
● ఎస్సీ జానకీ షర్మిల
జాతరకు పటిష్ట బందోబస్తు
దిలావర్‌పూర్: అడెల్లి మహా పోచమ్మ (గంగనీళ్ల) జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల తెలిపారు. సాంగ్వి గ్రామంలోని పోచమ్మ ఆలయాన్ని శనివారం సందర్శించి పూజలు చేశారు. గోదావరి తీరాన్ని పరిశీలించారు. పోలీసులతో ప్రత్యేకంగా సమావేశమై సూచనలు చేశారు. ఆదివారం అమ్మవారి ఆభరణాలు అడెల్లి ఆలయానికి వెళ్లేమార్గంలో ఎలాంటి సమస్య రాకుండా చూడాలన్నారు. అమ్మవారి ఆభరణాలు ఎత్తుకునేందుకు పోలీసులు ప్రయత్నించవద్దని సూచించారు. ఏఎస్పీ రాజేశ్ మీనా, సోన్ సీఐ గోర్ధన్‌రెడ్డి, నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, దిలావర్‌పూర్ ఎస్సై రవీందర్, ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.