగుతారు. కొన్ని గ్రామాల్లో ఆలయాల ముందు ఉండే బండరాళ్లను ఎత్తుకుని ఆలయం చుట్టు తిరుగుతారు. ఈ బండరాళ్ల బరువులెత్తే విషయంలో రైతులు పందేలు కాస్తారు. కొత్త పనుల్లో పాలేర్లు... కొత్త సంవత్సరంలో రైతుల వద్ద పాలేర్లుగా నియామకమైన వారంతా ఉగాదిరోజే పనుల్లో చేరుతారు. తమ కొత్త యజమాని వద్ద వ్యవసాయ పనుల్లో చేరి వచ్చే సంవత్సరం వరకు అక్కడే పని చేస్తారు. అనంతరం సాయంత్రం గ్రామాల్లో కబడ్డీ ఆడుతారు. పంట పొలాల్లో నుంచి తిరిగి వచ్చిన తర్వాత గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పంచాంగ పఠనం చేయిస్తారు. కొత్తసంవత్సరంలో ఏయే పంటలకు ధరలు ఉంటాయో కాలచక్రం ఏ విధంగా ఉంటుందో పంచాంగకర్తలు వెల్లడిస్తారు. పంటభూమిలో పూజలు.. ఉగాది వస్తోందంటే ప్రధానంగా పల్లెలు కోలాహలంగా కనిపిస్తాయి. రైతు కుటుంబాలు తమ ఇళ్లను శుద్ధి చేసి పెట్టుకుంటారు. కొత్త పంట ఉత్పత్తులు, కొత్త చింతపండు, కొత్త కారం, మామిడికాయలు, వేప చిగురు ఇలాఅన్నీ సిద్ధం చేసి ఉంచుకుంటారు. తమ పంటభూముల్లో సాగుపనులు ప్రారంభించేందుకు ఇప్పటికే పంచాంగాలు చూపించారు. పండుగ రోజు వేకువజామునే ఎవరి కంటపడకుండా పంట పొలాలకు వెళ్లి పూజలు చేస్తారు. పంట భూమిలో పంచపాండవులను ప్రతిష్ఠించి, ఇంటి నుంచి తీసుకెళ్లిన నీటితో శుద్ధి చేసి పసుపు, కుంకుమలు చల్లి తమ వెంట తీసుకెళ్లిన అరకలు, వ్యవసాయ పనిముట్లకు పూజలు చేస్తారు. ఉగాది నుంచే కొత్తఏడాది.. మనప్రాంతంలో ఉగాది పండుగకు ప్రత్యేకత ఉంటుంది. వ్యవసాయం చేసే రైతు కుటుంబాల వాళ్లం పండగను ఘనంగా జరుపుకుంటాం. సంప్రదాయబద్ధంగా ధోతీ కట్టి, తలపాగా చుట్టి ముహూర్త సమయాన పంటపొలంలో పూజలు చేసి, వ్యవసాయ పనులు ప్రారంభిస్తాం. అక్కడే భోజనాలు చేసి భూమాతకు పూజచేసి, చల్లగా చూడాలని వేడుకుంటాం. రైతు కుటుంబాలకు ఉగాది నుంచే కొత్త ఏడాది మొదలవుతుంది. –తూము దత్తు, భైంసాప్రత్యేకతలెన్నో... ఉగాది అంటే షడ్రుచుల పచ్చడి ఒక్కటే కాదు.. జిల్లాలో సాగు పనులు ప్రారంభించడం, బూరెల భోజనమూ పండుగ ప్రత్యేకమే. ప్రధానంగా భైంసా డివిజన్, నిర్మల్ డివిజన్ లోని కొన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా చేస్తారు. చాలామంది రైతులు పంట పొలాల్లో పూజలు చేసిన తర్వాత తెలిసిన వారిని పిలిచి అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇళ్లలోనుంచి అంబళ్ల కుండలతో వంటలు చేసుకొని పంట పొలాలకు వెళ్తారు. పూజలు చేశాక తమతో వచ్చిన వారికి అంబళ్లను తాగించి అక్కడే భోజనాలు పెడతారు. భోజనాలు చేశాక అందరితో కలిసి కాసేపు వ్యవసాయ పనులు చేస్తారు. తమ ఇంటి మహిళలపై ఉన్న బంగారాన్ని ఒక ఆకులో చుట్టి నేలలో పాతి పెడతారు. దుక్కిదున్నిన తర్వాత ఆకును ఇంటి వారు తీసుకొని భూమాత తమకు కొత్త సంవత్సరంలో బంగారం లాంటి పంటలు ఇస్తుందని సంబుర పడుతారు. ఇక దుక్కిదున్నిన వారు, అంబళ్ల కుండలు నెత్తిన మోసిన వారు దినమంతా నిద్రపోకుండా గ్రామ శివార్లు దాటి వెళ్లకుండా నియమాలు పాటిస్తారు. సాయంత్రం వేళ ఇళ్లలో పప్పుబూరెలు చేసి వ్యవసాయ కూలీలకు తమ వద్ద పని చేసే పాలేర్లకు భోజనాలు పెట్టి, అనంతరం ఇంటిల్లిపాది ఆరగిస్తారు. ఎప్పుడూ ప్యాంటు, చొక్కా వేసే వాళ్లు సైతం ఉగాది రోజున చక్కగా పంచకట్టుతో పొలాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. -
లెప్రసీ, ఫైలేరియాపై శిక్షణ
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లో శు క్రవారం మాన్ కై ండ్ సంస్థ సహకారంతో లె ప్రా ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో మిడ్ లెవె ల్ హెల్త్ ప్రొవైడర్స్‌కు లెప్రసీ, ఫైలేరియాపై ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో రాజేందర్ మాట్లాడుతూ.. జి ల్లాలో కుష్ఠు, బోదకాలు వ్యాధిని అరికట్టడానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమ నిర్వణాధి కారి డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, లెప్రా ఇండియా సొసైటీ ఫిజియోథెరపిస్ట్ కిషన్, డిప్యూటీ పీఎంవో గంగన్న, రాజేశ్వర్‌రావు, పీహెచ్ఎన్ విమల, ఆరోగ్య పర్యవేక్షకులు భోజారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
పీహెచ్‌సీలను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో
లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో రాజేందర్ శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఇన్, అవుట్ వార్డుల రో గుల వివరాలు డాక్టర్ ప్రత్యూషను అడిగి తెలుసుకున్నారు. ిబయోమెట్రిక్ హాజరు పరికరాన్ని పరిశీలించారు. ఓపీ గదికి మరమ్మతు చేయించుకోవాలని సూచించారు. ఎన్సీడీ పీవో శ్రీనివాస్ ఉన్నారు. మామడ: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని డీఎంహెచ్‌వో రాజేందర్ ఆకస్మికంగా త నిఖీ చేశారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సి బ్బందికి సూచించారు. ఆయన వెంట వైద్యులు శ్రీనివాస్, రవీందర్, అరుణ్, ప్రత్యూష ఉన్నారు. -
పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టాలి
నిర్మల్‌చైన్‌గేట్: రబీలో రైతులు పండించిన వరి ధా న్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని అదన పు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు ప్ర క్రియల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్త ప డాలని సూచించారు. ఓపీఎంఎస్ యాప్, జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందు కు ప్రత్యేకంగా రూపొందించిన లోకల్ యాప్, ట్యా బ్ ఎంట్రీ ప్రక్రియపై అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. గన్నీ సంచులు, టార్పాలిన్లు, తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, డీఎస్వో కిరణ్‌కుమార్, డీఎం వేణుగోపా ల్, డీసీవో పాపయ్య, ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గడువు మూడురోజులే..
నిర్మల్‘కడెం’పై సేఫ్టీ బృందం కడెం ప్రాజెక్ట్‌ను ‘స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్’ బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వరద గేట్లు, కౌంటర్ వెయిట్లు, లిఫ్టింగ్ రోప్‌లను పరిశీలించారు.● ఎల్ఆర్ఎస్ చెల్లింపులు 8శాతమే ● రిబేట్ ఇచ్చినా స్పందన అంతంతే ● గడువు పొడిగిస్తారని ఎదురుచూపు ● ఎలాంటి ప్రకటన చేయని సర్కారుశనివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 202510లోuవన్ నేషన్–వన్ ఎలక్షన్‌తో తగ్గనున్న ఆర్థికభారం నిర్మల్‌చైన్‌గేట్: వన్ నేషన్–వన్ ఎలక్షన్‌తో ప్ర భుత్వానికి ఆర్థికభారం తగ్గుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్ పేర్కొన్నా రు. జిల్లా కేంద్రంలోని గాజులపేట్ మున్నూ రు కాపు సంఘ భవనంలో శుక్రవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ‘ఒక దేశం–ఒక ఎ న్నిక’ కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నాయకులు రాంనాథ్, సత్యనారాయణగౌడ్ హాజరై మాట్లాడారు. ‘ఒక దేశం–ఒక ఎన్నిక’ విధానం పక్షపాతాన్ని నివారించి పాలనపై దృష్టిని పెంచుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల కార్తిక్, సుంకరి సాయి, మెడిసెమ్మే రాజు, కమల్ నయన్, ఒడిసెల అర్జున్, మహేశ్, గంగాధర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. భైంసాటౌన్: ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు గడువు మూడురోజుల్లో ముగియనుండగా దరఖాస్తుదారుల్లో స్పందన పెద్దగా కనిపించడంలేదు. ఈ నెల 31 వరకు చెల్లింపు గడువు విధించిన ప్రభుత్వం 25 శాతం రిబేట్ కూడా ప్రకటించింది. గడువులోపు ఫీ జు చెల్లించి 25శాతం రాయితీని వినియోగించుకో వాలని మున్సిపల్ అధికారులు ఎంత ప్రచారం చేసినా చెల్లింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా హె ల్ప్డెస్క్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేశారు. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 26,996 దరఖాస్తులు రాగా, వీటిలో పలు కారణాలతో కొన్నింటిని తిరస్కరించి, 18,130 దరఖాస్తులను క్రమబద్ధీకరణకు అర్హత ఉ న్నవిగా గుర్తించారు. అయితే, ఇప్పటివరకు మున్సి పాలిటీలు, గ్రామపంచాయతీలు కలుపుకొంటే 8శా తం మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. శు క్రవారం దరఖాస్తుదారుల తాకిడి పెరగడంతో కొద్దిసేపు సర్వర్ సమస్య తలెత్తింది. దీంతో దరఖా స్తుదారులు ఇబ్బంది పడ్డారు. ఈనెల 31తో గడువు ముగియనున్న నేపథ్యంలో సెలవురోజులైన 30, 31 తేదీల్లోనూ మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. న్యూస్రీల్గ్రామపంచాయతీల్లో... జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల పరిధిలోనూ ఎల్ఆర్ఎస్పై ఫీజు రాయితీకి అవకాశం కల్పించారు. 130 గ్రామపంచాయతీల పరిధిలో 2020లో 14,615 దరఖాస్తులు రాగా, ఆయా దరఖాస్తుదారులకు పంచాయతీ అధికారులు ఫోన్లు చేస్తూ ఎల్ఆర్ఎస్ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో కలిపి శుక్రవారం ఒక్కరోజే రూ.24 లక్షల వరకు ఫీజు రూపంలో వసూలు చేశారు. ఇంకా మూడు రోజులే గడువు ఉండగా, చాలామంది వివిధ కారణాలతో ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ఫీజు చెల్లింపు గడువు పొడిగిస్తుందని మరికొందరు భావిస్తున్నారు. కానీ.. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సద్వినియోగం చేసుకోవాలి ఎల్ఆర్ఎస్పై రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశాం. ఏమైనా సందేహాలుంటే, సిబ్బందిని సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. ఈనెల 30, 31 తేదీల్లోనూ కార్యాలయంలో అందుబాటులో ఉంటాం. – బీ రాజేశ్‌కుమార్, భైంసా మున్సిపల్ కమిషనర్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ వివరాలు మున్సిపాలిటీ దరఖాస్తులు చెల్లించినవారు వసూలు (రూ.కోట్లలో) నిర్మల్ 10,408 1,193 3.57 భైంసా 6,354 422 0.50 ఖానాపూర్ 1,368 84 0.15 పంచాయతీలు 14,615 1,076 1.63 -
ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి
● ఎస్పీ జానకీ షర్మిల ● వైద్యులు, సిబ్బందికి సన్మానంనిర్మల్ టౌన్: పోలీసులు ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించా రు. పోలీసులకు ఉచిత మెడికల్ టెస్టుల క్యాంప్ ను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నెలపాటు నిర్వహించారు. ఇందులో విధులు నిర్వర్తించిన వైద్యాధికారులు, మెడికల్ సిబ్బందిని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడు తూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తుంటే పోలీస్ అధికారులు, సి బ్బంది ఆరోగ్యం పాడవుతుందని గ్రహించి వై ద్యాధికారులతో మాట్లాడి మెడికల్ క్యాంపు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 30 ఏళ్లు పైబడిన 703 మంది పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత సంబంధిత వైద్యులకు చూ పించి మందులు ఇప్పించినట్లు తెలిపారు. క్యాంపులో విధులు నిర్వహించిన డాక్టర్లు, ఆస్పత్రి, ల్యాబ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్య క్రమంలో అదనపు ఎస్పీలు అవినాష్‌కుమార్, రాజేశ్ మీనా, ఏవో యూనస్అలీ, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, కృష్ణ, సమ్మయ్య, ఆర్ఐలు రాంనిరంజన్, శేఖర్, రామకృష్ణ, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
సివిల్ సప్లయ్‌లో ముగ్గురిపై వేటు
● డీఎం, డీఎస్వో, డీటీల సస్పెన్షన్ ● రైస్‌మిల్లు తనిఖీల్లో జాప్యంతోనే.. ● సస్పెన్షన్ పైనా అనుమానాలునిర్మల్: జిల్లా పౌరసరఫరాలశాఖలో ముగ్గురు అధి కారులపై వేటుపడ్డట్లు తెలిసింది. డీఎం, డీఎస్వో, డీటీలకు శాఖ కమిషనర్ దేవేంద్రచౌహాన్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. జిల్లాలో ఇటీవల సీఎంఆర్‌లో చోటుచేసుకుంటున్న మాయాజాలం, కొంతమంది మిల్లరు ధాన్యం అమ్ముకుని రూ.కోట్లు కొల్లగొట్టిన తీరు బయటపడుతున్న సందర్భంలో ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలి యడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ లేనంతగా అధికారులు జిల్లాలో రైసుమిల్లులపై కేసులు పెడుతున్న క్రమంలో వారు సస్పెండ్ కావడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కేసులోనేనా..! జిల్లాలోని చాలా రైసుమిల్లుల్లో రూ.కోట్ల విలువ చే సే ధాన్యం మాయమైంది. ఈక్రమంలోనే నర్సాపూ ర్ మండలం అర్లి ఎక్స్‌రోడ్డు సమీపంలోగల ద్వారకామయి ఆగ్రో ఇండస్ట్రిస్ రైస్‌మిల్లుపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులో 2022–23 రబీ, 2023–24 ఖరీఫ్, 2023–24రబీ సీజన్లకు సంబంధించి ఏకంగా రూ.48కోట్లకు పైగా విలువ చేసే ధాన్యం మాయం కావడం గమనార్హం. 2022–23 రబీ, 2023–24 ఖరీఫ్, 2023–24రబీ సీజన్లకు సంబంధించి సదరు మిల్లుకు 16,427మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. ఆ మిల్లు నుంచి 11,006.090 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) రావాల్సి ఉండగా, ఈఏడాది ఫిబ్రవరి వరకు 1031.218 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. మిగతా 9,974.972 మెట్రిక్ టన్నులు ఇవ్వలేదు. అధికారులు తనిఖీ చేసినప్పుడు సంబంధిత ధాన్యం మిల్లులో లేదు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసు కారణంగానే తాజాగా డీఎం గోపాల్, డీఎస్వో కిరణ్‌కుమార్, డీటీ రమాదేవికి సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. కేసులు పెడుతున్నా.. గతంతో పోలిస్తే.. ఇటీవల సివిల్ సప్లయ్ అధికారులు సీరియస్‌గానే స్పందిస్తున్నారు. ఐదునెలల పరిధిలోనే జిల్లాలో 21కేసులు పెట్టడం గమనార్హం. ఇందులో 12 క్రిమినల్ కేసులున్నాయి. ఏడు మిల్లులపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ పెట్టారు. మిగతా మిల్లులపైనా అమలు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇంతలోనే సదరు జిల్లా అధికారులపై వేటువేయడం అనుమానాలకు తావిస్తోంది. ద్వారకామయి మిల్లు తనిఖీల విషయంలో ఆలస్యం చేశారన్న కారణం చూపుతూ ముగ్గురు అధికారులపై వేటు వేసినట్లు సమాచారం. మరోవైపు వీరిపై కొంతమంది మిల్లర్ల ఒత్తిడి, రాజకీయ కోణంలో సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారా..!? అన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. -
రైతులపై దాడి సరికాదు
నిర్మల్‌చైన్‌గేట్: రైతులపై పంజాబ్ ప్రభుత్వం, పోలీ సుల దాడి చేయడం హేయమైన చర్య అని సంయు క్త కిసాన్ మోర్చా నాయకులు పేర్కొన్నారు. పంజాబ్‌లో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసుల దాడికి వ్యతిరేకంగా శుక్రవారం ఆర్డీవో కార్యాల యం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు నూతన్‌కుమార్, జే రాజు మాట్లాడారు. మోదీ పాలనలో దేశంలో రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి, రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపారు. పదేళ్లలో కేంద్రంలో మో దీ ప్రభుత్వం రూ.16లక్షల కోట్ల కార్పొరేట్ రుణాల ను మాఫీ చేసిందని విమర్శించారు. ఒక్క రూపాయి కూడా రైతు రుణాన్ని మాఫీ చేయలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు డాకూర్ తిరుప తి, నాగెళ్లి నర్సయ్య, శంభు, గోనె స్వామి, గుట్ల ప్రసాద్, మంక శ్రీనివాస్, రాములు పాల్గొన్నారు. -
గ్రామాల్లో సౌర వెలుగులు..!
● ‘పీఎం సూర్యఘర్ మస్త్ బిజిలీ యోజన’కింద ఎంపిక ● ఉమ్మడి జిల్లాలో రెండు మోడల్ గ్రామాలు ● పూర్తయిన సర్వే మంచిర్యాలఅగ్రికల్చర్: గ్రామీణ ప్రాంత ప్రజలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం లక్ష్యంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ‘సూర్యఘర్ మస్త్ బిజిలీ యోజన’ పథకం కింద సంపూర్ణ సౌరశక్తి గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ జిల్లాలో ఒక గ్రామాన్ని మోడల్ తీర్చిదిద్దనున్నారు. దీంతో ఆ గ్రామాల్లో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నర్సపూర్, మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ మండలం వెంకట్రావ్పేట్ను మోడల్ గ్రామాలుగా ఎంపిక చేశారు. కాగా ఆ గ్రామాల్లో ఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేశారు. ఎన్ని ఇండ్లు, విద్యుత్ సర్వీస్ మీటర్లు, వ్యవసాయ కనెక్షన్లు, తదితర వివరాలపై సర్వే చేపట్టారు. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించి, తదుపరి ఆదేశాలు రాగానే పనులు ప్రారంభించనున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ చెబుతున్నారు. సంపూర్ణ సౌరశక్తి గ్రామాలుగా.. కేంద్ర ప్రభుత్వం, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ద్వారా, రాష్ట్రంలో రెడ్కో విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ప్రతీ జిల్లాకు ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా తీర్చిదిద్దనున్నారు. సౌరశక్తి గ్రామంగా తీర్చిదిద్దేందుకు కేంద్రప్రభుత్వం రూ. కోటి సాయం అందిస్తుంది. స్థానిక ఉత్పత్తి చేయడం విద్యుత్ ఖర్చులు తగ్గనున్నాయి. ఇంటి యజమానికి ఆదాయం..రూప్ లెవల్ బిల్డింగ్‌పై కిలోవాట్ సోలార్ ఏర్పాటుకు 80 నుంచి 90 స్క్వేర్ ఫీట్లు, 2 కిలోవాట్స్ సోలార్ ప్లాట్ ఏర్పాటుకు 160 నుంచి 190 స్క్వేర్ ఫీట్లు, 3 కిలోవాట్స్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 270 స్క్వేర్ ఫీట్ల స్థలం అవసరం ఉంటుంది. వ్యవసాయ బోరుబావుల వద్ద 7.5 కిలోవాట్స్ ప్లాంట్ ఏర్పాటుకు బోరుబావుల నుంచి 100 మీటర్ల డీయషన్ పరిధిలో సరైన ప్రదేశం అవసరం ఉంటుంది. 2 కిలోవాట్స్ ప్లాంటు ఏర్పాటు అయితే ఇంటి యజమానికి నెలకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల ఆదాయం వరకు, బోరు బావుల వద్ద 7.5 కిలోవాట్స్ ప్లాంటుకు రూ. 5 వేల నుంచి రూ 6 వేల వరకు ఆదాయం యజమానికి చేరుతుంది. దీంతో పాటు రైతు గృహ అవసరాలకు విద్యుత్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. సర్వే పూర్తి చేశాం.. ప్రధాన మంత్రి సూర్యఘర్ మస్త్ బిజిలీ యోజన పథకం ద్వారా సంపూర్ణ సౌరశక్తి గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది. మోడల్ గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుకు చేసేందుకు సర్వే చేశాం. ఏడీఈ, ఏఈ, సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటి వివరాలు, యాజమాని పేరు, ఆధార్‌కార్డు వివరాలు సేకరించారు. రైతులకు సోలార్ ప్లాంట్ ప్రయోజనాలను వివరించాం. – గంగాధర్, విద్యుత్‌శాఖ ఎస్ఈ, మంచిర్యాల ఎంపిక చేసిన గ్రామాల వివరాలు..గ్రామం విద్యుత్ కనెక్షన్లు రిజిస్ట్రేషన్ వ్యవసాయ కనెక్షన్లు రిజిస్ట్రేషన్ వెంకట్రావుపేట 1415 1405 346 340 నర్సపూర్ 131 128 76 75ఉమ్మడి జిల్లాలో రెండు గ్రామాలు.. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, సమాజం తమ ఇంధన అవసరాలకు తీర్చుకోవడంలో స్వావలంబన పొందేలా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మోడల్ సోలార్ విలేజ్ అనే పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం అమలుకు రాష్ట్రంలోని 17 జిల్లాలలో 8 గ్రామాలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ డివిజన్ పరిధిలో నర్సపూర్, మంచిర్యాల జిల్లా పరిధిలో లక్షేట్టిపేట మండలం వెంకట్రావ్‌పేట్ గ్రామాలను ఎంపిక చేశారు. నర్సపూర్‌లో 131 విద్యుత్ మీటర్లుకు 128ఇండ్లను అర్హతగా గుర్తించారు. వ్యవసాయ బోర్లు 75 నమోదు పూర్తి చేశారు. వెంకట్రావ్‌పేటలో 1415 విద్యుత్ మీటర్లకు 1405, 346 వ్యవసాయ బోరుబావుల కనెక్షన్లకు 340 నమోదు చేశారు. మొత్తం 1746 కనెక్షన్లు నమోదు చేశారు. ఇంటి యజమాని పేరు, బ్యాంకు ఖాతా నెంబర్, ఆధార్ నెంబర్, రూప్ లెవల్లో ఉన్న స్థలం వివరాలను సేకరించారు. ఎంత సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటు చేయాలో వివరాలు సేకరించారు. ఆ వివరాలను సూర్యఘర్ పోర్టల్‌లో నమోదు చేశారు. -
బాసర ఆలయ హుండీ లెక్కింపు
బాసర: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ హూండీని శుక్రవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం 10 గంటలకు అమ్మవారి ఆలయ అక్షరాభ్యా స మండపంలో 43 రోజుల హుండీ లెక్కింపు ను చేపట్టారు. భక్తులు సమర్పించిన కానుకలు, హుండీల ద్వారా నగదు రూపంలో రూ. 53,36,176, బంగారం 73 గ్రాములు, వెండి 2 కిలోల 100 గ్రాములు, విదేశీ కరెన్సీ 21 నోట్లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వణాధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, శ్రీజ్ఞాన సరస్వతి సేవాసమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
‘కడెం’ను సందర్శించిన డ్యాం సేఫ్టీ బృందం
కడెం: కడెం ప్రాజెక్ట్‌ను శుక్రవారం ‘స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్’ బృందం సభ్యులు రిటైర్డ్ సీఈ, ఐడ్రో మెకానికల్ ఎక్స్పర్ట్ కె.సత్యనారాయణ, స్టేట్ డ్యాం సేఫ్టీ చీఫ్ ఇంజనీర్ ప్రమీల సందర్శించారు. ప్రాజెక్ట్ వరద గేట్లు, కౌంటర్ వెయిట్లు, లిఫ్టింగ్ రోప్‌లను పరిశీలించారు. వరద గేట్ల ఆపరేటింగ్ సమస్యలు, ప్రాజెక్ట్ స్థితిగతులను ఎస్ఈ రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు చేశారు. ఇందులో ఈఈ విఠల్‌రాథోడ్, డీఈ నవీన్, విజయలక్ష్మి, గణేశ్, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు. సీల్ట్ ఏజెన్సీ బృందం సందర్శన నీటిపారుదల శాఖ కడెం ప్రాజెక్ట్ పూడికతీత టెండర్ల ప్రక్రియను ఈనెల 27న, పూర్తి చేసి, పనులను ఏజెన్సీకి అప్పగించారు. శుక్రవారం ఏజెన్సీ సిబ్బంది కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. ఏజెన్సీ పేరు, వివరాలు కరీంనగర్ సీఈ పరిధిలో ఉంటాయని, టెండర్ గురించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఎస్ఈ రవీందర్ తెలిపారు. -
సరిహద్దు ప్రాంతంలో విస్తృత తనిఖీలు
కోటపల్లి: మండలంలోని రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద నార్కోటిక్ జాగిలంతో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అంతరాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా తెలంగాణలోకి వచ్చిపోయే వాహనదారులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతో పాటు మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. గంజాయి సేవించిన, రవాణ చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై రాజేందర్, ఎకై ్సజ్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కుళ్లిన మాంసం.. కాలం చెల్లిన స్వీట్లు
● బల్దియా అధికారుల తనిఖీల్లో గుర్తింపు కై లాస్‌నగర్: ఆదిలాబాద్ బల్దియా పారిశుద్ధ్య విభా గం అధికారులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు హోటల్స్, స్వీట్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. కలెక్టర్చౌక్లోని ఓ హోటల్‌ను తనిఖీ చేసిన అధికారులు కుళ్లిన 6 కిలోల మాంసం, గడ్డ కట్టిన పాడైన చేపల ను గుర్తించారు. వాటిని నిల్వ ఉంచిన ఫ్రీజ్‌లో పురుగులు ఉండటంతో హోటల్ యాజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన మాంసతో పాటు ఆహా ర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హోటల్ నిర్వాహకుడిని హెచ్చరించి, జరిమానా విధించారు. అనంతరం వినాయక్ చౌక్‌లోని వెంకటేశ్వర స్వీట్‌షాపు, స్వీట్ల తయారీ ప్రాంతం అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. కాలం చెల్లిన స్వీట్లను తయారు చేసిన స్వీట్లతో కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించి, జరిమానా విధించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే చర్యలు తప్పవని పుడ్ ఇన్స్పెక్టర్లు ఎం.నరేందర్, బైరి శంకర్లు హెచ్చరించారు. -
8వ షెడ్యూల్లో పొందుపర్చడం హర్షణీయం
నార్నూర్: బంజారా (లంబాడా) గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపర్చుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షణీయమని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భారత్‌త్ చౌహాన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్‌తో కలిసి మాట్లాడారు. బంజారా గిరిజనుల ప్రత్యేకమైన వేషాధారణ, భాష ఉన్నప్పటికీ లిపి లేక పోవడంతో గుర్తింపు లేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సమావేశంలో కళాకారు ల సంఘం జిల్లా అధ్యక్షుడు అడే డిగాంబర్, ఉట్నూర్ నాయక్ గంగారాం నాయక్, రవినాయక్, తదితరులు పాల్గొన్నారు. -
నీలుగాయిని హతమార్చిన వేటగాళ్ల అరెస్టు
● నిందితుల్లో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెంచికల్పేట్: మండలంలోని లోడుపల్లి అటవీ ప్రాంతంలో నీలుగాయిని హతమార్చిన వేటగాళ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పెంచికల్పేట్ రేంజ్ అధికారి అనిల్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లోడుపల్లి అటవీ ప్రాంతంలోని సహజ నీటి వనరుల వద్ద నీలుగాయిని హతమార్చానే పక్కా సమాచారంతో రావడంతో సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించాం. కొండపల్లి గ్రామానికి చెందిన చప్పిడే వెంకటేశ్, ఎల్లూర్ గ్రామానికి చెందిన దుర్గం రవీందర్‌ల ఇళ్లల్లో తనిఖీలు చేయగా.. నీలుగాయి మాంసం లభ్యమైంది. వారిని విచారించగా కొండపల్లి గ్రామానికి చెందిన ఆత్రం రవి, గొర్లపల్లి మొండి, మన్నెపల్లి శ్రీహరి, ఆత్రం భీమయ్యలతో కలిసి నీలుగాయిని హతమార్చినట్లు ఒప్పుకున్నారు. వెంకటేశ్, దుర్గం రవీందర్‌ను కోర్టులో హాజరుపరచగా న్యాయముర్తి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. దుర్గం రవీందర్ పెంచికల్పేట్ మండలంలోని మెరెగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పరారీలో ఉన్న మిగతా నలుగురిని పట్టుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఎఫ్ఎస్వో శంకర్, ఎఫ్‌బీవోలు సంగదీప్, సతీష్, లచ్చన్న, మనోహర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆన్లైన్ ప్రవేశాలు జరిగేనా..?
