
పెంబిలో పీపీఎల్–4 ప్రారంభం
పెంబి: దసరా సందర్భంగా మండల కేంద్రంలో పీపీఎల్–4 (పెంబి ప్రీమియర్ లీగ్)ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ బుధవారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా రుమూల పెంబి ప్రాంతంలో పెద్ద ఎత్తున క్రికెట్ టో ర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని పే ర్కొన్నారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోటీలను విజయవంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు వెంకటేశ్, స్వప్నీల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, క్రీడాకా రులు, పీపీఎల్ నిర్వాహకులు నరేశ్, రాము, మతీ న్, మహేశ్, నాను శ్రీకాంత్, తదితరులున్నారు.