
మళ్లీ ముంచిన గోదావరి
లక్ష్మణచాంద: మండలంలోని గోదావరి పరీ వాహక గ్రామాల్లో రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు పంటలను గోదావరి వరద ముంచెత్తింది. గత ఆగస్టు చివరి వారంలో ఎగువన భారీ వర్షాలు కురవడంతో ఎస్సారెస్పీ గేట్లు ఎత్తి 4లక్షల క్యూసెక్కుల నీటిని వదలగా పీచ ర, ధర్మారం, పార్‌పెల్లి, మునిపెల్లి, మాచాపూర్, చింతల్‌చాంద గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు నీటిమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు పంట నష్టంపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఇంతవరకు పరిహారం అందలేదు. ఆదివారం గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుండగా పీచర, ధర్మారం, పార్‌పెల్లి, చింతల్‌చాంద, మునిపెల్లి గ్రామాల్లో పంటలు మళ్లీ నీట మునుగుతుండగా మొక్కజొన్న, సోయా రైతులు ఆందోళన చెందుతున్నారు.