
వచ్చింది 12.. పోయింది 11
భైంసాటౌన్: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ఇన్‌ఫ్లో అంచనా వేస్తూ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈసారి జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్ట్‌కు ఏకంగా 12టీఎంసీ లకు పైగా వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1.83 టీఎంసీలు (358.70 మీట ర్లు) కాగా, దాదాపు పదింతల నీరు చేరింది. ఇప్పటివరకు 11.461 టీఎంసీలను దిగువకు వదిలారు.
ఈసారి భారీగా ఇన్‌ఫ్లో
గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌కు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే వరదనీరు వచ్చి చేరుతోంది. ఈసారి జూన్ నుంచి ఆగస్టు 15వరకు సరైన వర్షాలు లేక ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకో లేదు. అనంతరం భారీ వర్షాలతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. భారీ ఇన్‌ఫ్లో రావడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వది లారు. ఈసారి ప్రాజెక్ట్‌కు అధికంగా 43వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, అత్యధికంగా ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అలాగే, శనివారం ఒక్కరోజులోనే సగానికిపైగా టీఎంసీల నీరు ప్రాజెక్ట్‌కు వచ్చి చేరడంతో, అధికారులు వచ్చిన మొత్తం నీటి ని దిగువకు వదిలారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమ ట్టం 1.83 టీఎంసీలు కాగా, ఇప్పటివరకు 12.499 టీఎంసీల వరదనీరు వచ్చి చేరింది. ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తూ ఇప్పటివరకు 11.461 టీఎంసీల నీటిని ప్రాజెక్ట్ నుంచి వదిలిపెట్టారు.
ఇప్పటివరకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలు
పూర్తిస్థాయి నీటిమట్టం 1.83 టీఎంసీలు
ప్రస్తుత నీటిమట్టం 1.602 టీఎంసీలు
మొత్తం ఇన్‌ఫ్లో 12.499 టీఎంసీలు
వదిలిన నీరు 11.461 టీఎంసీలు