- సినీ ప్రముఖుల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలు
- శనివారం తెల్లవారుజాము వరకూ ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలపై వరుసగా నాలుగో రోజూ ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు కొనసాగాయి. మంగళవారం నుంచి పలువురు టాలీవుడ్ నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు చెందిన వ్యక్తులు, ఫైనాన్షియర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ సహా పలువురి ఇళ్లలోనూ గురువారం వరకు సోదాలు జరిగాయి.
దిల్ రాజు ఇంట్లో మాత్రం ఐటీ సోదాలు శుక్రవారంతో ముగిశాయి. 5 రోజుల సెర్చ్ వారెంట్‌తో ప్రారంభించిన సోదాలకు సంబంధించి శుక్రవారం దిల్ రాజు వాంగ్మూలం నమోదు చేశారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్‌కు తీసుకెళ్లారు. ఆయన సమక్షంలోనే డాక్యుమెంట్లను పరిశీలించి వాటిని స్వా«దీనం చేసుకున్నారు. గేమ్‌ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సహా ఇటీవల నిర్మించిన సినిమాల గురించి ఆరా తీసినట్లు తెలిసింది.
డాకు మహారాజ్ సినిమాకు దిల్‌రాజు
డి్రస్టిబ్యూటర్‌గా ఉండటంతో ఆ సినిమా కలెక్షన్లపైనా కొన్ని వివరాలు తీసుకున్నట్టు సమాచారం. అనంతరం పలు డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, సినిమాలకు ఖర్చు చేసిన సొమ్ము, వచ్చిన లాభాలు వంటి అంశాలపై ఐటీ అధికారులు దిల్ రాజుతోపాటు ఎస్‌వీసీ ఆడిటర్, అకౌంటెంట్ వాంగ్మూలాలను నమోదు చేసినట్లు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలకు సంబంధించి వివరణ కోరినట్లు సమాచారం.
సినీ ప్రముఖుల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలు
సినీ ప్రముఖుల ఇళ్లలో నాలుగు రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు.. శనివారం తెల్లవారుజామున ముగిశాయి. ఈ సోదాల్లో కీలక ాడాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment