సాక్షి,హైదరాబాద్: నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దిల్‌రాజు ఆఫీస్, కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్‌రాజు సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో 8 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
కాగా, సంక్రాంతికి భారీ బడ్జెట్‌తో ‘గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాము’ సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్స్ తీసింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బడా ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న దిల్ రాజు.. డిస్టిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారారు.
మెత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ తనిఖీలు
మెత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మైత్రీ నవీన్, సీఈవో చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప-2 వరల్డ్ వైడ్‌గా దాదాపు 1850 కలెక్షన్లు రాబట్టింది. సింగర్ సునీత భర్త రాముకు చెందిన మ్యాంగో మీడియా సంస్థలో కూడా సోదాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్.. రిలీజ్ అప్పుడేనన్న అనిల్ రావిపూడి!
Comments
Please login to add a commentAdd a comment