mallareddy college
-
మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: మల్లారెడ్డి వర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఉమెన్స్ క్యాంపస్‌లో ఆత్మహత్యకు యత్నించింది. కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేందుకు కిటికీ నుంచి దూకేందుకు యత్నించింది.గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. పరీక్ష ఫెయిల్ అవుతాననే భయంతో ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా సమాచారం. -
మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ స్కాంలో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ సీట్ల కేటాయింపులో గతంలో జరిగిన అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీల సిబ్బందిని విచారణకు పిలుస్తున్నారు. గురువారం మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకుడు, చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు విచారణకు హాజరైనట్టు అధికారవర్గాల సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన లక్ష్మీనర్సింహారావును మెడికల్ సీట్ల బ్లాక్ దందాపై వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. ఏమిటీ కుంభకోణం? కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి అనుబంధంగా ఉన్న 12 మెడికల్ కాలేజీల్లో పలు సీట్లను బ్లాక్ చేసి, అధిక ఫీజులకు అమ్ముకున్నారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు గతేడాది (2023) జూన్‌లో సోదాలు జరిపారు. నీట్ పీజీ మెరిట్ ఆధారంగా కనీ్వనర్ కోటా లేదా ఫ్రీ సీట్ల కింద దాదాపు 45 సీట్లను ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల పేర్లతో బ్లాక్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యార్థులు ఎవరూ వర్సిటీలో అడ్మిషన్ కోసం ఎన్నడూ దరఖాస్తు చేసుకోలేదని విశ్వవిద్యాలయ అధికారులు గుర్తించారు. దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ 2022 ఏప్రిల్‌లో వరంగల్‌లోని మటా్వడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సీట్లను బ్లాక్ చేసి పెద్దమొత్తంలో ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు ఉన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తులో భాగంగా 2023 జూన్ 22న బొమ్మకల్‌లోని చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ జిల్లా నగునూర్‌లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలోని కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని భాస్కర్ మెడికల్ కాలేజీ, మేడ్చల్‌లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, సూరారంలోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పటాన్‌చెరులోని మహేశ్వర మెడికల్ కాలేజీ, చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కాలేజీ, డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాంగణాల్లో ఈడీ సోదాలు జరిపింది. అందులో భాగంగా దర్యాప్తు కొనసాగిస్తున్న అధికారులు.. 12 కాలేజీలతో పాటు మరికొన్ని కాలేజీల యాజమాన్యాలకు కూడా సమన్లు జారీ చేసినట్టు తెలిసింది. అన్ని కాలేజీల ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం కాలేజీల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. -
డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లపై సర్కారు పట్టు
సాక్షి, హైదరాబాద్: డీమ్డ్ మెడికల్ కాలేజీలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కృత నిశ్చయంతో ఉంది. ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల మాదిరిగానే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం డీమ్డ్ మెడికల్ కాలేజీలు కూడా సగం సీట్లను కనీ్వనర్ కోటా కిందే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆయా కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇతర వర్గాలకు కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నాయి. డీమ్డ్ వర్సిటీలైనా, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కనీ్వనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది.ఒకవేళ ఈ నిబంధనలను అమలు చేసేందుకు డీమ్డ్ మెడికల్ కాలేజీలు సహా ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఒప్పుకోకపోతే, మరో రూపంలో ఆయా కాలేజీలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల డీమ్డ్ హోదా పొందిన రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనిపై బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించనున్నారు.డీమ్డ్ హోదా పొందిన కాలేజీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సదుపాయాలు పొందుతున్నాయని, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల పేరిట ప్రభుత్వ బిల్లులు పొందుతున్నాయని అంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లైనా దీనిపై తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు నీట్ ఫలితాలు వెలువడి కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత, డీమ్డ్ హోదా పొందటం న్యాయపరంగా ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.డీమ్డ్‌లో సొంత నిబంధనలపై గరంగరం..రాష్ట్రంలో రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా దక్కించుకున్నాయి. మరో నాలుగు మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసుకున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా మార్చుకోవడం, ఫీజులు తమకు అవసరమైన రీతిలో వసూలు చేసుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం.. వంటివి ఉంటాయని ఆయా కాలేజీలు చెబుతున్నాయి. నీట్లో ర్యాంకు సాధించిన ప్రతిభ గల, పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న ఆశను దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. డీమ్డ్ వర్సిటీలుగా మారా లంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న వాదననను ప్రైవేట్ యాజమాన్యాలు తెరపైకి తెస్తున్నాయి.ఇదే జరిగితే మున్ముందు మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా సాధించుకునే అవకాశం ఉంది. అలాగైతే రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లు మొత్తం మేనేజ్మెంట్ సీట్లుగా మారిపోతాయని అంటున్నారు. దీనివల్ల కన్వీనర్ కోటా ఫీజు ఎత్తేసి మేనేజ్మెంట్ ఫీజులు అమలవుతాయి. డీమ్డ్ హోదా కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిందేనని అంటున్నారు.ఎన్ఎంసీ నుంచి ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి పొందుతున్నందున ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ఎలా ఉంటుందంటున్నారు. ఫీజును కూడా ఆయా కాలేజీలు సొంతంగా నిర్ణయించుకునే అధికారం లేదని అంటున్నారు. దీనిపై సీరియస్‌గా ఉన్న మంత్రి రిజర్వేషన్లు రాజ్యాంగం కలి్పంచిన హక్కు అని... దానిని డీమ్డ్ పేరుతో ఎలా కాలరాస్తారని ప్రశి్నస్తున్నారు. -
మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా
-
Hyderabad: ధూమ్ ధామ్ దోస్తాన్..!
సాక్షి, సిటీబ్యూరో: మల్లారెడ్డి మహిళా కళాశాల వేదికగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్లు సందడి చేశారు. ఈ నెల ఫ్రెండ్షిప్ డే నేపథ్యంలో బుధవారం నిర్వహించిన వేడుకల్లో యువగాయకులు తమ స్వరాలతో అలరించారు. ధూమ్ ధామ్ దోస్తాన్ విత్ యువర్ ఐడల్స్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో సింగర్లు అనిరుధ్, కేశవ్, కీర్తన–కీర్తి, నజీర్ పాటలతో ఆకట్టుకున్నారు. మ్యూజిక్ కన్సర్ట్ను తలపించిన ఈ కార్యక్రమం ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్లతో సెల్ఫీలతో ఆహ్లాదంగా సాగింది. -
మల్లారెడ్డి కాలేజ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. యూనివర్సిటీకి చెందని విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వివరాల ప్రకారం.. విద్యార్థుల ఆందోళనలతో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరీక్షలు ఒకటి, రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయిన సుమారు 60 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో వారు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా.. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కాగా, ధర్నా చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతుగా నిలిచారు. -
తండ్రి, కొడుకుల బంధమే 'లవ్ యువర్ ఫాదర్'!
శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'లవ్ యువర్ ఫాదర్'. ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ నిర్మాతలుగా మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా ఘనంగా జరిగింది. ఈ మూవీకి మెంబర్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కామకూర శాలిని కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. సిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్ రెడ్డి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ..'గతంలో కో డైరెక్టర్‌గా చాలా సినిమాలకు వర్క్ చేశా. కిషోర్ రాఠీ నన్ను పిలిచి ఈ సినిమా ఇవ్వడం జరిగింది. సూర్య ది గ్రేట్, దర్యాప్తు, యమలీల, మాయలోడు, వినోదం లాంటి ఎన్నో మంచి హిట్ సినిమాలు అందించిన మనిషా ఫిలిమ్స్ బ్యానర్‌పై అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ ఈ సినిమా. ఈ సినిమాను కచ్చితంగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మహేష్ రాఠీ మాట్లాడుతూ.. '1983 నుంచి ఇప్పటివరకు మా నిర్మాణ సంస్థ సక్సెస్‌పుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ చూపించే విధంగా ఉంటుంది. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించడం జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. హీరో శ్రీహర్ష మాట్లాడుతూ..' ఇదే నా మొదటి సినిమా. వందశాతం కష్టపడి అందరికీ నచ్చే విధంగా చేస్తా. మీ సపోర్ట్ ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుంటున్నా' అన్నారు.ఈ చిత్రంలో ఎస్పీచరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, అంజన్ శ్రీవాస్తవ్, అమన్ వేమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. -
మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం: ఈడీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో సోదాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ గురువారం ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సోదాలు జరిపామని తెలిపింది. మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. రూ. కోటి 40 లక్షలు నగదు, బ్యాంక్ ఖాతాల్లోని రూ. 2.89 లక్షలు అనధికార నగదు సీజ్ చేసినట్లు తెలిపింది. ‘హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల్లో సోదాలు నిర్వహించాం. వరంగల్ పీజీ మెడికల్ సీట్స్ స్కామ్‌పై కేసు నమోదు చేశాం. సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశాం. ఇద్దరు మంత్రులకు చెందిన మమత, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరిపాం. ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నాం’ అని ఈడీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: అమరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ -
IT Raids: మల్లారెడ్డికి మరో షాకిచ్చిన ఐటీ అధికారులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు రాజకీయంగా సంచలనంగా మారింది. కాగా, ఐటీ దాడుల సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి రైడ్‌ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంతమంది సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. మేము దొంగలమా? ఇంత అరాచకమా? అంటూ కామెంట్స్ చేశారు. ఇక, దాడుల నేపథ్యంలో తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో ఐటీ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు. ఇక, నోటీసులు ఇచ్చిన వారిలో మల్లారెడ్డి సోదరులు, కుమారులు, అల్లుడు, సన్నిహితులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. మరోవైపు.. ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే విద్యా సంస్థల్లో(ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ) డొనేషన్లపై ఐటీ అధికారులు ఆరా తీయనున్నారు. -
ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి అల్లుడు రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. టర్కీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన.. ఐటీ దాడులపై స్పందించారు. తమ ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్లు లేవని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టారన్నారు. పథకం ప్రకారమే దాడులు చేశారన్నారు. కాగా, మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. చదవండి: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ -
మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సుచిత్రలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ. 2కోట్లు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతుండగా ఉదయం నుంచి ఆయన ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంత్రి సెల్‌ఫోన్ స్వాధీనం కాగా మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏక కాలంలో మొత్తం 50 బృందాలుగా అధికారులు. మంత్రితోపాటు ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లోనూ విస్త్రృత దాడులు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి కొడుకు, అల్లుడు, సోదరుడు, వియ్యంకుడు ఇళ్లల్లో తనిఖీలు జరుపుతున్నారు. మంత్రి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కొత్త విషయాలు వెలుగులోకి మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరుపుతున్న ఐటీ సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లో ఐటీ సోదాలు చేస్తోంది. జైకిషన్, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. గతంలో కూడా జైకిషన్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాస్వాములు. సీఎంఆర్ స్కూల్స్‌లో నరసింహ యాదవ్, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. దీంతో నరసింహయాదవ్, జైకిషన్ ఇళ్లల్లో ఐటీ దాడులు జరుపుతోంది. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నారు. క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లో ఐటీ సోదాలు జరుపుతున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లావాదేవీలు గుర్తించారు. అలాగే కన్వీనర్ కోటా సీట్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. నాలుగు మెడికల్ కాలేజీల లావాదేవీల పరిశీలిస్తున్నారు. సంబంధిత వార్త: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో.. -
Doctor Preeti Reddy: తనను తాను చెక్కుకున్న శిల్పం!
‘విద్య... వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి’ డాక్టర్ ప్రీతి తనకు తానుగా నిర్దేశించుకున్న లక్ష్యం ఇది. ఆమె లక్ష్యసాధనకు భరోసాగా నిలిచింది అత్తిల్లు. ఉచితంగా పురుడు పోసి డెలివరీ కిట్ ఇస్తోంది. ఆడపిల్లను కన్న... తల్లికి ప్రోత్సాహకం ఇస్తోంది. యోగసాధన... నాట్యసాధనతో... తనను తాను పరిపూర్ణం చేసుకుంటోంది. ఒక డాక్టర్ యోగసాధన చేస్తే యోగాసనం వల్ల దేహం ఏ రకంగా ప్రభావితమవుతుందో అధ్యయనం చేయగలుగుతారు. అలాగే ఓ డాక్టర్ శాస్త్రీయ నాట్యసాధన చేస్తే ఒక్కో నాట్య భంగిమ ఏరకంగా ఆరోగ్యకారకమో అవగాహన చేసుకోగలుగుతారు. ఈ రెండూ సాధన చేస్తున్నారు డాక్టర్ ప్రీతీరెడ్డి. వైద్యం చేసే డాక్టర్ ఎప్పుడూ ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండాలి, అలాగే నిత్యచైతన్యంతో ఉత్సాహంగానూ ఉండాలి. అప్పుడే పేషెంట్లు ఆ డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడతారు. పేషెంట్ మనసు చూరగొనడమే డాక్టర్ అంతిమలక్ష్యం కావాలి. అందుకే డాక్టర్లకు యోగసాధన చాలా అవసరం అంటారామె. ఇక భరతనాట్యం ప్రాక్టీస్ గురించి చెబుతూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. సినీగీతాల భరతనాట్యం! ‘‘మాది కర్నాటకలోని హుబ్లి. అమ్మ సైంటిస్ట్, నాన్న డాక్టర్. ఇద్దరికీ పూనాలో ఉద్యోగం. నా ఎల్కేజీ నుంచి పీజీ వరకు పూనాలోనే. మా అమ్మకు భరతనాట్యం ఇష్టం. నాను చిన్నప్పటి నుంచి శిక్షణ ఇప్పించింది. ప్రాక్టీస్‌తోపాటు నాక్కూడా ఇష్టం పెరిగింది. కానీ మా పేరెంట్స్‌కి సమాజానికి ఉపయోగపడే సర్వీస్‌లనే వృత్తిగా ఎంచుకోవడం ఇష్టం. వారి జీవితలక్ష్యం అలాగే ఉండేది. శాస్త్రవేత్తగా పరిశోధనలు చేసినా, డాక్టర్‌గా వైద్యం చేసినా సమాజానికి సర్వీస్ ఇచ్చే రంగాలే. నాక్కూడా డాక్టర్ కావాలనే కోరిక స్థిరపడింది. కళాసాధనను అభిరుచిగా అయినా కొనసాగించాలనే ఆకాంక్ష అమ్మకి. నా డాన్స్ ప్రాక్టీస్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేది. ఆమె ఆరోగ్యం దెబ్బతిని ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా నా డాన్స్‌కు అంతరాయం రానిచ్చేది కాదు. నాకు పద్నాగేళ్లున్నప్పుడు అమ్మ ఈ లోకం వదిలి వెళ్లిపోయింది. అమ్మకు ఇష్టమైన కళ కాబట్టి భరతనాట్యం కొనసాగించాను. సంప్రదాయ భరతనాట్యంలో ప్రయోగాలు కూడా చేస్తున్నాను. తెలుగు సినిమా పాటలను భరతనాట్యంలో కంపోజ్ చేయడం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయోగం. నభూతో అని చెప్పగలను. మా యూనివర్సిటీకి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గారొచ్చినప్పుడు ప్రదర్శన ఇచ్చాను. ఆయన పాటల్లో బాగా ఆదరణ పొందిన 29 పాటలను ఎంచుకుని చేసిన ఫ్యూజన్ అది. ఆ రోజు అక్టోబర్ 29. అందుకే 29 పాటల థీమ్ తీసుకున్నాను. 20 నిమిషాల్లో పూర్తయ్యేటట్లు పాటల పల్లవులను మాత్రమే తీసుకున్నాను. ఆ నాట్యసమ్మేళనాన్ని చిరంజీవిగారికి అంకితం చేశాను. ఆ పెర్ఫ్మార్మెన్స్ చిరంజీవి గారు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. నాకది గొప్ప ప్రశంస. అమ్మాయి పుడితే బహుమతి! డాక్టర్‌గా వైద్యం చేయడానికి మాత్రమే పరిమితం కాకూడదని, ఇంకా ఎక్కువగా ఏదైనా చేయాలనిపించింది. భగవంతుని దయ వలన వెసులుబాటు కూడా వచ్చింది. నా ఆలోచనలు, ఆశయాలను మా గ్రూప్‌లోని టీచింగ్ హాస్పిటళ్లలో ఒక్కటోక్కటిగా చేరుస్తూ వచ్చాను. అలా వచ్చినవే... ఫ్రీ ట్రీట్మెంట్, అమ్మాయి పుడితే ఐదువేలు నగదు బహుమతి. కరోనా సమయంలో మేము ఉచితంగా వైద్యం చేశాం. డెంటల్ హాస్పిటల్లో రోజుకు 250 మందికి ఉచిత వైద్యంతోపాటు 750 బెడ్లున్న టీచింగ్ హాస్పిటళ్లలో కూడా వైద్యం ఉచితమే. అలాగే తల్లీబిడ్డలకు అవసరమయ్యే వస్తువులతో కిట్ ఇవ్వడం కూడా. విద్యాసంస్థల డైరెక్టర్‌గా ఒక మహిళ ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా ఉమెన్ ఫ్రెండ్లీగా ఉంటాయనడానికి నిదర్శనం నేనే. ప్రతి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనే నానుడి నూటికి నూరుశాతం నిజం. నా సక్సెస్‌లో తొలి అడుగులు వేయించింది మా అమ్మ. తెలుగింటి కోడలిగా హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత అత్తమ్మ నాకు అమ్మయింది. నన్ను, నా బిడ్డలను తన బిడ్డల్లాగా చూసుకుంటూ నాకు ప్రతి విషయంలోనూ కొండంత అండగా ఉన్నారు. కెరీర్ పరంగా నన్ను నేను మలుచుకోవడానికి తగిన భరోసా ఇచ్చారు’’ అన్నారు డాక్టర్ ప్రీతి. సమాజానికి తిరిగి ఇవ్వాలి! గ్రీన్ ఇండియా మూవ్మెంట్లో కూడా చురుగ్గా ఉంటారు డాక్టర్ ప్రీతి. పచ్చటి భారతావని కోసం మొక్కలు నాటడం సంతృప్తినిస్తుందన్నారు. వైద్యరంగానికి ఆమె అందిస్తున్న విశిష్టసేవలకు గాను డాక్టర్ ప్రీతి ‘బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ తెలంగాణ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు’ అందుకున్నారు. ‘ప్రతి ఒక్కరూ తమవంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలి, అప్పుడే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన భారతదేశాన్ని చూడగలం’ అన్నారామె. –వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోహనాచారి వైద్యయోగం! యోగసాధన దేహాన్ని, మైండ్‌ని కూడా శక్తిమంతం చేస్తుంది. సింపథిటిక్ నెర్వస్ సిస్టమ్తోపాటు పారాసింపథిటిక్ నెర్వస్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మైండ్‌కి రిలాక్సేషన్నిస్తూ కామ్‌గా ఉంచుతుంది. పని ఒత్తిడితో వచ్చే పర్యవసానాలను నియంత్రిస్తుంది. ఇది మా డాక్టర్లకు మరీ ముఖ్యం. వైద్యం చేసే వృత్తిలోకి రావడమే ఒక యోగం. ఈ వృత్తికి నూటికి నూరుశాతం న్యాయం చేయడానికి ఉపయోగపడే దివ్యౌషధం యోగసాధన అని నా నమ్మకం. నేను యోగసాధన చేస్తాను. యోగ ఆవశ్యకతను తెలియచేస్తుంటాను. మా అమ్మానాన్నల ఆశయాలకు, అత్తమామల అభిరుచికి తగినట్లుగా నన్ను నేను మలుచుకోవడంలో నాకు యోగ చాలా దోహదం చేసింది. – డాక్టర్ ప్రీతీరెడ్డి, డైరెక్టర్, మల్లారెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్ -
మెగాస్టార్‌కు విద్యార్థుల సర్ప్రైజ్.. ఒకేసారి ఆరు వేలమంది కలిసి..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దీపావళి సందర్భంగా విడుదల చేసిన టైటిల్, మెగాస్టార్ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా దర్శకుడు తన ట్విటర్లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. (చదవండి: మెగా 154 టైటిల్ వచ్చేసింది, ఆకట్టుకుంటున్న చిరు మాస్ లుక్) హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్శిటీ విద్యార్థులు చిరంజీవిపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' లుక్‌ను విద్యార్థులు రీ క్రియేట్ చేశారు. యూనివర్శిటీ మైదానంలో సుమారు ఆరువేల మంది విద్యార్థులు కూర్చుని మెగాస్టార్ రూపాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించి విజువల్స్‌ను యూనివర్శిటీలో జరిగిన క్యాన్సర్‌పై పోరాటం కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్‌కు సర్ప్రైజ్ ఇస్తూ వీడియోను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రేమకు ఫిదా అయిన చిరు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ పట్ల మీకున్న ప్రేమ ఈ వీడియో చూస్తే తెలుస్తోంది అంటూ దర్శకుడు బాబీ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. దీనిపై నెటిజన్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిగా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. What a great tribute to our Megastar @KChiruTweets garu from the students and Management of Mallareddy college 👌👏👏 Clearly shows your love and affection towards BOSS 🙌, Big thanks from me and the entire team of #WaltairVeerayya 🙏❤️@MythriOfficial https://t.co/nv932COUnH — Bobby (@dirbobby) October 30, 2022 -
కాలేజి బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థిని మృతి
హైదరాబాద్: నగరంలోని దుండిగల్ పీఎస్ పరిధిలోని బహదూర్‌పల్లి చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఎంఆర్ కాలేజీ విద్యార్థిని రాజేశ్వరి (18) మృతిచెందింది. తాను చదువుతున్న కాలేజీకి చెందిన బస్సే.. ఆమెను ఢీకొనడంతో మరణించడం అత్యంత విషాదకరం. చింతల్ గణేశ్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేశ్వరి మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న తన సోదరుడితో కలసి స్కూటీ పై కాలేజీకి వెళ్తుండగా బహదూర్‌పల్లి చౌరస్తా వద్ద అదుపుతప్పి జారిపడ్డారు. కిందపడ్డ విద్యార్థినిపై నుంచి వెనకాలే వస్తున్న అదే కాలేజీకి చెందిన బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో కాలేజీ విద్యార్థులు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. విద్యార్థిని మృతితో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది. కాలేజీ యాజమాన్యం మంగళవారం కళాశాలకు సెలవు ప్రకటించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతురాలి కుటుంబ సభ్యులు కాలేజీ ఎదుట ఆందోళన నిర్వహించారు. కళాశాల అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థిని కుటుంబానికి రూ.7 లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు సమ్మతించింది. -
బీ ఫార్మసీ విద్యార్థిపై ర్యాగింగ్