● ఇంటర్ విద్యలో అమలుపై స్పష్టత కరువు ● మన్యువల్గానే ప్రవేశాలు ● విద్యార్థులపై ప్రైవేట్ యాజమాన్యాల ఒత్తిడి బోథ్: డిగ్రీలో అమలు చేస్తున్న దోస్త్ విధానం తరహాలోనే ఇంటర్ ప్రవేశాలపై పీటముడి నెలకొంది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధా నం వచ్చినా.. మన్యువల్ గానే ప్రవేశాలు పొందుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు తమ కళాశాలల్లో చేరాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. దీంతో పైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల ప్రవేశాలపై స్పష్టత కరువైంది. ప్రైవేట్ కళాశాలల ఆగడాలను చెక్.. ఇంటర్ ప్రవేశాల్లో దోస్త్ తరహా ఆన్లైన్ విధానం అమలైతే విద్యార్థులకు మేలు జరుగుతుంది. విద్యార్థి తనకు నచ్చిన కళాశాలలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకునే వీలుంటుంది. పదో తరగతిలో విద్యార్థికి వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా కేటాయింపులు జరుగుతాయి. ఈ విధానంతో విద్యార్థి తనకు నచ్చిన కళాశాలలో చదివే వీలు ఉంటుంది. వివిధ ఫేజ్‌లతో కూడిన ప్రవేశాలు ఉంటే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉండదు. ఇంటర్లో కూడా డిగ్రీ మాదిరిగానే ఆన్లైన్ ప్రవేశాలు చేపడితే ప్రైవేట్ కళాశాలల ఆగడాలను చెక్ పడనుంది. విద్యార్థుల వద్దకు పీఆర్వోలు.. పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంటర్లో ప్రవేశాలు పొందేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈక్రమంలో ప్రైవేట్ యాజమాన్యం క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఇప్పటికే ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. తల్లిదండ్రులను కలిసి తమ కళాశాలల్లో చేరాలని కోరుతున్నారు. విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. కాగా ఆయా కార్పొరేట్ కళాశాలలకు చెందిన పీఆర్వోలు విద్యార్థులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మొదట చేరి.. తరువాత తిరిగి వచ్చి.. పదో తరగతి పరీక్షలను విద్యార్థులు రాయకముందే పలు ప్రైవేట్ కళాశాలలకు చెందిన పీఆర్వోలు విద్యార్థుల అడ్మిషన్లు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులను కలిసి తమ కళాశాల గురించి వివరించి అడ్మిషన్లు చేస్తున్నారు. అడ్మిషన్ల సమయంలోనే వేలల్లోనే ఫీజులు కట్టించుకుంటున్నారు. ఇక పదో తరగతి పాస్ కాగానే విద్యార్థి కనీసం నెల రోజులు కూడా కళాశాలలో ఉండకుండా ఇంటికి వచ్చేస్తున్నారు. తాము కట్టిన ఫీజు వాపసు ఇవ్వకుండా కళాశాలల యాజమన్యాలు తల్లిదండ్రులను తిప్పించుకుంటున్నాయి. దీంతో తల్లిదండ్రులు నష్టపోతున్నారు. డిగ్రీ మాదిరిగా ఇంటర్లో ఆన్లైన్ ప్రవేశాలు చేపడితే ఇలాంటి నష్టాలు జరిగే అవకాశం ఉండదు. చెల్లించే ఫీజు వివరాలు కూడా ఆన్లైన్ అడ్మిషన్లో కనిపిస్తాయి. దీంతో ఎక్కువ ఫీజును కట్టే అవకాఽశం కూడా ఉండదు.కళాశాలల వివరాలు (ప్రభుత్వ, ప్రైవేట్)ఆదిలాబాద్ 76 నిర్మల్ 63 మంచిర్యాల 62 కుమురం భీం ఆసిఫాబాద్ 48 ఆన్లైన్ ద్వారా చేపట్టాలి ఇంటర్ ప్రవేశాలు పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించాలి. డిగ్రీ మాదిరిగా ప్రవేశాలు నిర్వహిస్తే విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కార్పోరేట్ కళాశాలలకు చెందిన పీఆర్ఓలు గ్రామాల్లోకి వచ్చి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థుల నుండి అధిక ఫీజులు అడ్మిషన్ల సమయంలో వసూలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆన్లైన్లో ప్రవేశాలు జరిపితే విద్యార్థి మంచి కళాశాలలో చదివే అవకాశం ఉంటుంది. – బోయిడి ఆకాష్, ఏబీవీపీ నాయకుడు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు గతంలో ఇంటర్లో ఆన్లైన్లో ప్రవేశాల కోసం విద్యార్థి కళాశాలకు దరఖాస్తు చేసుకునే వీలుంది. విద్యార్థి కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలంటే కళాశాల లాగిన్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. లేదా విద్యార్థి తాను స్వయంగా ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకుని కళాశాలలో చేరే అవకాశం ఉంది. కాని డిగ్రీ తరహా దోస్త్ మాదిరి ఆన్లైన్ ప్రవేశాలు ఇంటర్లో లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్, సమాచారం లేదు. – గణేశ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, ఆదిలాబాద్ -
విద్యుత్ సౌకర్యం కల్పించాలి
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ జిల్లా పెంబి మండలం జీడిమాల్య, రాగిదుబ్బ గిరిజన గేడేలకు, తండాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదివాసీలు కలెక్టర్‌ను కోరారు. కరెంటు లేక చీకట్లో ఉంటున్నామని తెలిపారు. గురువారం కలెక్టరేట్‌కు వచ్చి అభిలాష అభినవ్‌కు వినతిపత్రం ఇచ్చారు. పాలకులు మారినా తమ బతుకులు మారడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రజా ప్రభుత్వంలో తమ గూడేలు, వ్యవసాయ భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గం నాయకుడు బన్సీలాల్ రాథోడ్, ఆరే రాయుడు, తండా నాయక్ గుగ్లావత్ గణేశ్, రాజేందర్, రమేశ్, జల్పత్, చంపత్, ధన్సింగ్, మాలావత్ రమేశ్, ముకుంద్‌రావు, పర్సురామ్, బాబూలాల్ పాల్గొన్నారు. -
అర్హుల ఎంపికకు చర్యలు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ప్రత్యేక వైకల్య గుర్తింపు కా ర్డుల(యూడీఐడీ కార్డుల) పంపిణీ కోసం అర్హుల ఎంపికకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. హైదరా బాదు నుంచి సె ర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పంచాయతీరాజ్ గ్రా మీణాభివృద్ధి సెక్రెటరీ లోకేష్ కుమార్‌తో కలిసి జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో యూడీఐడీ కా ర్డులు, ఇందిర మహిళా శక్తి పెట్రోల్ బంకుల ఏ ర్పాటు, ప్రమాద బీమా మంజూరు, ఏకరూప దుస్తుల తయారీ తదితర అంశాలపై వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెర్ప్ సీఈవో మా ట్లాడుతూ, అన్ని జిల్లాల్లో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులను జారీ చేసేందుకు గుర్తింపు ప్రక్రియ ప్రా రంభించాలన్నారు. దివ్యాంగులు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వి ద్యాసంస్థల్లో చదివే వి ద్యార్థులకు ఏకరూప దుస్తుల ను పంపిణీ చేసేందుకు, ఎస్‌హెచ్‌జీ సభ్యులతో ఏకరూప దుస్తు ల స్ట్రిచింగ్ ప్రారంభించాలన్నారు. ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు, విద్యుత్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు, మహిళాశక్తి బజార్ల ఏ ర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. ప్ర మాదవశాత్తు మరణించిన మహిళా సంఘాల స భ్యులకు బీమా డబ్బులు అందేలా చూడాలన్నారు. ఎంపిక ప్రారంభానికి..కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ యూ డీఐడీ కార్డుల మంజూరు కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే న మోదు చేసుకున్న దివ్యాంగులకు సమాచారం అందించి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో యూడీఐడీ కార్డుల నమోదు శిబిరాన్ని ఏర్పా టు చేయనున్నామన్నారు. సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామ ని, మహిళా శక్తి పెట్రోల్ బంకులు, విద్యుత్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు, ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలా లను గుర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఇందిరా మహిళా బజార్ ఏర్పాటు కు స్థల గుర్తింపు పూర్తయిందని, ఇందిరా మహిళా బజార్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్, మెప్మా పీడీ సుభాష్, డీఎస్ఓ కిరణ్‌కుమార్, సివిల్ సప్లయిస్ డీఎం వేణుగోపాల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు సెర్స్ సీఈవో దివ్యదేవరాజన్ -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మల్లారెడ్డి
నిర్మల్ టౌన్: నిర్మల్ బార్ అసోసియేషన్ అ ధ్యక్ష ఎన్నికలు గురువారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడుగా అల్లూరి మల్లారెడ్డి ప్రత్యర్థిపై 17 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా షేర్ నరేందర్ ప్ర త్యర్థి అభ్యర్థిపై 7 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా అంపోలి నర్సారెడ్డి, కో శాధికారిగా సీహెచ్.అర్చన, సంయుక్త కార్యదర్శిగా ముత్తన్న, లైబ్రరీ సెక్రెటరీగా రత్నం, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా వంశీ ఏకగ్రీ వంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు నూ నె గంగాధర్, వోస మహేందర్ తెలిపారు. అనంతరం విజేతలను సన్మానించారు. -
అధికారిక వెబ్సైట్ తీరిదీ!
భైంసాటౌన్: జిల్లా అధికారిక వెబ్సైట్ నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు. జిల్లాకు సంబంధించి ఆయా శాఖలు, అధికారులు, ఉద్యోగుల వివరాలు, ఫోన్ నంబర్లతోపాటు ఇతర సమాచారం వెబ్సైట్లో అందుబాటులో ఉండాలి. కానీ, కొన్ని శాఖలకు సంబంధించి ఎలాంటి వివరాలు కనిపించడం లేదు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిఒక్కరూ ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారు. జిల్లాకు సంబంధించి ఆయా శాఖల అధికారులు, వారి పేర్లు తెలుసుకోవడంతోపాటు సంబంధిత శాఖల సమాచారం కోసం జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే, కొన్ని శాఖల సమాచారం లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. తూనికలు, కొలతలు, కార్మిక, వ్యవసాయ, జీజీహెచ్, మత్స్య, అటవీ, వైద్యారోగ్య, మార్కెటింగ్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, ఆర్అండ్బీ తదితర శాఖలకు సంబంధించి అధికారులు, ఇతర వివరాలు కనిపించడం లేదు. మరికొన్ని శాఖలకు సంబంధించి అధికారి మారినా.. పాత అఽధికారుల పేర్లే కనిపిస్తున్నాయి. ఐటీ వింగ్ వెబ్సైట్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు. కనిపించని కొన్నిశాఖల అధికారుల వివరాలు మరికొందరు మారినా.. అవే పేర్లు -
రాములోరి తలంబ్రాలు.. నేరుగా ఇంటికే
● ఆర్టీసీ హోండెలివరీ సౌకర్యం ● రామనవమి నేపథ్యంలో భక్తులకు మహాత్తరకానుక నిర్మల్‌ఖిల్లా: శ్రీరామనవమి పర్వదినం నేపథ్యంలో ఏటా భద్రాచలం శ్రీరామ క్షేత్రంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తా రు. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 6న సీతారాము ల కళ్యాణ మహోత్సవం జరుగనుంది. సీతారాము ల కళ్యాణంలో వినియోగించిన తలంబ్రాలను భక్తులు పరమ పవిత్రంగా భావించి పూజిస్తుంటారు. అ యితే భద్రాచలం వెళ్లలేని జిల్లాకుచెందిన భక్తులకు ఈ తలంబ్రాలను నేరుగా భక్తులవద్దకే చేర్చే బాధ్యతను తెలంగాణ ఆర్టీసీ ద్వారా లాజిస్టిక్స్ కార్గో సంస్థ స్వీకరించింది. రూ.151 చెల్లిస్తే చాలు.. ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా నేరుగా ఇవ్వబడిన చిరునామా కే చేరవేయబడతాయి. భద్రాచలం శ్రీ రాముల కల్యాణ మహోత్సవం తలంబ్రాలను నిర్మల్ ఆర్టీసీ డిపో పరిధిలోని జిల్లా కేంద్రం, పరిసర గ్రామాల ప్రజల కోసం ఆర్టీసీ కార్గో సర్వీస్ నేరుగా ఇంటికి చేరువయ్యేలా సేవలను అందిస్తోంది. ఏం చేయాలంటే ...జిల్లా కేంద్రంలోని బస్సు స్టేషన్లో ఆర్టీసీ కార్గో కౌంటర్లో ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు భక్తులు వినియోగించుకోవచ్చు. ఆర్టీసీ కార్గో కౌంటర్లో రూ.151 చెల్లిస్తే రసీదు అందజేస్తారు. అందులో పొందుపరిచిన భక్తుని చిరునామాకు సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలు ఇంటికి చేర్చబడతాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్ కే.పండరి తెలిపారు. కల్యాణమహోత్సవ తలంబ్రాలు కావలసినవారు 9154298547 నంబరుకు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. -
వాతావరణం ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది.
భరోసా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలిభైంసాటౌన్: క్షణికావేశం, వివిధ కారణాలతో విడిపోయిన జంటలకు కౌన్సెలింగ్ కో సం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని స ద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ జానకీ ష ర్మిల సూచించారు. బుధవారం పట్టణంలో ని తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశా రు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ బుధవారం భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రజా వాణిలో స్వీకరించిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేస్తూ, ఎప్పటికప్పుడు ఫిర్యా దు స్థితి తెలుసుకుంటున్నట్లు ఆమె చెప్పా రు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చే రువ చేసేలా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఏఎస్పీ అవినాష్‌కుమార్, సీఐలు గోపీనాథ్, నైలు, మల్లేశ్, కేంద్రం సిబ్బంది జ్యోతి, శిరీష, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ ఉన్నారు. వైద్యారోగ్యశాఖలో బయోమెట్రిక్ నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో గురువారం నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయనున్నట్లు డీఎంహెచ్‌వో రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. గతంలోనే అన్ని ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా హాజరును ప ర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. కాగా, సాంకేతిక ఇబ్బందులతో బయోమెట్రిక్ యంత్రం రిపేర్‌లో ఉన్నట్లు తెలిపారు. వాటిని మరమ్మతు చేయించి, అవసరమైన చోట కొత్త వాటిని బిగించి బయోమెట్రిక్ హాజరును అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కలెక్టరేట్లో ముస్లింలకు ఇఫ్తార్
నిర్మల్‌చైన్‌గేట్: పంచాయతీరాజ్ అధికారుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవా రం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అ దనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ము స్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపా రు. ఆర్డీవో రత్నకళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో.. నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిల ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, అవి నాష్కుమార్, రాజేశ్‌మీనా, ఏవో యూనస్ అలీ, ఇన్స్పెక్టర్లు అజయ్‌కుమార్, గోవర్ధన్‌రెడ్డి, నైలు, గోపీనాథ్, ప్రేమ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, కృష్ణ, మల్లేశ్, సమ్మయ్య, ఆర్ఐలు రాంనిరంజన్, శేఖర్, రామకృష్ణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ వస్తున్నారు!
నిర్మల్‌ఖిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గ్రామస్థాయిలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఉద్యోగి లేకపోవడంతో పాలనపరమైన సేవలకు ఆటంకాలు కలుగుతున్నట్లు భావించింది. వివిధ రకాల భూ సమస్యలు, గ్రామస్థాయిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ఇతర ధ్రువీకరణ పత్రాల జారీ లాంటి ప్రక్రియలో సమస్యలు జఠిలమవుతున్నట్లు భావించి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించే క్రమంలో జీపీవోలను నియమించేందుకు ముందడుగు వేస్తోంది. గ్రామీణులకు రెవెన్యూ సంబంధిత సేవలు చేరువ చేసేందుకు గ్రామ పాలనాధికారి (జీపీవో) పేరిట రాష్ట్రవ్యాప్తంగా 10,954 పోస్టులు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీలను కలుపుకొని 428 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఆయా గ్రామాలకు నూతనంగా జీపీవోలు రానున్నారు. గ్రామ పాలనలో వీరే కీలకం జిల్లాలో నూతనంగా నియామకం కానున్న జీపీవో లు ఆయా గ్రామాల్లోని భూమి హక్కులు, విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాల జారీ, వివిధ పథకాలకు అ ర్హుల ఎంపిక, భూమి సర్వే, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, విపత్తుల సమాచారం చేరవేత, ప్రభు త్వ ఆస్తుల పరిరక్షణ తదితర కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భా వించే భూభారతిచట్టం అమలులో వీరు విధులు ని ర్వహించనున్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన పేరి ట అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో వీఆర్వో, వీఆర్ఏలను వివిధ శాఖల్లోకి సర్దుబాటు చేసింది. అవసరమున్న చోట సూపర్ న్యూమరరీ పోస్టులు కూడా సృష్టించి సర్దుబాటు ప్రక్రియ చేపట్టింది. వీ ఆర్ఏ, వీఆర్వోలను మున్సిపల్‌శాఖలో వార్డు ఆఫీసర్లుగా, నీటిపారుదల శాఖలో లష్కర్, హెల్పర్ తదితర పోస్టుల్లో నియమించింది. అప్పటి వీఆర్వో, వీఆర్ఏలకే చాన్స్ గతంలో రెవెన్యూ శాఖలో వీఆర్వోలు, వీఆర్ఏలు గా పనిచేసిన వారికి ప్రస్తుతం నియమించనున్న జీపీవో పోస్టుల నియామకంలో ఆప్షన్ల ద్వారా అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వీరికి రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో మంచిపట్టు ఉండగా తిరిగి వీరిని గ్రామపాలన అధికారులుగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జీపీవో పోస్టులపై ఆసక్తి ఉన్న వీఆర్ఏ, వీఆర్వోలుగా పనిచేసినవారికి విల్లింగ్ అడుగుతూ దరఖాస్తులు ఆహ్వానించింది. వారిలో గ్రామస్థాయి పాలనాధికారికోసం 178 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. మిగతా పోస్టులకు నేరుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు చేపట్టే అవకాశమున్నట్లు ఆ శాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. పూర్వ శాఖలో నియమించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జిల్లా పూర్వ వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు షేక్ జమాల్, జేఏసీ రాష్ట్ర నాయకుడు దాదేమియా పేర్కొన్నారు.నిర్మల్ జిల్లాలో ఇలా..రెవెన్యూ గ్రామాలు : 428 గ్రామీణ మండలాలు : 18 రెవెన్యూ డివిజన్లు : 02 -
ఊరూవాడా తెలిసేలా..
నిర్మల్ఆశాజనకంగా నువ్వు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే నువ్వు సాగుపై పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఈసారి 25వేల ఎకరాల్లో పంట సాగు చేశారు. శుక్ర : 4:57గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 20259లోu‘అడెల్లి’ ఆదాయం లెక్కింపు సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మ అమ్మవారికి భక్తులు కానుకలు, నగదు రూపేణా సమర్పించిన హుండీ ఆదాయాన్ని బుధవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రవికిషన్‌గౌడ్ ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ద్వారా రూ.36,46,375, 210 గ్రాముల మిశ్రమ బంగారం, 4కిలోల 700 గ్రాముల మిశ్రమ వెండి సమకూరింది. అడెల్లి, కౌట్ల(బి), సారంగపూర్ గ్రామాల మహిళా భక్తులు, ఈవో రమేశ్, సిబ్బంది, ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు. రైతుభరోసా సమాచారం మండలం రైతుల పొందిన సంఖ్య సొమ్ము భైంసా 9,893 9,72,20,052 కుభీర్ 11,819 2,89,75,074 కుంటాల 5,346 5,33,20,656 దస్తురాబాద్ 4,688 4,05,24,211 కడెం 9,624 8,31,67,971 ఖానాపూర్ 8,091 6,57,16,939 పెంబి 4,731 5,50,41,040 బాసర 4,412 4,16,24,813 లోకేశ్వరం 9,269 8,11,52,459 ముధోల్ 8,107 7,73,30,185 తానూరు 9,475 9,70,20,198 దిలావర్పూర్ 5,166 4,30,52,722 నర్సాపూర్ (జి) 5,454 4,90,98,665 సారంగపూర్ 10,157 8,75,12,506 సోన్ 6,017 4,66,27,139 లక్ష్మణచాంద 7,224 5,46,42,027 మామడ 8,436 7,82,92,243 నిర్మల్ రూరల్ 7,584 5,80,95,122 నిర్మల్ అర్బన్ 528 23,34,524 దస్తురాబాద్‌లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ (ఫైల్) నిర్మల్‌చైన్‌గేట్: రుణమాఫీ సరిగా చేయలేదని, రైతుభరోసా ఇవ్వలేదని విపక్షాలు కాంగ్రెస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. లబ్ధిపొందిన రైతుల పేర్లతో ఫ్లెక్సీలు ముద్రించి ఒక్కో గ్రామంలోని మూడు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏ రైతుకు ఎంత రుణమాఫీ జరిగింది.. రైతు భరోసా ఎంత వచ్చింది.. లాంటి వివరాలతో కూడిన జాబితాను గ్రామాల్లో ప్రదర్శించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భావిస్తోంది. తద్వారా గ్రామపంచాయతీ, మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో లబ్ధిపొందాలని యత్నిస్తున్నట్లు చర్చ సాగుతోంది. రుణమాఫీ, రైతు భరోసా వివరాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి నాలుగు విడతల్లో జిల్లాలోని 71,565 మంది రైతులకు రూ.658.61 కోట్లు మాఫీ చేసింది. రైతు భరోసా పథకాన్ని గత జనవరి 26వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎకరాకు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు సాయంగా రైతులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు మూడెకరాలలోపు రైతులందరికీ రైతుభరోసా సాయాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. జిల్లాలో 1,36,021 మంది రైతులు రూ.124,07,48,546 రైతు భరోసా సా యం పొందారు. ఈ నెలాఖరులోగా మిగతా రైతులందరికీ సర్కారు సాయం అందించనుంది. ఫ్లెక్సీల్లో ఏం ముద్రిస్తారంటే.. ఒక్కో గ్రామంలో కనీసం 300–500 వరకు రైతులుంటారు. వీరిలో రుణమాఫీ వర్తించిన వారు తక్కువ మంది ఉన్నా, రైతు భరోసా అందిన వారు 90 శాతానికి పైగా ఉంటారు. ఫ్లెక్సీల్లో రైతు పేరు, తండ్రి పేరు, భూమి, బ్యాంక్ అకౌంట్, రుణమాఫీ ఎంత అయింది.. రైతు భరోసా కింద ఎంత జమ అయింది.. తదితర సమాచారం ఫ్లెక్సీల్లో ముద్రించనున్నారు. ఒక్కో ఫ్లెక్సీని 6x3 సైజ్‌లో ప్రింట్ చేయించనున్నారు. లబ్ధిదారులందరి పేర్లు ముద్రించాలంటే ఐదు ఫ్లెక్సీలు అవసరం. ప్రతీ గ్రామంలోని మూడు ప్రధాన కూడళ్ల వద్ద వీటిని ప్రదర్శించాలంటే కనీసం 15 ఫ్లెక్సీలు కావాలి. ఈ లెక్కన జిల్లాలో 400 గ్రామాలకు గాను 6వేల ఫ్లెక్సీలు అవసరం. ఒక్కో ఫ్లెక్సీకి జీఎస్టీతో కలిపి రూ.350కి మించొద్దని ప్రభుత్వం నోటిఫికేషన్లో షరతు విధించింది. ఈ మేరకు ఫ్లెక్సీలు ప్రింట్ చేయించేందుకు జిల్లాలవారీగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు రుణమాఫీ వివరాలు మండలం రైతుల సంఖ్య చెల్లించిన సొమ్ము (రూ.కోట్లలో) బాసర 3,429 38.16 దస్తురాబాద్ 2,425 20.6 దిలావర్పూర్ 3,256 42.5 కడెం 4,168 52.7 ఖానాపూర్ 5,081 44.5 కుభీర్ 5,739 55.79 కుంటాల 3,862 36.1 లక్ష్మణచాంద 3,654 29.54 లోకేశ్వరం 3,782 52.4 భైంసా 5,782 5.79 తానూరు 6,105 56.57 సోన్ 4,256 46.59 సారంగపూర్ 4,900 41.2 పెంబి 1,649 16.9 నిర్మల్ అర్బన్ 153 1.07 నిర్మల్ రూరల్ 2,998 25.4 నర్సాపూర్ (జి) 2,460 22.4 ముధోల్ 4,648 43.8 మామడ 3,218 26.6 ఒకరిపై కేసు నమోదు సారంగపూర్: మండలంలోని చించోలి(బి) గ్రా మానికి చెందిన నల్ల మాధవరెడ్డి పదేపదే ‘డయల్ 100’కు కాల్ చేసి అత్యవసర సేవలను దుర్వినియోగం చేసినందుకు అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవలందించే ‘డయల్ 100’ను దుర్వినియోగం చేసేవా రిపై కేసులు తప్పవని హెచ్చరించారు. గురు : 6:25ఇఫ్తార్న్యూస్రీల్ రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలతో ఫ్లెక్సీల ఏర్పాటు ప్రతీ గ్రామంలో మూడుచోట్ల ప్రదర్శన ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌గానే.. చిత్తశుద్ధి నిరూపణకే సర్కారు యత్నం ఆదేశాలు వచ్చాయి జిల్లావ్యాప్తంగా రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లు ఫ్లెక్సీల్లో ముద్రించి గ్రామాల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు సంబంధించి కలెక్టర్ నుంచి అనుమతి తీసుకుంటాం. ఫ్లెక్సీల్లో లబ్ధిపొందిన రైతుల పేర్లు ముద్రించి గ్రామాల్లో ప్రదర్శిస్తాం. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
ఉపాధి పనుల పరిశీలన
లక్ష్మణచాంద: మండలంలోని రాచాపూర్, వడ్యాల్ గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులను ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. కూలీల హాజరు, చేపట్టిన పనుల గురించి తెలుసుకున్నారు. రాచాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. యూ నిఫాంల పంపిణీ గురించి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించా రు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. నర్సరీల్లో షేడ్నెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలని, వందశాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో రాధ, ఎంపీవో అమీర్‌ఖాన్, ఏపీవో ప్రమీల, టీఏలు దినేశ్, భీమ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు విద్యకు సాంకేతిక దన్ను
● ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు ● ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వంనిర్మల్ఖిల్లా: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అ న్ని రకాలుగా అభివృద్ధిపరుస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పాఠశాల విద్యావ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే అనేక సౌకర్యాలు సమకూరుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రతీ ప్రాథమిక పాఠశాలకు ఐదు చొప్పున కంప్యూట ర్లు సరఫరా చేయాలని నిర్ణయించింది. రానున్న 2025–26 విద్యాసంవత్సరం జూన్ తొలి నాటికే ఆయా పాఠశాలల్లో కంప్యూటర్లు అందుబాటులో కి తేవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆ ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధా టూల్స్ ద్వారా ఇంగ్లిష్, గణితం బోధనలో వినియోగి స్తోంది. దీంతో జిల్లాలోనూ ప్రభుత్వ రంగంలోని 535 ప్రైమరీ స్కూళ్లలో కంప్యూటర్లు అందుబా టులోకి రానున్నాయి. దాదాపు 24వేలకు పైగా వి ద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచాలన్న ల క్ష్యంతో పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రైవేట్‌కు దీటుగా.. ప్రైవేట్ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలకు దీ టుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ అన్ని సదుపాయాలు సమకూర్చుతోంది. అవసరమున్న చోట ఉపాధ్యాయులను నియమిస్తూనే మరింత నాణ్య మైన బోధన అందించాలనే లక్ష్యంతో వివిధ రకాల కార్యక్రమాలు అమలు చేస్తోంది. అమ్మ ఆ దర్శ పాఠశాలల పేరిట అన్ని స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తోంది. ఇప్పటికే విద్యుత్, ఫ్యాన్లు, తరగతి గదులు, ప్రయోగశాల గదులు అందుబా టులోకి వస్తున్నాయి. మరోవైపు కేంద్రం ద్వారా పీఎంశ్రీ పథకంతో పాటు తరగతి గదుల్లో ఐఎ ఫ్పీ ప్యానెల్ అందుబాటులోకి వచ్చాయి. ఇంకా గ్రీన్ బోర్డులు లాంటివీ వినియోగిస్తున్నారు. జి ల్లాలో ఇప్పటికే ఏఐ ఆధారిత విద్యాబోధన కో సం 16 పాఠశాలలు ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రాథమిక పాఠశాలకు కంప్యూట ర్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సముచిత నిర్ణయమే మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన అభ్యసన ప్రక్రియలో నూతన సాంకేతిక విధానాలను వినియోగించడం శ్రేయస్కరం. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు కంప్యూటర్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగిస్తూ బోధన చేస్తే వారికి పాఠ్యాంశం సులభంగా అర్థమవుతుంది. – రమణారావు, పీఆర్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి -
నిర్మల్
కానుకలు వద్దు.. నగదే ఇద్దాం మంగళ్‌మోట్ ఆదివాసీ మహిళలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆడపిల్లల వివాహాల సమయంలో కానుకలకు బదులు నగదు ఇవ్వాలని నిర్ణయించారు. కూలీలందరికీ పని కల్పించాలి బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 20258లోట్రాఫిక్రూల్స్ పాటించాలి నిర్మల్‌టౌన్: వాహనచోదకులు, ప్రజలు ట్రాఫి క్ నియమాలు పాటించాలని ఎస్పీ జానకీ షర్మి ల సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో జిల్లాలో ని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులకు ట్రాఫిక్ నియంత్రణ, డ్రంకెన్‌డ్రైవ్ మిషన్లు పంపిణీ చే శారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ట్రాఫి క్ నియంత్రణకు పోలీసులకు సహకరించాలని సూచించారు. భైంసా, నిర్మల్ ఏఎస్పీలు అవి నాష్, రాజేశ్‌మీనా, ఏవో యూనస్ అలీ, ఇన్స్పెక్టర్లు అజయ్‌కుమార్, గోవర్ధన్‌రెడ్డి, నైలు, గోపీనాథ్, ప్రవీణ్ కుమార్, కృష్ణ, మల్లేశ్, ఆర్ఐలు రామ్‌నిరంజన్, శేఖర్, రామకృష్ణ, రమేశ్, ఎస్‌హెచ్‌వోలు, సిబ్బంది పాల్గొన్నారు. అధికారంలో ఏ ప్రభుత్వమున్నా.. ఏ పార్టీ పగ్గాలు చేపట్టినా.. జిల్లాకు అభివృద్ధి నిధులు, నేతలకు పదవులూ ఇవ్వడం లేదన్న వాదన పెరుగుతోంది. అభివృద్ధితోపాటు రాజకీయాల్లోనూ తమ ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా బడ్జెట్లలోనూ నిధులు రాలేదు. పక్కనున్న నిజామాబాద్ జిల్లాలో ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరుముగ్గురికి రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్ నేతలకు ఎలాంటి పోస్టులు ఇవ్వడం లేదు. రాజకీయంగా చక్రం తిప్పిన జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. – నిర్మల్ జిల్లాకు ఏమిచ్చారు..!? తెలంగాణ ఏర్పాటు కావడం, జిల్లాగా ఆవిర్భవించడంతో ఇక నిర్మల్‌కు తిరుగుండదన్న భావన ప్రజల్లో ఏర్పడింది. దీనికి తోడు నిర్మల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఇంద్రకరణ్‌రెడ్డికి రెండు పర్యాయాలు మంత్రి పదవి రావడంతో మరింతగా అభివృద్ధిపై ఆశలు పెరిగాయి. స్థానిక పాలకులు ప్రయత్నాలు చేసినా.. ప్రభుత్వాల నుంచి జిల్లాకు ప్రత్యేకంగా వచ్చిందేమీ లేదు. మెడికల్ కాలేజీ కూడా జిల్లాకొకటి ఇవ్వడంలో భాగంగానే వచ్చింది. కానీ.. కచ్చితంగా నిర్మల్ జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ కావాలని నిండుసభలో అప్పటి సీఎం కేసీఆర్‌ను అప్పటి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అడిగితే, ఆయన నిర్మల్‌కు కాకుండా పక్కనున్న ఆదిలాబాద్‌కు కేటా యించడం చోద్యం. సాఫ్ట్వేర్ హబ్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఊసే లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో వచ్చిన రెండు పరిశ్రమలు ప్రారంభమవుతాయన్న గ్యారంటీ లేకుండా పో యింది. పర్యాటక అభివృద్ధికి ఏ జిల్లాలో లేనన్ని అవకాశాలు నిర్మల్ జిల్లాలో ఉన్నా.. కనీసం ఆ దిశగా ఆలోచించిన సందర్భాలే లేవు. కళ్లముందే చా రిత్రక కట్టడాలు ఆక్రమణలకు గురవుతున్నా పట్టింపులేదు. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరిన తర్వాత కూడా జిల్లాలో కొత్తగా వచ్చిన అభివృద్ధి ఆనవాళ్లు ఒక్కటీ లేకపోవడం శోచనీయం. మనోళ్లకు ఎందుకివ్వరు...!? తాజాగా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో జిల్లాలో మళ్లీ పోస్టులపై చర్చ కొనసాగుతోంది. ఇంకెన్నాళ్లు ఇలా జిల్లాపై చిన్నచూపు చూస్తారన్న వాదన పెరుగుతోంది. డీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నడిపిస్తున్న కూచాడి శ్రీహరిరావుకు ఏదైనా ఒక పదవి దక్కుతుందని ఏడాదిగా చర్చకు వస్తున్నా.. పార్టీ అధి ష్టానం మాత్రం స్పందించడం లేదు. జిల్లాలో ఎంతోమంది సీనియర్ నేతలున్నా.. వారికి ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డికి దగ్గ ర అని పేరున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకూ మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. జిల్లాపై చిన్నచూపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఎప్పటి నుంచో చిన్నచూపు ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా నిర్మల్‌నూ అలాగే చూస్తున్నారు. అభివృద్ధికి నిధులివ్వడం లేదు. ఇక్కడి నేతలకూ పదవులు దక్కడం లేదు. ఇప్పటికై నా జిల్లా సమగ్ర అభివృద్ధికి సర్కారు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. – ఎంసీ లింగన్న, నిర్మల్ సిటిజన్స్‌ఫోరం కన్వీనర్ బకాయిలు వసూలు చేయాలినిర్మల్చైన్గేట్: శ్రీనిధి రుణ బకాయిలను గడువులోపు వసూలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీనిధి రుణాలపై సమావేశం నిర్వహించారు. మండలాలవారీగా మహిళా సంఘాల సంఖ్య, మంజూరు చేసిన రుణాలు, ఇప్పటివరకు సంఘాలు చెల్లించిన బకాయిలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్, మెప్మా పీడీ సుభాష్, శ్రీనిధి ప్రాంతీయ సమన్వయకర్త సరిత, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పక్కజిల్లాతో పోలిస్తే.. న్యూస్‌రీల్ అభివృద్ధి కోసం నిధులివ్వరు.. ఆశావహులకు పదవులివ్వరు.. పక్కజిల్లాకు నాలుగైదు పోస్టులు జిల్లాపై ఎప్పుడూ చిన్నచూపే.. రాజకీయ కేంద్రమైనా అనిశ్చితే..రాజకీయంగా అదే దుస్థితి.. జిల్లా అభివృద్ధికి నిధులే కాదు.. ఇక్కడి నేతలకూ పదవులు ఇవ్వడం లేదన్న వాదన బలంగా ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అల్లోలకు మంత్రి పదవి మినహా రాష్ట్రస్థాయిలో ఒక్క కార్పొరేషన్ పోస్టు కూడా ఇవ్వలేదు. పదేళ్లపాటు ఎంతోమంది సీనియర్ నేతలు నామినేటెడ్ పోస్టులపై పెట్టుకున్న ఆశలు అడియాశలే అయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అదే పరిస్థితి రిపీట్ అవుతోంది. ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క నామినేటెడ్ పోస్టు జిల్లాకు దక్కకపోవడం గమనార్హం.గతంలో ‘సాక్షి’ చెప్పినట్లు ‘గంగదాటని పదవులు’ అన్నట్లు ఇప్పటికీ గోదావరి(గంగ) దాటడం లేదు. జిల్లాకు పక్కనే గోదావరి దాటగానే నిజామాబాద్ జిల్లాలో ఉన్న బాల్కొండ నియోజకవర్గం నుంచే ముగ్గురు నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇదే నియోజకవర్గానికి చెందిన సుంకెట అన్వేశ్రెడ్డికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ పోస్టు దక్కింది. రాష్ట్ర సహకార సంఘాల అసోసియేషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన మానాల మోహన్‌రెడ్డిది కూడా బాల్కొండ నియోజకవర్గమే కావడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఉన్నా.. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ముగ్గురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. ఇదొక్కటి చాలు.. జిల్లాపై ఉన్న చిన్నచూపునకు ప్రత్యక్ష ఉదాహరణ. -
డిమాండ్లు నెరవేర్చేదాకా ఉద్యమిస్తాం
నిర్మల్‌చైన్‌గేట్: డిమాండ్లు నెరవేర్చేదాకా ఉద్యమి స్తామని ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురా లు బీ సుజాత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద గల గాంధీవిగ్రహం చుట్టూ ఆశ వర్కర్లు మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి ని రసన తెలిపారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. ‘చలో హైదరాబాద్’కు వెళ్తున్న ఆశ వర్కర్లను ముందస్తు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో భ విష్యత్‌లో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రక ళ, కోశాధికారి రామలక్ష్మి, నాయకులు భాగ్యలక్ష్మి, మంగ, రాణి, సరోజ, సంగీత, లావణ్య, గంగ, ల క్ష్మి, కృష్ణవేణి, శారద, పద్మ తదితరులున్నారు. -
ఆయిల్‌పాం సాగుపై సదస్సు
నర్సాపూర్ (జి): మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్‌పాం సాగుపై శాస్త్రవేత్త డాక్టర్ బీఎన్ రావు, జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమశాఖ అధికారి బీవీ రమణ మంగళవారం సద స్సు నిర్వహించారు. వేసవిలో నీటి యాజమా న్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. మొదటి సంవత్సరం నుంచి 30 నెలల వరకు వచ్చిన పూత, గెలలు తొలగించాలని తెలిపారు. డైరీలో సూచించినట్లు తప్పనిసరిగా మొక్కలకు పోషకాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూ మయ్య, రాంచందర్, జెడ్పీటీసీ మాజీ సభ్యు డు చిన్న రామయ్య, హార్టికల్చర్ అధికారులు జావీద్‌పాషా, మౌనిక, ఏఈవోలు గణేశ్, భాగ్యలక్ష్మి, రమ్య తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ ఆదేశించినా సాగునీరివ్వరా?
కడెం: పక్క నుంచే సాగునీరు వెళ్తున్న మళ్లించుకోలేని దుస్థితిలో మండలంలోని సదర్మాట్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే సాగు నీరందక కొందరి పొలాలు ఎండడంతో కలెక్టర్ అభిలాష అభినవ్ వాటిని పరిశీలించారు. ఏప్రి ల్ చివరి వరకు సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని లింగాపూర్, నచ్చన్ఎల్లాపూర్, మాసాయిపేట్, కొత్తమద్దిపడగ, పాత మద్ది పడగ తదితర గ్రామాలకు సదర్మాట్ కాలువ ద్వా రా వారబందీ పద్ధతిన సాగు నీరందించాలి. కానీ, ఒక్కరోజు మాత్రమే నీటిని అందిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. సదరమాట్ కాలువ ద్వారా కడెం ప్రాజెక్ట్‌కు ఫీడింగ్ చేయడంతో తమకు అన్యాయం జరుగుతోందని కొత్తమద్దిపడగ, పెద్దూర్‌తండా రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి సాగునీరందించాలని కోరుతున్నారు. -
గెలుపోటములను పట్టించుకోవద్దు
నిర్మల్‌రూరల్: ఏయే పనిలోనైనా గెలుపోటములు సాధారణమేనని.. వాటిని పట్టించుకోకుండా మన బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకెళ్లాలని సైక్రియాటిస్ట్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని సోఫీనగర్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని ముందుకుసాగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఒత్తిడి నివారణ చర్యలు, ఆహార నియమాలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కవిత, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆయిల్‌పామ్‌కు తెల్లదోమ..!
● చెట్ల పెరుగుదల, దిగుబడిపై ప్రభావం ● యాజమాన్య పద్ధతులతో నియంత్రణమామడ: ఆయిల్‌పామ్‌ను తెల్లదోమ ఆశిస్తుండటంతో జిల్లా రైతులను ఉద్యానశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ తెగులు కనిపించిందని అధికారులు పేర్కొంటున్నారు. దీని కారణంగా మొక్కల పెరుగుదల లోపిస్తుంది. దిగుబడులపై ప్రభావం చూపనుంది. తెల్లదోమ నియంత్రణకు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బీవీ రమణ రైతులకు చేస్తున్న సూచనలు.. లక్షణాలు.. నష్టాలు ఆకుల దిగువ భాగంలో వంకర తిరిగిన తెల్లదోమ గుడ్లు, ఆకులపై తెలుపు మైనపు పదార్థం కనిపిస్తుంది. జిగట పదార్థంతో నల్ల మసి అచ్చు ఏర్పడుతుంది. తెల్లదోమ మొక్కను ఆశించిన అనంతరం వెంటనే మొక్కను చంపదు. కానీ, మొక్క పెరుగుదల, దిగుబడిని తగ్గిస్తుంది. మొక్క నుంచి తెల్లదోమ పోషకాలు నీటిని పీల్చడం ద్వారా ఒత్తిడిని కలి గిస్తుంది. మెరిసే జిగట ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఇది నల్ల మసి అచ్చు పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఈ జిగట పదార్థం చీమలు, కందిరీగలను ఆకర్షిస్తుంది. ఇవి తెల్లదోమను కాపాడుతాయి. సహజ నియంత్రణ పద్ధతిలో నివారణ నీటి ఒత్తిడితో ఆకులను కడగడం ద్వారా దోమ ఉధృతిని తగ్గించవచ్చు. మొక్కలపై గుడ్లు అపరిపక్వ దశలోనే తొలగించాలి. పసుపు రంగు జిగురుతో కూడిన అట్టలు ఉపయోగించి తెల్ల దోమలను ఆకర్షించి నియంత్రించవచ్చు. బంతిపూల మొక్కలను పెంచడం ద్వారా పూలు విడుదల చేసే లిమొనెన్ వాయువు తెల్లదోమను నివారిస్తుంది. ఆముదంతో పూత పూసిన టార్పాలిన్‌ను ఉపయోగించి తక్కువ ఖర్చుతో అరికట్టవచ్చు. రసాయన పద్ధతి ద్వారా.. నర్సరీల నుంచి మొక్కలు నాటేందుకు తీసుకువచ్చేటప్పుడు ప్రతీ మొక్కను పరిశీలించాలి. చీడపీడల బెడద లేని మొక్కల్ని మాత్రమే నాటాలి. తెగులు సోకిన ప్రాంతాల నుంచి మొక్కల సేకరణ నిలిపివేయాలి. మసి అచ్చు పెరుగుదల, జిగట పదార్థం కనిపిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. సేంద్రియ పద్ధతుల ద్వారా.. పవర్ స్ప్రేయర్, ట్రాక్టర్ స్ప్రేయర్‌తో ఐదు గ్రాముల డిటర్జెంట్ పౌడర్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఎకరాకు 200 లీటర్ల నీటిని ఉపయోగించాలి. 10 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు ఆకుల కింది భాగంపై పిచికారి చేయాలి. 15 రోజుల తర్వాత జీవ నియంత్రణ పద్ధతిలో 100 లీటర్ల నీటిలో లీటర్ శిలీంద్ర కల్చర్, నాలుగు కిలోల బెల్లం, నాలుగు కిలోల గంజి పిండిని కలిపి వారంపాటు మరగనివ్వాలి. ఈ ద్రావణాన్ని 5ఎంఎల్‌ను లీటర్ నీటికి కలిపి ఆకుల కింది భాగం పైన పిచికారి చేయించాలి. ఆయిల్‌పామ్ సాగు వివరాలు జిల్లాలో సాగు విస్తీర్ణం : 8,165 ఎకరాలు సాగు చేస్తున్న రైతుల సంఖ్య : 3,304 అవగాహన కల్పిస్తున్నాం ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు పంటకు సోకే చీడపీడలు, నివారణపై అవగాహన కల్పిస్తున్నాం. మొక్కలకు ఇతర ప్రాంతాల్లో తెల్లదోమ సోకుతుంది. జిల్లాలో ఆయిల్‌పామ్ రైతులు అప్రమత్తంగా ఉండాలి. తెల్లదోమ సోకిన లక్షణాలు కనిపిస్తే ఉద్యానవనశాఖ అధికారులకు సమాచారం అందించాలి. – రమణ, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి -
వేధింపులు ఆపాలి..
ఖానాపూర్ మండలం పాత తర్లపాడ్ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు 1991లో సర్వే నంబర్ 113లో ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున భూమి కేటాయిస్తూ పట్టాలు మంజూరు చేశారు. 34 ఏళ్లుగా ఇందులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. భూమి అభివృద్ధి పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. బ్లేడ్ ట్రాక్టర్, జేసీబీ లాంటివి ఉపయోగిస్తే సీజ్ చేస్తామని వేధిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఆంక్షలు, విధించడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. – పాత తర్లపాడ్, ఖానాపూర్ -
‘ఇథనాల్’ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి
● అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ జిల్లాలో జరిగిన ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమంలో రైతులు, మహిళలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ జీరో అవర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో గ్రామంలో ప్రజలకు, పంటలకు ఇబ్బందులు తలెత్తుతాయని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారని తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చి ఫ్యాక్టరీని రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఉద్యమంలో పాల్గొన్న రైతులు, మహిళలపై పెట్టిన కేసులు అలాగే ఉన్నాయని తెలిపారు. కేసులు ఎత్తివేయాలని కోరారు. -
నిఘా నీడన ఇంటర్ మూల్యాంకనం
● ఈనెల 10న ప్రారంభమైన ప్రక్రియ ● 22 నుంచి మొదటి స్పెల్ ప్రారంభం ● ఏప్రిల్ 10 వరకు పూర్తయ్యేలా ప్రణాళిక లక్ష్మణచాంద: ఇంటర్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం వడివడిగా సాగుతోంది. ఈనెల 10న జిల్లా ఇంటర్ అధికారులు మూల్యాంకనం ప్రక్రియను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలో మొత్తం నాలుగు విడతల్లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 10న ప్రారంభమైన ప్రక్రియలో భాగంగా మొదట సంస్కృతం పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియకు మొత్తం 04 ఏఈలుగా నియమించారు. ఈనెల 22వ తేదీ నుంచి మొదటి విడత ప్రారంభమైంది. ఇందులో తెలుగు, ఆంగ్లం, గణితం, పొలిటికల్ సైన్స్ పేపర్లు మూల్యాంకనం చేయడానికి ఎగ్జామినర్లు ఈనెల 21వ తేదీన రిపోర్ట్ చేశారు. రెండో విడత మూల్యాంకనం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లు మూల్యాంకనం చేయడానికి ఎగ్జామినర్లు ఈనెల 23న రిపోర్ట్ చేశారు. ఇక మూడో విడత మూల్యాంకనం ప్రక్రియ ఈనెల 26న ప్రారంభం కానుంది. ఇందులో రసాయనశాస్త్రం, కామర్స్ పేపర్లు మూల్యాంకనం చేయడానికి ఎగ్జామినర్లు ఈనెల 25న రిపోర్ట్ చేయనున్నారు. నాలుగో విడత మూల్యాంకనం ఈనెల 28న ప్రారంభమవుతుంది. ఇందులో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, చరిత్రకు సంబంధించిన ఎగ్జామినర్లు ఈనెల 27న రిపోర్ట్ చేయనున్నారు. సీసీ కెమెరాల మధ్యన మూల్యాంకనం...గతంకు భిన్నంగా ఈసారి ఇంటర్ బోర్డు మొదటి నుంచి అన్నింటిని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మొదట ఇంటర్ రెండవ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలను సీసీ కెమెరాలు మధ్యన నిర్వహించిన ఇంటర్ బోర్డు అధికారులు అనంతరం ఇంటర్ వార్షిక పరీక్షలు కూడా సీసీ కెమెరాల మధ్యన విజయవంతంగా నిర్వహించారు. ఇంటర్ వార్షిక పరీక్షలు నేటితో ముగియడంతో ఇంటర్ మూల్యాంకనం కూడా సీసీ కెమెరాలు మధ్యన నిర్వహిస్తున్నారు. ఎగ్జామినర్లు మూల్యాంకనం కేంద్రానికి వచ్చి పేపర్లు తీసుకున్నది మొదలు మూల్యాంకనం పూర్తి చేసి తిరిగి చీఫ్ ఎగ్జామినర్లకు(సీఈలకు) పేపర్లు అందజేసే వరకు మొత్తం సీసీ కెమెరాలు పర్యవేక్షణలో జరుగుతుంది. బయోమెట్రిక్ హాజరు..ఇంటర్ మూల్యాంకనానికి హాజరయ్యే ఎగ్జామినర్లకు ఈసారి బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టారు. మూల్యాంకనానికి వచ్చే అధ్యాపకులు రోజు ఉదయం 10:30 గంటల లోపే బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.10:30 తర్వాత వచ్చే ఎగ్జామినర్లకు ఈసారి అనుమతి ఉండదని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. రోజుకు 30 పేపర్లు...జిల్లాకు మొత్తం 1,37,000 జవాబు పత్రాలు వచ్చాయని ఇంటర్ నోడల్ అధికారి పరశురామ్‌నాయక్ తెలిపారు. జిల్లాలోని మూల్యాంకనానికి 500 మంది ఏఈలు పాల్గొంటారని పేర్కొన్నారు. మూల్యాంకనానికి హాజరవుతున్న ఎగ్జామినర్లకు ఒక రోజుకు 30 పేపర్ల చొప్పున ఇస్తారు. ఇందులో ఉదయం 15 పేపర్లు మధ్యాహ్నం 15 పేపర్ల చొప్పున ఇస్తారు. -
కల్వర్టు పునర్నిర్మించాలి..
నాకు కడెం మండలం కొండుకూర శివారులో భూములు ఉన్నాయి. ఈ భూమిలోకి వెళ్లే దారిలో నీటిపారుదల శాఖ కాలువ ఉంది. ఈ కాలువపై ఉన్న కల్వర్టును ముక్కెర శ్రీను, ఆకుల పుల్లయ్య, ఆకుల శ్రీను కల్వర్టుని తొలగించి మార్గం లేకుండా చేశారు. కాలువ నీటిని అక్రమంగా వాడుకుంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఇరిగేషన్ ఏఈ, ఈఈలతోపాటు స్థానిక తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాం. అయినా పట్టించుకోవడం లేదు. కాలువపై కల్వర్టును పునర్నిర్మించాలి. – కళ్లెం నారాయణరెడ్డి, కొండుకూర్ ● -
గోడు వినండి.. గోస తీర్చండి
● ప్రజావాణిలో కలెక్టర్‌ను అర్జీదారుల వేడుకోలు ● తక్షణమే పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశం ● గ్రీవెన్స్‌కు 8 ఫోన్ కాల్స్, 76 దరఖాస్తులు నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు బారులు తీరారు. వివిధ సమస్యలతో వచ్చిన పలువురు కలెక్టర్ అభిలాష అభినవ్‌కు అర్జీలు సమర్పించి తమ గోడు వెల్లబోసుకున్నారు. గోస తీర్చాలని వేడుకున్నారు. అర్జీదారుల సమస్యలు ఓపికగా విన్న కలెక్టర్ బాధితుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్రూం తదితర సమస్యలు పరిష్కరించాలని ప్రజలు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాఖ ల వారీగా అధికారులందరూ సమయానికి ప్రజా వాణికి హాజరుకావాలని ఆదేశించారు. ప్రజావాణి రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడానికి ఏర్పాట్లను పూర్తి చేయాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలను సందర్శిస్తూ, నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించాలన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టెలి ప్రజావాణికి 8 ఫోన్‌కాల్స్.. వేసవి నేపథ్యంలో దూర ప్రాంత ప్రజల సౌకర్యార్థం సోమవారం నుంచి టెలి ప్రజావాణి ప్రారంభించారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజల ఫోన్‌కాల్ స్వీకరించి మాట్లాడారు. వాటిని నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం టెలిఫోన్ ప్రజావాణి ద్వారా 8 మంది, నేరుగా 76 మంది దరఖాస్తుదారులు వివిధ ప్రాంతాల నుంచి తమ అర్జీలను సమర్పించారు. ఫోన్ ద్వారా వచ్చిన దరఖాస్తు వివరాలను వాట్సాప్ ద్వారా స్వీకరించి ప్రజావాణిలో సమస్య నమోదుకు సంబంధించి రశీదును వాట్సాప్ ద్వారా అందించారు. -
నిర్మల్
రంజాన్ వేళలు7మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025క్షయ రహిత జిల్లాకు కృషి ● డీఎంహెచ్‌వో రాజేందర్ నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్‌ను క్షయ రహిత జిల్లాగా మార్చడానికి కృషి చేయాలనీ డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ప్రపంచ క్షయ దినోత్సవం సోమవారం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చాలన్నారు. ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న ప్రజలను గుర్తించి వారందరికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. సిబ్బంది అంకితభావంతో పనిచేయడం వల్ల న్నే కేసులో గుర్తింపు సులభతరం అవుతుందన్నారు. సమావేశంలో కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి, డాక్టర్ నైనారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పవన్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారే రవీందర్, ఆరోగ్య పర్యవేక్షకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఖాళీగా ఇథనాల్ స్థలం ● జిల్లాలో పరిశ్రమలకు గ్రహణం ● ఇథనాల్.. క్యాన్సిల్!? ● ఆయిల్‌పామ్ అనుమానమే.. ● అడ్రస్‌లేని ఇండస్ట్రీయల్ కారిడార్.. ● అభ్యంతరాలు తెలుసుకోకుండా పనులు ● ఆదిలోనే తప్పని అడ్డంకులుఇథనాల్ కథేంటి..!? జిల్లాలో తొలి ప్రధాన పరిశ్రమగా వచ్చిన ఇథనాల్‌కు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. తీవ్ర ప్రజావ్యతిరేకతతో ఆగమ్యగోచరంగా మారింది. దిలావర్పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య పీఎంకే సంస్థ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు పనులు మొదలుపెట్టింది. ఈ ఫ్యాక్టరీ వల్ల భవిష్యత్తులో తమపై కాలుష్య ప్రభావం ఉంటుందంటూ స్థానిక గ్రామాలు అడ్డుచెప్పాయి. పరిశ్రమ ఏర్పాటు కోసం నిర్వాహకులు, అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో గత నవంబర్‌లో ఒక్కసారి ఆ గ్రామాల ఆందోళన భగ్గుమంది. ఊళ్లకు ఊళ్లు కదిలివచ్చి రోజులపాటు రహదారులు దిగ్బంధం చేశాయి. రాష్ట్రప్రభుత్వం సైతం ప్రజాందోళనకే మద్దతు తెలుపుతూ ఫ్యాక్టరీ పనులను నిలిపివేస్తామని ప్రకటించింది. దీంతో ఇథనాల్ పరిశ్రమ కథ అక్కడితో ఆగిపోయింది. ఆయిల్‌పామ్.. ఏమవుతుందో..! జిల్లాలో ఇథనాల్ తర్వాత వచ్చిన మరో పరిశ్రమ ఆయిల్‌పామ్. సోన్ మండలం పాక్పట్ల(పాత పోచంపాడ్) సమీపంలో ఎస్పారెస్పీ ప్రాజెక్టు దిగువన ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం స్థలం కేటాయించారు. ప్రియూనిక్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయాల్సిన ఈ పరిశ్రమకు 2023 అక్టోబర్ 4న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్, అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు శంకుస్థాపన చేశారు. రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఎస్సారెస్పీ దిగువన బఫర్‌జోన్‌లో ఉన్న ఈ పరిశ్రమ స్థలంపై అభ్యంతరాలు ఉన్నాయి. పలు శాఖల నుంచి క్లియరెన్స్ లేకపోవడంతో ముందుకు సాగడం లేదు. ఇటీవల ఈ పరిశ్రమ వ్యవహారం రాజకీయరంగు పులు ముకుంది. ఆయిల్‌పామ్ ఆగిపోవడానికి మీరంటే మీరే కారకులు అంటూ కాంగ్రెస్–బీజేపీ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. పంటలను సెట్ చేయాలి.. ఏ ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా కేవలం పరిశ్రమలు ఉంటేనే సరిపోదు. వాటికి అనుగుణంగా ఎప్పటికీ సరిపడా ముడిపదార్థాలు కావాలి. ఫ్యాక్టరీ పెట్టేముందు దానికి సంబంధించి ఈ ప్రాంతంలో పంటల సాగు సరళి, అలాగే స్థానిక రైతాంగం అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలన్న విషయమూ చర్చకు వచ్చింది. పరిశ్రమలను పెట్టాలన్న ఆలోచన చేసే ముందే స్థానికంగా పంటసాగు సరళిని సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపాదనల్లోనే కారిడార్ సహర్ఇఫ్తార్న్యూస్రీల్ముందుచూపు ఉండాలి.. జిల్లా ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి పరిశ్రమతోనే చేదు అనుభవం ఎదురైంది. ఇథనాల్ ఫ్యాక్టరీ తమకు వద్దంటూ ఊళ్లు ఎదురుతిరిగాయి. సర్కారు సైతం ఆ గ్రామాలకే వత్తాసు పలికింది. ఇలాంటి సందర్భంలో.. మరి జిల్లాకు ఏం కావాలి..!? ఎలాంటి పరిశ్రలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది..!? అసలు పరిశ్రమలను ఏర్పాటు చేసేముందు జిల్లాలో ఉన్న వనరులు, పంటల సరళిపై పరిశోధనలు చేస్తున్నారా..!? అన్న ప్రశ్నలకు ఎలాంటి జవాబులు లేవు. ఆయిల్‌పామ్‌కు స్థలమే అడ్డంకిగా మారుతోంది. ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ పారిశ్రామికాభివృద్ధిపై యోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.పరీక్షల వేళ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు లక్ష్మణచాంద: పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దని ఎంజేపీ గురుకులాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్సీవో గోపీచంద్ పేర్కొన్నారు. మండలంలోని రాచాపూర్ ఎంజేపీ గురుకుల పాఠశాలను సోమవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇది వరకే పూర్తయిన పరీక్షలు ఎలా రాశారో అడిగి తెలుసుకున్నారు. రానున్న గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులు చాలా కీలకమన్నారు. సంబంధిత సబ్జెక్టు టీచర్స్ స్టడీ అవర్స్‌లో సబ్జెక్టులపై, మోడల్ క్వశ్చన్ పేపర్‌పై, పార్ట్ బి పేపర్‌పై అవగాహన కల్పిస్తూ పిల్లలు శ్రద్ధగా చదివేలా చూడాలని సూచించారు. విద్యార్థులకు సాయంత్రం, నైట్ స్టడీ అవర్స్‌లో టీ, స్నాక్స్ అందించాలని సూచించారు. కష్టపడి చదివితే మంచి ఫలితం వస్తుందని విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజు, ఉపాధ్యాయులు అశోక్, నాగరాజు, వెంకట్‌రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఏర్పడి తొమ్మిదేళ్లు కావస్తోంది. ఇప్పటికీ జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి బాటలు పడలేదు. మంజూరైన పరిశ్రమలకు పట్టిన గ్రహణం వీడటం లేదు. పాలకుల లోపమా, అధికారుల పనితనమా, ప్రశ్నించలేని ప్రజల అమాయకత్వమా.. అర్థం కావడం లేదు. విషయం ఏదైనా ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా జిల్లాలో ఏర్పాటు ప్రారంభం కాలేదు. ఇథనాల్ పరిశ్రమ ఆదిలోనే ఆగిపోయింది. ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటుపై అనుమానాలు ఉన్నాయి. ఇక ఏళ్లుగా ఊరిస్తున్న 44వ జాతీయ రహదారి వెంట ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు ప్రతిపాదన అడుగు కూడా ముందుకు పడలేదు. బాసరలో ఏర్పాటు చేస్తామన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లూ జాడలేవు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే జిల్లాకు పరిశ్రమలు వస్తాయన్న ఆశ ఏ కోశానా లేదు. – నిర్మల్ హైదరాబాద్–నాగ్‌పూర్ హైవేఆయిల్పామ్ శిలాఫలకంరైతుల ప్రయోజనాలే ముఖ్యం.. పరిశ్రమల ఏర్పాటు అవసరమా.. అన్న ప్రశ్న ముందుగా రావాలి. అవసరం అనుకుంటే స్థానిక వనరులను, పంటల సరళిని ముందుగా అంచనా వేయాలి. స్థానిక రైతులు సదరు పరిశ్రమకే బానిసలుగా మారేలా ఉండకూడదు. రైతుల చేతుల్లోనే ఆ పరిశ్రమల జుట్టు ఉండాలి. జీరో పొల్యూషన్ పరిశ్రమలైతేనే ప్రస్తుతం మనుగడ సాగించే అవకాశాలు ఉన్నాయి. – ప్రొఫెసర్ దొంతి నర్సింహారెడ్డి, పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్హైదరాబాద్–నాగ్‌పూర్ 44 జాతీయ రహదారి వెంట ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ అలాంటి ప్రతిపాదనకు అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రతీసారి బడ్జెట్లో పారిశ్రామిక ప్రగతిలో భాగంగా ఈ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామంటూ చెప్పడమే మినహా ఎలాంటి ప్రయోజనం లేదు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు వరకే ఎన్‌హెచ్.44 వెంట పరిశ్రమల ఏర్పాటు ఆగిపోయింది. గతంలో బాసరలో స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేస్తామన్న ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతిపాదనలూ బుట్టదాఖలయ్యాయి. -
‘హామీలు మరిచిన కాంగ్రెస్’
కడెం: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మరిచిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.2,500, నిరుద్యోగభృతి ఇవ్వకుండా, రైతు రుణమాఫీని పక్కాగా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందని విమర్శించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి వెచ్చిస్తున్న నిధులు కేంద్ర ప్రభత్వానివేనని చెప్పారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మహిళా విభాగం జి ల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని భర్త దుర్గయ్యకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరగగా అ తడిని పరామర్శించారు. ఇటీవల మరణించిన సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీజేపీ మండలాధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్, నాయకులు అమరవేని రవీందర్‌గౌడ్, మోహన్‌నాయక్, ముల్కి కృష్ణ, ప్రవీణ్, శ్రీరాం, నగేశ్, తిరుమల్ తదితరులున్నారు. -
ఆర్జీయూకేటీలో యువ ఉత్సవ్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో శనివారం టెక్‌ఫెస్ట్–2025లో భాగంగా యువ ఉత్సవ్‌ను మిని స్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ఎన్ఎస్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథి గా ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, ఏవో రణధీర్ సాగి, ఆదిలాబాద్ జిల్లా యూత్ ఆఫీసర్ సుశీల్ భడ్ కార్యక్రమాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడు తూ.. జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం, భారతదేశ వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వంపై ప్రశంసలు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో భారతదేశ పురోగతిని ప్రదర్శిస్తూనే యువ ఆవిష్కర్తలు, క ళాకారులు, నాయకులను ప్రోత్సహించడానికి ప్ర యత్నిస్తున్నట్లు చెప్పారు. భారతదేశ పురోగతిని ప్రదర్శించడం, వివిధ రంగాల్లో దేశం సాధించిన గణనీయమైన పురోగతిని హైలైట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువ కళాకారులు, యువ రచయితలు, ఛాయాచిత్ర రచన, ప్రశంసల పోటీ, సాంస్కృతిక పోటీ, సైన్స్ మేళా పొటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రూ.5వేలు, ద్వితీయ బహుమతిగా రూ.2,500, తృతీయ బహుమతిగా రూ.1,500 నగదు అందించారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రాకేశ్‌రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ శ్రవణ్‌కుమార్, డాక్టర్ రాములు, జ్యూరీ మెంబర్లుగా డాక్టర్ లకుమాదేవి, డాక్టర్ దేవరాజు, డాక్టర్ మహేశ్, డాక్టర్ రాజేందర్, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు. -
వడ్డెరులంతా సంఘటితం కావాలి
నిర్మల్‌ఖిల్లా: వడ్డెర కులస్తులంతా సంఘటితమై హక్కులు సాధించుకోవాలని భారతీయ వడ్డెర స మాజ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్ మౌర్య పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. వడ్డెరుల పలు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించబడ్డా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బీసీ జాబితాలోనే ఉంచి అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవాలని సూచించారు. స మావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏత్తరి మా రయ్య, ప్రధాన కార్యదర్శి సంపంగి ప్రభాకర్, యువజన ఉపాధ్యక్షుడు ఒంటిపులి రాము, నా యకులు గురవయ్య, నర్సయ్య, గంగాధర్, ఎల్ల ప్ప, గంగారాం, శ్రీనివాస్, లక్ష్మణ్, బాజీరావు, శంకర్, ముత్యం, బంగారయ్య, మోహన్, పద్మారావు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి
● ఎమ్మెల్యే రామారావుపటేల్ ● పశువైద్యశాల భవనం ప్రారంభం భైంసాటౌన్: నియోజకవర్గంలో రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పీ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం పట్టణంలోని మండల పశువైద్యశాల నూతన భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ చొరవతోనే ప్రభుత్వం నియోజకవర్గంలో రైతుల పొలాలకు వెళ్లే దారులు నిర్మిస్తోందని చెప్పారు. కుభీర్, బాసర, కల్లూరులో ప్రాథమిక పశువైద్యశాలల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని జిల్లా పశువైద్య, పశుసంవర్ధక అధికారి బాలిక్ అహ్మద్ ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలోని పశువైద్యశాల నూతన భవనంపై రైతుశిక్షణ కేంద్రం కోసం నిధుల మంజూరుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ఏఎంసీ చైర్మన్ సింధే ఆనంద్‌రావు పటేల్, పీఆర్ డీఈఈ రాజేందర్రావు, పశువైద్యుడు విఠల్, మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, బీజేపీ నాయకులు తాలోడ్ శ్రీనివాస్, సిరం సుష్మారెడ్డి, పోశెట్టి, గాలి రవి, తూమోల్ల దత్తాత్రి, గాలి రాజు తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటా..వైద్యులు లేరు!
