నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా బాసర సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే బాసర గోదావరి నదీతీరంలో భక్తులు కనిపించారు. పుణ్యస్నానాలు ఆచరించి, సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించారు.
అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. తెలంగాణ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు కుటుంబ సమేతంగా బాసరకు వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయించారు.
సాయంత్రం కలెక్టర్ అభిలాష అభినవ్ వసంత పంచమి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ జానకీషర్మిల బందోబస్తును పర్యవేక్షించారు. కాగా, సోమవారం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తులకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment