
● రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ● మూడు విడుతల్లో
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాలోని 18 మండలాల్లో 400 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సోమవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ క్షణం నుంచే ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 157 ఎంపీటీసీ, 18 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 400 గ్రామ పంచాయతీలు, 3,368 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం..
జిల్లాల్లోని 18 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో మూడు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నా రు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ వి డుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఎన్నికల కమిషనర్ తెలిపారు.
మొదటి విడత జరిగే ఎంపీటీసీ,
జెడ్పీటీసీల మండలాలు
మండలం ఎంపీటీసీల సంఖ్య ఓటర్లు
ఖానాపూర్ 8 23,658
పెంబి 5 10,886
కడెం 10 29,159
దస్తూరాబాద్ 5 12,894
మామడ 9 26,072
లక్ష్మణచాంద 9 24,577
నిర్మల్ 7 22,751
సోన్ 8 21,801
సారంగాపూర్ 14 39,516
రెండవ విడత జరిగే ఎంపీటీసీ,
జెడ్పీటీసీల మండలాలు
మండలం ఎంపీటీసీల సంఖ్య ఓటర్లు
దిలావర్‌పూర్ 6 18,744
నర్సాపూర్(జి) 7 20,238
లోకేశ్వరం 10 29,359
కుంటాల 7 19,055
భైంసా 11 33,970
కుభీర్ 14 40,625
తానూర్ 11 31,516
ముధోల్ 10 28,754
బాసర 6 15,728