● నిర్మల్ ఆస్పత్రిలో నిరుపయోగంగా 2డీ ఎకో ● కార్డియాలజిస్టు లేక ఇబ్బంది ● జనరల్ ఫిజిషియన్‌తో వైద్యం ● ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ ● అన్ని పరీక్షలు అందుబాటులోకి తేవాలంటున్న ప్రజలుపోస్టులు భర్తీ చేయాలి నిర్మల్ ఆస్పత్రిలో కార్డియాలజిస్టులు లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుండగా ఇబ్బందులు పడుతున్నారు. కార్డియాలజిస్టు పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తేవాలి. – కోరిపెల్లి శ్రావణ్‌రెడ్డి, నిర్మల్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జనరల్ ఆస్పత్రికి కార్డియాలజిస్ట్ పో స్టులు కేటాయించలేదు. గుండె సమస్యతో వచ్చిన వారికి జనరల్ ఫిజీషియ న్‌తో ప్రాథమిక వైద్యం చేయిస్తున్నాం. ఈసీజీ తీయించి పరిస్థితిని బట్టి ఇక్కడే వైద్యం అందిస్తున్నాం. 2డీ ఎకో అవసరమైన వారికి ఆరోగ్య శ్రీ పథకం కింద ఇక్కడికే ప్రైవేట్ కార్డియాలజిస్టును పిలి పించి పరీక్షలు చేయిస్తున్నాం. పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం. – డాక్టర్ గోపాల్‌సింగ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మణచాంద మండలం మల్లాపూర్‌కు చెందిన లింగన్న (46) హైడ్రోసిల్తో బాధపడుతూ ఈనెల 4న నిర్మల్ జనరల్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. వైద్యులు పరీక్షించి ఆపరేషన్ చేయాలని చెప్పారు. వయస్సు రీత్యా 2డీ ఎకో చేయాలి. ఈ పరికరం ఉన్నా కార్డియాలజిస్టులు లేరు. ఆరోగ్యశ్రీ పథకంలో ప్రైవేట్ కార్డియాలజిస్టును పిలిపించి ఈ పరీక్ష చేయించారు. ఈనెల 5న ఆయనకు హైడ్రోసిల్ ఆపరేషన్ చేశారు. జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ పోస్టులు భర్తీ చేసి 2డీ ఎకో పరికరం అందుబాటులోకి తీసుకురావాల్సి అవసరం ఎంతైనా ఉంది.నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రం ఏర్పడ్డాక ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసి ఏటా 150 మంది వైద్య విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల నుంచి 330 పడకల స్థాయి కి పెంచారు. 20 విభాగాల్లో 22 మంది డాక్టర్లు, 201 మంది నర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. కానీ గుండె సంబంధిత వైద్యులు లేరు. కార్డియాలజీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు డాక్టర్ పోస్టులు మంజూరు చేయలేదు. పెరుగుతున్న పేషెంట్లుమారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, కాలుష్యంతో జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నిర్మల్ ఆస్పత్రికి సీజన్‌ను బట్టి ప్రతీరోజు 800 నుంచి 1000 మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తారు. ఇందులో 40 మందికి పైగా గుండె సమస్యలతో వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ముందుగా వారికి ఈసీజీ, 2డీ ఎకో, యాంజియోగ్రామ్ తదితర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కార్డియాలజిస్టులు లేక ఛాతిలో నొప్పి, ఇతర సమస్యలతో వచ్చిన వారిని జనరల్ ఫిజీషియన్ చూస్తున్నారు. పరీక్షలు చేసేందుకు 2డీ ఎకో మిషన్లు ఉన్నా.. ఆపరేట్ చేసే టెక్నీషియన్లు లేరు. స్టాఫ్‌నర్సు, ఇతర ఉద్యోగులతో ఈసీజీ తీయిస్తున్నారు. మిగిలిన పరీక్షలకు మిషన్లు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ డాక్టర్లు లేక హైదరాబాద్, నిజామాబాద్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వైద్యం సకాలంలో అందక మార్గమధ్యలో రోగులు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. రూ.లక్షల్లో ఖర్చులుఇటీవల జిల్లాలో గుండెపోటు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే నిర్మల్ ప్రజలకు గుండెపోటు వస్తే అంతే సంగతులు.. అనే విధంగా మారాయి పరిస్థితులు. ఇటు ప్రభుత్వ ఆస్పత్రి.. అటు ప్రైవేట్‌లో సరైన వైద్య నిపుణులు అందుబాటులో లేక అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌కు పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీంతో రూ.లక్షల్లో వైద్య ఖర్చులు భరించలేక బాధితులు అవస్థలు పడుతుండగా.. మరికొందరు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. జి ల్లా జనరల్ ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటుతో వచ్చే బాధితులకు ప్రాథమిక చికిత్స అందుబాటులో లేకుండా పోయింది. ఇక్క డ 2డీ ఎకో మిషన్ అందుబాటులో ఉన్నా టెక్నీషి యన్ లేక నిరుపయోగమైంది. ఇక ఈసీజీ అందుబాటులో ఉన్నా రిపోర్ట్ సక్రమంగా వస్తుందా.. రాదా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్‌లోనూ అంతే..నిర్మల్‌లో ప్రైవేట్ సెక్టార్లో రెండు క్యాథ్ ల్యాబ్‌లు ఉన్నాయి. ఇద్దరు కార్డియాలజిస్టులు అందుబాటులో ఉన్న కార్డియోథొరాసిక్ సర్జన్లు ఒక్కరూ లేరు. గుండెకు సంబంధించి చిన్నపాటి సర్జరీ చేయాలన్నా హైదరాబాద్ నుంచి టీమ్‌లను ఇక్కడకు రప్పిస్తున్నారు. రోగుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. చాలావరకు మేజర్ సర్జరీలు ఉంటే హైదరాబాద్‌కు వెళ్తున్నారు. స్థానికంగా రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొంతమేర సేవలు అందుబాటులో ఉన్నా ఫీజులు భారీగా ఉంటున్నాయి. యాంజియోగ్రామ్ చేయించుకోవడానికి రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతోంది. ఒకవేళ స్టంట్ వేయాల్సి వస్తే అదనంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉండడంతో కొంతమేర నిరుపేదలు లాభపడుతున్నారు. -
‘బర్డ్ వాచ్’కు డిగ్రీ విద్యార్థులు
మామడ: జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలలకు చెందిన 22 మంది విద్యార్థులు ‘ట్రెయిన్ టు ట్రెయినర్’ కార్యక్రమంలో భాగంగా ఆదివా రం దిమ్మదుర్తి రేంజ్ పరిధిలోని తుర్కం చెరు వు, పొన్కల్ చెరువు, యెంగన్న చెరువుల పరి ధిలో ఎకో టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు బర్డ్ వాచింగ్, జంతువుల గుర్తింపుపై శిక్షణ ఇచ్చారు. సఫారి, నేచర్, రా త్రి క్యాంపు ఫైర్ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో బాసర సీసీఎఫ్ శర్వనన్, డీఎఫ్ వో నాగినిభాను, ఎఫ్ఆర్వో శ్రీనివాస్‌రావు, రామకృష్ణారావు, ఎఫ్ఎస్వో శ్రీనివాస్, అన్నపూర్ణ, ఎఫ్‌బీవోలు పాల్గొన్నారు. -
అప్‌గ్రేడ్ అయ్యేదెప్పుడో!
నిర్మల్● విస్తరించని ఏరియాస్పత్రి సేవలు ● 25 ఏళ్లయినా ఇంకా 100 పడకలే.. ● 150కి పెంచాలని ఏళ్లుగా డిమాండ్ ● జనాభా పెరిగినా సేవలు అంతంతే ● భైంసావాసులకు అరకొర వైద్యమే..ట్రా‘ఫికర్’ తీరేదెన్నడో! జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. రోడ్లపై వాహనాలు నిలిపేవారు, రోడ్లను ఆక్రమించి చిరువ్యాపారాలు చేసేవా రితోనే సమస్య తీవ్రమవుతోంది. సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025సంస్థ అభివృద్ధికి సహకరించాలి నిర్మల్‌టౌన్: ఆర్టీసీ అభివృద్ధికి ఉద్యోగులంతా సహకరించాలని నిర్మల్ డీఎం పండరి సూచించారు. ఆదివారం ఇటీవల డిపో మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన పండరిని నిర్మల్ డిపోలో సిబ్బంది సన్మానించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ.. ఆదిలాబాద్ రీజియన్‌లో నిర్మల్ డిపో ప్రథమ స్థానంలో ఉందని తెలిపా రు. ఈ స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క రూ అంకితభావంతో కృషి చేయాలని కోరారు. సిబ్బంది గంగాధర్, శేఖర్, నరేందర్, రమేశ్, సుజాత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. భైంసాటౌన్: డివిజన్ కేంద్రమైన భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రి సేవలు విస్తరించడంలేదు. పెరిగిన జనాభాకు తగినట్లు ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయడంలేదు. ఆస్పత్రి ఏర్పడి దశాబ్దాలు గడిచినా అప్పటి నుంచి 100 పడకలతో సరిపెడుతున్నారు. ప్రస్తుతం భైంసా పట్టణంతోపాటు డివిజన్ పరిధి లోని ఏడు మండలాల నుంచి రోగుల తాకిడి విపరీతంగా ఉంది. అత్యవసర సమయంలో సరైన వై ద్యం అందని పరిస్థితి నెలకొంది. జిల్లాకేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రిని ప్రభు త్వ జనరల్ హాస్పిటల్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో టీవీవీపీ ఆధ్వర్యంలో కొనసాగాల్సిన జిల్లా ఆ స్పత్రిని భైంసాలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ డివిజన్ వ్యాప్తంగా వినిపిస్తోంది. మూడు దశాబ్దాలైనా పట్టింపేది? కమ్యూనిటీ ఆస్పత్రిగా ఉన్న భైంసా ఆస్పత్రిని 1996లో ఏరియాస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసి వంద పడకలకు పెంచారు. అప్పటి జనాభా, ఆస్పత్రికి రోగు ల తాకిడికి అనుగుణంగా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేశా రు. అప్పట్లో నగర పంచాయతీగా ఉన్న భైంసా ప ట్టణం తరువాత క్రమంలో మున్సిపాలిటీగా మా రింది. ఆ తర్వాత డివిజన్‌కేంద్రంగా కూడా ఏర్పడింది. పట్టణ జనాభాతోపాటు డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లోని ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకై క ప్రభుత్వ ఏరియాస్పత్రి ఇది. నిర్మల్ తర్వాత విద్య, వైద్యం, వ్యాపార, వాణిజ్య, మార్కెటింగ్ పరంగా భైంసా అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఇతర జిల్లాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు నిత్యం వేలసంఖ్యలో భైంసాకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో భైంసాలోని ఏరియాస్పత్రికీ రోగుల తాకిడి విపరీతంగా ఉంటోంది. వ్యాధుల సీజన్లో ఆస్పత్రిలో రోజుకు సరాసరి 500–600కు పైగా ఓపీ నమోదవుతోంది. వసతులు, సిబ్బంది అంతంతే.. భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో సరైన వసతులు, సరిపడా సిబ్బంది లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మేల్, ఫిమేల్ వార్డులు, క్యాజువాలిటీ, ఆరోగ్యశ్రీ, ఆర్థో, సర్జరీ, డెలివరీ, ఎన్‌బీఎస్‌యూ, పీడియాట్రిక్.. ఇలా తొమ్మిది విభాగాలకు షిఫ్ట్‌కు ఇద్దరేసి చొప్పున నర్సులు ఉండాల్సి ఉండగా, 19 మందే ఉన్నారు. వైద్యులూ పూర్తిస్థాయిలో లేరు. రెగ్యులర్ వైద్యులు లేక పలువురు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. డెలివరీ కేసులకు సరిపడా సిబ్బంది లేరు. సీటీ స్కాన్ సౌకర్యం లేక నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో రూ.వేలల్లో బిల్లులు వెచ్చించలేని నిరుపేదలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రిఫర్.. డివిజన్ పరిధిలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలబారిన పడినవారిని భైంసాలోని ఏరియాస్పత్రికి తీసుకువస్తారు. ఆయా సందర్భాల్లో స్థానిక వైద్యులు అందుబాటులో ఉన్న వసతులతోనే చికిత్స అందిస్తున్నారు. అయితే, క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు, అత్యవసర సమయాల్లో నిజామాబాద్, ఇతర ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో సకాలంలో వైద్యం అందక ఎంతోమంది క్షతగాత్రులు మధ్యలోనే ప్రా ణాలొదులుతున్నారు. జిల్లాలోనే అధికంగా డెలివరీ కేసులు భైంసా ఆస్పత్రిలోనే నమోదవుతున్నాయి. వీటితోపాటు సీజనల్ వ్యాధుల సమయంలో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. బాసరలో శ్రమదానం బాసర: బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ సిబ్బంది, శ్రీ ప్రణవపీఠం పీఠాధిపతి వద్దిపర్తి పద్మాకర్‌కు చెందిన 85 మంది శిష్యులు, విశ్వనాథ్ పూ ర్ణిమ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. ఆల యం, గోదావరి నది పుష్కరఘాట్లను శుభ్రం చేశారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సుధాకర్‌రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి సుదర్శన్‌గౌడ్, పర్యవేక్షకుడు, శివరాజ్, నారా యణ పటేల్, సిబ్బంది పాల్గొన్నారు. న్యూస్రీల్జిల్లా ఆస్పత్రిగా మార్చితేనే.. జిల్లాకేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా మార్చారు. టీవీవీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జిల్లా ఆస్పత్రిని భైంసాలోని ఏరియాస్పత్రిలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఏరియాస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని ఇక్కడి ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ తర్వాత వైద్యపరంగా రోగుల తాకిడి ఎక్కువగా ఉండే భైంసా ఏరియాస్పత్రిని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా వైద్యులు, సిబ్బందితోపాటు వసతులు పెరిగి ఇక్కడి ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఏరియాస్పత్రిలో పోస్టుల వివరాలు పోస్టు మంజూరు భర్తీ ఖాళీలు సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ 13 7 6 డిప్యూటీ సివిల్ సర్జన్ 10 3 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ 22 17 5 డిప్యూటీ డెంటల్ సర్జన్ 1 1 – డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 1 1 – హెడ్ నర్స్ 5 5 – స్టాఫ్ నర్స్ 26 19 7 మిడ్‌వైవ్స్ 2 – 2 ఎంపీహెచ్ఏ (ఎఫ్) 6 2 4 అప్‌గ్రేడ్ చేయాలి భైంసా పట్టణం నానాటికీ విస్తరిస్తున్నా ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో సేవలందడంలేదు. పెరిగిన జనాభా, రోగుల తాకిడికి అనుగుణంగా ఏరియాస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి. జిల్లా ఆస్పత్రిని భైంసాలో ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రాంతప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. – డాక్టర్ రామకృష్ణాగౌడ్, ఆరోగ్యభారతి రాష్ట్ర సభ్యుడు రోగులకు ఇబ్బందవుతోంది భైంసా ఏరియాస్పత్రిలో అత్యవసర సేవలు అందడంలేదు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ సేవలు అందుబాటులో లేవు. అత్యవసర సమయాల్లో వైద్యులు ఇతర ప్రాంతాలకు రిఫర్ చేస్తుండగా పేదలపై ఆర్థికభారం పడుతోంది. భైంసా ఏరియాస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి. – జె.రాజు, సీపీఐ (ఎంఎల్) నాయకుడు, భైంసా -
ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న టెక్ ఫెస్ట్
బాసర: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు బాసర ట్రిపుల్‌ఐటీలో నిర్వహిస్తున్న టెక్ ఫెస్ట్ రెండో రోజు శనివారం కొనసాగింది. ముఖ్య అతిథులు ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధరన్, ఏవో రణధీర్‌సాగి, అసోసియేట్ డీన్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులను సందర్శించారు. విద్యార్థుల సృజనను అభినందించారు. ప్రాజెక్టుల్లో ‘పిజోజెక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీ హార్వెస్టింగ్’ అనే ప్రాజెక్ట్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగం ప్రదర్శించింది. ఈ ప్రాజెక్ట్ మెకానికల్ కంపనాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పిజోజెక్ట్రిక్ పదార్థాల ప్రాథమిక అన్వయాన్ని చూపించింది. ఇక ఈసీఈ విభాగ విద్యార్థులు రూపొందించిన ‘యాంటీ సూసైడ్ ఫ్యాన్’ ఆకట్టుకుంది. ఇది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోకుండా నివారిస్తుంది. ఈ పరికరం ఫైలింగ్ ఫ్యా న్స్‌పై అనూహ్యమైన భారం లేదా అనుమానాస్పద రకమైన లోడ్లను గుర్తిస్తుంది. తద్వారా ఆత్మహత్యను నిరోధిస్తుందని విద్యార్థులు తెలిపారు. -
వేణుగోపాలస్వామిని తాకిన సూర్య కిరణాలు
లక్ష్మణచాంద: దక్షిణ భారత దేశంలోనే అష్ట భుజాలు కలిగిన ఏకై క ఆలయమైన శ్రీఅష్టభుజ వే ణుగోపాల స్వామి ఆలయంలో శనివారం అద్భుతం ఆవిష్క్రృతమైంది. స్వామి వారి పాదాలను ఉదయం 6.40 గటంలకు సూర్యకిరణాలు తాకాయి. ఈ సందర్భంగా పూజారి రమేశ్ఆచారి మాట్లాడుతూ ఏటా అక్టోబర్‌లో ఒకసారి, మార్చిలో మరో సారి సూర్యకిరణాలు మూలవిరాట్‌పై పడతాయని తెలిపారు. అటవీ అడ్డంకులను తొలగించాలి● అసెంబ్లీలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ కడెం: కవ్వాల్ టైగర్‌జోన్‌తో ఖానాపూర్ నియోజవర్గంలో అభివృద్ధి పనులకు అటవీ నిబంధనలు అడ్డంకిగా మారాయని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ శనివారం అసెంబ్లీలో ప్రస్తావించారు. జీరో అవర్‌లో నియోజకవర్గంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కడెం మండలంలోని లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు, అల్లంపల్లి, గంగాపూర్ రోడ్డు, దస్తురాబాద్ మండలంలో దేవునిగూడెం ఆలయ నిర్మాణ పనులకు, విద్యుత్ లైన్లకు, స్థానిక అవసరాల కోసం ఇసుకను తీసుకేళ్లేందుకు అటవీ అనుమతులు ఇవ్వాలని కోరారు. -
రైస్‌మిల్లులో విజిలెన్స్ తనిఖీలు
● లెక్క తేలని ధాన్యం సుమారు 12,202 మెట్రిక్ టన్నులు ● గోప్యంగా తనిఖీల వివరాలు ఖానాపూర్: మండలంలోని సత్తనపల్లి పంచాయతీ పరిధి రాంరెడ్డి పల్లె గ్రామంలోని ఏఆర్ఎస్ ఇండస్ట్రీయల్ రైస్‌మిల్‌పై స్టేట్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతోపాటు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం తనిఖీలు చేశారు. ఈ విషయం శనివారం వెలుగు చూసింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టిన అధికారులు ఈ తనిఖీల్లో కోట్ల రూపాయల విలువ చేసే సుమారు 12,202 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం లెక్క తేలనట్లు గుర్తించారు. రబీ సీజన్ 2022–23, 2023–24 సంవత్సరాలకుగానూ కేటాయించిన ధాన్యంలో తేడాలు వచ్చినట్లు తెలిసింది. మిల్లులపై కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే తనిఖీల విషయం అధికారులు గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. -
ఇంటికే రాములోరి తలంబ్రాలు
నిర్మల్‌టౌన్: ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా భద్రాదిలో జరగనున్న సీతారామచంద్రస్వామి కళ్యాణంలో వినియోగించిన తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా అందించనున్నట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సీతారాముల కళ్యాణ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లో రూ.151 చెల్లించి రశీదు పొందితే ఇంటి వద్దకే తలంబ్రాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, స్టేషన్ మేనేజర్ ఏఆర్.రెడ్డి, కార్గో ఎగ్జిక్యూటివ్ కిశోర్‌కుమార్, కంట్రోలర్లు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం
నిర్మల్‌చైన్‌గేట్: ఏప్రిల్ 1 నుంచి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్‌కుమార్ అధికారులను ఆదేశించారు. రేషన్ దుకాణాలలో సన్నబియ్యం సరఫరా అంశంపై రేషన్ డీలర్లు, రెవెన్యూ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొడ్డు బియ్యం పంపిణీ చేయవద్దని స్పష్టం చేశారు. సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. వేసవి నేపథ్యంలో రేషన్ దుకాణాల వద్ద మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, ప్రజలుకు ఎండ నుంచి రక్షణ కల్పించేలా తగిన ఏర్పాట్లను చేయాలని సూచించారు. సమావేశంలో సివిల్ సప్లయ్ డీఎం వేణుగోపాల్, డీఎస్వో కిరణ్‌కుమార్, రేషన్ డీలర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నీటిబొట్టుకూ ఓ లెక్క
ఉమ్మడి జిల్లాలో 2024–2025 ఫిబ్రవరి వరకు భూగర్భ జల శాఖ వివరాలు జారీ చేసిన ఎన్వోసీలు 101రిజిస్ట్రేషన్ ఫీజులు(వాల్టా, పరిశ్రమ, మైనింగ్) రూ.15,12,448విధించిన జరిమానాలు రూ.1,65,000వసూలైన భూగర్భజల వినియోగ చార్జీలు రూ.3,02,64,788రిజిస్ట్రేషన్ చేసుకోవాలిభూగర్భ జలాలను వాడుతున్న ఆయా సంస్థలు, యాజమాన్యాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫ్లో మీటరు అమర్చుకోవాలి. ముందుగా యజమానులకు అవగాహన కల్పించి, తర్వాత నోటీసులు ఇచ్చి అవసరమైతే జరిమానా విధిస్తున్నాం.– జి.లావణ్య, భూగర్భ జలశాఖ అధికారి, మంచిర్యాలసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భ జలాల విచ్చలవిడి వినియోగాన్ని భూగర్భ జల శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. గృహ, ప్రజావసరాలు మినహా వ్యా పార కేంద్రాల్లో ఇష్టారీతిన నీటి వినియోగం తగ్గించేలా ప్రతీ నీటిబొట్టుకు లెక్కగడుతూ ఆ మేరకు చా ర్జీలు వసూలు చేస్తోంది. కమర్షియల్ కేంద్రాలైన కంపెనీలు, పరిశ్రమల నుంచి వినియోగ చార్జీలు తీసుకునేలా 2023లోనే తీసుకొచ్చిన నూతన విధానం లో ప్రతీ 1కేఎల్(వెయ్యి లీటర్లు)కు రూపాయి చొప్పున వసూలు చేయనున్నారు. గతంలో వాల్టా చట్టం ప్రకారం నీటి వాడకం కోసం ధ్రువీకరణ పత్రం(ఎన్వోసీ)ని మూడేళ్లకోసారి పునరుద్ధరణ చేసేవారు. కొత్త నిబంధనల ప్రకారం ఎంత నీరు వాడితే అంత చార్జీ చేస్తూ ప్రతీనెల విద్యుత్ బిల్లు మాదిరిగానే నీటి బిల్లు ఆన్లైన్లో చెల్లించేలా సిద్ధం చేశారు. ప్రస్తుతం సింగరేణి, దేవాపూర్ సిమెంటు ఫ్యాక్టరీలో ఈ నిబంధనలు అమలు అవుతున్నాయి. ఫ్లో మీటర్లు బిగింపు.. నీటిని వాడుతున్న ఆయ సంస్థలు, కంపెనీలు కచ్చితంగా భూగర్భ జలాల వాడకంపై డిజిటల్ ఫ్లో మీటర్‌తో కూడిన టెలిమీటర్కు అనుసంధానం చేసుకోవాలి. ఈ ఫ్లో మీటరు ప్రతీ ఆరు గంటలకు ఎంత నీటిని వాడారో లెక్కించి ఆన్లైన్లోనే వివరాలు పంపిస్తుంది. దీంతో ప్రతీ నెల ఆయా సంస్థలు జల వాడకానికి తగినట్లుగా చార్జీలు చెల్లించాలి. ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనులు, ఓపెన్ కాస్టుల్లో అమలవుతోంది. వీటితోపాటు సిమెంటు, ఇతర మైనింగ్ కంపెనీలు, నీరు అధికంగా వినియోగిస్తున్న సంస్థలకు ఆయా జిల్లాల భూగర్భ జల అధికారులు వెళ్లి తనిఖీ చేస్తూ ఫ్లో మీటర్లను బిగించుకునేలా చూస్తున్నారు. కొత్త విధానంపై ఇంకా చాలామందికి అవగాహన లేకపోవడం, డబ్బులు కట్టాల్సి వస్తుందని కొన్ని చోట్ల స్పందించడం లేదు. వాడకమున్నా వసూళ్లు లేవు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేటు తాగునీటి ప్లాంట్లు, కంపెనీలు, పరి శ్రమలు, ఖనిజ పరిశ్రమలు అనేకం ఉన్నాయి. యా జమాన్యాలు తమ బోర్‌వెల్స్‌ను రిజిస్ట్రేషన్ చేసుకు ని ఫ్లో మీటర్లు అమర్చుకోవాల్సి ఉంది. కానీ చాలా చోట్ల వ్యాపారులు ముందుకు రావడం లేదు. అనధి కారికంగానూ బోర్‌వెల్స్, పంపుసెట్లు, వాగులు, వంకలు, చెరువుల నుంచి నీటిని తోడేస్తున్నారు. ఎండాకాలంలో ఈ వాడకం తీవ్రంగా ఉంటుంది. ఒక్కో సంస్థ నిత్యం వేలాది లీటర్ల నీటిని వినియోగి స్తున్నా లెక్కాపత్రం లేకపోవడంతోపాటు వినియోగంపైనా అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అలాంటి చోట్ల అధికారులు వెళ్లి మొదట నోటీసులు ఇస్తున్నారు. కొంత గడువు ఇచ్చాక జరిమానా విధిస్తున్నారు. చాలా చోట్ల యాజమాన్యాలు ఈ నోటీసులను సైతం పట్టించుకోవడం లేదు. భూగర్భ జలాల వినియోగంపై చార్జీలు ఫ్లోమీటర్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు వ్యాపార, వాణిజ్య సంస్థలకు నోటీసులు క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మేసీ్త్రలకు శిక్షణ
నిర్మల్‌చైన్‌గేట్: న్యాక్, హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మేసీ్త్రలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం శనివారం కూడా కొనసాగింది. మోడల్ ఇందిరమ్మ ఇల్లు నమూనాని మేసీ్త్రలకు చూపించారు. శిక్షణ కేంద్రాన్ని హౌసింగ్ పీడీకే రాజేశ్వర్, డీఈ గంగా ధర్ సందర్శించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ట్రైనింగ్‌లో చెప్పిన ప్రతీ అంశాన్ని పరిగణలోకి తీసుకోవా లని తెలిపారు. న్యాయ జిల్లా ఇన్చార్జి ధ్యావంతు రమేశ్, శిక్షకుడు మహేష్ పాల్గొన్నారు. -
నేరాల తగ్గింపుపై దృష్టిపెట్టాలి
● ఎస్పీ జానకీ షర్మిల ● భైంసా రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ భైంసారూరల్: నేరాలు తగ్గించేలా పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. భైంసారూరల్ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంతాలను, వాహనాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసు వివరాలను, స్టేషన్ రికార్డులను తనిఖీచేశారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. నారీశక్తి కార్యక్రమంలో పాల్గొనే మహిళా కానిస్టేబుళ్ల విధుల గురించి ఆరాతీశారు. పోలీస్ అక్కలో పాల్గొన్న మహిళా సిబ్బందితో మాట్లాడి వారు వెళ్తున్న పాఠశాలల వివరాలు అడిగారు. బ్లూకోల్ట్, పెట్రోకార్ డ్యూటీలో ఉన్నప్పుడు 100 కాల్స్‌కు తక్షణమే స్పందించి సంఘటన స్థలానికిచేరుకుని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్నారు. పెట్రోలింగ్ సమయాల్లో పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను తనిఖీ చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవా ణా పై ఉక్కుపాదం మోపాలన్నారు. గంజాయి తాగే వారిని, వారికి సరఫరాచేసే వారిని గుర్తించి కేసులు నమోదుచేయాలన్నారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలునాటారు. ఏఎస్పీ అవినాశ్‌కుమార్, సీఐ నైలు, కుభీర్, కుంటాల ఎస్సైలు రవీందర్, భాస్కరాచారి, పోలీసులు ఉన్నారు. -
ప్రజలకు అందుబాటులో కలెక్టరేట్
● కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ కలెక్టరేట్ పట్టణానికి దూరంగా ఉండడంతో పట్టణ ప్రజలతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు, ఉద్యోగులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కలెక్టరేట్‌తో పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడమా లేక నూతన కలెక్టరేట్ భవనం నిర్మల్‌లో అందరికీ అందుబాటులో ఉండేలా నిర్మించాడమా అనే విషయమై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతానని తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జీల సహకారంతో రానున్న మూడున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి జిల్లాలో బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఆదిలాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఏర్పడే నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని స్పష్టం చేశారు. లేకపోతే అప్పటికి ఆదిలాబాద్ ఎంపీ స్థానం జనరల్ రిజర్వేషన్ అయితే ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. -
● నదీమాతల్లులే ‘నిర్మల్’కు అండ ● ‘సరస్వతీ’కటాక్షంతో పచ్చదనం ● తలాపునే గోదావరి ఉన్నా.. ఎండుతున్న భైంసా డివిజన్ ● ఓవైపు నిండుగా చెరువులు.. ● మరోవైపు వట్టిపోతున్న బోర్లు
ఇక్కడ పారుతున్న చెరువు ఒర్రెలో నుంచి నీటిని పైపుల ద్వారా తన పొలానికి మళ్లించుకునేందుకు తిప్పలు పడుతున్న రైతు పేరు నర్సారెడ్డి. లోకేశ్వరం మండలం ధర్మోరాకు చెందిన ఈయన రెండున్నరెకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేస్తున్నాడు. బోరు ఎత్తిపోవడంతో దగ్గరలోని చెరువుకింద ఒర్రె నుంచి ఇలా పైపులు వేసుకుంటూ పంటకు నీరందించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. నిండువేసవిలోనూ నిండుకుండల్లా చెరువులు, మండిపోతున్న ఉష్ణోగ్రతల్లోనూ పచ్చగా పండుతున్న పంటలు.. ఎటుచూసినా కాలువలు, వరి ధాన్యపు సిరులు. లక్ష్మణచాంద మండలం జిల్లాలో కోనసీమను తలపిస్తోంది. సరస్వతీ కాలువ, కాకతీయుల నాటి చెరువుల పుణ్యాన ఈ ప్రాంతమంతా ఎప్పుడూ పచ్చగా ఉంటోంది. ఈ ఒక్క మండలంలోనే 40 వరకు చెరువులు ఉన్నాయి. సరస్వతీ కెనాల్‌తో నిండుతూ పంటలకు అండగా ఉంటున్నాయి. ఈ వేసవిలోనూ తమ పంటలకు ఏమాత్రం ఢోకా లేదని ఇక్కడి రైతులు అంటున్నారు. ఇక్కడ.. గొర్రెలు మేస్తున్న తన పొలంతో సెల్ఫీ తీసుకుంటున్న యువరైతు పేరు ప్రవీణ్. దిలావర్పూర్ మండలకేంద్రానికి చెందిన ఈయనకు రెండున్నర ఎకరాల సాగుభూమి ఉంది. బోరుబావును నమ్ముకుని వరిసాగు చేశాడు. కానీ.. వేసవి మొదట్లోనే పాతాళగంగ దెబ్బ కొట్టింది. వారం నుంచి బోరు ఎత్తిపోవడంతో నీరు లేక పొలం ఎండుతోంది. చివరకు చేసేది లేక ఇలా.. తన పొలాన్ని మూగజీవాలు మేపడానికి ఇచ్చేశాడు. ఈ సీజన్సాగులో నీరందక రూ.30 వేలు నష్టపోయినట్లు వాపోతున్నాడు. పంట ఎండిపోయింది.. కుంటాల మండలం దౌనెల్లికి చెందిన రైతు అలీమ్. యాసంగి పంటగా రెండెకరాల్లో జొన్న సాగు చేశాడు. భూగర్భజలాలు అడుగంటిపోయి, పంటకు బోరు నీళ్లు అందలేదు. దీంతో జొన్న పంట మొత్తం ఎండిపోయింది. నీరందితే 30–40 క్వింటాళ్ల పంటదిగుబడి వచ్చేదని బాధిత రైతు తెలిపాడు. ఇపుడు ఐదారు క్వింటాళ్లు కూడా వస్తాయో లేవోనని అలీమ్ వాపోతున్నాడు. బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతున్నాడు. అడుగంటిన బావి.. బీడువారిన భూమి కడెం మండలం సదర్మట్ ఆయకట్టు చివరి భూములకు పక్షం రోజులుగా నీరందడం లేదు. చివరి ఆయకట్టు వరకు నీరందకపోవడంతో వరిపొలాలు బీడువారాయి. వేసవి ప్రారంభంలోనే ఇక్కడ బావులు, బోరుబావులూ అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే ఈభూములను కలెక్టర్, జిల్లా అధికారులూ పరిశీలించారు.పొలం.. గొర్రెల పాలు..చెరువు.. ఆయకట్టు ఆదరువు -
సాక్షి చెంతకు జడ్జి
ఖానాపూర్: కోర్టు కేసుల్లో సాక్షులు కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది.. ఖానాపూర్‌లో న్యాయస్థానమే సాక్షివద్దకు వెళ్లి సాక్ష్యాధారాలు తీసుకుంది. ఖానాపూర్ మండలం బావాపూర్(ఆర్) గ్రామంలో గతంలో జరిగిన గొడవతో కేసు నమోదైంది. కేసు చివరి దశలో ఉన్న సమయంలో కేసును వాదించే న్యాయవాది రమణరావు కాలి గాయంతో నడవలేని స్థితిలో ఉన్న సాక్షిని కోర్టు ఆదేశాల మేరకు ఆటోలో కోర్టు ఆవరణ వరకు తీసుకొచ్చాడు. కోర్టు లోపలికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవేందర్తోపాటు సదరు న్యాయవాది ఈ విషయం జడ్జి జితిన్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జడ్జి నేరుగా కోర్టు ఆవరణలో ఆటోలో ఉన్న సాక్షి వద్దకు వచ్చి భయాన స్టేట్మెంట్ తీసుకున్నారు. -
క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఎంఏ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటి కే పలువురు దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తున్నారని గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిధిలో ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ రుసుములో 25 శాతం రా యితీ కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విని యోగించుకుని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులంతా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలన్నారు. మార్చి 31తో రాయితీ గడువు ముగుస్తుందన్నారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీజుల చెల్లించి రెగ్యులర్ చేసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, యాదవ్కృష్ణ, రాజేశ్‌కుమార్ పాల్గొన్నారు. అర్హులైన దివ్యాంగులకు యూడీఐడీ కార్డు అర్హులైన దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూడీఐడీ కార్డుల జారీ మార్గదర్శకాలు, దివ్యంగుల సమస్యలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు, దివ్యాంగులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సదరం సర్టిఫికెట్‌కు బదులుగా అర్హులైన ప్రతీ దివ్యాంగుడికి యూనిక్ డిసెబిలిటీ ఐడీ (యూడీఐడీ) నంబర్‌ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి 1 నుంచి దివ్యాంగుల పునరావాసం, సాధికారత కోసం డైనమిక్ వెబ్ ఎనేబుల్ సిస్టమ్‌ను రూపొందించిందన్నారు. సదరం సర్టిఫికెట్ ఉన్నవారు, నూతనంగా యూడీఐడీ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుని ఆసుపత్రిలో స్లాట్ బుకింగ్ చేసి, నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. తర్వాత కార్డులు జారీ అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్డులు 21 రకాల వైకల్యం ఉన్న దివ్యాంగులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ అర్హులైన దివ్యంగులకు ప్రభుత్వ పథకాల లబ్ధి, పునరావాసం, సాధికారతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం యూడీఐడీ కార్డుల జారీ మార్గదర్శకాలపై వైద్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్‌సింగ్, దివ్యాంగులు, అధికారులు పాల్గొన్నారు. -
మహిళలే బ్రాండ్!
● అన్నిరంగాల్లో రాణించాలి ● కలెక్టర్ అభిలాష అభినవ్ ● కలెక్టరేట్లో మహిళా దినోత్సవం ● వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం నిర్మల్‌చైన్‌గేట్: మహిళాశక్తిని చాటుతూ, వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా ప్రత్యేకంగా నిలుస్తోందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మహిళలు మరింతగా రాణించాలని, అన్నిరంగాలలో పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్హాల్లో గురువారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్డీవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలే బ్రాండ్‌గా రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్నంగా రూపొందించిన ‘వాక్ ఫర్ దేశీ సీడ్స్’, ‘మిట్టి దీదీ’ కార్యక్రమాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అందుకే జిల్లా మహిళలను అవార్డులు వరిస్తున్నాయని తెలిపారు. జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టినందుకు మహిళలు జిల్లాకు బ్రాండ్ అన్నారు. భవిష్యత్తులో స్వయం సహాయక సంఘాలు మరిన్ని అవార్డులు, ప్రోత్సాహకాలు సాధించాలని ఆకాంక్షించారు. విత్తన చొరవ అభినందనీయం..మితిమీరిన ఎరువులు వాడిన పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడంతోనే వ్యాధుల బారిన పడుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. సంప్రదాయ పంటలు, సంప్రదాయ ఆహారపు అలవాట్లవైపు మళ్లే విధంగా మహిళా సమాఖ్యలు చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రత్యేకంగా నాణ్యమైన దేశీ విత్తనాలను సేకరించి, మహిళా సంఘాలకు విత్తనాలను అందజేసి, సాగు చేయించడంతోపాటు సీడ్బ్యాంక్లు ఏర్పాటు చేస్తామన్నారు. భూసార పరీక్షలనూ మహిళా సంఘాల ద్వారానే చేయిస్తామన్నారు. ఈ రెండింటికీ సంబంధించిన ‘వాక్ ఫర్ దేశీ సీడ్’, ‘మిట్టిదీదీ’ పోస్టర్లను జిల్లా అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లామహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు గంగామణి, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.సేకరించిన దేశీ విత్తనాలు..చిరుధాన్యాలు: కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలు మధ్యస్థ ధాన్యం: రాగులు, సజ్జలు, జొన్నలు ఉత్తమ ధాన్యం: గోధుమలు, ధాన్యం(వడ్లు) ధాన్యంలో రకాలు: చిట్టి ముత్యాలు, తులసిబసు, అంబేమొహర్, కోతంబరి, తులసి బాస్మతి, బహురూపి(బలానికి), మైసూర్మల్లిగ(చిన్న పిల్లల్లో ఎదుగుదలకు), రత్నచోడి(కండర పటుత్వానికి), ఇంద్రాణి(ఈ విటమిన్ కోసం), కుజుపఠాలియా, కాలాబట్టి(రోగనివారణకు), కర్పకౌని(శరీర సమతుల్యతకు), నవారా(మధుమేహ బాధితులకు), రక్తశాలి(రక్తహీనత నివారణకు) కులాకార్, పుంగర్, మా పిళ్ళై సాంబ తదితర రకాలు. కూరగాయలు:అన్నపూర్ణ రామ్ములక్కాయ, కాశీ రామ్ములక్కాయ, చిట్టీ రామ్ములక్కాయ, కేసరీ రామ్ములక్కాయ, దేశీ టమాట, వంకాయ, బెండ, సూర్యముఖి/త్రిశూల మిరప, మధ్యస్థ పొడవుకారం మిరపకాయ, బీరకాయ, గుత్తి బీరకాయ, ఆకుపచ్చ కాకరకాయ తదితర కూరగాయలతో పాటు చిలగడ, కర్రపెండలం దుంప విత్తనాలు. మట్టి పరీక్షలు.. దేశీ విత్తనాలు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ భూసార పరీక్షలు చేయడమే ‘మిట్టిదీదీ’ కార్యక్రమం. ఒకప్పటి దేశీవిత్తనాలను కాపాడుకుంటూ ముందుతరాలకు అందించేలా సాగు చేయించడమే ‘వాక్ ఫర్ దేశీ సీడ్స్’ కార్యక్రమం. ఈ రెండు కూడా మహిళా రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనుండటం, దేశీ విత్తనాలతో పండించిన పంటలనూ సంఘాలే కొనుగోలు చేయనుండటం విశేషం. ఇప్పటికే జిల్లాలో 200 మంది మహిళా రైతులతో దాదాపు 20 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేయించేందుకు సిద్ధం చేసినట్లు డీఆర్డీవో విజయలక్ష్మి వివరించారు. పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి దేశీవిత్తనాలను సేకరించినట్లు చెప్పారు. పథకాలు సద్వినియోగం చేసుకోవాలి..జిల్లాకు మహిళా సంఘాలే బ్రాండ్ అంబాసిడర్లని కలెక్టర్ కొనియాడారు. నిర్మల్ కొయ్యబొమ్మల కోసం పొనికికర్ర ఉత్పత్తికి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పొనికి వనాలు పెంచడం గొప్ప విషయమన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమ ని, అందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారితకు ఎన్నో పథకాల ను ప్రవేశపెట్టాయని వివరించారు. మహిళలు సద్వినియోగం చేసుకోవా లని, వ్యాపారం, స్వయంఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్నారు. జిల్లా స్వయం సంఘాలు బ్యాంకు లింకేజీ, రుణ వితరణ, తదితర అంశాలలో అగ్రగామిగా ఉందన్నారు. -
‘పది’ విద్యార్థులతో కలెక్టర్ జూమ్ మీటింగ్
నిర్మల్‌చైన్‌గేట్: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ముందు రోజు కలెక్టర్ అభిలాషఅభినవ్ జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల విద్యార్థులతో జూమ్‌కాల్ మాట్లాడారు. ప్రశాంతంగా, ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షలంటే భయం వీడి మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. పరీ క్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవా లని తెలిపారు. ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నారు. పరీక్ష కేంద్రంలోనికి పెన్నులు, పెన్సిల్, పరీక్ష ప్యాడ్ మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు. సెల్ ఫోన్సహా. ఎలక్టాన్రిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ, దిగ్విజయంగా పరీక్షలు రాయాలని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏర్పాట్లపై సమీక్ష..అంతకు ముందు పరీక్షల నిర్వహణ, ఏర్పాట్ల పై విద్యాశాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బో ర్డు పరీక్షలను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. పరీక్షలపై ఎవరైనా తప్పుడు సమాచారం షేర్ చేసేత క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షలపై సందేహాలుంటే కంట్రోల్ రూమ్ నంబరు 90599 87730ను సంప్రదించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, విద్యాశాఖ అధికారులు ఎం.పరమేశ్వర్, పద్మ, లింబాద్రి పాల్గొన్నారు. -
రైతుల చేతిలో నాలుగు ఎకరాల్లోపే..
ఉమ్మడి జిల్లాలో భూ కమతాల సగటు చూస్తే గతేడాది, తాజా సర్వే ప్రకారం యధావిధిగా ఉన్నాయి. అంటే భూమి చేతులు మారుతున్నప్పటికీ రైతుల వద్ద ఉన్న భూమి అలాగే కొనసాగుతోంది. గత ఆర్థిక సర్వేలోనూ ఉమ్మడి జిల్లాల్లో సగటు కమతం ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టం 3.78ఎకరాలు ఉండగా, కనిష్టంగా మంచిర్యాలలో 2.29ఎకరాలు ఉంది. ఈ జిల్లాలో జనాభా తక్కువ, భూ లభ్యత ఎక్కువ కావడంతో సగటులో ఎక్కువ వస్తోంది. జిల్లాలో సగటు భూ కమతాలు (ఎకరాల్లో)ఆదిలాబాద్ 3.78ఆసిఫాబాద్ 1.39నిర్మల్ 2.47మంచిర్యాల 2.29 -
‘టెన్’షన్ వద్దు
● నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ● జిల్లాలో 9,129 మంది విద్యార్థులు ● 5 నిమిషాలపాటు వెసులుబాటునిర్మల్ రూరల్: విద్యార్థి జీవితంలో ప్రథమ మెట్టుగా భావించే పదో తరగతి పరీక్షలు శుక్రవా రం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు జిల్లా అధికారులు కూడా ఈసారి ఫలితాలపై ఆసక్తిగా ఉన్నారు. వరుసగా రెండేళ్లు ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 47 సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షకు ఐదు నిమిషాల వెసులుబాటు కల్పించారు. ఈసారి గ్రేడింగ్‌కు బదులుగా మార్కులను కేటాయిస్తారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్లను అందజేశారు. పోలీసులు, ఆరోగ్యశాఖ, ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో విద్యాశాఖ 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 9,129 మంది విద్యార్థులు..ఈసారి జిల్లాలో 9,129 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 4,444, బాలికలు 4,685 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి మొత్తం 6,158 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఇందులో 2,765 బాలురు, 3,393 బాలి కలు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి 2,971 మంది రాయనుండగా, 1,679 మంది బాలురు, 1,292 బాలికలు ఉన్నారు. నిర్మల్‌లో 22, భైంసాలో 19, ఖానాపూర్‌లో 06 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్‌కు ఒక ముఖ్య పర్యవేక్షణ అధికారి, డీవోను నియమించారు. ఏడుగురు కస్టోడియన్ ఆఫీసర్లు, 563 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఐదు నిమిషాల వరకు అనుమతి..పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు 5 నిమిషాల వరకు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తారు. కానీ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్లను పంపిణీ చేశారు. ఇంకా పొందని వారు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చని సూచించారు. ‘హ్యాట్రిక్ ’ కొట్టాలి...‘పదవ తరగతి విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్.. మళ్లీ మన జిల్లా రాష్ట్రంలోనే ఫస్ట్ రావాలి.. హ్యా ట్రిక్ కొట్టాలి’ అంటూ జిల్లావాసులు చెబుతున్నా రు. రెండేళ్లుగా ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొద టి స్థానంలో నిలిచింది. ఈసారి కూడా ఆ స్థానా న్ని నిలబెట్టుకోవాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ సైతం పలుమా ర్లు పదో తరగతి పరీక్షల నిర్వహణపై డీఈవో, ఇతర జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించా రు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈసారి కూడా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లామని, మళ్లీ ఫస్ట్ వస్తామని డీఈవో రామారావు ధీమాగా ఉన్నారు. వివరాలు..పరీక్ష రాయనున్న విద్యార్థులు 9,129బాలురు 4,444బాలికలు 4,685పరీక్ష కేంద్రాలు 47నిర్మల్‌లో 22భైంసాలో 19ఖానాపూర్‌లో 06 -
పెద్దలసభలో ‘పెద్ద’గా నిర్మల్ బిడ్డ
నిర్మల్: రాజ్యసభలోకి అడుగుపెట్టి తొలి గుర్తింపు దక్కించుకున్న నిర్మల్బిడ్డ సిర్గాపూర్ నిరంజన్‌రెడ్డి. అదే పెద్దలసభకు ‘పెద్ద’గా వ్యవహరించి జిల్లాపేరు దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేశారు. దిలావర్పూర్ మండలం సిర్గాపూర్‌కు చెందిన నిరంజన్‌రెడ్డి దేశంలోనే ప్రముఖ న్యాయవాదిగా పేరొందారు. వైస్సార్ కాంగ్రెస్ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజ్యసభలో ప్యానెల్ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న నిరంజన్‌రెడ్డి మంగళవారం జరిగిన సమావేశాల్లో తన బాధ్యతలను నిర్వర్తించారు. పెద్దల సభగా గుర్తింపు పొందిన రాజ్యసభకు ‘పెద్ద’గా తాను వ్యవహరించిన తీరును అందరూ ప్రశంసించారు. జిల్లావాసికి అరుదైన గుర్తింపు దక్కడంపై స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.నిరంజన్‌రెడ్డి -
కలెక్టరేట్ ఎదుట ఆశ కార్యకర్తల ధర్నా
నిర్మల్‌చైన్‌గేట్: సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎ దుట ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఉద యం 9గంటలకే గేటు ఎదుట బైఠాయించి సుమా రు 3గంటలపాటు అధికారులు, ఉద్యోగులు, సి బ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రూ.18వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, ప్రమోషన్, పీఎఫ్, ఈపీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయిలు చెల్లించాలని డి మాండ్ చేశారు. డీఎంహెచ్‌వో, స్థానిక సీఐ పలు సార్లు సముదాయించినా వినలేదు. దీంతో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రోడ్డు పై, చెట్ల నీడన నిరీక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ వచ్చి సమస్యలు తెలుసుకున్నారు. డీఎంహెచ్‌వోతో మాట్లాడి పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు రిలీజ్ చేయించారు. మూడేళ్లకు సంబంధించిన సర్వే డబ్బులు గురువారం అందజేస్తామని హామీ ఇచ్చారు. మిగతా సమస్యలు కూడా ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగామణి, సుజాత, చంద్రకళ, రామలక్ష్మి, విజయలక్ష్మి, మంగమ్మ, అనురాధ, శారద, లావణ్య, స్రవంతి, సౌమ్య, సరిత, అనసూయ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ అదనపు కలెక్టర్ హామీతో విరమణ -
నిర్మల్
అలరించిన వీడ్కోలు వేడుకలు జిల్లాలోని పలు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు హంగామా చేశారు. గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025IIIలోu ‘మధ్యాహ్న’ కార్మికుల నిరసన నిర్మల్‌చైన్‌గేట్: సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఏవో, డీఈవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ మా ట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు గత డిసెంబర్ నుంచి పెరిగిన మెనూ చార్జీ రూ.74 పైసలు వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికు ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే రాధ, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, నాయకులు రాజేశ్వర్, మంజుల, పద్మ, గోదావరి, మాయవ్వ, సరస్వతి, లక్ష్మీబాయి, హంస పాల్గొన్నారు. ప్రజలను వంచించే బడ్జెట్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌తో ప్రజలను మరింత మోసం చేసింది. బడ్జెట్ నిండా బడాయి, అప్పులు మినహా ప్రజాసంక్షేమం ఎక్కడా లేదు. జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేవు. అభివృద్ధికి నిధులూ ఇవ్వలేదు. – మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, నిర్మల్ బడ్జెట్లో ఏమీ లేదు రాష్ట్రబడ్జెట్లో కోట్ల లో కేటాయింపులు మినహా.. చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లే దు. ప్రజలను వంచించే బడ్జెట్ ఇది. బాసర జ్ఞానసర్వసతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి సంబంధించిన రూ.42కోట్ల నిధులు వెనక్కి ఇవ్వలేదు. చెరువులనూ పట్టించుకోలేదు. – రామారావుపటేల్, ఎమ్మెల్యే, ముధోల్ ఆమోదయోగ్య బడ్జెట్ ప్రజల సంక్షేమం కోసం ఈసారి బడ్జెట్లో గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేపట్టాం. ఇది ప్రజామోదయోగ్యమైన పద్దు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుంది. – వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే, ఖానాపూర్ ఈసారి కూడా రాష్ట్రబడ్జెట్ ఉసూరుమనిపించింది. రాష్ట్ర ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రభుత్వ పథకాలు, రెగ్యులర్ కేటాయింపులు మినహా పెద్దగా ఎలాంటి ప్రత్యేకతలు కనిపించలేదు. యథావిధిగా ప్రాజెక్ట్‌లు, కాలువల మరమ్మతుకు ఎంతోకొంత ఇవ్వాలన్నట్లు ఈపద్దులో కేటాయింపులు మినహా పెద్దగా నిధులివ్వలేదు. బాసర ఆలయ అభివృద్ధికి కొత్తగా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంతో పాటు గతంలో తీసుకున్న రూ.42కోట్లపైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. బాసరలో గోదావరి హారతి చేపడతామని మాత్రం ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు ఇది ప్రజలను మోసగించే బడ్జెట్ అని, జిల్లాకు ఎలాంటి ప్రయోజనం కల్పించలేదని ఆరోపణలు చేస్తుండగా, అధికారపక్షం మాత్రం ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని, గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేశారని సమర్థిస్తున్నారు. – నిర్మల్● పథకాలకే ప్రథమ ప్రాధాన్యత ● జిల్లాకు దక్కని ప్రయోజనం ● బాసర గోదావరికి ‘హారతి’ ● మహిళలు, రైతులకు ఊరట ● బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు ఈసారి కూడా పాతలెక్కనే.. ఈసారి రాష్ట్ర పద్దులో పెద్దగా జిల్లాకు కేటాయింపులు లేవు. ఎప్పటిలాగే సాగునీటి ప్రాజెక్ట్‌ల మరమ్మ తు, నిర్వహణ కోసం అరకొరగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సారెస్పీ–1కింద పేర్కొ నే కడెం ప్రాజెక్ట్‌కు రూ.3కోట్ల లక్షాయాభైవేలు, సు ద్దవాగు ప్రాజెక్ట్‌కు రూ.3.42కోట్లు, స్వర్ణ ప్రాజెక్ట్‌కు రూ.70లక్షలు కేటాయించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నిధుల కేటాయింపులున్నా.. అందులో జిల్లాలోని 27, 28 ప్యాకేజీలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారనే లెక్క తేల్చలేదు. ఏళ్లు గడిచిపోతున్నా.. పక్కనే ఉన్న గోదావరి జలాలు మాత్రం జిల్లాలోని భూములకు అందని పరిస్థితి ఉండగా పెద్దగా పట్టించుకోలేదు. బాసరలో ‘హారతి’స్తారట.. జిల్లాలోనే కాదు.. దక్షిణ భారతంలోనే ప్రముఖ సరస్వతీక్షేత్రం బాసర. ఇక్కడి ఆలయ అభివృద్ధికి బడ్జె ట్లో నిధులు కేటాయించాలని దశాబ్దాలుగా డి మాండ్ చేస్తూ ఉంటే గత ప్రభుత్వం రూ.50కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.8కోట్లు మాత్ర మే ఖర్చు చేశారు. ఇక ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిగతా రూ.42కోట్లు వెనక్కి తీసుకుంది. ఈ నిధులను తిరిగి ఆలయానికి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే రామారావుపటేల్ అసెంబ్లీ సాక్షిగా అడిగినా కేటాయించలేదు. ప్రభుత్వం తరఫున గంగాహారతి తరహాలో బాసరలో గోదావరికి హారతినిచ్చే కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. మహిళలు, రైతులకు.. మెగామాస్టర్‌ప్లాన్ 2050 పేరిట అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని ఆర్థికశాఖమంత్రి ప్రకటించారు. ప్రతీ మండలంలో మహిళలతో రైస్‌మిల్లులు, మినీగోదాములు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళల రైస్‌మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తామన్నారు. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను మ హిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామ ని ప్రకటించారు. మండల మహిళా సమాఖ్య ద్వా రా ఆర్టీసీకి 600 బస్సులు అద్దెకిస్తామని పేర్కొ న్నా రు. వీటిద్వారా జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులూ లబ్ధి పొందనున్నారు. రైతుభరోసాకు నిధుల కేటాయింపులతో పాటు సాగుకు రూ.24,439కోట్లు కేటాయించారు. విద్యారంగానికి కేటాయింపులు అరకొరగానే ఉన్నాయని, పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహం లేదని సంబంధిత రంగాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యూస్‌రీల్ -
‘పది’ ఫలితాల్లో హ్యాట్రిక్ కొడతాం
● మూడోసారి కూడా రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తాం ● జిల్లా విద్యాధికారి రామారావునిర్మల్ రూరల్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈసారి కూ డా రాష్ట్ర స్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతా మని జిల్లా విద్యాధికారి (డీఈవో) రామారావు ధీమా వ్యక్తంజేశారు. ఈనెల 21నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనను ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేయగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సాక్షి: జిల్లాలో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు? జిల్లా వ్యాప్తంగా ఎన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు? డీఈవో: జిల్లాలో మొత్తం 9,129 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో బాలికలు 4,685, బాలురు 4,444 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో నిర్మల్‌లో 22, భైంసాలో 19, ఖానాపూర్‌లో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతీ కేంద్రానికి ఒక ముఖ్య పర్యవేక్షణాధికారి, సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించాం. అన్ని కేంద్రాల్లో 523 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. సాక్షి: ఉత్తమ ఫలితాల సాధనకు ఎలాంటి చర్యలు చేపట్టారు? డీఈవో: విద్యార్థులకు రెండు గ్రాండ్ టెస్టులు నిర్వహించాం. ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా పూర్తి చేశాం. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాం. వీరిని ఉపాధ్యాయులు దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాం. ఉదయం, సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు నిర్వహించాం. మా కృషి ఫలితంగా ఈసారి కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధిస్తాం. సాక్షి: ఉష్ణోగ్రతలు పెరిగినందున కేంద్రాల వద్ద కల్పిస్తున్న వసతులేమిటి? డీఈవో: ఎండల తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద చల్లని తాగునీరు అందుబాటులో ఉంచేలా చూస్తాం. ప్రతీ కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని వసతులూ కల్పిస్తున్నాం. సాక్షి: ఈసారి పరీక్షా విధానంలో బోర్డు చేసిన మార్పుల గురించి తెలుపండి? డీఈవో: పరీక్షా ఫలితాల్లో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి మునుపటిలా మార్కులు ప్రకటించనున్నారు. విద్యార్థులకు ఈసారి సింగిల్ రూల్స్గల 24 పేజీల బుక్లెట్ ఇస్తారు. ఇందులోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అదనపు సమాధాన పత్రం ఇవ్వరు. గతంలో బయోలజీ, ఫిజికల్ సైన్స్ పరీక్షలు ఒకేరోజు నిర్వహించగా ఈసారి వేర్వేరుగా రెండు రోజులు నిర్వహిస్తారు. సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు? డీఈవో: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ఐదు నిమిషాలు వెసులుబాటు కల్పిస్తాం. హాల్‌టికెట్ అందనివారు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఎల్ఆర్ఎస్పై అనాసక్తి
● 25శాతం రిబేట్ కల్పించిన సర్కారు ● చెల్లింపునకు ఈ నెల 31వరకు గడువు ● ముందుకురాని దరఖాస్తుదారులు ● హెల్ప్డెస్క్లకు స్పందన కరువునిర్మల్చైన్గేట్: జిల్లాలో ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)పై ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. అధికారులు దరఖాస్తుల పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినా మొహం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లోనే కాకుండా ము న్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మున్సి పాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించి ఎస్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆరోపణలు ఉండటంతో ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులను క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి మొబైల్ యాప్ ద్వారా మ్యాపింగ్ ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 44,436 దరఖాస్తులు రాగా.. వీటిని మూడు దశల్లో పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్న వాటికి అనుమతి ఇవ్వనున్నారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎల్ఆర్ఎస్ కోసం 44,436 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఫీజు చెల్లింపునకు 24,576 దరఖాస్తులు సరైనవిగా అధికారులు గుర్తించారు. ఈ నెల 16వరకు 239 మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించగా ఇప్పటివరకు ప్రభుత్వానికి రూ.68.02 లక్షల ఆదాయం సమకూరింది. ఇంకా 24,337 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించాల్సి ఉంది. బల్దియాల వారీగా ఇలా.. ఖానాపూర్ మున్సిపల్ పరిధిలో 1,928 దరఖాస్తులు రాగా, 1,348 దరఖాస్తులను ఫీజు చెల్లింపునకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 15మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించగా ఇంకా 1,333 మంది చెల్లించాల్సి ఉంది. నిర్మల్ బల్దియా పరిధిలో 15,515 దరఖాస్తులు రాగా, 10,264 దరఖాస్తులు సరైనవిగా గుర్తించారు. ఇందులో 115 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించగా ఇంకా 10,161 మంది దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంది. భైంసా మున్సిపల్ పరిధిలో 9,044 దరఖాస్తులు రాగా, 6,289 దరఖాస్తులను సరైనవిగా గుర్తించారు. ఇందులో 48 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించగా ఇంకా 6,241 మంది దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంది. వేటికి ఎల్ఆర్ఎస్ వర్తించదంటే.. మున్సిపల్ పరిధిలో బఫర్, ఎఫ్టీఎల్, కుంటలు, చెరువులు, ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితా లోని భూములకు ఎల్ఆర్ఎస్ వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వీటి పరిధిలో భూములుంటే గతంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నా క్రమబద్ధీకరణ చేయకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్కు పూర్తి ఫీజు చెల్లించినా క్షేత్రస్థాయి విచారణ అనంతరం తిరస్కరణకు గురైతే చెల్లించిన ఫీజులో 10శాతం మినహాయించుకుని 90 శాతం డబ్బులు తిరిగి దరఖాస్తుదారుకు చెల్లిస్తారు. మున్సిపాలిటీల్లో హెల్ప్‌డెస్క్‌లు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వ చ్చే సందేహాలు నివృత్తి చేసేందుకు జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. బల్దియాల పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. దరఖాస్తుదారులు సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు. క్షేత్రస్థాయి పరిశీలన ఇలా.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అధికారులు మొదటి దశలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ముందుగా సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు పరిశీలిస్తారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా పరిశీలన చేపడతారు. సర్వే నంబర్ల వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామం లేదా మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, నీటి పారుదలశాఖ అసిస్టెంట్ ఇంజినీర్లతో కూడిన బృందం పరిశీలిస్తోంది. ఈ బృందం జీపీఎస్ ద్వారా సదరు భూమి హద్దులు, ఇతర సమాచారాన్ని మొబైల్ యాప్‌లో నమోదు చేస్తోంది. ఇదే సమయంలో ఈ భూములు నీటి వనరుల బఫర్ జోన్, నాలా, చెరువులు, డిఫెన్స్ ల్యాండ్ పరిధి లోనివి కావని ధ్రువీకరించాల్సి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి గతంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 31లోపు ఫీజు చెల్లిస్తే 25శాతం రాయితీ వర్తిస్తుంది. ఒకవేళ 31వ తేదీ దాటితే ప్రస్తుతమున్న రిజిస్ట్రేషన్ విలువకు అనుగుణంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు గడువులోపు చెల్లించి రాయితీ వినియోగించుకోవాలి. – జగదీశ్వర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ -
నిధులు సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● మున్సిపల్ అధికారులతో సమీక్షనిర్మల్చైన్గేట్: మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులు సమర్ధవంతంగా వినియోగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధి కారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపల్ అధికా రులతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ ల వారీగా కేటాయించిన నిధులు, చేపట్టిన పనులు, ఖర్చు చేసిన నిధులు, అందుబాటులో ఉన్న నిధులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని, విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని సూచించారు. సుందరీకరణ పనులు పూర్తి చేసి ప్రజలు పార్కులకు వచ్చేలా చూడాలని తెలిపారు. గేట్లు, గోడలకు రంగులు వేసి, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పట్టణ వాసులను భాగస్వాములను చేస్తూ పార్కులకు అసోసియేషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపల్ శాఖకు సంబంధించి వచ్చిన సమాచార హక్కు చట్టం దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, జాదవ్‌కృష్ణ, రాజేశ్‌కుమార్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
ఏరియాస్పత్రిని సందర్శించిన కాయకల్ప బృందం
భైంసాటౌన్: పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిని కాయకల్ప బృందం బుధవారం సందర్శించింది. బృందం సభ్యుడు డాక్టర్ శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో రోగులకు అందుతున్న సేవలు, పారిశుధ్య నిర్వహణ, క్లినికల్ వేస్టేజ్, గడువు ముగిసిన మందుల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, నర్సింగ్ ఉద్యోగులతో సమావేశమై మాట్లాడారు. రోగులకు మెరుగైన సేవలందించడంలో పోటీ పడేందుకు కాయకల్ప ర్యాంక్‌లు ఇ స్తుందని పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి నివేదిక పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాయకల్ప బృందం సభ్యులు హెడ్నర్స్ సుజాత, ఫార్మసిస్ట్ శ్రీలత, మాణిక్యం, ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్లు చంద్ర సుజాత, రేఖ, హెడ్నర్స్ విజయశ్రీ, స్టాఫ్ నర్స్ మంజూష తదితరులున్నారు. -
లెక్కలోకి తీసుకుంటరా..!
