చెన్నైకి చెందిన టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు శుక్రవారం కూడా కొనసాగారుు. శేఖర్‌రెడ్డితో పాటు ఆయన వ్యాపార భాగస్వాములు ప్రేమ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కిరణ్‌రెడ్డికి చెందిన చెన్నై, వేలూరు జిల్లాల్లోని ఇళ్లు, కార్యాలయాలపై గురువారం నుంచి రెండురోజుల పాటు జరిగిన దాడుల్లో మొత్తం రూ.170 కోట్ల నగదు, 130 కిలోల బంగారం పట్టుబడినట్లు సమాచారం. కాగా చెన్నైలోని వివిధ ప్రాంతా ల్లో జరిపిన దాడుల్లో లెక్కల్లోకి రాని రూ.142 కోట్లకు పైగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ విభాగానికి చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటన వెల్లడించింది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత మొదటిసారిగా పెద్దమొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన ఈ కేసు ను ఐటీ శాఖ.. సీబీఐకి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది