
శేఖర్ రెడ్డి భార్యను విచారించిన ఐటీ అధికారులు
చెన్నై: టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదివారం కాట్పాడి గాంధీనగర్‌లో శేఖర్ రెడ్డి ఇంట్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు శేఖర్ రెడ్డి భార్యను విచారించారు.
శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు చేసి భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. శేఖర్‌రెడ్డితో పాటు ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు చేశారు. గత మూడు రోజుల నుంచి భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నోట్ల రద్దు ప్రకటన తర్వాత మొదటిసారిగా పెద్దమొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన ఈ కేసును ఐటీ శాఖ.. సీబీఐకి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం వెలుగుచూశాక ఏపీ ప్రభుత్వం టీడీడీ పాలక మండలి సభ‍్యత్వం నుంచి శేఖర్ రెడ్డిని తొలగించింది.