నిర్మల్పిచ్చుకలతో జీవ వైవిధ్యం జీవ వైవిధ్యంలో పిచ్చుకలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. భూమిపై ప్రతీజీవి మనుగడకు పిచ్చుకలే కారణం. 20న పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ● బడ్జెట్లో జిల్లాకు నిధులిస్తారా..! ● ప్రతిసారీ ఆశనిరాశల పద్దులే.. ● ఈసారైనా జిల్లావైపు చూడాలి ● పనులు పూర్తిచేయాలి ● అభివృద్ధికి చేయూతనివ్వాలిబుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025చెరువుల మరమ్మతులకు నిధులివ్వండి భైంసాటౌన్/ బాసర/ ముధోల్: వానాకాలంలో భారీ వర్షాలకు ముధోల్ నియోజకవర్గంలో వంద వరకు చెరువులు ధ్వంసమయ్యాయని, మరమ్మతుల కోసం నిధులివ్వాలని ఎమ్మెల్యే పి.రామారావుపటేల్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీలో జీరో అవర్‌లో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటి పంటలు ఎండుతున్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హిప్నెల్లి చెరువు మరమ్మతులకు రూ.60 లక్షలు, దొడర్న చెరువుకు రూ.90 లక్షల నిధులు మంజూరైనా ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదని పేర్కొన్నారు. ముధోల్ మండలం ఎడ్‌బిడ్‌లో కాంగ్రెస్ నాయకులు పంచాయతీరాజ్ రోడ్డును వంద మీటర్లు తవ్వేశారని, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. రోడ్డు నిర్మాణనానికి కలెక్టర్ రూ.17.70 లక్షల ఉపాధిహామీ నిధులు మంజూరు చేశారని తెలిపా రు. అయితే వర్షాకాలంలో రోడ్డుపై మొరం వేయించగా రోడ్డు ఎత్తుకు పెరిగిందన్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు దీనిని తవ్వించార ని పేర్కొన్నారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42 కోట్లు వెనక్కి తీసుకుందని, తిరిగి మంజూరు చేయాలని కోరారు. త్వరలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.● రెండుమూడేళ్లుగా భారీ వర్షాలకు చాలావరకు చెరువులు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలి. ● జిల్లాలో ఇప్పటికీ చాలా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థల్లోనే కొనసాగుతున్నాయి. వీటిపై ఈ బడ్జెట్లో దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.కావాల్సినవెన్నో.. ● కడెం ప్రాజెక్టుకు గత బడ్జెట్లో రూ.9 కోట్లకు పైగా నిధులిచ్చారు. సంబంధిత పనులు పూర్తయ్యాయి. ఇక పూడికతీతతోపాటు పూర్తిస్థాయిలో గేట్లను మార్చాల్సిన అంశంపైనా దృష్టిపెట్టాల్సిన అవసరముంది. ప్రాజెక్టు కాలువలు కూడా చాలాచోట్ల దెబ్బతిన్నాయి. మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. ● మామడ మండలంలోని కమల్‌కోట్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ చేసినా నిధులు మాత్రం విడుదల చేయడం లేదు.● జిలాకేంద్రంలో పీజీ కళాశాలను తిరిగి రెగ్యులర్‌గా క్లాసులు ఉండేలా ప్రారంభించాలి. బడ్జెట్.. అనగానే జిల్లాకు నిధులేమైనా వస్తాయా..!? అన్న ఆసక్తి జిల్లావాసుల్లో ఉంటుంది. కానీ ప్రతీ బడ్జెట్‌కు ముందు ఆశ, ఆ తర్వాత నిరాశ కంటిన్యూ అవుతోంది. ఏళ్లు గడిచిపోతున్నా.. జిల్లా అభివృద్ధికి సరిపడా నిధులు మాత్రం రావడం లేదు. మరోవైపు బాసర దేవస్థానానికి ఇచ్చిన రూ.42 కోట్లనూ సర్కారు వెనక్కి తీసుకుంది. జిల్లాలో రాజకీయ పరిస్థితుల పేరు చెప్పి, ప్రభుత్వాలు ప్రజల సమస్యలపై చిన్నచూపు చూడటం సరికాదన్న వాదనా ఉంది. ఈసారి బడ్జెట్లో జిల్లాను లెక్కలోకి తీసుకోవాలని, పెండింగ్ పనుల పూర్తితోపాటు కొత్తగా అభివృద్ధి పనులకు దండిగా నిధులు కేటాయించాలని జిల్లా డిమాండ్ చేస్తోంది. – నిర్మల్ ● బాసర ట్రిపుల్ఐటీకి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కొన్నేళ్లుగా ప్రతిపాదనలు వెళ్తున్నా.. నిధులు మాత్రం రావడం లేదు. ప్రభుత్వాలు పెద్దగా తమను పట్టించుకోవడం లేదన్న భావన విద్యార్థుల్లో ఉంది. ● కడెం, దస్తురాబాద్ మండలాలకు సాగునీటిని అందించేలా లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో సర్వేచేశారు. కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చలనం లేదు. ● సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు మరమ్మతులకు గతంలో రూ.3 కోట్ల వరకు ప్రతిపాదించినా నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. స్వర్ణనదిలో మంజూరైన చెక్డ్యామ్లనూ నిర్మించడం లేదు. ● నిర్మల్, భైంసా పట్టణాల్లో ట్రాఫిక్ పెరిగింది. ఈనేపథ్యంలో ఆయా పట్టణాల్లోనూ ఫ్లైఓవర్, రింగ్‌రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. ● బాసర జ్ఞానసరస్వతీ దేవస్థానానికి గత ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించగా, అందులో కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా రూ.42 కోట్లు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇప్పటికీ ఆలయ అభివృద్ధికి ఎలాంటి నిధులు, చర్యలు చేపట్టడం లేదు. ● కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో 27, 28 ప్యాకేజీల కింద లక్ష ఎకరాల సాగుకు చేపట్టిన పనులు ఇంకా పూర్తికాలేదు. ప్రధానంగా ముధోల్ నియోజకవర్గానికి సంబంధించి 28 ప్యాకేజీ పనులను మధ్యలోనే నిలిపివేశారు. గత ప్రభుత్వం హడావుడిగా 27వ ప్యాకేజీని ప్రారంభించినా.. ఒక్కరోజుకే పరిమితమైంది. ఇప్పటికీ కాలువల పనులు కొనసాగుతూనే ఉన్నాయి.● నిర్మల్ జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజీ సహా అన్నిరకాల వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలి. మెడికల్ కాలేజీ భవనాన్ని త్వరగా నిర్మించాలి. ● జిల్లాలో ఇప్పటికీ ఒక్క పరిశ్రమ కూడా ప్రారంభం కాలేదు. ఇథనాల్, ఆయిల్‌పామ్ మధ్యలోనే నిలిచిపోయాయి. బాసరలో ఏర్పాటు చేస్తామన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ముచ్చట అక్కడే ఆగిపోయింది. అక్కడ భూమి ఉన్నా.. పరిశ్రమలను ఏర్పాటు చేయడం లేదు. ● జిల్లాలో బాసర నుంచి కడెం వరకు జిల్లాకేంద్రం సహా ఎన్నో పర్యాటక ప్రాంతాలు, దర్శనీయ ఆలయాలు ఉన్నాయి. కానీ..ఎక్కడా పర్యాటకపరంగా అభివృద్ధి చేయడం లేదు. కనీసం ఒక్క రూపాయి కూడా పర్యాటకాభివృద్ధి కోసం నిధులు కేటాయించడం లేదు. ● భైంసాలో ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చడంతోపాటు నూతన భవనాన్ని నిర్మించాలి. అలాగే దేవస్థానంతోపాటు, ట్రిపుల్‌ఐటీని బాసరలో వందపడకలతో ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించాల్సిన అవసరం ఉంది. ● నిరుద్యోగ యువతకు సరైన శిక్షణ కేంద్రాలు లేవు. జిల్లాకేంద్రంలో మినహా భైంసా, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఆధునాతన లైబ్రరీలు అందుబాటులో లేవు. స్వయం ఉపాధి పొందేందుకూ కనీసం ప్రోత్సాహం లేదు.● జిల్లాలో క్రీడాప్రాంగణాలు ఉన్నట్లే కానీ.. ఎక్కడా కనీసం ఆడుకోవడానికి సరైన వసతులు లేవు. చాలా క్రీడలకు కోచ్‌లు లేక ఆసక్తి ఉన్న పిల ్లలు పక్కజిల్లాల్లో నేర్చుకోవడానికి వెళ్తున్నారు. ● ఖానాపూర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.న్యూస్రీల్రెమ్యునరేషన్ చెల్లించాలి లక్ష్మణచాంద: గత నవంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వేను జిల్లాలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు విజయవంతం చేసి జిల్లాను మొదటి వరుసలో ఉంచారని, అయినా వారికి రెమ్యునరేషన్ చెల్లించలేదని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శంకర్, అశోక్ పేర్కొన్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే రెమ్యునరేషన్ విడుదల చేయాలని కోరారు. -
పీఎంశ్రీతో ఐసీడీఎస్ నిర్వీర్యం
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ ● రెండో రోజు కొనసాగిన అంగన్వాడీల ఆందోళననిర్మల్చైన్గేట్: ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తలపెట్టిన 48 గంటల మహాధర్నా రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో అంగన్వాడీలు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి సామూహిక భోజనాలు చేశారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టరేట్ ప్రాంగణంలో బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ప్రతీనెల ఒకటో తారీకు జీతాలు, ఎండాకాలంలో మే నెల మొత్తం సెలవులు ప్రకటించాలన్నారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రవర్తిస్తుందన్నారు. ఐసీడీఎస్‌కు వ్యతిరేకంగా కేంద్రం చేసిన నిర్ణయాలకు రాష్ట్రంలో అమలు చేయాలని చూడడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయంతో పేద ప్రజలకు, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు తీవ్రమైన నష్టం కలిగించాయన్నారు. ఎన్ఈపీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. మొబైల్ అంగన్వాడీ సెంటర్ రద్దుచేసి ఐసీడీ సేవలు పాత పద్ధతిలో కొనసాగించాలని కోరారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం పర్మిట్ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టో పొందుపర్చిన హామీల ప్రకారం మినీ టీచర్ నుంచి మెయిన్ టీచర్‌గా పదోన్నతి పొందిన అంగన్వాడీ టీచర్లకు పది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. కార్యక్రమంలో అంగన్వాడీ యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లలిత, జిల్లా కోశాధికారి శైలజ, జిల్లా ఉపాధ్యక్షులు గంగామణి, రజియా విజయ, ప్రసాద, భాగ్య,వనజ, జిల్లా సహాయ కార్యదర్శి, భాగ్య, రేష్మ, విజయ, వందన, దేవిక లావణ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 9,129 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. వీరికోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల ప్రశ్న, జవాబు పత్రాల తరలింపు సమయంలో పోలీసు భద్రతను, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించాలని, ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రహరీ లేని పరీక్ష కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా పరీక్షల సమయానికి తగ్గట్లుగా ఆయా మార్గాల్లో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలి.. అనంతరం పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షలను రాయబోవు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసే విధంగా వారిలో మానసికస్థైర్యం నింపాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో పి.రామారావు, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, డీఎంహెచ్‌వో రాజేందర్, విద్యుత్ శాఖ డీఈ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ అధికారులు పద్మ, లింబాద్రి, ప్రవీణ్ పాల్గొన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాగునీటి సమస్య, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కూలీలకు ఉపాధి పనులు తదితర అంశాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, షెడ్యూల్ ప్రకారం ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని సూచించారు. బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. పశువులకు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చేతి పంపులు, బోరు బావులకు మరమ్మతులు చేయించాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నమూనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాల గుర్తింపును వెంటనే పూర్తిచేయాలన్నారు. జాబ్‌కార్డు కలిగివున్న ప్రతీ ఒక్కరికీ ఉపాధి కల్పించాలన్నారు. ఎండలు అధికంగా ఉన్నందున, ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాలలో టెంట్లను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈజీఎస్ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టాలన్నారు. అనంతరం పలు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ మాట్లాడుతూ ఆయా మండలాల పరిధిల్లోని ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. ప్రజలు దరఖాస్తులు చేసుకున్న ఆదాయ, కుల, నివాస తదితర ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం చేయొద్దని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ -
భవన నిర్మాణ కార్మికులకు వర్క్‌షాప్
నిర్మల్‌ఖిల్లా: జిల్లాలో భవన నిర్మాణరంగం కార్మికులకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కల్పించాలని పలువురు కార్మిక సంఘ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జాతీయ భవన నిర్మాణం అకాడమీ, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆరు రోజుల వర్క్‌షాప్‌ను మంగళవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా గృహ నిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రవాసీమిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల మాట్లాడుతూ.. భవన నిర్మాణరంగంలో స్థానిక మేసీ్త్రలు, కార్మికులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో అవకాశం కల్పించాలని సూచించారు. స్థానిక కార్మికులు, మేసీ్త్రలకు నైపుణ్య శిక్షణ అందిస్తూ తక్కువ ఖర్చుతో స్థానిక వనరులను వినియోగించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టవచ్చని సూచించారు. మరో అతిథి అసిస్టెంట్ ఇంజనీర్ హెచ్ఏ.షరీఫ్ మాట్లాడుతూ.. స్థానిక కార్మికులకు శిక్షణ ద్వారా నిర్మాణ కొలతలు, మౌలిక ఇంజనీరింగ్ సామర్థ్యాలను నేర్చుకుని న్యాక్ సంస్థ ద్వారా ధ్రువీకరణ పత్రం పొందితే భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు రమేశ్, మహేశ్, జిల్లాకు చెందిన పలువురు మేసీ్త్రలు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరికీ టీషర్టులు, బ్యాగులు, హెల్మెట్లు అందించారు. జాతీయ నిర్మాణ సంస్థ, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు -
నూతన భవనం అందుబాటులోకి తేవాలి
●ఖానాపూర్ మండలం బాదన్‌కుర్తి గ్రామంలో ఎంపీ యూపీఎస్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. భవనం పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంతో విద్యార్థులను తల్లిదండ్రులు బడి మాన్పిస్తున్నారు. గతేడాది పాఠశాలలో 117 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది కేవలం 34 మందికి పరిమితమైంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల మరో భవనంలో బాత్రూంలు, కిచెన్, ప్రహరీ నిర్మాణాలు వెంటనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలి. – బాదన్‌కుర్తి, గ్రామస్తులు -
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్
కుంటాల: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌సెర్చ్ నిర్వహించనున్నట్లు భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమా ర్ తెలిపారు. మండలంలోని లింబా(కె)గ్రామంలో సోమవారం కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఇంటింటా సోదాలు చేశారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడారు. ఆన్లైన్ మోసాల నేపథ్యంలో ప్రజలు సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అపరి చిత వ్యక్తులకు బ్యాంకు వివరాలు చెప్పవద్దని సూ చించారు. ప్రతీ వాహనదారుడు ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు పెడతామన్నారు. మహిళలకు భద్రత, భరోసా కల్పించేందుకు ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీసు అక్క’కు శ్రీకారం చుట్టారని తెలి పారు. తనిఖీల్లో 82 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకోగా మీసేవ ద్వారా చలాన్లు చెల్లించిన వాహనాలు అప్పగించారు. భైంసా రూరల్ సీఐ నైలు, ఎస్సైలు భాస్కరాచారి, రవీందర్, ఏఎస్సైలు జీవన్‌రావు, దేవన్న, పోలీసులు పాల్గొన్నారు. -
ఎండలతో జాగ్రత్త
● కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్‌చైన్‌గేట్: ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలను చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. వడదెబ్బతో అనారోగ్యానికి గురై ఆస్పత్రులకు వచ్చే రోగులకు మందులు, సైలెన్ బాటిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొయ్యబొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి వనాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న డీఆర్డీవో విజయలక్ష్మిని అభినందించారు. తర్వాత జిల్లా అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్టీల్ వాటర్ బాటిళ్లను కలెక్టర్ అధికారులకు అందజేశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించడంలో భాగంగా స్టీల్ బాటిళ్లు వాడకాన్ని ప్రోత్సహించిన అధికారులను అభినందించారు. విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. తానూరు మండలం బోరిగామ గ్రామంలో రెవెన్యూ ఉద్యోగిపై దాడి ఘటనను ఖండించారు. ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. -
నిర్మల్
ఊపందుకున్న ‘ఉపాధి’ ఉన్న ఊరిలోనే నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో కేంద్రం అమలు చేస్తున్న ఉపాధిహామీ సత్ఫలితాలిస్తోంది. మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 20259లోu ఎన్వోసీ ఇప్పించాలి.. మా కుమారుడు రామిళ్ల ఉదయకుమార్ నిర్మల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ కోర్సును 2011 నుంచి 2013 వరకు చదివాడు. చదువు మధ్యలో నిలిపివేసి మళ్లీ కొనసాగించి కోర్సును పూర్తి చేశాడు. అనంతరం బీఎఫ్ఏ యానిమేషన్ కోర్సును జెఎన్ఎఫ్ఏవీఈఏస్, హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. గతంలో చదివిన ఈఈఈ మొదటి సంవత్సరం ఫీజు బకాయి ఉన్నందున నేను డీడీవో కోడ్ 040–1240 2015 డబ్ల్యూ5ఏస్ చలాన నంబర్ రూ 3800 చలాన్ నం. 6403504732 మీద రూ 2600 గత డిసెంబర్ 31న చెల్లించాను. దీనికి సంబంధించిన చలాన్ పత్రాలు కార్యాలయంలో అందజేశాను. ఇప్పుడు వెళ్లి అడిగితే ఆ ఫైల్ పోయింది అంటున్నారు. మూడు నెలలుగా తిప్పించుకుంటున్నారు. ఎన్వోసీ సర్టిఫికెట్ అందిస్తేనే మా బాబు ఎంతో కష్టపడి చదివిన బీఎఫ్ఏ సర్టిఫికెట్ పొందే అవకాశం ఉంది. – రమేశ్, కడెం ఆన్లైన్ బెట్టింగుల జోలికి వెళ్లొద్దు ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్ టౌన్: ఆన్లైన్ బెట్టింగ్‌లు, గేమింగ్ల జోలికి వెళ్లొద్దని ఎస్పీ జానకీ షర్మిల జిల్లా ప్రజలకు సూచించారు. యువత, విద్యార్థులు బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు అలవాటుపడి సైబర్ ఉచ్చులో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెట్టింగ్, గేమింగ్ ఆడినా, ప్రోత్సహించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నిర్మల్‌చైన్‌గేట్: గ్రామ, మండలస్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే న్యాయం జరుగుతుందని, త్వరగా పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వస్తున్నారు. ఆరోజు పనులు మానుకుని.. అర్జీలు చేత పట్టుకుని.. గంటల తరబడి క్యూలో నిలబడి కలెక్టర్‌కు దరఖాస్తులు అందిస్తున్నారు. ఇక సమస్య తీరినట్లే అని ఇళ్లకు వెళ్తున్నారు. కానీ, రోజులు గడుస్తున్నా.. దరఖాస్తుపై ఉలుకు పలుకు ఉండడం లేదు. దీంతో మళ్లీ కలెక్టరేట్‌కు మరో దరఖాస్తు పట్టుకుని వస్తున్నారు. అర్జీల పరిష్కారంలో అధికారుల అలసత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తిరిగి తిరిగి విసిగిపోయిన బాధితుల గోడు వినడం.. ఇచ్చిన దరఖాస్తులు తీసుకోవడమే తప్ప సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇచ్చిన వినతులు అధికారులు తీసుకుని ఆన్లైన్ చేసి సంబంధిత శాఖ అధికారులకు పంపించడంతో కలెక్టరేట్ అధికారుల పని పూర్తవుతోంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు క్షేత్రస్థాయిలో పరిష్కారం అయిందా.. లేదా అన్న విషయంపై సమీక్ష లేకపోవడంతో గ్రీవెన్స్ మొక్కుబడిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ నెలలో ఇచ్చిన అర్జీ పరిష్కారం కాక.. మళ్లీ మూడు నెలల తర్వాత బాధితుడు మళ్లీ ప్రజావాణికి రావడం చూస్తే సమస్యల పరిష్కారం ఎంత వేగంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రతీ వారం కిటకిటే.. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఇందులో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. మండల స్థాయిలో తమ గోడు వెల్లబోసుకున్నా పరిష్కారం కాని సమస్యలపై బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ సోమవారం ప్రజావాణి కిటకిటలాడుతోంది. వందల అర్జీలు వస్తున్నాయి. కొన్నింటిని వెంటనే పరిష్కరిస్తున్న ఉన్నతాధికారులు.. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన వాటిని ఆయా మండలాలకు పంపుతున్నారు. అయితే అక్కడికి వెళ్లే దరఖాస్తులు త్వరగా పరిష్కారం కావడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. చేసేదేమీలేక మళ్లీ ఉన్నతాధికారులకు సమస్యను నివేదించేందుకు వస్తున్నామని చెబుతున్నారు. పెండింగ్‌లో 251 అర్జీలు.. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి సంబంధించి ఇప్పటి వరకు 70 శాఖల పరిధిలో 251 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు సోమవారం మరో 86 అర్జీలు అధికారులు స్వీకరించారు. ముఖ్యంగా విద్యాశాఖలో 14, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిర్మల్ శాఖలో 14, సూపరింటెండెంట్ ఈ సెక్షన్లో 10, సూపరింటెండెంట్ డి సెక్షన్లో 9, నిర్మల్ రూరల్ తహసీల్దార్ వద్ద 9, డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో 8, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద 8, నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్ 8, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 8, లోకేశ్వరం తహసీల్దార్ 8, ముధోల్ తహసీల్దార్ 8, తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 8, కుభీర్ తహసీల్దార్ 7, టీఎస్ ఎన్పీడీసీఎల్ 7, జిల్లా వ్యవసాయ అధికారి 6, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి 6, జిల్లా పంచాయతీ అధికారి 6, దేవాదాయ శాఖ 6, ఖానాపూర్ తహసీల్దార్ 6, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ 5, నిర్మల్ అర్బన్ తహసీల్దార్‌లో 5 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజావాణిలో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు దాడిపై కేసు నమోదు ఖానాపూర్: పట్టణంలోని మహాత్మాజ్యోతి బాపూలే జూనియర్ కళాశాల వసతి గృహంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి తరుణ్‌పై దాడి చేసిన సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సీఐ అజయ్, ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. వాలీబాల్ విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని దాడిచేసిన సీనియర్ విద్యార్థి తనయ్తోపాటు అతని స్నేహితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇఫ్తార్మంగళ : 6:22సహర్బుధ : 5:05న్యూస్రీల్త్వరగా పరిష్కరించాలి.. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్, రైతు రుణమాఫీ వంటి సమస్యలను పరిష్కరించాలని 86 అర్జీలను సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరుచాలన్నారు. దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న బాధితులు బాధ్యులపై చర్య తీసుకోవాలి.. నా భార్య తొండకూరి స్వరూపను రెండో కాన్పు నిమిత్తం జనవరి 30న జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో అడ్మిట్ చేశాను. అదేరోజు వైద్యులు శస్త్రచికిత్స చేస్తే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 4న డిశ్చార్జ్ చేశారు. కుట్లు విడిపించిన తర్వాత చీము వచ్చి పొట్ట భాగం ఉబ్బింది. ఆస్పత్రికి పలుసార్లు తీసుకువచ్చి చూపించాను. సీటీ స్కాన్ తీసి ప్రాబ్లం లేదని చెప్పారు. తర్వాత నాభార్య తీవ్ర కడుపు నొప్పి రావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరీక్షలు చేసి డెలివరీ సమమంలో నిర్లక్ష్యం కారణంగా కడుపులో ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ అందించారు. నిజాన్ని దాచి నా భార్యకు ప్రాబ్లం లేదని చెప్పిన బాధ్యులపై చర్య తీసుకోవాలి. – టి.శ్రీకాంత్, జఫ్రాపూర్ -
ఇల్లు కూల్చారని నిరవధిక దీక్ష
● కలెక్టరేట్ ఎదుట బాధిత కుటుంబం నిరసన నిర్మల్‌చైన్‌గేట్: భూ పోరాటం చేసి సాధించుకున్న భూమిలో నిర్మించుకున్న గుడిసెను అటవీ అధికారులు అక్రమంగా కూల్చారని ఓ కుటుంబం కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్షకు దిగింది. ఖానాపూర్ మండలం రంగపేట్ పంచాయతీ పరిధిలోని కొత్తగూడెంలో గోనె స్వామి, ఆయన కూతురు గోనె మల్లీశ్వరి భూపోరాటం ద్వారా 20 ఏళ్ల క్రితం ఆటవీ స్థలం ఆక్రమించుకున్నారు. అక్కడే గుడిసె వేసుకున్నారు. గ్రామపంచాయతీ ఇంటి నంబర్ కూడా మంజూరు చేసింది. 2005 నుంచి 2009 వరకు గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను చెల్లించారు. ఇక 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో కొంతమేర నిర్మాణం చేశారు. పంచాయతీ రోడ్డు సౌకర్యం కూడా కల్పించింది. ఇన్నేళ్ల తర్వాత అటవీ శాఖ గోనె స్వామి, ఆయన కూతురు మల్లీశ్వరికి అటవీ స్థలంలో ఇల్లు కట్టుకున్నారని, తొలగించాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. రెండుసార్లు(జనవరి 16, ఫిబ్రవరి 12న)నోటీసులు ఇచ్చిన అటవీ అధికారులు, మార్చి 7న ఇంటిని కూల్చివేశారు. దీంతో తండ్రీ కూతురు నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి రోడ్డు పక్కన చెట్టు నీడన ఉంటున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గేటు ఎదుట సోమవారం దీక్ష చేపట్టారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కలెక్టరేట్ గేటు వదిలి వెళ్లబోమని తెలిపారు. ఈమేరకు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినట్లు వెల్లడించారు. స్పందించిన కలెక్టర్ డీఎఫ్‌వోతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. వీరి దీక్షకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్, జిల్లా నాయకులు సింగరి వెంకటేశ్, ఖానాపూర్ డివిజన్ నాయకులు దుర్గం లింగన్న, గూట్ల ప్రసాద్, గోనె స్వామి, గోగు శేఖర్, రేగుల గంగన్న, మచ్చ కై లాస్, మాన్క శ్రీనివాస్, గోగు భూమక్క, గూట్ల రజిత, నైతం లింగు బాయి, సంఘీభావం తెలిపారు. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. గాలిలో తేమశాతం తగ్గుతుంది. దీంతో మధ్యాహ్నం వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. ఉద్యోగం ఇప్పించండి నేను పుట్టుకతోనే దివ్యాంగుడిని. కాళ్లు పనిచేయవు. ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాను. ఇటీవల మెడికల్ కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్లో వార్డు అటెండెంట్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకున్నాను. నా వైకల్యాన్ని గుర్తించి దివ్యాంగుల కోటాలో ఉద్యోగం ఇప్పించి ఆదుకోండి. – సుంకే రాకేష్, నిర్మల్ రైతుబీమా రావడం లేదు.. మా నాన్న తడగొండ రాజన్న ఫిబ్రవరి 21న మరణించారు. ఆయనకు కొత్తపేట మండలంలో ఖాతా నంబర్ 532లో వ్యవసాయ భూమి ఉంది. మరణానంతరం రావాల్సిన రైతుబీమా మంజూరు కాలేదు. గతవారం కలెక్టరేట్ లో దరఖాస్తు చేసుకున్నాను. వారం రోజులు అయినా ఫలితం లేకపోయేసరికి మరోమారు వచ్చాను. ఇప్పుడు అధికారులు మా నాన్న పేరు మీద ఇన్సూరెన్స్ కవర్ కాలేదని.. బీమా రాదని చెబుతున్నారు. అధికారులు మా సమస్య పరిష్కరించి బీమా సొమ్ము అందజేయాలి. – భవాని, కొత్తపేట, ఖానాపూర్ -
అంగన్వాడీల పోరుబాట
● 48 గంటల మహా ధర్నా షురూ.. ● తొలిరోజు ఆర్డీవో కార్యాలయం ఎదుట వంటావార్పు ● హామీలు నెరవేర్చాలని డిమాండ్ నిర్మల్‌చైన్‌గేట్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం రద్దు, ఐసీడీఎస్ పథకం ప్రారంభమై 50 ఏళ్లు అవుతున్నా.. సమస్యలు తీరడం లేదని అంగన్వాడీ టీచర్స్, మినీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలు పరిష్కరించి పర్మినెంట్ చేయాలని.. తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు పోరుబాట పట్టారు. నిర్మల్ ఆర్డీవో ఎదుట సోమవారం 48 గంటల ధర్నా ప్రారంభించారు. తమ సమస్యల పరిష్కారానికి 17, 18 తేదీల్లో అంగన్వాడీ సెంటర్ల బంద్ నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఆర్డీవో కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. రాత్రి అక్కడే నిద్రించారు. ఆశ వర్కర్ యూనియన్ అంగన్వాడీల ధర్నాకు మద్దతు తెలిపింది. ఆందోళనలో ఆశ వర్క ర్లు చంద్రకళ, భాగ్య, రామలక్ష్మి, అంగన్వాడీ యూ నియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లలిత, జిల్లా కోశాధికారి శైలజ, జిల్లా ఉపాధ్యక్షులు గంగామణి, రజియా విజయ, ప్రసాద, భాగ్య, వనజ, జిల్లా సహాయ కార్యదర్శి, భాగ్య, రేష్మ, విజయ, వందన, దేవిక లావణ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు. రాత్రి శిబిరంలోనే నిద్రిస్తున్న అంగన్వాడీ టీచర్లు -
అభివృద్ధి పనులకు రూ.1.12 కోట్లు
భైంసాటౌన్: నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.1.12 కోట్లు మంజూరైనట్లు భైంసా ఏఎంసీ చైర్మన్ సింధే ఆనంద్‌రావు పటేల్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రి సీతక్కను గతంలో కోరినట్లు తెలిపారు. ఈ మేరకు రూ.1.12కోట్ల నిధులు మంజూరు చేస్తూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 27 పనులకు నిధులు మంజూరు చేసినందుకు మంత్రి సీతక్క, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
సత్ఫలితాలిస్తున్న ‘పోలీస్ అక్క’
భైంసాటౌన్: మహిళా కానిస్టేబుళ్లకు పెట్రోకార్, ఎ మర్జెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల చేపట్టిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలిస్తోంది. ఇందులో భాగంగా భైంసా పట్టణంలో శనివారం పెట్రోకార్ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఓ మహిళ ప్రాణాన్ని కాపాడారు. వివరాలు.. పట్టణంలోని బోయిగల్లికి చెందిన తాండ్రోల్ల రుక్మాబాయి (55)ని ఆమె భర్త పోశెట్టి ఇంట్లో ఏ పని చేయడం లేదని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో అక్కడున్న కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పెట్రోకార్ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు సంగీత, అనిత సకాలంలో చేరుకుని ఆమెను అడ్డుకున్నారు. అనంతరం ఆమె కొడుకు భీమేశ్‌కు అప్పగించారు. అలాగే ఆమె భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మహిళను కాపాడిన కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. -
పద్యకవికి తెలుగుసాహితీ పురస్కారం
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌కు చెందిన పద్యకవి, వ్యాఖ్యా త, ఉపన్యాసకులు, సంస్కతభాషా ప్రచార సమితి ఉమ్మడి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు బీ వెంకట్ డాక్టర్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అవార్డు–2025ను అందుకున్నారు. శనివారం ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ సంస్థ, ఇందిరా ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హిమాయత్నగర్లోగల సారెగ స్టూడియోలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ చైర్మన్, డాక్టర్ ఆలూరి విల్సన్, సినీ నటుడు పసునూరి శ్రీనివాస్, సిటీ సివిల్ కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ డాక్టర్ పీవీపీ అంజనీకుమారి, ఆర్ట్ ఫౌండేషన్ అధ్యక్షురాలు గాయని డాక్టర్ ఎన్ ఇందిరా చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఇదే వేదికపై నిర్వహించిన కవి సమ్మేళనంలో ‘నేటి సమాజానికి ఆదర్శ మహిళలు’ అంశపై వెంకట్ రాగయుక్తంగా తెలుగు పద్యాలను ఆలపించారు. వివిధ తెలుగు సాహిత్య సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ అవార్డు వచ్చినట్లు ఈ సందర్భంగా వెంకట్ తెలిపారు. వెంకట్ మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంస్కృత, తెలుగు భాషల్లో సాహితీసేవలందిస్తున్నారు. నిర్మల్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక, నిర్మలభారతి సభ్యులు, జిల్లాకు చెందిన సాహితీవేత్తలు వెంకట్‌ను అభినందించారు. -
వాతావరణం
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వా తావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం ప్రకా శవంతంగా కనిపిస్తుంది. చలి తగ్గుతుంది. నిమ్మనాయుడు చేతుల మీదుగా ఏర్పడి, ఎంతోమంది రాజుల పాలనలో మినీ ఓరుగల్లుగా పేరొందాను. వందలఏళ్లు రాజసాన్ని చాటాను. మరిప్పుడు.. ఆ రాజసమేది..!? ఘనమైన చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న ఆనాటి కోటలు, గఢ్‌లు, కందకాలు, బావులు, బగీచాలను ఏంచేస్తున్నారు..!? ఇష్టారీతిన కూలగొట్టేస్తూ.. మట్టితో కప్పేస్తూ.. కబ్జాలు పెట్టి ఇళ్లు, దుకా ణాలు కట్టేస్తున్నారు. అరె.. ఇవి రాజులకాలం నాటి గుర్తులు కదా.. వాటిని కాస్త అభివృద్ధి చేస్తే పర్యాటకంగా బాగుంటాయన్న కనీస సోయి కూడా లేదా..!? మీ ఇళ్లల్లో తాతముత్తాల ఫొటోలన్నీ వరుసగా ఉన్నాయి. మరి.. నిమ్మనాయుడు మొదలు నాటి రాజులు, ప్రాణ త్యాగం చేసిన రాంజీసహా వెయ్యిమంది వీరుల గుర్తులు, ఆనవాళ్లు కూడా మిగల్చరా..!? ‘రాజ’సం ఎక్కడుంది.. -
సత్ఫలితాలిస్తున్న ‘పోలీస్ అక్క’
భైంసాటౌన్: మహిళా కానిస్టేబుళ్లకు పెట్రోకార్, ఎ మర్జెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల చేపట్టిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలిస్తోంది. ఇందులో భాగంగా భైంసా పట్టణంలో శనివారం పెట్రోకార్ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఓ మహిళ ప్రాణాన్ని కాపాడారు. వివరాలు.. పట్టణంలోని బోయిగల్లికి చెందిన తాండ్రోల్ల రుక్మాబాయి (55)ని ఆమె భర్త పోశెట్టి ఇంట్లో ఏ పని చేయడం లేదని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో అక్కడున్న కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పెట్రోకార్ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు సంగీత, అనిత సకాలంలో చేరుకుని ఆమెను అడ్డుకున్నారు. అనంతరం ఆమె కొడుకు భీమేశ్‌కు అప్పగించారు. అలాగే ఆమె భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మహిళను కాపాడిన కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. -
ఘనంగా కాన్షీరాం జయంతి
నిర్మల్ టౌన్: బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆరాధ్య దైవం కాన్షీరామ్ అని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకుడు భూమేశ్ పేర్కొన్నారు. శనివారం కాన్షీరాం జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం ఎదుట ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మా ట్లాడుతూ.. 15 శాతం ఉన్న అగ్రకులాలే దేశంలోని భూమి, సంపద, రాజకీయ అధికారాలను అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన అంబేడ్కర్ అడుగుజాడల్లో కాన్షీరాం ముందుకు సాగారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కల్లూరు సుధాకర్, రాజు, కుందూరు వినోద్, కత్తి శేఖర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పిస్తున్న ధర్మసమాజ్ పార్టీ నాయకులు -
పద్యకవికి తెలుగుసాహితీ పురస్కారం
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌కు చెందిన పద్యకవి, వ్యాఖ్యా త, ఉపన్యాసకులు, సంస్కతభాషా ప్రచార సమితి ఉమ్మడి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు బీ వెంకట్ డాక్టర్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అవార్డు–2025ను అందుకున్నారు. శనివారం ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ సంస్థ, ఇందిరా ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హిమాయత్నగర్లోగల సారెగ స్టూడియోలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ చైర్మన్, డాక్టర్ ఆలూరి విల్సన్, సినీ నటుడు పసునూరి శ్రీనివాస్, సిటీ సివిల్ కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ డాక్టర్ పీవీపీ అంజనీకుమారి, ఆర్ట్ ఫౌండేషన్ అధ్యక్షురాలు గాయని డాక్టర్ ఎన్ ఇందిరా చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఇదే వేదికపై నిర్వహించిన కవి సమ్మేళనంలో ‘నేటి సమాజానికి ఆదర్శ మహిళలు’ అంశపై వెంకట్ రాగయుక్తంగా తెలుగు పద్యాలను ఆలపించారు. వివిధ తెలుగు సాహిత్య సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ అవార్డు వచ్చినట్లు ఈ సందర్భంగా వెంకట్ తెలిపారు. వెంకట్ మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంస్కృత, తెలుగు భాషల్లో సాహితీసేవలందిస్తున్నారు. నిర్మల్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక, నిర్మలభారతి సభ్యులు, జిల్లాకు చెందిన సాహితీవేత్తలు వెంకట్‌ను అభినందించారు. -
నేను.. మీ నిర్మల్‌ను..
