
బాసరకు మళ్లీ బ్యాక్‌బాటర్
బాసర వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
బాసర: ఎగువనున్న మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా చేరుతుండగా బాసర వద్ద గోదావరి ప్రవాహం మళ్లీ పెరిగింది. బుధవారం గంటగంటకూ ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బాసర ఆలయం నుంచి గోదావరి పుష్కర ఘా ట్‌కు వెళ్లే రోడ్డు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌తో నిండి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవె న్యూ, పోలీస్‌శాఖల అధికారులు ఆయా గ్రామా ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా 15రోజులుగా బాసర, ఓని గ్రామాల మీదుగా రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటికీ పరిహారం అందలేదు.
డివైడర్ పైనుంచి ఆలయానికి వెళ్తున్న భక్తులు
నీటితో నిండిన రోడ్డుపై వెళ్తున్న భక్తులు
ఎస్సారెస్పీ 40గేట్లు ఎత్తివేత
మామడ: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో పెరి గింది. బుధవారం ఎస్సారెస్పీలోకి 2.54 లక్ష ల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అధికారులు ప్రాజెక్ట్ 40 గేట్లు ఎత్తి 4లక్షల క్యూసెక్కులను గోదావరి నదిలోకి వదులుతున్నారు. కాగా, పశువుల కాపరులు, రైతులు, మత్స్యకారులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

బాసరకు మళ్లీ బ్యాక్‌బాటర్

బాసరకు మళ్లీ బ్యాక్‌బాటర్