IT searches
-
నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు
సాక్షి,హైదరాబాద్: నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దిల్‌రాజు ఆఫీస్, కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్‌రాజు సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో 8 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.కాగా, సంక్రాంతికి భారీ బడ్జెట్‌తో ‘గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాము’ సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్స్ తీసింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బడా ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న దిల్ రాజు.. డిస్టిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారారు.బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాం : దిల్ రాజు భార్యదిల్ రాజు భార్య తేజస్వినిని అధికారులు బ్యాంక్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తేజస్విని మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇవాళ ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బ్యాంకు వివరాలు కావాలని అధికారులు అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాం’’ అని ఆమె చెప్పారు.మెత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ తనిఖీలుమెత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మైత్రీ నవీన్, సీఈవో చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప-2 వరల్డ్ వైడ్‌గా దాదాపు 1850 కలెక్షన్లు రాబట్టింది. సింగర్ సునీత భర్త రాముకు చెందిన మ్యాంగో మీడియా సంస్థలో కూడా సోదాలు చేస్తున్నారు. ఇదీ చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్.. రిలీజ్ అప్పుడేనన్న అనిల్ రావిపూడి! -
టీడీపీ అభ్యర్థి కంపెనీలో సోదాలు.. కంటైనర్‌లో భారీగా నగదు
సాక్షి, బాపట్ల: బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు సోదాలు చేపట్టారు. చీరాల మండలం కావూరి వారిపాలెంలోని కంపెనీలో సోదాలు చేపట్టారు. కంటైనర్‌లో రూ.56 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన నగదుగా గుర్తించారు. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కంటైనర్‌లో ఉన్న నగదును పోలీసులు సీజ్ చేశారు. -
ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. మూడ్రోజులుగా ప్రదీప్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రదీప్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్న డబ్బుగా ఐటీ శాఖ తేల్చింది. ప్రదీప్‌రెడ్డితో పాటు కోట్ల నరేందర్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఆయన ఇంట్లో రూ. 7 కోట్ల 50 లక్షలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఐటీ అధికారుల వరుస సోదాలు సోమవారం మూడ్రోజులు పాటు కొనసాగాయి. ఫార్మా రంగానికి చెందిన పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ అధికారుల బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, ఆర్సీపురం, వట్టినాగులపల్లి,గచ్చి బౌలిలోని మైహోం భుజాలో సోదాలు నిర్వహించాయి. మై హోమ్ భుజాలో నివాసం ఉంటున్న ప్రదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడాలో అంతర్జాతీయ రసాయన పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. తనిఖీల సమయంలో ఎవరినీ లోపలికి రానీయకుండా సీఆర్పీ ఎఫ్ జవాన్లు బందోబస్తు నిర్వహించారు. ఆయా కంపెనీలకు చెందిన ఆర్ధిక లావాదేవీల వివరాలకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులకు పలు ఫార్మా కంపెనీల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఐటీ అధికారులు మెరుపుదాడులు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. చదవండి: కోట్లున్నా..కారుండదు..ఎందుకు? -
తిరుపతిలో ఐటీ దాడుల కలకలం
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తిరుపతిలో డాలర్స్ గ్రూప్‌పై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. డాలర్స్ గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ డాక్టర్ సి.దివాకర్‌రెడ్డి కార్యాలయం పాటు, బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దివాకర్‌రెడ్డి, కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. పత్రాలను పరిశీలిస్తున్నారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, వారి బంధువుల ఇళ్లలో గురువారం ఉదయం మొదలైన ఐటీ అధికారుల సోదాలు రాత్రి తర్వాత కూడా కొనసాగాయి. గురువారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఆయన కుమారుడు జయవీర్ నివాసంలోనూ తనిఖీలు చేసి నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే సాధా రణ తనిఖీల్లో భాగంగానే వీరి ఇళ్లలో సోదాలు చేపట్టినట్టు, కొన్ని పత్రాలను ఐటీ అధికారులు పరి శీలించి వెళ్లినట్టు సమాచారం. గురువారం రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ ఆర్)కి చెందిన ఇళ్లు, విల్లా, ఫామ్‌హౌసుల్లో, బాలా పూర్లోని బడంగ్పేట్ మేయర్, పీసీసీ నేత, చిగు రింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ అధికా రులు సోదాలు చేప ట్టిన విషయం తెలిసిందే. కాగా కేఎల్ఆర్ నివాసం,కార్యాలయాల్లో శుక్రవారం మరో సారి తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులు తుక్కుగూడలోని కేఎల్ఆర్ నివాసానికి చేరుకున్నారు. పలు డాక్యు మెంట్లతో పాటు కేఎల్ఆర్ను వెంటబెట్టుకుని నార్సింగ్ ఎన్సీసీ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. గంట పాటు అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడి నుంచి మాదాపూర్‌లోని కేఎల్ఆర్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి పొద్దు పోయే దాకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బడంగ్పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో గురువారం రాత్రే సోదాలు ముగిశాయి. ఇంట్లో లభించిన రూ.8 లక్షలు సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని, ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. తమను రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఈ దాడులు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు.. ఆరుగంటలుగా కొనసాగుతున్న సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆరు గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్, బడంగ్పేట్ మేయర్ పారిజాత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేఎల్ఆర్ నివాసం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న కేఎల్ఆర్ ఫామ్ హౌస్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తుక్కుగూడలో పార్టీ కార్యాలయాన్ని కేఎల్ఆర్ ప్రారంభించారు. అటు శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ఉన్న అక్బర్ బాగ్‌లో కేఎల్ఆర్ ఫామ్ హౌస్‌లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ రంగారెడ్డి పరిసరాల్లో పలు ఫామ్ హౌస్‌లు, గచ్చిబౌలి సమీపంలో ఎన్సిసీలో కూడా విల్లా ఉన్నట్టు సమాచారం. మరో వైపు, కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బడంగ్ పేట్ కార్పొరేటర్‌గా ఉన్న పారిజాత.. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించారు. తెల్లవారు జామున 5 గంటలకు చేరుకున్న ఐటీ అధికారులు.. పారిజాత కూతురు ఫోన్ స్వాధీనం చేసుకుని సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పారిజాత తిరుపతిలో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. 10 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. కోకాపేట్ హిడెన్ గార్డెన్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. గిరిధర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. చదవండి: కాంగ్రెస్ పొత్తు యూటర్న్‌పై నారాయణ ట్వీట్ -
లోకేష్ సన్నిహితుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, కాకినాడ జిల్లా: లోకేష్ సన్నిహితుడు, టీడీపీ నేత గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. నారా లోకేష్‌కి ప్రధాన అనుచరుడుగా ఉన్న చంద్రమౌళి ఇంట్లో మూడు బృందాలుగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 5 గంటలకు సోదాలు కొనసాగుతున్నాయి. ఆక్వా, క్వారీ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టిన చంద్రమౌళి.. ఆదాయంలో తేడాలు చూపించి ఇన్ కంటాక్స్లు ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. బినామీల ద్వారా వ్యాపారాలు చేసి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. చదవండి: ‘అమ్మా పురంధేశ్వరి గారూ.. మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు’ -
బీఆర్ఎస్ నేతలే టార్గెట్! ముగిసిన ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ ఇళ్లు, కార్యాలయాల్లో అలజడి సృష్టించిన ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగినట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రిజనార్ధన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారితో స్థిరాస్థి వ్యాపార సంబంధాలున్నాయన్న ఆరోపణలపై మరికొన్ని కంపెనీల్లోనూ ఈ సోదాలు జరిగా యి. పదుల సంఖ్యలో ఐటీ అధికారులు.. 60కిపైగా ప్రాంతాల్లో పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. పన్ను ఎగవేతలు, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై ఆరా తీసిన అధికారులు, సదరు నాయకులకు నోటీసులు జారీ చేశారు. సంబంధిత వివరాలు, ఆధారాలతో ఫతేమైదాన్‌లోని ఐటీ ఆఫీస్‌లో మంగళవారం హాజరుకావాలని సూచించినట్టు సమాచారం. హైదరాబాద్‌లో కొత్తపేట గ్రీన్‌హిల్స్ కాలనీలోని శేఖర్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసులు, జూబ్లీహిల్స్‌లోని మర్రి జనార్ధన్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసులో సోదాల సందర్భంగా వారి అనుచరుల ఆందోళనలు కొంత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు బ్యాంకు ఖాతాలతోపాటు బ్యాంకు లాకర్లను సైతం తెరిపించి సోదాలు చేపట్టారు. శుక్రవారం లైఫ్‌స్టైల్ సంస్థ డైరెక్టర్ ఇల్లు, కార్యాలయాల్లోనూ ఈ సోదాలు కొనసాగాయి. కాగా, ఐటీ సోదాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పు డు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని తెలిపారు. -
రెండోరోజూ ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్/దిల్సుఖ్నగర్/ముషీరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం మొదలైన ఐటీ సోదాలు గురువారం రెండోరోజూ కొనసాగాయి. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 36లో ఉన్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంటితోపాటు కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో ఉన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి. తనిఖీల్లో వారి కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలు, లాకర్లు, బ్యాలెన్స్ షీట్లను అధికారులు సేకరించారు. ఒక్కో కంపెనీకి చెందిన ఐదేళ్ల ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలించారు. ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి... పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి కలసి చేసిన రియల్ ఎస్టేట్, మైనింగ్ సహా ఇతర వ్యాపారాలపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో హిల్‌ల్యాండ్, మైన్స్‌ల్యాండ్, తీర్థ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, శ్రీలార్వెన్ సిండికేట్ సంస్థల్లో ఈ ముగ్గురికీ చెందిన కుటుంబ సభ్యులే భాగస్వాములుగా ఉండటంతో ఇందుకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు రూపంలో జరిగిన లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించి తెరవగా కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలు బయటపడ్డట్లు తెలిసింది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బ్యాంకు లాకర్స్‌ను సైతం అధికారులు తెరిపించారు. పన్నుల ఎగవేతపై ఆరా తీశారు. సోదాలయ్యాక వారి సంగతి చూస్తా: ఎమ్మెల్యే మర్రి ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నినాదాలు చేయగా తన ఇంటి నుంచి బయటకు వచ్ఛి న ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఐటీ అధికారులు వారి పని చేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మరోవైపు తమ సిబ్బందిని ఐటీ అధికారులు బెదిరించారని... కొందరిపై చేయి చేసుకున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. అధికారులకు చేయి చేసుకొనే హక్కు లేదని... అలా జరిగితే తాము కూడా తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు. సోదాలు ముగిశాక వారి సంగతి చూస్తామన్నారు. కాగా, ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కొండపల్లి మాధవ్ నివాసంపై బుధవారం ఉదయం 5 గంటలకు మొదలైన ఐటీ దాడులు రాత్రి 12 గంటలకు ముగిశాయి. తన ఇంటిపై ఐటీ దాడులు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని మాధవ్ ఆరోపించారు. -
ఐటీ దాడులు: పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట భారీ నగదు, డాక్యుమెంట్స్ సీజ్!
సాక్షి, హైదరాబాద్/ సూర్యాపేట: బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసం, భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని కార్యాలయాలతో పాటు 12 చోట్ల 12 గంటలుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన మామ మోహన్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. కాగా, కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. మెయిన్ ల్యాండ్స్ డిజిటల్ టెక్నాలజీ సంస్థకు డైరెక్టర్‌గా శేఖర్ రెడ్డి భార్య పైళ్ల వనిత రెడ్డి ఉన్నారు. ఇదే కంపెనీకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భార్య మంజులత కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, పన్నులు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంటి వద్ద ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఇక, ఐటీ దాడులపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షసాధింపు కోసమే.. కేంద్రంలో ఉన్నా బీజేపీ తమ ఇంటిపై ఐటీ సోదాలు చేయించింది. ఆ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, తాను పూర్తిగా వైట్ పేపర్ అని స్పష్టం చేశారు. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. 1986 నుంచి వ్యాపారం చేస్తున్నానని, అప్పటి నుంచే పాన్‌కార్డు తీసుకున్నానని, నాటి నుంచి నేటి వరకు మా వ్యాపారం పూర్తిగా వైటే అని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంట్లో ఉన్న తన కూతురు ఐటీ అధికారులకు సెర్చ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చిందన్నారు. అయితే అక్కడ ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదన్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న ఐటీ దాడులపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ, ఈడీ దాడులతో బీఆర్ఎస్ నేతలను బీజేపీ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోంది. ఇలాంటి దాడులకు మేం భయపడే ప్రసక్తే లేదు. రాజకీయ కక్షలో భాగమే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు. శేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారవేత్త. రాజకీయంగా శేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురిచేయడం పిరికి పందల చర్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో -
టీడీపీ నాయకుడి ఇంట్లో ఐటీ సోదాలు..
రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె పట్టణానికి చెందిన రొయ్యల వ్యాపారి, టీడీపీ నాయకుడు దండుప్రోలు పిచ్చయ్య ఇంట్లో గురువారం ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఆయన సోదరుడు దండుప్రోలు వెంకటేశ్వరరావు ఇంట్లో, వారికి చెందిన రొయ్యల కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం పక్కన ఉన్న దండుప్రోలు పిచ్చయ్య ఇంటితోపాటు సమీపంలోని దండుప్రోలు వెంకటేశ్వరరావు నివాసం, వీరికి చెందిన రొయ్యల కంపెనీలో ఉదయం ఒకేసారి అధికారులు సోదాలు ప్రారంభించారు. వెంకటేశ్వరరావు ఇంట్లో, రొయ్యల కంపెనీలో మధ్యాహ్నం వరకు సోదాలు నిర్వహించారు. దండుప్రోలు పిచ్చయ్య ఇంట్లో మాత్రం రాత్రి వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడిశాలోని పాల్కన్ రొయ్యల మేత, రొయ్యల ఎగుమతి కంపెనీతోపాటు ఆ సంస్థతో వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్న కంపెనీలు, వాటి నిర్వాహకుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయని, దీనిలో భాగంగా రేపల్లెలోని దండుప్రోలు పిచ్చయ్య, ఆయన తమ్ముడి ఇళ్లు, వారి కంపెనీలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పిచ్చయ్య ఇంటి వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దండుప్రోలు పిచ్చయ్య ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: అనుమతి లేకుండానే విదేశాలకు మార్గదర్శి ఎండీ.. -
తమిళనాడు: స్టాలిన్ బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఐటీ సోదాల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఐటీ అధికారులు సోమవారం ఉదయం నుంచి 50 ప్రాంతాల్లో బృందాలుగా సోదాలు నిర్వహించారు. ఇక, తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యుల ఇళ్లలో, అధికార డీఎంకే నేతలు, జీ స్వ్కేర్ కంపెనీ రియల్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అన్నానగర్ డీఎంకే ఎమ్మెల్యే మోహన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాగా, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఎరలు.. దాడులు.. ‘విచారణ’ల రాజకీయం!