పశుగ్రాసం కొరత జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాడి రైతులను పశుగ్రాసం కొరత వేధిస్తోంది. బోధన్, మహా రాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక ధర వెచ్చించి చొప్ప, వరిగడ్డి దిగుమతి చేసుకుంటున్నారు. ‘‘నేనంటే మీకిష్టమేనా..!? అసలు.. మీ ఊరిని మీరు ఇష్టపడుతున్నారా..!? ఏంటి.. ఇలా అడుగుతోంది..? అని అనుకోకండి. ఏళ్లుగా చూస్తున్నా మీలో ఏమైన మార్పువస్తుందేమోనని. ఊహూ..! ఎక్కడా మార్పు కనిపించడం లేదు సరికదా.. మరింతగా నన్ను మీరు ద్వేషిస్తున్నారేమో అనిపిస్తోంది. ద్వేషం.. అనే పదం పెద్దదే కావొచ్చు. కానీ.. మనకు ఇష్టం లేనప్పుడే కదా ద్వేషిస్తాం. ఇప్పుడు నాపై మీరు చూపుతున్న తీరు ఇలాగే ఉంది మరి. ఆదివారం పూట.. ఈ సోదంతా మాకెందుకు.. అనుకుంటున్నారు కదా. అందుకే నేరుగా విషయానికొస్తా. మీరు ఇష్టపడే ప్రతీదాన్ని మీరు ఎంత బాగా చూసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. అది ఇల్లు కావచ్చు, కారు కావచ్చు.. కుటుంబమూ కావచ్చు. అలాంటప్పుడు.. మీకు ఇష్టమైన, మీకు జన్మస్థానమైన నన్ను మాత్రం దారుణంగా చూస్తున్నారు. పైకి మాత్రం ‘మేం నిర్మలోళ్లంబై, మాది రాయల్ నిర్మల్, మా ఊరు మస్తుంటది, ఐ లవ్ నిర్మల్..’ అని బయట దోస్తులకు గొప్పలు చెబుతున్నరు. అసలు.. ఒక్కసారైనా మీరు ఉంటున్న ఊరిని సరిగ్గా చూశారా..!? కనీసం మీ గల్లీలు ఎలా ఉన్నాయో గమనించారా..!? ఎన్ని సమస్యల మధ్య సతమతమవుతున్నామో గుర్తించారా..!? ఇవన్నీ తెలిసి కూడా మీరంతా మౌనంగా ఉంటున్నారన్నదే నా బాధ. –నిర్మల్ సహర్సోమ : 5:07ఇఫ్తార్ఆది : 6:22 -
రైతు సంక్షేమానికి కృషి చేయాలి
కడెం: నూతనంగా నియమితులైన ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగెల భూషణ్ (భూమన్న), వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు శనివారం ఉట్నూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే బొజ్జు నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల అభివృద్ధికి పాటు పడాలని, రైతు లేనిదే దేశం లేదని, రైతులే దేశానికి వెన్నెముక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి సతీశ్‌రెడ్డి, బరుపటి రమేశ్‌వర్మ, మల్లేశ్‌యాదవ్, చంద్రశేఖర్, డైరెక్టర్లు యాదగిరి, జలజ, విఠల్, నారాయణ, నాయకులు వాజీద్‌ఖాన్, రాజు, రమేశ్, ఆకుల లచ్చన్న, దేవందర్‌గౌడ్, రాజన్న తదితరులున్నారు. -
ఔదార్యం చాటిన విద్యార్థులు
మామడ: ఆపదలో ఉన్న వారికి జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థులు ఆర్థికసాయమందిస్తున్నారు. మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రేని భీమేశ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో మంచానికి పరిమతమయ్యాడు. విషయం తెలుసుకున్న జిల్లా కేంద్రంలోని శ్రీవిద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విరాళంగా కొంత నగదు సేకరించారు. పోతారం గ్రామానికి వెళ్లి బాధితుడికి నగదు, నిత్యావసరాలు అందించారు. ప్రతీనెల అనాథలు, ఆరోగ్యం బాగాలేని వారికి సాయం అందిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్యాంప్రకాశ్ తెలిపారు. -
పేరులోనే నిర్మలం..
● నేనంటే మీకెందుకు ఇష్టం లేదు? ● సమస్యలెందుకు పట్టించుకోరు? ● నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ● నా పేరెందుకు చెడగొడుతున్నారు? ● పాలకులు, ప్రజలను ప్రశ్నిస్తున్న పట్టణం నిర్మల్.. ఆహా నిమ్మలంగా ఎంతబాగుంది. కానీ.. ఏం లాభం. ఆ పేరులో మినహా ఊరిలో నిర్మలత్వం ఎక్కడుంది చెప్పండి. ఎప్పుడో వందలఏళ్ల క్రితం ఏర్పడ్డ చరిత్ర. అప్పుడెప్పుడో 1952లో మున్సిపాలిటీగా గుర్తించారు. అప్పటి ఊరి జనాభా పదివేల మంది. ఇప్పుడు లక్ష దాటిపోయి, రెండులక్షలకు దగ్గరవుతున్నారు. పెరిగిన జనాభాకు తగ్గట్లు వసతులు కల్పించారా..!? కనీసం ఇంతమంది జనాభాకు తగ్గట్లు బల్దియాలో కార్మికులు, ఉద్యోగుల సంఖ్య పెంచారా..!? సర్కారు నుంచి పట్టణం కోసం నిధులు తెస్తున్నారా..!? ఇవన్నీ చేస్తే.. మరి గల్లీలన్నీ ఎందుకిట్ల గలీజుగా కనిపిస్తున్నాయో చెప్పండి. మీరు గాంధీచౌక్కే పోతారో.. బుధవార్పేట్కే వెళ్తారో.. ప్రియదర్శినినగర్లోనే తిరుగుతారో.. ఇంకే గల్లీలో తిరుగుతారో మీ ఇష్టం. ఎక్కడైనా కనీసం ఒక్క రోడ్డయినా సక్కగా ఉందా..! డ్రైనేజీ సిస్టం పక్కాగా ఉందా..! డ్రైనేజీల్లో నుంచి వెళ్లకుండా నల్లాపైపులైన్లు ఉన్నాయా..!? గల్లీల్లో మూలమలుపులు, సందు చివరలు చెత్తలేకుండా కనిపిస్తున్నాయా..! కనీసం దుమ్ముధూళీ లేకుండా ఏ ఒక్క రోడ్డయినా ఉందా..!? ఉట్టిగనే కాదు.. మీరే స్వయంగా చూసి చెప్పండి. -
ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన
లక్ష్మణచాంద మండలంలో.. లక్ష్మణచాంద: మండలంలోని బాబాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ, పార్పెల్లి మండల ప్రాథమిక పాఠశాలల్లో ఏఈ ఆధారిత విద్యాబోధనను ఎంఈవో అశోక్‌వర్మ శనివారం ప్రారంభించారు. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు బీ, సీ గ్రేడ్ల విద్యార్థులకు కృత్రిమ మేధా ద్వారా చేపడుతున్న బోధనను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీరోజు విద్యార్థులందరినీ గ్రూపులుగా విభజించి విషయాల వారీగా ఏఐ ఆధారిత విద్యాబోధన చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు ధర్మేంద్ర, కిష్టయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, నగేశ్, రాజన్న, నారాయణ, సీఆర్పీ సుధాకర్ పాల్గొన్నారు. నిర్మల్ రూరల్: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు ద్వారా ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, గణిత శాస్త్రంలోని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో 16 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రారంభించామని పేర్కొన్నారు. మూ డు నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఏఐ ఆధారిత విద్యా యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లు ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని గుర్తించి మెరుగుపరిచేందుకు దో హదం చేస్తాయని తెలిపారు. ఏఐ ఆధారిత యాప్ లు కథలు, వీడియోలు, ఆటల ద్వారా పిల్లల్లో చదవడం, లెక్కించడం మీద ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సును వినియోగించుకుని ప్రతీ విద్యార్థి ప్రాథమిక విద్యలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు. ప్రతీ విద్యార్థి ఆరోగ్యం, విద్య, ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టా లని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతీరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. ఆమె వెంట డీఈవో పీ రామారావు, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజేందర్, విద్యాశాఖ అధికారులు సలోని, ప్రవీణ్, లింబాద్రి, ఉపాధ్యాయుడు నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఏఈ ఆధారిత బోధన పరిశీలన -
అనభేరి ప్రభాకర్‌రావు సేవలు మరువలేనివి
ఖానాపూర్: పేదప్రజలు, పీడిత జనుల ఆర్తనాదాలను ఆపి బానిస బతుకులను రూపుమాపేందుకు అవతరించిన తెలంగాణ భగత్‌సింగ్ అనభేరి ప్రభాకర్‌రావు సేవలు మరువలేనివని సీపీఐఎంఎల్ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి నంది రామయ్య కొనియాడారు. పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతిభవనం ఆవరణలో ఎల్లాపి సంఘం నిర్మల్ డివిజన్ అధ్యక్షుడు పుప్పాల మురళి అధ్యక్షతన నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ జిల్లా పోలంపల్లికి చెందిన ప్రభాకర్‌రావు విద్యార్థి దశ నుంచే నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. పాలేర్ల పిల్లలకు చదువులు చెప్పించడంతోపాటు తన ఇంట్లో ఉండే పని మనుషులకు వివాహాలు చేసి వారి జీవితాల్లో స్వేచ్ఛ వెలుగులు నింపి సీ్త్ర జాతి గౌరవాన్ని కాపాడారని గుర్తు చేశారు. నేతన్నలను ఆకలిచావుల నుంచి తప్పించడంతో పాటు పటేల్, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. నిజాంకు సింహస్వప్నంలా మారి తెలంగాణ ప్రజల విముక్తికి ఉద్యమించిన అనభేరి విగ్రహాన్ని ట్యాంక్‌బాండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దయానంద్, అంకం రాజేందర్, నిమ్మల రమేశ్, గంగనర్సయ్య, గణపతిరావు, పడాల మోహన్‌రావు, పెరిక గంగాధర్, లక్ష్మీపతిగౌడ్, శ్రీనివాస్, కాంతారావు, భీంరావు, చందు, సతీశ్ తదితరులున్నారు. -
ముదురుతున్న ఎండలు
● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● భయాందోళనలో జిల్లా ప్రజలు ● అప్రమత్తతే మేలంటున్న డాక్టర్లు భైంసాటౌన్: మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జనాలు పగటివేళ బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే జాగ్రత్తలు పాటించి బయటకు వస్తున్నారు. ఓవైపు ఇంటర్ పరీక్షలు కొనసాగుతుండగా, మరోవైపు పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. పెరుగుతున్న ఎండల కారణంగా ఈనెల 15నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 40 డిగ్రీలకు చేరువగా.. జిల్లాలో ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండలు మొదలయ్యాయి. ఈనెల ప్రారంభంలో గరిష్ణ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు ఉండగా, శుక్రవారం అధికంగా 39.5 డిగ్రీలుగా నమోదైంది. దీంతో హోలీ పండుగ వేళ జనాలు ఎండకు భయపడి ఉదయమే వేడుక జరుపుకొని ఇళ్లకు చేరుకున్నారు. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్తలే మేలు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలో పనిచేసేవారు, ద్విచ క్ర వాహనాలపై దూర ప్రయాణాలు చేసేవారు వడదెబ్బ బారిన పడే ప్రమాదముందని పే ర్కొంటున్నారు. వడదెబ్బ బారిన పడితే కళ్లు తి రగడం, తీవ్రమైన తలనొప్పి, గుండెదడ, చెమటలు ఎక్కువగా పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఉంటుందని పేర్కొన్నారు. వడదెబ్బ బారిన పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వీలైనంత వరకు ఎండలో పనిచేయరాదని తెలిపారు. ఉదయం వేళల్లోనే పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు చేరాలని పేర్కొన్నారు. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవాలి. ఎండలో వెళ్లినప్పు డు రక్షణగా గొడుగు వాడాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. ప్రతీరోజు ఎక్కువ మోతా దులో నీటిని తీసుకోవాలి. పండ్ల రసాలు, కొ బ్బరి నీరు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. – ఎస్.కాశీనాథ్, ఏరియాస్పత్రి సూపరింటెండెంట్, భైంసా జిల్లాలో ఐదురోజుల ఉష్ణోగ్రతలు తేదీ గరిష్టం కనిష్టం 10 37.5 21.5 11 37.6 22.5 12 38.4 23.3 13 39 24 14 39.5 24.4 -
అంత్యక్రియలు
పోలీస్ జాగిలానికి నిర్మల్ టౌన్: జిల్లాలో పోలీస్‌శాఖకు విశేష సేవ లందించిన హంటర్ అనే జాగిలం గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ సందర్భంగా హంటర్‌కు పోలీస్ లాంఛనాలతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఎస్పీ జానకీ షర్మిల జాగిలానికి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ శాఖలో ఫిబ్రవరి 1, 2022 నుంచి నేర విభాగంలో విధులు నిర్వహిస్తూ పలు హత్యలు, చోరీ కేసులను ఛేదించడంలో హంటర్ సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐలు ప్రేమ్‌కుమార్, కృష్ణ, జాగిలం సంరక్షకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఖానాపూర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ మండలాధ్యక్షుడు టీ రాజగంగన్న, పట్టణాధ్యక్షుడు గౌరికార్ రాజు ఆధ్వర్యంలో శు క్రవారం స్థానిక జగన్నాథ్‌రావు చౌరస్తాలో ఆందోళన చేశారు. అంబేడ్కర్ చౌరస్తాలోని కూరగాయల మార్కెట్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాగా, దిష్టిబొమ్మ ద హనానికి అనుమతి లేకపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. నా యకులు అబ్దుల్ ఖలీల్, సుమన్, ప్రదీప్, గ జేందర్, శ్రావణ్, నరేందర్‌రెడ్డి, సుమిత్, చంద్రహాస్, షోయబ్, దివాకర్, మహిపాల్, మ హేందర్, వెంకటేశ్వర్రావు, రమేశ్, శ్రీనివాస్, లాజర్, శ్రీకాంత్, నరేశ్ తదితరులున్నారు. -
అటవీశాఖ అనుమతులు తీసుకోవాలి
● డీఎఫ్‌వో నాగిని భాను ● హరితవనం పరిశీలన ● అభివృద్ధిని అడ్డుకోవద్దని గ్రామస్తుల వినతి దస్తురాబాద్: అటవీశాఖ అనుమతులు ఉన్నప్పుడే అటవీశాఖ పరిధిలో పనులు చేపట్టేందుకు అంగీకరిస్తామని డీఎఫ్‌వో నాగిని భాను తెలిపారు. మండలంలోని దేవునిగూడెం గ్రామస్తులు కేసీఆర్ హరిత వనంలో మరో 200 చెట్లు నరికి వేశారు. అటవీ అధికారులు డీఎఫ్‌వోకు సమాచారం అందించారు. గురువారం దేవునిగూడెం చేరుకుని నరికివేసిన చెట్లను పరిశీలించారు. అటవీశాఖ పరిధిలో పనులు చేయాలంటే అనుమతులు తప్పనిసరి అన్నారు. నల్ల పోచమ్మ ఆలయం, రహదారి నిర్మాణం చేపట్టాలంటే ఆయా శాఖలైన దేవాదాయ, పంచాయతీరాజ్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనుమతి ఇస్తామన్నారు. చెట్లు నరికివేసినవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతులు ఇచ్చే వరకూ పోరాడుతాం.. గ్రామానికి కష్టపడి బీటీ రోడ్డు మంజూరు చేయించుకున్నామన్నారు. మంజూరైన రోడ్డును అడ్డుకోవడం సరికాదని గ్రామస్తులు అన్నారు. అనుమతులు, అంక్షల పేరుతో గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని కోరారు. అభివృద్ధికి అడ్డుగా ఉంటే ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ హరితవనాన్ని ధ్వంసం చేశామన్నారు. అటవీ అనుమతులు వచ్చే వరకు పోరాడుతామని తెలిపారు. జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. గ్రామస్తులతో మాట్లాడిన తహసీల్దార్...ఇదిలా ఉంటే దేవునిగూడెం గ్రామస్తులతో తహసీల్దార్ సర్ఫరాజ్ నవాజ్ మాట్లాడారు. హరిత వనంలో చెట్లు నరికివేయడం సరికాదని పేర్కొన్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. మండలం పరిధిలో 5,300 ఎకరాల్లో రెవెన్యూ, అటవీశాఖ పరిధిలో వివాదాస్పద భూమి ఉందని, రెండు శాఖలు సంయుక్తంగా సర్వే చేస్తేనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గ్రామస్తుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో భవానీశంకర్, డిప్యూటీ తహసీల్దార్ యాదవరావ్, కడెం, ఖానాపూర్, పెంబి, మమాడ, నిర్మల్ అటవీ అధికారలు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. -
● జిల్లాలో ఎన్నో రంగులు.. ● ఇప్పటికీ ‘వెలుగులు’లేని ఊళ్లు ● దారులు చూడని పల్లెలు ● అభివృద్ధి పట్టని పాలకులు ● ఇలా.. ఇంకెన్ని హోలీలో..!?
నిర్మల్: రంగులు లేని జీవితం ఉండదు. మనసును బట్టి మనిషి రంగు మారుతుంది. కొన్నిసార్లు ఆ మనిషి ఎంచుకునే రంగులూ తనేంటో చెబుతాయట. గట్ల(ఘాట్)కింద, గంగ(గోదావరి) ఇవతల ఉన్న మన జిల్లాలోనూ ఎన్నో రంగులున్నయ్. కల్లాకపటం తెలియని పల్లె మనుషుల మనసంతా తెలుపైతే.. అలాంటి కొన్ని పల్లెలు ఇప్పటికీ వెలుగును చూడకపోవడం నలుపే. తాము ఎంతటి దుస్థితిలో ఉంటున్నా ప్రశ్నించలేని ప్రశాంతత నీలమైతే.. తట్టుకోలేక తన్నుకొచ్చిన చైతన్యం ఎరుపవుతుంది. ఇలా ఎన్నోరంగులను తనలో ఇముడ్చుకున్న జిల్లాలో ఎన్ని హోలీపండుగలు వెళ్లిపోతున్నా.. ఇప్పటికీ ‘రంగులలోకం’ చూడని అడవిబిడ్డలూ ఉండటం శోచనీయమే. హోలీ పండుగవేళ సప్తవర్ణాల్లో జిల్లా.. ఎలా ఉందంటే.. తెలుపు..నల్లరేగడి నేలలు పర్చుకున్న జిల్లాలో ‘తెల్ల’బంగారం పండుతోంది. ఇప్పటికీ సగానికిపైగా జిల్లాకు అదే పెద్ద దిక్కవుతోంది. ఇప్పుడంటే మైసా(భైంసా)లో మిల్లులు తగ్గిపోయాయి కానీ.. ఒకప్పుడు కనుచూపు మేరంతా ‘కాటన్’ సంచులు నిండిన ఎడ్లబండ్లే ఉండేవి. ‘బాపూ.. కాలేజీల ఫీజు కట్టాలటనే..’అని పట్నంలో చదువుతున్న కొడుకు అడిగితే.. ‘ఆగు బిడ్డా.. రేపు మైసాకు పోయచ్చినంక పైసల్ పంపిస్త..’ అనేవాళ్లు. ఇక ఇదే జిల్లాలో ఇంకోదిక్కు.. తెల్లటి మనసున్న అడవి బిడ్డలు ఉన్నారు. ఎన్నికష్టాలున్నా.. ఏ ‘రంగులు’ లేని స్వచ్ఛమైన నవ్వులతోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. నలుపు..జిల్లాలో ఇప్పటికీ ‘నల్లని ఊళ్లు’ ఉన్నాయి. నల్లని ఊళ్లా.. అవేంటి..!? అని ఆశ్చర్యపోవచ్చు. ఏ వెలుగూ లేకపోతే ఉండేది ‘నల్లటి’ చీకటే కదా..! ఇప్పటికీ జిల్లాలో కనీసం కరెంటు లేని ఊళ్లు, రోడ్లు లేని పల్లెలు ఉన్నాయి. ఎప్పుడో ఇచ్చిన సోలార్లైట్లు అప్పుడప్పుడు మిణుకుమిణుకు మంటుంటే.. ఆముదం పోసిన దీపాల వెలుగుల్లోనే జీవితాలు గడిపేస్తున్నారు. తరాలు గడిచిపోతున్నా.. చాకిరేవు, రాగిదుబ్బ, సోముగూడ, మిద్దెచింత ‘చీకట్లు’ తొలగడం లేదు. అంకెన, రాయదారి, కోరకంటి, వస్పెల్లి, ధోంధరి, గంగాపూర్, గండిగోపాల్పూర్, ఇస్లాంపూర్, అల్లంపెల్లి, బాబానాయక్‌తండా, కుసుంపూర్, చామన్‌పెల్లి, కొత్తగూడ, జిల్లెడుకుంట, పంగిడిచెరు, పెండల్దరిలకు ఇప్పటికీ సరైన దారీ లేదు. పసుపు..రంగుకే పేరు తెచ్చిన పసిడిపంట పసుపు. ఈ సీజన్లో నిర్మల్ డివిజన్లోని నీటి కాలువలు, చెరువులు ఉన్న పంట ఏరియాల వెంట వెళ్తూ ఉంటే.. ఉడకబెడుతున్న పసుపు వాసన ఆహా.. అనిపిస్తుంది. పక్కజిల్లాలో వచ్చిన పసుపుబోర్డు జిల్లా రైతులలో ఇంకా ఆశలు పెంచింది. కానీ ఇప్పటికిప్పుడు పసిడి లెక్క ధర పెరిగే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎరుపు..‘ఎర్రటి’బొట్టు పెట్టుకున్న అమ్మలే జిల్లాకు పట్టుగొమ్మలు. అవును.. జిల్లా మహిళల ఖిల్లా. సీ్త్ర, పురుష జనాభా నిష్పత్తిపరంగా చూస్తే రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా అధిక మహిళానిష్పత్తితో ప్రథమస్థానంలో ఉంది. ప్రతీ వెయ్యిమంది పురుషులకు 1,046 మంది మహిళలు ఉన్నారు. ‘ఎరుపంటే’.. చైతన్యానికి ప్రతీక. జిల్లాలోనూ ఇప్పుడంతా మహిళల రాజ్యమే. కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, డీఆర్డీవో వంటి జిల్లా అధికారులే కాదు.. మండల, గ్రామస్థాయిలోనూ స్వయంశక్తితో సాధికారత సాధిస్తుందీ చైతన్యమూర్తులైన మహిళలే. ఆకుపచ్చ..జిల్లాలో ఓ దిక్కు తెల్లబంగారం మెరుస్తుంటే.. మరోవైపంతా.. ‘పచ్చదనమే’. నిర్మల్ జిల్లాకేంద్రం నుంచి అలా ఖానాపూర్, కడెంవైపు వెళ్తుంటే ఆకుపచ్చకోక కట్టిన అడవి అందాలు ఆకట్టుకుంటాయి. ఒక్కసారి గంగాపూర్ వాచ్‌టవర్ ఎక్కిచూస్తే ‘ఆహా..’ అనిపిస్తుంది. అలాంటి పచ్చదనం క్రమంగా తగ్గుతోంది. జిల్లాలో ఇప్పటికీ చెట్ల నరికివేత యథేచ్ఛగా సాగుతోంది. కలప అక్రమ రవాణా అలాగే ఉంది. నీలం..‘నీలి’వర్ణాన్ని నిండా నింపుకుని గలగల పారేటి గోదారమ్మ జిల్లాపొడవునా ‘సాగు’తోంది. ‘సరస్వతమ్మ’తో జలసిరులు సాగనంపుతూ అన్నదాతకు అండగా ఉంటోంది. ఓ దిక్కు స్వర్ణమ్మ, మరోదిక్కు కడెం, ఇంకోదిక్కు సుద్ధవాగులూ జిల్లాకు జీవం పోస్తున్నాయి. వరి, మొక్కజొన్న, జొన్న, పసుపు వంటి ఎన్నో పంటల సాగుతోపాటు జిల్లావాసులకు ‘భగీరథ’తో తాగునీటిని అందిస్తున్నాయి ఈ నీలివర్ణపు జలాలే. కాషాయం..జిల్లాలో ఇటీవల కాషాయవర్ణం మెరుస్తోంది. రాజకీయపరంగా బీజేపీని కాషాయంతో పోలుస్తుంటారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి బీజేపీ నిర్మల్, ముధోల్‌లో రెండు ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. ఎంపీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కాషాయపార్టీకి జిల్లానే అధిక్యతనిచ్చింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అధిక ఓట్లను కట్టబెట్టింది. ఇద్దరు ఎమ్మెల్యేలను, ఎంపీని, ఎమ్మెల్సీలనూ గెలిపించినా కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయపార్టీది జిల్లాపై శీతకన్నే. జిల్లా మీదుగా రైల్వేలైన్, నవోదయ, యూనివర్సిటీ వంటి ఎన్నో పనులను చేయాల్సి ఉన్నా.. కేవలం ‘కాషాయ’వర్ణాన్ని చూపి, మాయచేస్తోందన్న ఆరోపణలూ ఉన్నాయి. -
17నుంచి కుష్ఠువ్యాధి సర్వే
నిర్మల్‌చైన్‌గేట్: ఈనెల 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో చేపట్టే లేప్రసీ కేస్ డిటెక్షన్ కార్యక్రమం కొనసాగుతుందని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ తెలిపారు. జిల్లా వైద్య, ఆరో గ్య శాఖ అధికారి కార్యాలయంలో గురువా రం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే కుష్ఠు వ్యాధిని గుర్తించి చి కిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా, వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లి కుష్ఠు వ్యాధిని గుర్తించడానికి ప్రతి ఒక్కరినీ పరీక్షించడం జరుగుతుందన్నారు. జిల్లాలో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి లెప్రసీ కేసులు గుర్తించి చికిత్సలు అందించాలన్నారు. కార్యక్రమంలో కార్యక్ర మ నిర్వహణ అధికారి రవీందర్‌రెడ్డి, డిప్యూ టీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారే రవీందర్ డిప్యూటీ పీఎంవో రాజేశ్వర్, ఫిజి యోథెరపిస్ట్ కిషనరావు, వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షక అధికారులు పాల్గొన్నారు. -
పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ నిర్మల్‌చైన్‌గేట్: ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ సూచించారు. కలెక్టర్లు, ఈఆర్వోలతో హైదరాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లతోపాటు ఈఆర్వోలు తమతమ స్థాయిలలో పొలిటికల్ పార్టీ మీటింగ్‌లు ఏర్పాటు చేసి అప్డేట్స్ అందించాలన్నారు. సమావేశాల తేదీ, సమయాన్ని ఖరారు చేస్తూ ముందస్తుగానే రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని తెలిపారు. సమావేశాల వివరాలను సీఈవో కార్యాలయానికి, గుర్తింపు పొందిన పార్టీల ప్రధాన కార్యాలయాలకు పంపించాలన్నారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్‌రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కౌట్ల(బి) అటవీ ప్రాంతంలో సమగ్ర జాబితా సర్వే
సారంగపూర్: మండలంలోని కౌట్ల(బి) అట వీ ప్రాంతంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏడీ సంపత్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంత అభివృద్ధి, పెరుగుతున్న మొక్కలు, తదితర సమ గ్ర జాబితా సర్వేను నిర్వహించారు. ఈసందర్భంగా అడవుల్లో అటవీశాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోపాటు అడవుల్లో పెరుగుతున్న వృక్షసంపద, గడ్డిజాతుల పెరుగుదల తదితర అంశాలను గురించి సర్వే చేపట్టారు. అటవీ సంపద పరిరక్షణలో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో నజీర్‌ఖాన్, కౌట్ల(బి) బీట్ అధికారి స్వప్న, సిబ్బంది పాల్గొన్నారు. -
● భక్తిశ్రద్ధలతో కామ దహనం ● పలుగ్రామాల్లో హోలీ ప్రారంభం ● పాఠశాలల్లో ముందస్తు పండుగ
నిర్మల్: ఆనంద కేళి రంగుల హోళి రానే వచ్చింది. చిన్నా, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రంగులు, సంతోషం, సామూహిక ఆనందం, మంచి చెడు మధ్య పోరాటాన్ని సూచిస్తుంది. ఈ పండుగ చలికాలానికి వీడ్కోలు చెప్పే వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. హోలీ బంధుత్వాలను, స్నేహాలను మరింత దగ్గర చేస్తుంది. వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచే పండుగ సందడి మొదలైంది. రాత్రి కామదహనం నిర్వహించారు. పలు గ్రామాల్లో కాముడు కాల్చగానే హోలీ పండుగను ప్రారంభించారు. రంగులు చల్లుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యాసంస్థల్లోనూ ముందస్తు హోలీ నిర్వహించారు. పండుగ విశేషాలను పిల్లలకు వివరించారు. ఇక జిల్లావ్యాప్తంగా శుక్రవారం హోలీ పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. కోలలు, కొప్పుల సందడి..హోలీ పండుగ వస్తుందంటే గ్రామాల్లో హనుమాన్ ఆలయాలు, కూడళ్లవద్ద పెద్దలు, యువకులు అంతా కలిసి రాత్రిపూట కోలాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. లయబద్ధంగా పాటలు పాడుతూ ఒకరికొకరు కోలలు వేసుకుంటూ అలా చుట్టూ తిరుగుతుండటం ఆకట్టుకుంటుంది. జిల్లా కేంద్రంలోనూ బాగులవాడ, నగరేశ్వరవాడ, వెంకటాద్రిపేట, ద్యాగవాడ తదితర గల్లీల్లో ఇప్పటికీ కోలాలు వేస్తున్నారు. గురువారం రాత్రి కోలలు వేశారు. తరాలు మారుతున్నా ఇప్పటికీ జిల్లాలోని చాలా గ్రామాల్లో కోలలు, జడకొప్పులనూ వేయడం ఆనవాయితీగా సాగుతోంది.తానూరు మండలంలో కామదహనం కార్యక్రమంలో భాగంగా నృత్యం చేస్తున్న గ్రామస్తులు -
అటవీ అధికారుల తీరుపై నిరసన
ఖానాపూర్: మండలంలోని రంగపేట పంచాయతీ పరిధి కొత్తగూడెంలో నివాసం ఉంటున్న గోనె స్వా మి–మల్లీశ్వరి దంపతుల ఇంటిని అటవీశాఖ అధి కారులు అక్రమంగా, కక్షపూరితంగా కూల్చివేయడంపై సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. బాధ్యులపై చర్య తీ సుకోవాలని పార్టీ జిల్లా కార్యదర్శి జె.రాజు డిమాండ్ చేశారు. పట్టణంలోని అటవీ శాఖ డివిజన్ కార్యాలయం ముందు సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబీకులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ నిరుపేద గుడిసెను కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. గతంలో భూపోరాటం ద్వారా 40 కుటుంబాలు నివసిస్తుండగా అధికారులు బాధిత కుటుంబానికి అన్యాయం చేయడం సరికాదన్నారు. 2005 నుంచి 2009 వరకు ఇంటి పన్ను చెల్లించడంతోపా టు 2008లో ఇందిరమ్మ ఇంటిని సైతం నిర్మించార ని పేర్కొన్నారు. అనంతరం ఎఫ్‌డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్, దుర్గం లింగన్న, ప్రసాద్, స్వామి, శేఖర్, గంగన్న, కై లాస్, శ్రీనివాస్, చంద్రకళ, సావిత్రి ఉన్నారు. -
ఘనంగా మొల్లమాంబ జయంతి
నిర్మల్‌ఖిల్లా: తొలి తెలుగు మహిళా కవయిత్రి, మొల్లమాంబ 585వ జయంతి ఉత్సవాల ను జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ కూ డలిలోని విగ్రహం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా, పట్టణ కుమ్మర సంఘం, కుమ్మర ఉద్యోగుల సంక్షేమ సంఘం (కేవ) ఆధ్వర్యంలో మొల్లమాంబ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కుమ్మరుల ఆరాధ్య దైవం మొల్లమాంబ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని, కుమ్మరుల సంక్షేమం కొరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేపట్టాలని, కుమ్మరులను బీసీ–ఏలో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గంగాధర్, కేవా అధ్యక్షుడు తోడిశెట్టి పరమేశ్వర్, జిల్లా కోశాధికారి టి.శంకర్, కేవా ప్రధాన కార్యదర్శి పి.సాయన్న, తోడిశెట్టి రవి కాంత్, చంద్రయ్య, స్వామి, మధు సిలారి, నారాయణ, శ్యాంసుందర్, కృష్ణసాగర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు రాయితీ పొందాలి
భైంసాటౌన్: ఈ నెలాఖరులోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చె ల్లించి 25శాతం రాయితీ పొందాలని మున్సిపల్ క మిషనర్ రాజేశ్‌కుమార్ సూచించారు. బుధవారం తన కార్యాలయంలో దరఖాస్తుదారులు, రియల్టర్ల కు ఎల్ఆర్ఎస్పై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పట్టణంలో ఎల్ఆర్ఎస్ కోసం 6,288 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఎల్ఆర్ఎస్ రూపంలో రూ.2కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా యం రావాల్సి ఉందని వెల్లడించారు. బుధవారం 30మంది ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించగా, రూ.2.66 లక్షలు ఫీజు రూపంలో వచ్చినట్లు వివరించారు. -
పశుసంపదను పరిరక్షించాలి
నిర్మల్ టౌన్: దేశీయ పశుసంపదను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలని క్లీమామ్ గోశాల వ్యవస్థాపకురాలు, సేవ్ దేశీ కౌస్ క్యాంపెయినర్ అల్లోల దివ్యారెడ్డి కోరారు. బుధవారం తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. క్రాస్ బ్రీడింగ్‌తో దేశంలో అంతరించిపోయే దశకు చేరిన దేశవాళీ ఆవుల సంరక్షణకు చేస్తున్న క్యాంపెయినింగ్‌కు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. దేశవాళీ ఆవుల సంరక్షణకు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశవాళీ ఆవుల సంరక్షణకు చేస్తున్న మంచి కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని బీఆర్ నాయుడు పేర్కొన్నట్లు అల్లోల దివ్యారెడ్డి తెలిపారు. -
‘దేవాదాయ’ం.. గాల్లో దీపం!
నిర్మల్: ‘ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని చూస్తున్నారే గానీ.. దేవుడి చుట్టూ ఉన్న సమస్యలు పరిష్కరించడం లేదు..’ అంటూ దేవాదాయశాఖపై బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నా యి. జిల్లాలో పలు ఆలయాల్లో లోపాలను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతున్నారు. నేరుగా ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారుల నుంచి పెద్దగా స్పందన రావ డం లేదని భక్తులు వాపోతున్నారు. అభివృద్ధి ప నులు, వసతుల కల్పన అటుంచి.. కనీసం కరెంట్, తాగునీరు, అర్చకులు, సిబ్బందికి సకాలంలో వేతనాల విషయం కూడా పట్టించుకోకపోవడంపై వెల్లువలా ఆరోపణలు వస్తున్నాయి. గండిరామన్నకు కరెంట్ కట్ జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఒక్కటిగా వె లుగొందుతున్న నిర్మల్‌లోని గండిరామన్న దత్తసాయి ఆలయ ప్రాంగణంలో చీకట్లు ముసురుకున్నాయి. కొన్నినెలలుగా ఆలయం నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఇటీవల కరెంట్ కట్ చేయడంతో అర్చకులు, సిబ్బంది నివాస గృహాల్లో అంధకారం నెలకొంది. ఊరికి శివారు న, అటవీప్రాంతానికి సమీపంలో ఉండటంతో సంబంధిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గ డిపాయి. అధికారులు, పాలకవర్గం తీరుపై విమర్శలు రావడంతో విద్యుత్ అధికారులతో మాట్లా డి బిల్లులు చెల్లించకుండా, తాత్కాలికంగా కరెంట్ కనెక్షన్‌ను పునరుద్ధరింపజేశారు. బిల్లులు ఇవ్వకపోవడంతో.. ఆలయాల్లో అభివృద్ధి పనులకు దాతలు ముందు కు వచ్చి డబ్బు, వస్తు రూపంలో సహకరించడం సాధారణమే. వారిచ్చిన వాటితో అక్కడ పాలకవర్గం, అధికారుల సమన్వయంతో పనులు చేయిస్తుంటారు. ఆ పనులు చేసిన వారికి బిల్లుల రూ పంలో డబ్బులు చెల్లిస్తుంటారు. ఇది అంతటా జరిగేదే. కానీ.. గండిరామన్న ఆలయంలో చేసిన పనులకూ బిల్లులు ఇవ్వకపోవడంతో సంబంధిత వ్యక్తులు తాము చేసిన వస్తువులను తిరిగి తీసుకెళ్లడం గమనార్హం. సాయిబాబా ఆలయం పక్కన గల షెడ్డులో గల విగ్రహం వద్ద దాతల సహకా రంతో స్టీల్ రెయిలింగ్‌తో పనులు చేయించారు. ఈ పనులు చేసినవారికి డబ్బులు ఇవ్వకపోవడంతో వారు వాటిని తిరిగి తీసుకెళ్లడం జిల్లాకేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. భక్తులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేయడంతో రెయిలింగ్ పనులు మళ్లీ చేయించారు. ఇక్కట్లు దేవుడికెరుక ఏ కష్టం వచ్చినా అందరూ ‘దేవుడా.. నువ్వే ది క్కు..’ అంటుంటారు. అలాంటి ఆలయాల్లో ని త్యం దైవసేవలో ఉండే అర్చకులు, సిబ్బంది స మస్యలు మాత్రం దేవాదాయశాఖ పట్టించుకో వ డం లేదన్న ఆరోపణలున్నాయి. ఆలయాల్లో కాంట్రాక్ట్ సిబ్బంది, అర్చకులకు సకాలంలో వేతనా లు రావడం లేదు. అసలే అరకొరగా ఉన్న జీతా లు నెలలు గడిచినా రాక వారు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఆలయాల్లో భక్తులు ఇచ్చే వస్తుకానుకలనూ అధికారులు వారికి దక్కనివ్వడం లే దన్న ఆరోపణలున్నాయి. ఆలయాల్లో చేసే అన్నదానాల్లోనూ అవకతవకలు చోటుచేసుకుంటున్న ట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తులకు అందించే భోజనానికి, పెట్టే బిల్లులకు పొంతన ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులూ రెగ్యులర్‌గా రావడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. వీటితో పాటు పలు ఆలయాలు శిథిలావస్థకు చేరుతున్నా కనీసం పట్టించుకునేవారు లేరని భక్తులు వాపోతున్నారు. గండిరామన్న గుడిలో పవర్ కట్ చేసిన పనులకూ చెల్లింపుల్లేవ్ అధికారుల పర్యవేక్షణ అంతంతే -
నీటి కొరత రానివ్వొద్దు
మామడ: అటవీ ప్రాంతంలో జంతువులకు నీ టి వనరుల కొరత లేకుండా చర్యలు చేపట్టా లని బాసర సర్కిల్ సీసీఎఫ్ శర్వానంద్ సూచించారు. బుధవారం మామడ అటవీ క్షేత్ర పరి ధి లోని భీమన్న గుట్ట, ఆరేపల్లి అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీ టికుంటల నిర్మాణం, సాసర్పిట్లు, నీటిచెల్మ లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. నీటి కుంటల సమీపంలో కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి వనరుల వద్దకు వచ్చే నీలుగాయి, సాంబర్, జింక తదితర అట వీ జంతువులు, పక్షులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎఫ్‌వో నాగినిభాను, ఎఫ్ ఆర్వో రాథోడ్ అవినాశ్, ఎఫ్ఎస్వో ప్రభాకర్, ఎఫ్‌బీవోలు రమేశ్, మౌనిక ఉన్నారు. -
నిధులు కేటాయించాలి
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ నగర కార్యదర్శి మేస్తిర సాయికుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. గత బడ్జెట్లో 7శాతం నిధులే కేటాయించి ఆ మొత్తాన్ని కూ డా పూర్తిగా విడుదల చేయకపోవడంతో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ రాక పేద విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశా రు. విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయిస్తేనే విద్యావ్యవస్థ గాడిలో పడుతుందని తెలి పారు. నాయకులు తేజ, శేఖర్, సాయిప్రసాద్, అజయ్, గణేశ్, సందీప్ పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
భైంసాటౌన్: బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ జానకీ షర్మిల అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్‌కుమార్, రూరల్ సీఐ నైలు, ఎస్సై అశోక్, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. కళ్లను కాపాడుకోవాలినిర్మల్: కళ్లను కాపాడుకుంటేనే జీవితాన్ని చూడగలుగుతామని ప్రముఖ కంటివైద్యుడు కృష్ణంరాజు తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఆ దర్శనగర్ శిశుమందిర్‌లో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వి ద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. డాక్టర్ స తీశ్ చెవి, వినికిడి, మాట పరీక్షలు, డాక్టర్ ప్ర వీణ్ జనరల్ చెకప్ చేసి మందులు అందించా రు. విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువుపై దృష్టిపెట్టాలన్నారు. ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాల ను కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో శిశుమందిర్ జిల్లా కార్యదర్శి షోలాపూర్ రాజేశ్వర్, శైక్షణిక్ ప్ర ముఖ్ కలిమహంతి వేణుమాధవ్, సాదు జ నార్దన్‌రెడ్డి, పుష్పలత తదితరులున్నారు. -
● పసిడి పంటకు దక్కని ‘మద్దతు’ ● బోర్డు వచ్చినా అందని ఫలితం ● పెట్టుబడి ఖర్చులూ రాని వైనం ● భారీగా నష్టపోతున్న రైతాంగం
లక్ష్మణచాందలో సాగు చేసిన పసుపు పంటలక్ష్మణచాంద: ఆరుగాలం కష్టపడి పసుపు సాగు చేసిన జిల్లా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన అన్నదాతలకు దిగుబడి బాగా తగ్గింది. వచ్చిన కాస్త పంట అమ్ముకుందామనుకుంటే ప్రస్తుతం మార్కెట్లో ధర లేదు. పొరుగు జిల్లా నిజామాబాద్‌లో ఇటీవల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాకు చెందిన పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. బోర్డు ఏర్పాటుతో పసుపు పంటకు గిట్టుబాటు ధర వస్తుందని భావించారు. కానీ.. పసుపు బోర్డు ఏర్పాటైనా అక్కడ కూడా పంటకు సరైన ధర లేక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సాగు ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఈసారి సుమారు 5,500 ఎకరాల్లో పసుపు సాగు చేసినట్లు జిల్లా ఉద్యానవన అధికారి బీవీ రమణ తెలిపారు. గతేడాది 15వేల ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి సాగు విస్తీర్ణం ఘననీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది సాగు ప్రారంభ దశలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో పంటపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ.. తరువాత క్రమంలో పంటకు వివిధ తెగుళ్లు సోకాయి. ప్రధానంగా దుంప కుళ్లు, మర్రి ఆకు తెగుళ్లు సోకగా పంట దెబ్బతిని దిగుబడి ఘననీయంగా తగ్గింది. ఎకరాకు కనీసం 15 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చులు ధీర్ఘకాలిక (9 నెలలు) పంట అయిన పసుపు సాగు కు పెట్టుబడి కూడా ఎక్కువేనని రైతులు చెబుతున్నారు. ఎకరం సాగుకు కనీసం రెండు లారీల పశువుల ఎరువు అవసరముంటుందని తెలిపారు. ఇందుకు రూ.60వేలు, కలుపు తీతకు కూలీలు, రసాయన ఎరువులకు కలిపి రూ.25 వేలు, పసుపు తవ్వకం, ఉడకబెట్టడం కోసం మరో రూ.30 వేలు.. ఇలా మొత్తంగా ఎకరా సాగుకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చయినట్లు రైతులు చెబుతున్నారు. గతేడాది పలికిన ధరే ఈసారి ఉంటుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. పడిపోతున్న ధర గతేడాది క్వింటాల్ పసుపు పంటకు రూ.16వేల నుంచి రూ.17వేల వరకు ధర ఉంది. ఇది రైతులు ఆశించిన ధరే కావడంతో అప్పుడు గిట్టుబాటైంది. ప్రస్తుతం నిజామాబాద్‌లో క్వింటాల్ పసుపు పంటకు రూ.7వేల నుంచి రూ.10వేల వరకు మాత్రమే ధర ఉంది. దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో సాగు వివరాలుగతేడాది సాగు : 15వేల ఎకరాలు ఈ ఏడాది.. : 5,500 ఎకరాలు ఎకరాకు పెట్టుబడి : రూ.లక్ష–రూ.లక్షన్నర గతేడాది ధర : రూ.16వేలు–రూ.17వేలు ప్రస్తుత ధర : రూ.7వేలు–రూ.10వేలు -
ఉపాధి పనుల్లో నిబంధనలు పాటించాలి
భైంసారూరల్: నిబంధనల మేరకే ఉపాధిహామీ పనులు చేపట్టాలని, కొలతల్లో తేడాలుంటే ఉపేక్షించబోమని డీఆర్డీవో విజయలక్ష్మి హెచ్చరించారు. బుధవారం భైంసా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధిహామీ పనులపై 15వ బహిరంగ విచారణ చేపట్టారు. మండలంలోని 30 గ్రామపంచాయతీల పరిధిలో చేపట్టిన పనులపై చర్చించారు. సామాజిక తనిఖీ బృందాలతో చేయించిన పనులు వివరాలు తెలుసుకున్నారు. కూలీలతో కలిసి సామాజిక తనిఖీ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఇంటింటికీ వెళ్లి కూలీలను కలిసి వివరాలు సేకరించారు. గ్రామాల వారీగా సేకరించిన వివరాలను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభ నిర్వహించి వెల్లడించారు. గ్రామపంచాయతీల్లో నాటిన మొక్కలు చనిపోవడం, పని ప్రదేశాల్లో నేమ్‌బోర్డులు పెట్టకపోవడం, మస్టర్లలో కూలీల సంతకాలు లేకున్నా వేతనాలు చెల్లించడం లాంటి అంశాలను ప్రజావేదికలో డీఆర్పీలు వెల్లడించారు. 2023–24 సంవత్సరంలో రూ.7.50కోట్లతో చేపట్టిన పనుల్లో కొన్ని లోపాలను గుర్తించారు. పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు విధులను నిర్లక్ష్యం చేస్తూ రికార్డులను సరిగా నిర్వహించకపోవడాన్ని బయటపెట్టారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన సిబ్బంది నుంచి రూ.35వేలు రికవరీ, రూ.4వేల జరిమానా విధించారు. రానున్న రోజుల్లో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు సమష్టిగా పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్, జేక్యూసీ కృపాకర్, ఎస్సార్పీ రాజు, ఎంపీడీవోలు సుధాకర్‌రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, ఏపీవో శివలింగం, ఈసీ రాజ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఎఫ్ఏలున్నారు. -
వైద్యురాలు శృతికి సన్మానం
మంచిర్యాలటౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పు రస్కరించుకొని మంగళవారం పట్టణంలోని వైశ్యభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన మహిళలను మంచిర్యాల వాసవీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన బర్త్రూట్ ఆస్పత్రి వైద్యురాలు శృతి గోలిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవీ వనిత క్లబ్ అధ్యక్షురాలు మల్యాల సంగీత, సెక్రటరి కే.గాయత్రి, కోశాధికారి గుండా సునీత, పలువురు మహిళలు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతిభైంసారూరల్: మండలంలోని కోతల్గాం గ్రామానికి చెందిన రైతు పోలబోయిన భోజన్న(62) విద్యుత్ షాక్‌తో మంగళవారం మృతి చెందినట్లు సీఐ నైలు తెలిపారు. గ్రామానికి చెందిన భోజన్న అడవి జంతువుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు విద్యుత్ తీగలు అమర్చాడు. ఎప్పటిలాగే మంగళవారం రైతు తన పంటపొలంలోకి వెళ్లగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ఐదుగురు జూదరుల అరెస్టుఆదిలాబాద్టౌన్(జైనథ్): భోరజ్ మండలంలోని గిమ్మ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపారు. గండ్రత్ సతీష్, అయిండ్ల కిరణ్ కుమార్, కందుల సాయికృష్ణ, జి సతీష్, ఎన్ రాకేష్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 52 పేక ముక్కలు, రూ. 43,290 నగదును సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్ అనే మరో వ్యక్తి పరారయ్యాడన్నారు. భైంసాలో బైక్ చోరీ భైంసాటౌన్: పట్టణంలో చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుస చోరీలు పట్టణ వాసులను కలవరపెడుతున్నాయి. తాజాగా పట్టణంలోని గాంధీగంజ్ ప్రాంతంలో బైక్ చోరీకి గురైంది. సీఐ జీ. గోపినాథ్ కథనం ప్రకారం.. మండలంలోని హంపోలికి చెందిన ఊరే సుభాష్ పట్టణంలో ప్రైవే ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం దుకాణం ఎదుట బైక్ నిలిపి ఉంచాడు. సాయంత్రం కనిపించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4, 5వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన వర్డ్ పవర్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూపీసీ)రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ పోటీల్లో స్పెల్లింగ్, రీడింగ్, అర్థం రౌండ్ల అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేశారు. 4వ తరగతి నుండి ఆడే విజయ్‌కుమార్ (నిర్మల్), యశ్వంత్ (ఆసిఫాబాద్), రాజేశ్ (ఆసిఫాబాద్), కోట్నాక్ కళ్యాణ్ (ఆసిఫాబాద్), కుర్సెంగ వినోద్ (ఆసిఫాబాద్) విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 5వ తరగతి నుండి కృష్ణ ధృవ (ఆసిఫాబాద్), తొడసం వైష్ణవి(ఆదిలాబాద్), మడావి వరలక్ష్మి (ఆదిలాబాద్), రాథోడ్ బాలాజీ(నిర్మల్), లక్ష్మణ్‌చౌదరి (నిర్మల్), కిరణ్ రాథోడ్ (ఆసిఫాబాద్) జిల్లాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. విజేతలకు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏసీఎంవో జగన్, విభా ఫౌండేషన్ సీనియర్ ప్రొగ్రాం మేనేజర్ వీరనారాయణ పాల్గొన్నారు. -
భారీగా టేకు చెట్లు నరికివేత
ఇచ్చోడ: సిరిచెల్మ అటవీ ప్రాంతంలోని ఫకీర్‌పేట్ బీట్‌లో టేకు చెట్లు స్మగ్లర్ల చేతిలో నరికివేతకు గురవుతున్నాయి. టేకుచెట్లను నరికి సైజులుగా మార్చి బైక్‌లపై తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మాన్కపూర్ వద్ద చెక్‌పోస్టు ఉన్నప్పటికీ కలప తరలించుకుపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిరిచెల్మలో టైగర్‌జోన్ అటవీ అధికారి క్యాంపు కార్యాలయం, ఫకీర్‌పేట్ వద్ద బెస్ క్యాంపులు ఉన్నాయి. వీటికి సమీపంలోనే టేకుచెట్లు నరికివేతకు గురికావడం అటవీశాఖ పనితీరుకు అద్దం పడుతోంది. దీనిపై టైగర్‌జోన్ ఎఫ్ఆర్వో నాగవత్ స్వామిని ‘సాక్షి’ వివరణ కోరగా టేకు చెట్లు నరికినట్లు తమదృష్టికి వచ్చిందని, చెట్లు నరికిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
నిర్మల్
జోరుగా.. హుషారుగా..గ్యారంటీల అమలులో విఫలం ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం: 6:21గురువారం: 5:108లోu బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025సిక్స్ కొడుతున్న ఉద్యోగిని జిల్లా కేంద్రంలో గత శనివారం నుంచి నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు కొండాపూర్ సమీపంలోని స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వివిధ శాఖల మహిళా ఉద్యోగులు జోరుగా, హుషారుగా పాల్గొన్నారు. వివిధ క్రీడల్లో సత్తా చాటారు. క్రికెట్, టెన్నిస్ మ్యూజికల్ చైర్తోపాటు వివిధ ఇండోర్ ఆటల్లోనూ తమ నైపుణ్యం ప్రదర్శించారు. సాయంత్రం నృత్యం చేశారు. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో రత్న కళ్యాణి, డీఎస్డీవో శ్రీకాంత్‌రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. – నిర్మల్‌చైన్‌గేట్/సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్వాతావరణం ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. చలి ప్రభావం చాలావరకు తగ్గుతుంది. తెల్లవారుజాము చల్లగా ఉంటుంది. -
ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దు
అంకితభావంతో విధులు నిర్వహించాలి ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్‌టౌన్: పోలీస్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకీషర్మిల సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నిర్మల్ సబ్ డివిజన్ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. 5ఎస్ అమలు చేయాలని తెలిపారు. ఠాణా పరిధిలో ఏ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఉన్న సీడీ ఫైల్స్‌ను పరిశీలించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజల సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైం రేటు తగ్గించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఎస్పీ వెంట నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్సై లింబాద్రి ఉన్నారు. భైంసాటౌన్: నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. పట్టణంలోని జీఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉష కింద రూ.3.97 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పీఎం ఉష కింద డిగ్రీ కళాశాలకు రూ.5 కోట్లు మంజూరయ్యాయని, వీటిలో రూ.3.97 కోట్లతో 12 అదనపు తరగతి గదులు, విద్యార్థులకు మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. త్వరలోనే కళాశాలలో పీజీ తరగతులు ప్రారంభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంగాధర్, తూమోల్ల దత్తాత్రి, సిరం సుష్మారెడ్డి, ఈడబ్ల్యూఐడీ ఈఈ అశోక్‌కుమార్, డీఈఈ గంగాధర్, కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కడెం: మండలంలో సదర్మాట్ ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు అందక ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిపై ఈనెల 5న ‘పంట తడికి..కంటతడి’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం మండలంలోని కొత్తమద్దిపడగ శివారులో ఎండిన పొలాలను పరిశీలించారు. యాసంగిలో ఏయో పంటలు సాగు చేస్తున్నారో రైతులను అడిగి తెలుసుకున్నా రు. సాగునీరు అందక ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దని సూచించారు. ఏప్రిల్ చివరి వరకు సదర్మాట్ చివరి ఆయకట్టుకు వరకు సాగు నీరందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఏవో అంజిప్రసాద్, ఈఈ విఠల్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, ఎంపీవో కవిరాజు, రైతులు ఉన్నారు. నిర్మాణం నాణ్యతగా చేపట్టాలి ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఏప్రిల్ చివరి వరకు సాగు నీరందించాలని ఆదేశం -
● ‘భగీరథ’ నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు కరువు ● కొన్నిచోట్ల సరఫరా కాక.. బోరు నీరే దిక్కు ● నిర్మల్‌లో రంగుమారిన నీరు సరఫరా
ఈ చిత్రం నిర్మల్ జిల్లాకేంద్రంలోని గొల్లపేటలోనిది. మిషన్ భగీరథ నల్లాల ద్వారా ఇలా రంగు మారిన నీరు వస్తోంది. పట్టణంలో చాలా కాలనీలకు కలుషిత నీరే సరఫరా అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో దుర్వాసన కూడా వస్తోంది. ఈ నీటిని తాగడానికి పట్టణవాసులు భయపడుతున్నారు. ఇతర అవసరాలకు వినియోగించి.. తాగునీటిని కొనుక్కుంటున్నారు. ఈ చిత్రం భైంసా పట్టణంలోని రాహుల్నగర్లోనిది. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు నీరు రాలేదని కాలనీవాసులు తెలిపారు. దీంతో మున్సిపల్ బోరు మోటార్ నీటినే తాగునీటితోపాటు ఇంటి అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. వేసవికి ముందే తాగునీటికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. మరోవైపు పట్టణాల్లో లీకేజీలతో నీరు వృథా అవుతోంది. కొన్ని కాలనీల్లో ప్రజలు నీటిని వృథా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో తాగునీటి పరిస్థితి తెలుసుకునేందుకు ‘సాక్షి’ మంగళవారం విజిట్ చేసింది. ప్రస్తుతానికి పెద్దగా సమస్య లేకపోయినా.. నీటి వృథాతో రాబోయే రోజుల్లో వ్యథ తప్పేలా లేదు. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినా, నల్లాలకు ఆన్/ఆఫ్ బిగించకపోవడంతో నీటి సరఫరా సమయంలో వృథాగా వదిలేస్తున్నారు. దీంతో 30 శాతం వరకు నీరు వృథా అవుతోంది. ఇంకా కొన్నిచోట్ల నల్లా కనెక్షన్ ఉన్నా ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. మున్సిపల్ బోర్ల సహాయంతో నీటిని అందిస్తున్నారు. పేదలు బోరు నీటినే తాగుతున్నారు.నిర్మల్‌లో కలుషిత నీరు.. నిర్మల్‌టౌన్: నిర్మల్ మున్సిపాలిటీలో నీటి సమస్య పెద్దగా లేకున్నా.. చాలాచోట్ల లీకేజీలు ఉన్నాయి. ఈ కారణంగా తాగునీరు కలుషితమవుతోంది. పలు కాలనీల్లో రంగు మారుతుండటంతో స్థానికులు నీటిని తాగడం లేదు. 42 వార్డులకుగాను 39 వార్డుల్లో ప్రతీరోజు మంచినీటి సరఫరా అవుతోంది. బుధవార్‌పేట్, గాజుల్పేట్, వైఎస్సార్ కాలనీలో రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. మొత్తం 21,800 నల్లా కలెక్షన్లు ఉండగా, 174 మోటర్లు ఉన్నాయి. కార్మికులు 116 మంది అవసరం ఉండగా.. 70 మంది మాత్రమే ఉన్నారు. మాటేగావ్ నుంచి 1.5 మిలియన్ లీటర్లు తక్కువగా సరఫరా అవుతుండడంతో, మూడు వార్డుల్లో సమస్య వస్తోంది. భైంసాలో వృథా.. భైంసాటౌన్:భైంసా పట్టణంలో 26 వార్డులుండగా, 12,900 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు అన్నివార్డుల్లో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు పూర్తిచేశారు. కానీ, ౖపైపెన పైపులు వేయడంతో వాహనాల రాకపోకలతో అవి పగిలిపోయి లీకవుతున్నాయి. నల్లాలకు ఆన్/ఆఫ్ బిగించకపోవడంతో కొందరు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. చాలాచోట్ల ఆన్ఆఫ్ లేక నీరు వృథాగా పోతోంది. కొన్ని కాలనీలకు ఇప్పటికీ భగీరథ నీరు రావడం లేదు. భట్టిగల్లి, భాగ్యనగర్, రాహుల్‌నగర్, తదితర కాలనీల్లో మున్సిపల్ బోరు నీటినే వినియోగిస్తున్నారు. కొన్నిచోట్ల బోరు మోటార్లు కాలిపోతున్నాయి. మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, భట్టిగల్లిలో బోరుమోటారు చెడిపోయి కొద్దిరోజులు కావస్తున్నా మరమ్మతు చేయడం లేదని కాలనీవాసులు తెలిపారు. పట్టణంలో 170 కి.మీ మేర నల్లా నీటి పైప్‌లైన్ ఉండగా, స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద గల మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి రోజుకు 12 ఎంఎల్డీల నీటిని సరఫరా చేస్తున్నారు.బోరు నీరే దిక్కు.. మా కాలనీలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు వేశారు. కానీ, ఇప్పటివరకు నీరు సరఫరా చేయడం లేదు. మున్సిపల్ బోరు మోటారు ద్వారానే నీటిని అందిస్తున్నారు. బోరు నీటినే తాగుతున్నాం. – గోదావరి, రాహుల్‌నగర్, భైంసా భగీరథ రాలేదు.. మిషన్ భగీరథ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు నీరు సరఫరా కావడం లేదు. కాలనీలోని బోరు మోటారు నీటినే వాడుతున్నాం. తాగడానికి బోరు నీటినే వినియోగిస్తున్నాం. – నేహ, రాహుల్‌నగర్, భైంసా నీటి కొరత లేకుండా చర్యలు.. పట్టణంలో నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొన్నిరోజుల ముందు మిషన్ భగీరథ రంగు నీళ్లని టెస్టింగ్ చేయించాం. ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా పరిష్కరించాం. కొన్ని చోట్ల విద్యుత్ శాఖ మరమ్మతుల వల్ల పైపులైన్లు పడిపోయాయి. వాటికి కూడా మరమ్మతులు చేయించి సమస్య లేకుండా చూస్తున్నాం. – జగదీశ్వర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ అందని ‘భగీరథ’.. ఖానాపూర్:ఖానాపూర్ పట్టణంలో ఏటా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుతూనే ఉంది. ఈసారి మున్సిపల్ అధికారులు ముందస్తుగా ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నా.. కొన్ని కాలనీలకు పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. కొన్నిచోట్ల లీకేజీల కారణంగా నీరు కలుషితమవుతోంది. స్లమ్ ఏరియాలైన సుభాష్ నగర్‌తోపాటు డబుల్ బెడ్రూం కాలనీల్లో నీటి సమస్య ఉండడంతో ట్యాంకర్‌తో సరఫరా చేస్తున్నారు. పట్టణంలో 5,300 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అమృత్ పథకం కింద రూ.22 కోట్లతో పనులు కొనసాగుతున్నట్లు కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. -
అమ్మా.. నీ తప్పుకు నన్ను చంపేశావా?
‘అమ్మా.. ఇంకో మూడు నెలలైతే లోకం చూసేవాడిని కదమ్మా.. ఎందుకమ్మ ఇంత పనిచేశావు. నీ కడుపులో నన్ము మోయలేకపోయావా.. ఆరు నెలలుగా నీ కడుపులో హాయిగా పెరుగుతున్నా.. నీవు మింగిన మాత్రలకు నాకు ఊపిరి ఆడడం లేదమ్మా.. లోకం చూపించి అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది.. తెల ్లవారేసరికే నా ఊపిరి తీశావేంటమ్మా.. నీవు చేసిన తప్పుకు నన్ను బలి ఇచ్చావా..’ గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ వాగులో పడేసిన పిండానికి మాటలు వస్తే ఇలాగే ప్రశ్నించేదేమో. క్షణికావేశంలో చేసిన తప్పుకు గర్భం దాల్చిన ఓ యువతి.. బయటి ప్రపంచానికి ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల గర్భంలోనే పిండాన్ని చంపేశారు. ఈ హృదయ విదారక సంఘటన గురుజ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మంగళవారం ఉదయం గ్రామ శివారులోని వాగు ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన కొందరు గ్రామస్తులకు మృత శిశువు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. స్థానికులు అందించిన వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువతి, ఇద్దరు యువకులతోపాటు ఆర్ఎంపీని అదుపులోని తీసుకున్నట్లు తెలిసింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఓ యువతి.. ఆరు నెలల గర్భాన్ని తీయించుకునేందుకు ఆర్ఎంపీని ఆశ్రయించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి గ్రామంలో తిరిగిన సదరు ఆర్ఎంపీ ప్రాణాపాయమని తెలిసినా.. ఆరు నెలల గర్భాన్ని తొలగించారు. ఆ పిండాన్ని ఇలా వాగులో పడేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు పూర్తి కానందున పూర్తి వివరాలు బుధవారం అందిస్తామని సీఐ భీమేష్ తెలిపారు. మృత శిశువును పరీక్షించిన వైద్యులు మగ శిశువుగా నిర్ధారించారు. పిండం వయస్సు సుమారు 6 నెలలు దాటి ఉండవచ్చని సమాచారం. గురుజలో ఆరు నెలల పిండం కడుపులోనే చంపి.. వాగులో పడేసి.. విచారణ జరుపుతున్న పోలీసులు... -
‘ఎల్ఆర్ఎస్’లో 25 శాతం రాయితీ●
నిర్మల్‌చైన్‌గేట్:రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించిందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తుల పరిష్కారంపై పంచాయతీ, మున్సిపల్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 31వ తేదీలోపు పూర్తి ఫీజు చెల్లించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 46 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు, లోకల్ టీవీ ఛానెళ్లలో ప్రచారం చేయాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టాం టాం వేయించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, రాజేశ్‌కుమార్, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. మాస్ కాపీయింగ్ దూరంగా ఉండాలిసోన్: పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు దూరంగా ఉండాలని, సొంతంగా పరీక్షలు రాయాలని డీఈవో రామారావు సూచించారు. మండలంలోని మాదాపూర్ ఉ న్నత పాఠశాలను మంగళవారం సందర్శించా రు. తొమ్మిది, పది తరగతి విద్యార్థుల గ్రేడ్లపై సమీక్షించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా 9వ తరగతి విద్యార్థుల ఎల్ఈపీ ప్రగతి, నివేదికలను సమీక్షించారు. పదో తరగతి విద్యార్థులను ఒక్కొక్కరిని పిలిచి వారి ప్రగతి అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఎన్ని రోజులు, ఎన్ని గంటలు పాఠశాలకు వ చ్చారని, అందులో ఎన్ని గంటలు పరీక్షలు రా స్తున్నారు విద్యార్థులను అడిగి తెలుసుకున్నా రు. సబ్జెక్టుల వారీగా సిలబస్ గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని సూ చించారు. 9, 10 తరగతి విద్యార్థులు సాధించిన మార్కులు గ్రేడ్లను డిస్ప్లే చేయాలని ఉపాధ్యాయులకు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 471 మంది గైర్హాజర్ నిర్మల్ రూరల్: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియెట్ పరీక్షలకు 471 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 7,343 మంది విద్యార్థులకు 6,872 మంది హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో 6,501 మందికి 6,139 మంది హాజరవగా, 362 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో 842 మంది విద్యార్థులకు 733 మంది హాజరవగా, 109 మంది గైర్హాజర్ అయ్యారని డీఐఈవో పరశురాం తెలిపారు. -
‘సైబర్’ కుట్ర భగ్నం
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరాలకు పాల్పడాలనే భా రీ కుట్రను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు భగ్నం చే శారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను టూటౌన్, సై బర్క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మొ బైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ద్విచక్ర వాహనాలు, మొబైల్ బ్యాటరీలను స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఒకరు పరారీలో ఉండగా, ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్పీ అఖిల్ మ హాజన్ మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హె డ్క్వార్టర్లోని సమావేశ మందిరంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బిహార్ రాష్ట్రంలోని కాతిహర్ జిల్లా హతియదిర గ్రామానికి చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి దేశ వ్యాప్తంగా సై బర్ నేరాలకు పాల్పడడానికి కుట్ర పన్నినట్లు తెలి పారు. ఇందులో ఏ–1గా ఉన్న తబారక్ మిగతా ఐదు గురిని బైక్‌లపై తెలంగాణ రాష్ట్రానికి పంపించాడు. వారు పాత మొబైళ్లు తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తామంటూ పట్టణాలు, పల్లెల్లో తిరిగారు. పా త మొబైళ్లు సిమ్‌కార్డు, బ్యాటరీలను సేకరించారు. వాటిద్వారా వివిధ రాష్ట్రాల్లోని ప్రజలకు బ్యాంక్ అధికారులంటూ ఫోన్ చేసి సైబర్ బారిన పడే వి ధంగా కుట్ర పన్నారు. వారి కుట్రను ఆదిలాబాద్ పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులు మహ్మద్ మెరాజుల్, మహెబూబ్ ఆలం, మహ్మద్ జమాల్, ఎండీ ఉజీర్, అబ్దుల్లాను అరెస్టు చేయగా ఏ–1 నిందితుడు తబారక్ పరారీలో ఉన్న ట్లు తెలిపారు. అరెస్టయిన వారి వద్ద నుంచి 2,125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, ఐదు ద్విచక్ర వాహనాలతో పాటు వారు వినియోగించే మొబైల్ ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలను స్వాఽ దీనం చేసుకుని టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కుట్ర భగ్నం చేసిన సై బర్ డీఎస్పీ హసీబుల్లా, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌ను ఎస్పీ అభినందించారు. ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులపై కేసు పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు 2,125 పాత మొబైళ్లు, 107 సిమ్ కార్డులు, 600 మొబైల్ బ్యాటరీలు, 5 వాహనాలు సీజ్ వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్