
సాక్షి,న్యూఢిల్లీ:కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సోమవారం(జనవరి13) సాయంత్రం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని తొలుత తులసి చెట్టుకు పూజ చేశారు.
అనంతరం గంగిరెద్దులకు అరటిపళ్ళు తినిపించి,నూతన వస్త్రాలు బహుకరించారు. భోగి రోజు కావడంతో భోగి మంట వేశారు. ఈ సంబరాలకు ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా,పలువురు కేంద్రమంత్రులు,బీజేపీ ఎంపీలు, బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
అంతకుముందు సినీ నటుడు చిరంజీవి,ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు,బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి సంక్రాంతి వేడుకలకు ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రముఖ గాయని సునీత గీతాలాపనతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment