Malla Reddy Son In Law Marri Rajasekhar Reddy Reaction On IT Raids, Details Inside - Sakshi
Sakshi News home page

Malla Reddy IT Raids: ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి అల్లుడు రియాక్షన్‌ ఇదే..

Published Thu, Nov 24 2022 11:48 AM | Last Updated on Thu, Nov 24 2022 3:04 PM

Malla Reddy Son In Law Marri Rajasekhar Reddy Reaction On IT Raids - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. టర్కీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన.. ఐటీ దాడులపై స్పందించారు. తమ ఇంట్లో ఎలక్ట్రానిక్‌ లాకర్లు లేవని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టారన్నారు. పథకం ప్రకారమే దాడులు చేశారన్నారు.

కాగా, మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్‌ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్‌ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్‌ చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.
చదవండి: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement