
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, ఆఫీసులలో నాలుగోరోజు కూడా ఐటీ సోదాలు(Income Tax Officer) జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దిల్‌రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు సంబంధించిన ఆఫీస్‌కు ఆదాయపన్ను శాఖ అధికారులు తీసుకెళ్లారు.
దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు దాదాపు ముగిశాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ సోదాలలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళా అధికారి సమక్షంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నివాసం నుంచి వారు తాజాగా సాగర్ సొసైటీలోని తన ఎస్‌వీసీ కార్యాలయానికి వెళ్లారు. తమ వాహనంలోనే దిల్ రాజును వారు తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఎస్‌వీసీ ఆఫీస్‌లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీశ్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. వారు నిర్మించిన పలు సినిమాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రైడ్స్ గురించి అధికారులు ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి విషయాలు ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment