సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో సోదాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ గురువారం ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సోదాలు జరిపామని తెలిపింది. మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. రూ. కోటి 40 లక్షలు నగదు, బ్యాంక్ ఖాతాల్లోని రూ. 2.89 లక్షలు అనధికార నగదు సీజ్ చేసినట్లు తెలిపింది.
‘హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల్లో సోదాలు నిర్వహించాం. వరంగల్ పీజీ మెడికల్ సీట్స్ స్కామ్‌పై కేసు నమోదు చేశాం. సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశాం. ఇద్దరు మంత్రులకు చెందిన మమత, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరిపాం. ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నాం’ అని ఈడీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
చదవండి: అమరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment