బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో బారులు తీరిన భక్తులు. (ఇన్‌సెట్‌లో) బాసర సరస్వతీ అమ్మవారు
బాసర(ముధోల్): ‘చదువులతల్లీ.. చల్లం గసూడు. మా పిల్లలకు మంచి విద్యాబుద్ధులను ప్రసాదించు’ అంటూ నిర్మల్ జిల్లా బాసరలో వెలిసిన సరస్వతమ్మను భక్తజనం చేతులెత్తి వేడుకున్నారు. అమ్మవారి చెంత తమ చిన్నా రులకు అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి పర్వదినం పురస్కరించుకుని బాసర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము న ఒంటిగంట నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవారిని దర్శించుకుని, తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలను చేయించారు.
రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాగా, వసంత పంచమిని పురస్కరించుకుని శని వారం ఉదయం అమ్మవారికి అభిషేకం, మం గళవాయిద్యసేవ, సుప్రభాతసేవతో పాటు చండీహావనం, మహావిద్యాహావనం, వేదస్వస్తి, పూర్ణాహుతి నిర్వహించారు. ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు వారికి ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, చైర్మన్ శరత్‌పాఠక్ స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment