basara saraswati temple
-
వసంత పంచమి.. అక్షరాభ్యాసం
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా బాసర సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే బాసర గోదావరి నదీతీరంలో భక్తులు కనిపించారు. పుణ్యస్నానాలు ఆచరించి, సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు కుటుంబ సమేతంగా బాసరకు వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయించారు. సాయంత్రం కలెక్టర్ అభిలాష అభినవ్ వసంత పంచమి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ జానకీషర్మిల బందోబస్తును పర్యవేక్షించారు. కాగా, సోమవారం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తులకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు. -
బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి
-
చదువులమ్మకు ‘వసంత’ శోభ
బాసర(ముధోల్): ‘చదువులతల్లీ.. చల్లం గసూడు. మా పిల్లలకు మంచి విద్యాబుద్ధులను ప్రసాదించు’ అంటూ నిర్మల్ జిల్లా బాసరలో వెలిసిన సరస్వతమ్మను భక్తజనం చేతులెత్తి వేడుకున్నారు. అమ్మవారి చెంత తమ చిన్నా రులకు అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి పర్వదినం పురస్కరించుకుని బాసర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము న ఒంటిగంట నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవారిని దర్శించుకుని, తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలను చేయించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాగా, వసంత పంచమిని పురస్కరించుకుని శని వారం ఉదయం అమ్మవారికి అభిషేకం, మం గళవాయిద్యసేవ, సుప్రభాతసేవతో పాటు చండీహావనం, మహావిద్యాహావనం, వేదస్వస్తి, పూర్ణాహుతి నిర్వహించారు. ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు వారికి ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, చైర్మన్ శరత్‌పాఠక్ స్వాగతం పలికారు. -
బాసర ఆలయ పూజారులకు నోటీసులు
- పరారీలో పూజారులు నిర్మల్: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బయటకు తరలించిన ఇద్దరు పూజారులకు నోటీసులు ఇచ్చినట్లు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లా దేవరకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అక్షరాభ్యాసాలు చేయించేందుకు వీరిద్దరూ ఆలయం నుంచి అనుమతి లేకుండా ఉత్సవ విగ్రహాన్ని తరలించిన విషయం విదితమే. ఆలయానికి అప్రదిష్ట మూటగట్టిన ప్రధాన పూజారి సంజీవ్‌రావు, మరో పూజారి ప్రణవ్ శర్మలు పరారీలో ఉన్నారు. కాగా ప్రధాన పూజారి సంజీవ్ రావు అనారోగ్యకారణాలతో నిజామాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.