రాష్ట్రంలో పోటాపోటీ దాడులు, తనిఖీలు.. వ్యూహాలు, ప్రతివ్యూహాలు.. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల జోరుతో ఈ ఏడాది హాట్‌హాట్‌గా మారింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు లక్ష్యంగా కేసులు, విచార ణలు, నోటీసులు కలకలం రేపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకునపెట్టేలా ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు తెరపైకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తులు టార్గెట్‌గా లిక్కర్ స్కాం, ఐటీ, ఈడీ దాడులు రాజకీయ వేడిని రగిలించాయి. మొత్తంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపరంగా పెద్ద సమస్యలేవీ ఎదురుకాలేదు. తెలంగాణ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో దేశంలో పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) ఉగ్ర లింకులు బయటికి రావడం గమనార్హం. 2022లో రాష్ట్రంలో పోలీసు, దర్యాప్తు విభాగాల పరిధిలో జరిగిన ప్రధాన ఘటనలు, అంశాలను ఓసారి గుర్తు చేసుకుందాం.. – సాక్షి, హైదరాబాద్ మంటలు రేపుతున్న లిక్కర్ స్కాం ఢిల్లీ లిక్కర్ స్కాం మూలాలు తెలంగాణలో బయటపడటం ఈ ఏడాది సంచలన కేసులలో ఒకటిగా నిలిచింది. ఈ కేసులో కీలక నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. డిసెంబర్ తొలివారంలో కవితకు సీబీఐ అధికారులు నోటీసులివ్వడం, తర్వాత హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి వచ్చి విచారించడం చర్చనీయాంశంగా మారింది. కవితకు దగ్గరి వ్యక్తిగా ప్రచారమున్న అభిషేక్‌రావును సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఇంకా ఏం జరుగుతుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది. ‘ఎమ్మెల్యేలకు ఎర’తో గరంగరం నలుగురు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డిలను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫాంహౌస్‌లో బేరసారాలు జరుగుతున్న సమాచారంతో సైబరాబాద్ పోలీసులు దాడి చేశారు. బీజేపీ తరఫున డీల్ చేసేందుకు వచ్చినట్టుగా చెప్తున్న ఢిల్లీ ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, తిరుపతికి చెందిన సింహయాజీ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందుకుమార్‌లను అరెస్టు చేశారు. ఈ కేసుతో బీజేపీకి సంబంధం లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేయడం, బీఆర్ఎస్ నేతల ప్రతి సవాళ్లు, ఆరోపణలు, కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ నేతలు కోర్టుల్లో పిటిషన్లు వేయడం జరిగాయి. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయగా.. అధికారులు కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసు నిందితులతో సంబంధాలున్న జగ్గు స్వామి, తుషార్, మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. వరుస విచారణలు, మలుపులతో ఈ కేసు ఇప్పటికీ ఉత్కంఠ రేపుతోంది. చీమ చిటుక్కుమన్నా గుర్తించేలా.. సీసీసీ తెలంగాణ పోలీసుల రోజువారీ ఆపరేషన్స్‌లో సాంకేతికంగా కీలకంగా మారనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఈ ఏడాది ఆగస్టు 5న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. డిసెంబర్ 3న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘తెలంగాణ పోలీస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ’ని మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ సైబర్ సేఫ్టీ విభాగంతో రాష్ట్ర పోలీసులు సైబర్ నేర పరిశోధనలో కీలక అడుగు వేసినట్టయింది. పెరిగిన ‘మత్తు’.. కట్టడికి పోలీసుల పైఎత్తు.. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం పెరిగిన విషయం ఈ ఏడాది పలు ఘటనల్లో బయటపడింది. ఏప్రిల్ 2న రాడిసన్ బ్లూ హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో పలువురు ప్రముఖుల పిల్లలున్నట్టు గుర్తించడం సంచలనం సృష్టించింది. పెరిగిన డ్రగ్స్, గంజాయి వంటివాటి వినియోగానికి అడ్డుకట్ట వేసి యువతను కాపాడాలన్న లక్ష్యంలో తొలిసారిగా సీఎం కేసీఆర్ పోలీసు, ఎౖMð్సజ్‌శాఖ ఉన్నతాధికారులతో జనవరి 27న సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాల కట్టడికి నార్కోటిక్స్ వింగ్‌ల ఏర్పాటుతోపాటు ఇటీవల ఆ విభాగాల బలోపేతానికి సిబ్బందిని కేటాయించారు. మరోవైపు రాష్ట్రంలో పోలీసు శాఖ బలోపేతం కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేశారు. నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఐటీ సోదాలు.. ఈడీ దాడులు గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులపై ఈ ఏడాది ఈడీ, ఐటీ దాడులు జరిగాయి. గ్రానైట్ తవ్వకాల్లో ఫెమా నిబంధనల ఉల్లంఘనపై నమోదైన కేసులో ఈడీ అధికారులు నవంబర్ 9న కరీంనగర్‌లోని మంత్రి గంగుల కమలాకర్, ఆయన బంధువుల నివాసాలు, పలు గ్రానైట్ కంపెనీల ఆఫీసులలో సోదాలు చేయడం సంచలనం సృష్టించింది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ఈడీ సోదాలు, తనిఖీల దూకుడు పెరగడంపై రాజకీయ వర్గాల్లో తీవ్రచర్చ జరిగింది. నవంబర్ 22, 23 తేదీల్లో మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను (ఐటీ) అధికారుల సోదాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలు రాజకీయ వేడిని పెంచాయి. 65 ఐటీ బృందాల సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం ఓవైపు.. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు అనుచితంగా ప్రవర్తించారంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు, పోలీస్ స్టేషన్లలో పరస్పర కేసులు మరోవైపు హాట్‌హాట్‌గా కొనసాగాయి. అగ్నికి ప్రాణాలు ఆహుతి.. ఈ ఏడాది సెప్టెంబర్ 12న సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్లో అగ్నిప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 16న మంచిర్యాల జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. లొంగుబాటలో మావోయిస్టులు మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణలో ఈ ఏడాది సైతం పోలీసులు తమ పట్టు నిలుపుకొన్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యురాలు మాధవి హడ్మే అలియాస్ సావిత్రి సెప్టెంబర్ 21న డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆలూరి ఉషారాణి అలియాస్ విజయక్కతోపాటు మరికొందరు కూడా లొంగిపోనున్నారు. కలకలం రేపిన పీఎఫ్ఐ లింకులు ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ మరోకేసు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి సంబంధించినది. మత ఘర్షణలను ప్రేరేపించేలా ఓ వర్గం యువతకు శిక్షణ ఇస్తున్నట్టు ఈ ఏడాది జూలైలో గుర్తించిన నిజామాబాద్ పోలీసులు.. పీఎఫ్ఐకి చెందిన కీలక వ్యక్తులు ఖదీర్, షాదుల్లా సహా మరికొందరిని అరెస్టు చేశారు. ఈ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఆగస్టు 26న మరోకేసు నమోదు చేసింది. తర్వాత ఎన్ఐఏ దేశవ్యాప్తంగా వరుస సోదాలు, అరెస్టులు చేపట్టడం కలకలం సృష్టించింది. -
ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి అల్లుడు రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. టర్కీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన.. ఐటీ దాడులపై స్పందించారు. తమ ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్లు లేవని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టారన్నారు. పథకం ప్రకారమే దాడులు చేశారన్నారు. కాగా, మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. చదవండి: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ -
మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’
సాక్షి, హైదరాబాద్: ఐటీ సోదాల్లో రూ.100 కోట్ల వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో కోట్లు డొనేషన్లు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 100 కోట్ల డొనేషన్ల పంచనామాపై ఐటీ అధికారులు సంతకం తీసుకున్నారు. సోమవారం ఐటీ విచారణకు హాజరుకావాలని మంత్రి మల్లారెడ్డి సహా, ఆయన కుమారులు, అల్లుడికి ఐటీ నోటీసులు జారీ చేసింది. ఇంజనీరింగ్ కాలేజీలో మూడు సంవత్సరాల్లో 100 కోట్లు డొనేషన్ల పేరుతో వసూలు చేయించారని మహేందర్ రెడ్డితో ఐటీ సంతకం తీసుకుంది. తన కొడుకుతో బలవంతంగా సంతకం పెట్టించారని ఐటీ అధికారులతో మల్లారెడ్డి వాదనకు దిగారు. ఇష్టం వచ్చినట్లు కోట్ల రూపాయల డొనేషన్లు పేరు చెప్పి సంతకాలు పెట్టించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ కాలేజీలో జరిగే ప్రతి లావాదేవీలకు లెక్కలు ఉంటాయని మంత్రి చెబుతున్నారు. కాగా, మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేశారు. చదవండి: అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది? -
అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. కాగా, అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్ టాప్‌పై హైడ్రామా చోటుచేసుకుంది. మొదట ఆసుపత్రిలో ఐటీ అధికారి రత్నాకర్ ల్యాప్‌టాప్ వదిలివెళ్లారు. రత్నాకర్‌ను బోయిన్పల్లి పీఎస్‌కు మంత్రి మల్లా రెడ్డి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ఉండిపోయిన ల్యాప్‌టాప్‌ను మల్లా రెడ్డి అనుచరులు పీఎస్‌కు తీసుకుని వచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్‌ను కేంద్ర బలగాలు తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ల్యాప్‌టాప్‌ను లోపలికి తీసుకెళ్లేందుకు మల్లారెడ్డి అనుచరులు ప్రయత్నించారు. బోయినపల్లికి చెందిన కానిస్టేబుల్.. ల్యాప్‌టాప్‌ను లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్‌ను అడ్డుకున్న కేంద్ర బలగాలు.. ల్యాప్‌టాప్‌ను బయటే పెట్టించాయి. బోయినపల్లి పీఎస్ గేటు ముందే ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు వదిలి వెళ్లారు. మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్‌ను కేంద్ర బలగాలు ఖాళీ చేశాయి. కేంద్ర బలగాలు వెళ్లిన తర్వాత ల్యాప్‌టాప్‌ను బోయినపల్లి పీఎస్ లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం బోయినపల్లి పీఎస్‌లోనే ల్యాప్‌టాప్ ఉంది. చదవండి: మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? -
మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే?
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేశారు. సోమవారం ఐటీ ఎదుట హాజరు కావాలంటూ మల్లారెడ్డి సహా, కుమారులు, అల్లుడికి అధికారులు నోటీసులు ఇచ్చారు. కాగా, తాను లేని సమయంలో తన కుమారుడితో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి సంతకం చేయించుకున్నారని బోయినపల్లి పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు. హాస్పిటల్లో ఉన్న తన కొడుకుతో బలవంతంగా సంతకం చేపించుకుంటున్నారని, ఇండ్లల్లో చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘వీళ్లు ఐటీ అధికారులు కాదు.. రక్త పిశాచులు.. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా రాస్తున్నారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. గందరగోళంగా రైడ్స్ చేసారు. మా దగ్గర ఎటువంటి డబ్బు దొరకలేదు. మెడికల్ కాలేజీకి సంబంధించి అన్ని అబద్ధాలు రాశారని’’ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. చదవండి: మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాలు.. అర్ధరాత్రి హైడ్రామా -
మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాలు.. అర్ధరాత్రి హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. కుమారులు ఇళ్లు, బంధువులు ఇళ్లు, కార్యాలయాలు, సోదరులు ఇళ్లలో కూడా తనిఖీలు ముగిశాయి. రెండు రోజుల పాటు 65 బృందాలతో 48 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో 10.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు ముగియడంతో పంచనామా రిపోర్ట్‌ను అధికారులు మంత్రికి ఇచ్చారు. సోమవారం ఐటీ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. మరోవైపు.. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. టర్కీ నుంచి హైదరాబాద్‌కు ఆయన వస్తున్నారు. కాగా, మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాల్లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. తన పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డితో ఐటీ అధికారులు బలవంతంగా సంతకం చేయించుకున్నారంటున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. లేనివి ఉన్నట్లు రాయించుకుని సంతకం చేసుకున్నారని ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి.. గన్ మాన్ సెక్యూరిటీ లేకుండా కేవలం డ్రైవర్‌తో మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్‌కి చేరుకున్నారు. తాను లేని సమయంలో తన కుమారుడితో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి సంతకం చేయించుకున్నారని బోయినపల్లి పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు. హాస్పిటల్లో ఉన్న తన కొడుకుతో బలవంతంగా సంతకం చేపించుకుంటున్నారని, ఇండ్లల్లో చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘వీళ్లు ఐటీ అధికారులు కాదు.. రక్త పిశాచులు.. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా రాస్తున్నారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. గందరగోళంగా రైడ్స్ చేసారు. మా దగ్గర ఎటువంటి డబ్బు దొరకలేదు. మెడికల్ కాలేజీకి సంబంధించి అన్ని అబద్ధాలు రాశారని’’ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. చదవండి: Telangana: సోదాలు, దాడుల కాలమిది! -
మన దాడుల న్యూస్‌తో ప్రచారం వచ్చి గుర్తింపు వస్తుందేమో సార్!
మన దాడుల న్యూస్‌తో ప్రచారం వచ్చి గుర్తింపు వస్తుందేమో సార్! -
‘ఐటీ దాడులా...ఎంకే స్టాలిన్ ఇక్కడ’!
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ముఖ్యంగా డీఎంకే నేతల ఇళ్లపై ఐటీ దాడులు ప్రకంపనలు రేపుతున్నాయి. ఆదాయపన్ను శాఖ సోదాలపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. తన కుమార్తె, అల్లుడు ఇంటిపై శుక్రవారం నాటి ఐటీ దాడులపై ఘాటుగా స్పందించారు. అలాగే తమిళనాడులోని కల్లకూరిచిలో డీఎంకె వ్యవస్థాపకుడు అన్నాదురై విగ్రహానికి నిప్పంటించిన ఘటననుకూడా స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. (ఎన్నికల వేళ, డీఎంకేకు ఐటీ వరుస షాక్స్) పెరంబలూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఐటీ దాడులు చేసిన తమ పార్టీకి భయపడేది లేదని తెగేసి చెప్పారు. అంతేకాదు తాము ఏఐఎడిఎంకె నాయకులు కాదని ప్రధాని మోదీ తెలుసుకోవాలన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏఐఎడిఎంకె ప్రభుత్వాన్ని మోదీ సర్కార్ కాపాడుతోంది. కానీ తాను కలైంగర్ (దివంగత డీఎంకె నేత ఎం కరుణానిధి) కొడుకుననే విషయాన్ని మర్చిపోవద్దని ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను మిసాను, ఎమర్జెన్సీని చూశాను..ఇలాంటి వాటికి భయపడను.. బీజేపీ తప్పుడు విధానాలకు ప్రజలు ఏప్రిల్ 6 న స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని స్టాలిన్ స్పష్టం చేశారు. అలాగే డీఎంకే వ్యవస్తాపకుడు అన్నాదురై విగ్రహాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఐటీ దాడులపై డీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాగా డీఎంకేనేతలు, సంబంధిత వ్యక్తుల నివాసాలపై వరుస ఐటీ దాడులు తమిళనాట కాక పుట్టించాయి. స్టాలిన్ అల్లుడు శబరీశన్ నివాసంలో ఆదాయ పన్ను శాఖ శుక్రవారం దాడులు చేపట్టింది. చెన్నై నగరానికి సమీపంలోని నీలాంగరాయ్‌లోని శబరీశన్ నివాసం, ఆయనకు చెందిన మరో నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో డీఎంకే నేత సెంథిల్ బాలాజీ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ దాడి నిర్వహించింది. -
అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళునాట ఐటి దాడుల కలకలం
-
ఎన్నికల వేళ, డీఎంకేకు ఐటీ వరుస షాక్స్
సాక్షి చెన్నై: తమిళనాడులోరానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే నాయకులపై వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడి నివాసం ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్టాలిన్ అల్లుడి శబరీశన్‌కు చెందిన నాలుగు ప్రదేశాల్లో శుక్రవారనం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. నీలంగరైలో ఉన్న ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. స్టాలిన్ కూతురు సెంతమారై తన భర్త శబరీశన్‌తో పాటు అక్కడే నివసిస్తున్నారు. కాగా ఏప్రిల్ 6 న జరిగనున్న ఎన్నికలకు ముందు డీఎంకే నేతలు, పార్టీతో సంబంధం ఉన్న వారిపై జరిపిన దాడుల్లో ఇది రెండోసారి. ఇళ్లపై ఐటీ దాడులు జరగడం ఇది రెండవసారి.గత నెలలో డీఎంకే నేత ఈ వేలూ నివాసంతోపాటు 10 కి పైగా చోట్ల ఐటీశాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలను బెదిరించేందుకు బీజేపీతో జతకలిసిన కూటమి పన్నిన పన్నాగమని, ఇది రాజకీయ కుట్ర అంటూ డీఎంకే నేతలు ఖండించారు. -
కల్కి ఆశ్రమంలో ముగిసిన ఐటీ సోదాలు
-
ప్రచారానికి మళ్లిన ప్రభుత్వ నిధులు!
భోపాల్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాలపై జరిపిన ఐటీ సోదాల్లో రోజుకొకటి చొప్పున విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఉద్దేశించిన నిధుల్ని ప్రచారానికి దారి మళ్లించినట్లు అనుమానాలు రేకిత్తిస్తున్న కీలక డైరీ తాజాగా బయటపడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడి వద్ద నుంచి ఈ డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ప్రజా పనులు, మైనింగ్, ఎక్సైజ్, రవాణా, ఇంధనం ఇలా పలు విభాగాలకు కేటాయించిన నిధులు ఒక వైపు, ఖర్చులు మరోవైపు డైరీలో రాసి ఉన్నట్లు గుర్తించారు. ఖర్చుల్లో పీసీసీ, ఢిల్లీ–ఏఐసీసీ పేర్లు ప్రస్తావించడం సంచలనం రేపుతోంది. ఢిల్లీ–మధ్యప్రదేశ్ మధ్య అక్రమ నగదు చెలామణికి పాల్పడుతూ రూ.281 కోట్ల విలువైన నగదును అక్రమంగా నిల్వచేసిన వ్యవస్థీకృత రాకెట్‌ను గుర్తించినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఎన్నికల వేళ ఎన్ఫోర్స్మెంట్ సంస్థల సోదాలు తటస్థంగా ఉండాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు స్పందిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం బదులు పంపింది. మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి నగదు అక్రమ రవాణా జరుగుతోందని విశ్వసనీయ సమాచారం అందడంతోనే సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 50 చోట్ల జరిగిన ఐటీ దాడులు మరో రెండు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది. విపక్షాలను అడ్డుకునేందుకే: అహ్మద్ పటేల్ విపక్ష నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకునేందుకే ఆదాయ పన్ను ఎగవేత పేరిట సోదాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ఆరోపించారు. ఐటీ దాడులకు భయపడేది లేదని, ఎన్నికలకు ముందు రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం బీజేపీలో నెలకొన్న నిరాశ, నిస్పృహలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దేశ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
చెన్నై శరవాణా స్టోర్స్‌లో ఐటీ తనిఖీలు
-
రూ. 100 కోట్ల వరకూ అనుమానాస్పద లావాదేవీలు
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై ఐటీ దాడుల్లో రూ.100 కోట్ల వరకూ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. రమేష్‌కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ రూ.74 కోట్ల నిధులను గుర్తించలేని లావాదేవీల ద్వారా దారిమళ్లించినట్టు, రూ.25 కోట్ల బిల్లులను ఐటీ అధికారులు అనుమానాస్పదమైనవిగా కనుగొన్నట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. ఐటీ అధికారులు ఈనెల 12న హైదరాబాద్‌లోని కంపెనీ కార్యాలయంలో, కడపలో ఎంపీ రమేష్ నివాసంలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించిన మీదట సీఎం రమేష్ డైరెక్టర్‌గా ఉన్న రిత్విక్ ప్రాజెక్ట్స్ పలు సబ్ కాంట్రాక్టర్ల ద్వారా నిధులను దారిమళ్లించేందుకు పలు అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్టు ఐటీ వర్గాలు గుర్తించాయి. గత ఆరేళ్లుగా రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎడ్కో (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు. అయితే రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఆ కంపెనీ ఆనవాళ్లు లభించలేదని ఐటీ శాఖ రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఎడ్కోతో జరిపిన కరస్పాండెన్స్లో రిత్విక్ ప్రాజెక్ట్స్ అకౌంటెంట్ సాయిబాబు ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహించినట్టు గుర్తించారు. ఎడ్కో స్టాంప్, సీల్ ఆయన వద్ద ఉన్నట్టు గుర్తించడంతో నిధుల దారిమళ్లింపునకే దీన్ని వాడుకున్నట్టు తెలుస్తోందని నివేదిక పేర్కొంది. ఇక రూ. 25 కోట్ల బిల్లులకు సంబంధించి కంపెనీ డైరెక్టర్ కానీ, అకౌంటెంట్ కానీ సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని తెలిపింది. స్టీల్ సరఫరాదారుల నుంచి రూ. 12.24 కోట్లు వసూలైనట్టు కంపెనీ చూపగా, నగదు లావాదేవీల్లో వివరణ లేదని పేర్కొంది. ఢిల్లీ సబ్‌కాంట్రాక్టర్ ఎన్‌కేజీ కన్స్ర్టక్షన్స్కు రూ 6 కోట్లు చెల్లింపులు జరపగా దానికి సరైన బిల్లులు చూపలేకపోయారని నివేదిక తెలిపింది. వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు బ్యాంకుల నుంచి రుణంగా పొందిన రూ. 2.97 కోట్లను కంపెనీకి చెందిన కొందరు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్టు ఐటీ అధికారుల విచారణలో వెల్లడైంది. ఆక్ స్టీల్స్, బీఎస్కే సంస్థలచే స్టీల్ కొనుగోళ్లకు సంబంధించి రూ 25 కోట్ల బిల్లులను అనుమానాస్పదమైనవిగా గుర్తించిన ఐటీ శాఖ వీటిని పరిశీలిస్తోంది. ఇక రికార్డుల్లో చెల్లింపులుగా చూపిన రూ. 8.4 కోట్ల మొత్తానికి సరైన వివరణ ఇవ్వలేదని, రమేష్ నివాసం నుంచి రూ. 13 లక్షలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సీఎం రమేష్‌ను ప్రశ్నించగా, వీటిపై నన్ను అడగవద్దని, ఐటీ అధికారులనే అడగాలని బదులిచ్చారు. టీడీపీ నేతల బుకాయింపు రాజకీయ కక్ష సాధింపుతోనే ఐటీ దాడులు నిర్వహించారని సీఎం రమేష్‌పై ఐటీ దాడుల సందర్భంగా టీడీపీ నానా హంగామా చేసింది. సీఎం రమేష్ సైతం తనపై రాజకీయ కక్షతోనే దాడులు చేపట్టారని ఆరోపించారు. కేంద్ర సహాయ మంత్రిగా పార్లమెంటరీ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఐటీ శాఖకు రమేష్ ఇచ్చిన నోటీసుల ఫలితంగానే సోదాలు జరిగాయని కూడా టీడీపీ వర్గాలు చెప్పుకొచ్చాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులకు పాల్పడుతోందని సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ సైతం ఆరోపించారు. గతంలో సుజనా చౌదరి ప్రస్తుతం సీఎం రమేష్‌లపై ఐటీ దాడులే ఇందుకు సంకేతమని చినబాబు అప్పట్లో ఆరోపించారు.